శ్రామికశక్తి = ఉద్యోగిత – నిరుద్యోగిత
నిరుద్యోగం అనే పదం ప్రతి యువకుడిని ఆలోచింపజేస్తుంది. అందరి దృష్టి ఈ నిరుద్యోగం నుంచి బయటపడాలనే. నిరుద్యోగంవల్ల ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాయి.
-ఉద్యోగాల కల్పన గురించి ప్రతి ప్రభుత్వం పలు వాగ్దానాలు, నెరవేర్చలేని ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఎంతో శ్రమకోర్చి చదివినా ఉద్యోగం రాని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో నిరుద్యోగం అంటే ఏమిటి? అది ఎలా చేస్తుంది. దాని పర్యవసానాలు ఏంటి? దాన్ని ఎలా కొలుస్తారు? దాని వివిధ రూపాలేంటి? దాని స్థాయి ఎంత? మొదలైన విషయాలను తెలుసుకోవడం ముఖ్యం.
-పై విషయాలపై ఎన్నో ప్రశ్నలు, ఎన్నో వివరణాత్మక, పరిశీలనాత్మక ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈ నిరుద్యోగం అనే విషయాన్ని పేదరికంతో కలిపి చదివినప్పుడు విషయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునే వీలుంటుంది.
-ఇదివరకే ఉన్న పరిస్థితుల్లో, అప్పటికే అమలవుతున్న వేతన రేటుకు అనుగుణంగా ఒక అభ్యర్థి తన ఇష్టాపూర్వకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా పనిదొరకని పరిస్థితిని నిరుద్యోగం అంటారు.
-నిరుద్యోగం = కార్మికశక్తి-పనిశక్తి
జనాభా
-1) కార్మికశక్తి
-2) కార్మికశక్తికి అవతల: వీరు ఆర్థిక వ్యవస్థలో వివిధ పనులు చేయడానికి అందుబాటులో ఉండరు.
కార్మికశక్తి
-ఎ) వర్క్ ఫోర్స్ (ఎంప్లాయ్): ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఉత్పత్తిని పెంచడానికి వీరు ఉపయోగపడతారు.
-బి) నిరుద్యోగి (అన్ ఎంప్లాయ్): ఆర్థికవ్యవస్థ వీరిని ఉపయోగించుకునే స్థితిలో లేదు అని అర్థం.
-ఇంకా ఆర్థిక భాషలో చెప్పాలంటే పనిచేసే వయస్సులో అంటే 15-59 ఏండ్ల మధ్య వయస్సులో ఉంటే పనిచేసే సామర్థ్యం/కోరిక ఉన్నప్పటికీ ఉద్యోగం లభించకుంటే వారిని నిరుద్యోగులు అని అంటారు.
-అంటే ఒక వ్యక్తిని నిరుద్యోగిగా పరిగణించాలంటే ఆ వ్యక్తి 15-59 ఏండ్ల మధ్య వయస్సు ఉండాలి.
-ఆ వ్యక్తి కార్మికశక్తిలో భాగం అయి ఉండాలి.
-ఆ వ్యక్తి పనిచేయడానికి కోరికతో, సిద్ధంగా ఉండాలి.
-పైవన్నీ ఉన్న సందర్భంలో కూడా పని లభించకుంటే దాన్ని నిరుద్యోగం అంటారు.
-కార్మికశక్తి: ఏదో ఒక పనిలో ఇదివరకే భాగస్వామి అయి ఉండటం.
-నిరుద్యోగులు: ఏ పనిలో నిమగ్నం/భాగస్వామి అయి ఉండకున్నా పనికోసం ప్రయత్నాలు చేస్తుండటం, పనికోసం సిద్ధంగా ఉండటం.
-పనిశక్తి: ఏదో ఒక పనిలో ఇదివరకే భాగస్వామి అయి ఉంటే వారిని పనిశక్తిగా భావిస్తారు.
-ప్రణాళికాసంఘం: ఒక మనిషి ఒక రోజుకు 8 గంటలు లేదా ఏడాదికి 273 రోజులు పనిచేసినట్లయితే వారిని ఉద్యోగిగా పేర్కొంటుంది.
మన దేశ నిరుద్యోగితను మూడు రకాలుగా విభజించారు.
1) సాధారణ స్థితి నిరుద్యోగిత
2) వారంవారీ స్థితి నిరుద్యోగిత
3) రోజువారీ స్థితిగల నిరుద్యోగిత
సాధారణ స్థితి నిరుద్యోగిత
-దీనికి రిఫరెన్స్ పీరియడ్ ఏడాది.
-సర్వే తేదీకి ముందు ఏడాదిలో అధికకాలం ఖాళీగా ఉండటం.
-అంటే ఒక వ్యక్తి ఉద్యోగా, నిరుద్యోగా, కార్మికశక్తిలో ఉన్నాడా? లేదా మొదలైనవన్నీ ఏడాది కాలాన్ని ఆధారంగా చేసుకొని నిర్ణయిస్తారు.
-దీన్ని బహిరంగ నిరుద్యోగం (Open Unemployment) అని కూడా అంటారు. ఇది ఎక్కువగా విద్యావంతులు, నిపుణులు మొదలైనవారితో ఎక్కువగా ఉంటుంది.
-ఇది భారత్లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
-ఇది ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో తెలుపుతుంది కానీ నిరుద్యోగ తీవ్రతను తెలుపుతుంది.
-అందుకోసం దీని ఆధారంగా నిరుద్యోగాన్ని చాలా తక్కువ సమయాల్లో లెక్కిస్తారు.
వారంవారీ స్థితి నిరుద్యోగిత (CWS)
-ఆధారకాలం ఒక వారం
-సర్వే జరిపే రోజుకు ముందు ఒక మనిషికి 7 రోజుల్లో (వారంలో) ఒక గంట కూడా పని దొరకపోవడాన్ని నిరుద్యోగం అంటారు.
-అంటే ఒక వారం మొత్తంలో ఒక వ్యక్తికి కనీసం ఒక గంట పనిదొరికినా అతన్ని ఉద్యోగి కింద లెక్కిస్తారు.
-ఈ పద్ధతిలో ఎవరు ఉద్యోగులో, ఎవరు నిరుద్యోగులో విభజిస్తారు. కానీ నిజంగా ఎంత తీవ్రతలో నిరుద్యోగం ఉందో లెక్కించరు.
-అందుకే రోజువారీ స్థితిగల నిరుద్యోగితను వాడుతారు.
నిరుద్యోగిత అంచనాలు
-1973లో భగవతి అధ్యక్షతన నిరుద్యోగ అంచనాల కమిటీ సూచనల ప్రకారం, ఎన్ఎస్ఎస్ఓ 27వ రౌండ్ ప్రకారం పై మూడు పద్ధతులను వాడుతారు.
నిరుద్యోగాన్ని ప్రకటించేదెవరు?
-ఎన్ఎస్ఎస్ఓ (నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్) అనే సంస్థ నిరుద్యోగాన్ని వివిధ సర్వేలు, గణాంకాల ఆధారంగా అంచనా వేస్తుంది.
-ఎన్ఎస్ఎస్ఓ సూచనలు, అంచనాలను ఆధారం చేసుకుని నీతి ఆయోగ్ ఆ అంచనాలను ధ్రువీకరించి నిరుద్యోగాన్ని ప్రకటిస్తుంది.
-ఇక్కడ శ్రామికులు అంటే 15-59 ఏండ్ల మధ్య వయస్కులు. వీరిలో పనిచేసే వారిని శ్రామికులు (వర్కర్స్) లేదా శ్రామిక జనాభా (వర్క్ ఫోర్స్) అంటారు.
-మొత్తం పట్టికలో పట్టణ నిరుద్యోగిత క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇక గ్రామీణ నిరుద్యోగిత, తగ్గుతూ, పెరుగుతూ ఒడిదుడుకుల మధ్య ఊగిసలాడుతూ యూపీఎస్ ప్రకారం 2.3 శాతంగా, సీడీఎస్ ప్రకారం 5.7 శాతంగా నిలిచిపోయింది.
-ప్రస్తుతం నిరుద్యోగిత రేటు యూపీఎస్ ప్రకారం 2.7 శాతం ఉంది. సీడీఎస్ ప్రకారం 5.6 శాతం ఉంటుంది. యూపీఎస్ ప్రకారం పట్టణ నిరుద్యోగిత ఎక్కువగా, సీడీఎస్ ప్రకారం గ్రామీణ నిరుద్యోగిత ఎక్కువగా కనిపిస్తుంది.
రోజువారీ స్థితి నిరుద్యోగిత (CDS)
-దీనికి ఆధారం కూడా ఒక వారమే. కానీ ఒక రోజును రిఫరెన్స్గా తీసుకున్నప్పుడు. ఒకవ్యక్తికి ఒక్క రోజులో ఏమాత్రం పని దొరకని పరిస్థితిని రోజువారీ స్థితిగల నిరుద్యోగిత అంటారు.
-సర్వే జరిపిన రోజుకు ముందు ఏడు రోజుల శ్రమ రోజుల్లో ఏ ఒక్క రోజైనా కనీసం నాలుగు గంటలు లేదా ఆ పైన పనిచేసిన వ్యక్తి ఆ రోజు ఉద్యోగిత పొందినట్టు భావిస్తారు.
-ఈ పద్ధతిలో ఒక వ్యక్తి ఎన్నిరోజులు పనిచేశారో, ఎన్ని రోజులు పనిచేయలేదో స్పష్టంగా తెలుస్తుంది.
-ఇది ఎవరు ఉద్యోగులో, ఎవరు నిరుద్యోగులో గుర్తించడం కంటే ఎక్కువ భావనలను తెలుపుతుంది.
-అంటే ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారని తెల్పడంతోపాటు ఎంత తీవ్రస్థాయిలో నిరుద్యోగిత ఉందో కూడా తెలుపుతుంది.
-ఈ పద్ధతిని నిరుద్యోగాన్ని కొలవడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు.
-సీడీఎస్ ద్వారా కొలిచిన నిరుద్యోగ రేటునే వివిధ విధానాల రూపకల్పనల్లో వాడుతారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు