భూదానోద్యమం విజయవంతమైన రాష్ట్రం?
1. కింది వాటిని జతపర్చండి.
1) థియోడర్ బెర్జ్మన్ ఎ) Agrasian reforms in india
2) వైవీ కృష్ణారావు బి) Peasant movement and struggles
3) ఎన్జీ రంగా సి) Telangana peoples struggles and its lesson
4) పుచ్చలపల్లి సుందరయ్య డి) The modern
indian peasent
1)1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
2. కింది వాటిని జతపర్చండి.
1) పాయిగా జమియత్ ఎ) బేషరత్ భూములు
2) జాత్ బి) అశ్విక దళాల పోషణార్థం
ఇచ్చే భూములు
3) మశ్రుతి సి) వంశపారంపర్య భూములు
4) ఆల్తమ్గా డి) మత, సైనిక, పౌర సంబం
ధమైన సేవలకు గుర్తింపుగా ఇచ్చే భూములు
1)1-బి, 2-ఎ, 3-డి, 4-సి
2) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
3) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3. హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల చట్టం-1950లో పేర్కొనని అంశాలు?
1) 5 ఏండ్లు తక్కువ కాకుండా భూమిని కౌలుకు చేస్తే వారిని షక్మీదారులుగా గుర్తిస్తారు
2) కౌలు ఒప్పందం మౌలిక రూపంలో గాని తహసీల్దార్ సమక్షంలో గాని రాత పూర్వకంగా ఉండవచ్చు
3) చారిటబుల్, మతసంబంధ, ఇనాం భూములతో పాటు అన్ని వర్గాల భూములకు వర్తిస్తుంది
4) కౌలు పరిమాణ భూస్వామి చెల్లించే శిస్తుకు 4-5 రెట్ల కంటే ఎక్కువ ఉండరాదు
1) 1, 2, 3 2) 2, 3, 4 3) పైవన్నీ 4) 1, 3, 4
4. భూదాన ఉద్యమానికి సంబంధించి కింది వాటిలో సరైనది?
1) భూదాన్ అహింసా విధానాన్ని ప్రోత్సహించింది.
2) భూదాన ఉద్యమం 1952 ఏప్రిల్ 18న నల్లగొండ జిల్లా పోచంపల్లిలో ప్రారంభమైంది
3) భూదాన ఉద్యమం 5 కోట్ల ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా 1967 వరకు 42 లక్షల ఎకరాల భూమినే సేకరించారు
4) భూదాన ఉద్యమం విఫలం కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చింది
1) పైవన్నీ 2) 1, 3, 4 3) 1, 2, 4 4) 2, 4
5. ఏ రాష్ట్రంలో భూదాన ఉద్యమం విజయవంతమైంది?
1) పశ్చిమబెంగాల్ 2) కేరళ 3) గోవా 4) బీహార్
6. పంట పండించే కౌలుదారులకు పెద్ద మొత్తంగా వెళ్ల గొట్టడం ఆపివేయకపోతే హరిత విప్లవం ఎర్రగా మారే అవకాశం ఉందని పేర్కొన్నది ఎవరు?
1) పుచ్చలపల్లి సుందరయ్య 2) చండ్ర రాజేశ్వర్రావు 3) లెచ్కజిన్సి 4) ఆర్థర్లూయిస్
7. భూసంస్కరణల తాత్విక నేపథ్యం రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో కన్పిస్తుంది?
1) ఆర్టికల్- 39 2) ఆర్టికల్ – 39(బి)
3) ఆర్టికల్- 39(సి) 4) ఆర్టికల్-39 (ఎ)
8. కిందివాటిలో సరైనది.
1) హైదరాబాద్ రాష్ట్రంలో ఇనామ్ల రూపంలో 8 లక్షల ఎకరాలకు మించి భూమి ఉండేది
2) నిజాం ప్రభుత్వం తమ బంధు, మిత్రులకు, సైన్యంలోని ఉన్నతస్థాయి అధికారులకు ఇనామ్ల పేరిట కొన్ని గ్రామాలను అప్పగించింది.
1) 1 2) 2 3) 1,2 4) ఏదీకాదు
9. హైదరాబాద్ రాష్ట్రంలో సర్ఫేఖాస్ భూముల విస్తీర్ణం?
1) 5,682 2) 5,782 3) 5,582 4) 5,882
10. దేశ్ముఖ్, సర్దేశ్ముఖ్, దేశాయ్, సర్దేశాయ్, పండిట్, కరణం పోస్టులు కింది వాటిలో వేటిలో కన్పిస్తాయి?
1) ఖల్సాదివాని 2) సంస్థానాలు
3) జమిందారీ 4) జాగీర్దార్లు
11. హైదరాబాద్ రాష్ట్రంలో వెల్లోడి ప్రభుత్వం భూ సంస్కరణల్లో భాగంగా మొదటగా ఏ రకమైన భూములను రైత్వారీ భూములుగా ప్రకటించింది?
1) ఇనామ్దారీ 2) జాగిర్దారీ
3) జమిందారీ 4) సర్ఫేఖాస్
12. సంస్థానాధీశులు నిజాం ప్రభుత్వానికి చెలించే శిస్తు?
1) ఖల్సా 2) నజరానా 3) పేష్కరస్ 4) రకం
13. కింది వాటిలో సరైనది.
1) బెతాయి అంటే పంటతో సంబంధం లేకుండా ఒక నిర్ధిష్ట పరిమాణంలో కౌలు చెల్లించడం
(పంటలో కొంత భాగం – 20-40 శాతం)
2) గల్లామక్తా అంటే పండిన పంటలో 1/4 లేదా 1/5 వంతు కౌలుగా చెల్లించడం (స్థిరమైన కౌలు)
3) సర్ఫేఖాస్ విధానంలో కౌలును నగదు రూపంలో (ఎకరానికి 5 నుంచి 10 వేలు) చెల్లించాలి
1) 1, 2 2) 1, 2, 3 3) 1, 2 4) ఏదీకాదు
14. అసైన్డ్ భూముల పంపిణీ గురించి కోనేరు రంగారావు కమిటీ చేసిన సూచనలు కానివి?
1) ప్రభుత్వ భూములను పేదలకు ఇవ్వాలంటే భూమికి సంబంధించిన సర్వే భూ రికార్డులను ఎప్పటికప్పుడు సరిచేయాలి
2) అర్హులైన, భూమిలేని పేదలకు వ్యవసాయ నిమిత్తమైన భూమిని మంజూరు చేసేటప్పుడు దరఖాస్తుదారు అభ్యర్థన లిఖిత పూర్వకంగా వచ్చిన 2 నెలల లోపల అతనికి స్వాధీనం చేయాలి
3) రాష్ట్రంలో పంపిణీకి అనుగుణంగా 12 రకాల భూములున్నాయి, భూమిలేని ప్రతి పేద రైతుకు 2 ఎకరాల భూమిని పంపిణీ చేయవచ్చు.
1) 1, 2, 3 2) 2, 3 3) 3 4) 2, 3
15. కౌలుదార్లకు సంస్థాగత పరపతిని అందించడం కోసం రుణ అర్హత కార్డులను ప్రభుత్వం ఇవ్వాలని కీలకమైన సూచన చేసిన కమిటీ?
1) కుమారప్ప 2) కోనేరు రంగారావు
3) బెర్జర్ 4) స్వామినాథన్
16. దేశంలో ఏ రకమైన వ్యవసాయదారులు ఎక్కవ?
1) చిన్న కమతం 2) మధ్యతరహా కమతం
3) ఉపాంత కమతం 4) పెద్ద కమతం
17. కిందివాటిలో సరైన దాన్ని గుర్తించండి.
1)1949 ఆగస్టు 15న హైదరాబాద్లో జాగీర్ల రద్దు చట్టాన్ని హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీ-1947 చేసిన సూచనల మేరకు ప్రకటించారు.
2) హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూములు చట్టాన్ని 1952లో చేశారు.
1) 1 2) 2 3) 1, 2 4) ఏవీకాదు
18. తప్పు జతను గుర్తించండి.
1) ఏపీ ఇనామ్ల రద్దు చట్టం – 1967
2) ఏపీ భూ గరిష్ట పరిమితి చట్టం – 1961
3) తెలంగాణ ఇనామ్దారీ రద్దు చట్టం -1955
4) హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల చట్టం-1952
19. కౌలుదారులు, ఉపాంతరైతులు, వ్యవసాయ కూలీల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని భూమిని పునఃపంపిణీ చేయటమే భూసంస్కరణల లక్ష్యమని ఎవరు నిర్వచించారు?
1) ప్రణాళిక సంఘం 2) యూఎన్ఓ
3) రాజ్యాంగం 4) యూఎన్డీపీ
20. భూ సంస్కరణలకు సంబంధించి ప్రణాళిక సంఘం అధికారికంగా ప్రకటించిన లక్ష్యాలను గుర్తించండి.
1) వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు గల ప్రతి బంధకాలను తొలగించడం
2) వ్యవసాయ రంగంలోని దోపిడీలను, సాంఘిక అన్యాయాలను తొలగించి దున్నేవాడికి రక్షణ కల్పించడం
3) భూ గరిష్ట పరిమితిని నిర్దేశించడం
1) 1, 2 2) 1, 2, 3 3) 1, 3 4) 2, 3
21. లోప భూయిష్టమైన భూస్వామ్య విధానాలే దేశ వ్యవసాయ రంగంలో తక్కువ ఉత్పాదకతకు కారణమని తెలిపింది?
1) ఆర్థర్లూయిస్ 2) కుమారప్ప
3) వోల్కర్ 4) గున్నార్ మిర్దాల్
22. భూసంస్కరణల అనుభవాలను పీసీ జోషి నాలుగు రకాలుగా పేర్కొన్న వాటిలోని అంశాలు?
1) మధ్యవర్తుల తొలగింపు
2) ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చినవి
3) ప్రజల నుంచి ఐచ్ఛికంగా వచ్చినవి
4) వామపక్షాల చర్చలు
1) 1, 2, 3 2) 2, 3, 4 3) 1, 3, 4 4) పైవన్నీ
23. పెత్తందారి వ్యవస్థను తలపించేది ఏది?
1) రైత్వారీ 2) జాగిర్దారీ
3) జమిందారీ 4) ఇనామ్దారీ
24. కింది వాటిలో సరైన దాన్ని ఎంపిక చేయండి.
1) జమిందారీ వ్యవస్థ ఫ్రెంచ్ భూస్వామ్య వ్యవస్థకు, రైత్వారీ విధానం బ్రిటిష్ రైతుస్వామ్య వ్యవస్థకు ప్రతిరూపాలు
2) మదద్-ఇ-మాష్ ఆత్మ పరిత్యాగం చేస్తూ సమా జం కోసం జీవించే వారికి ఇచ్చే జాగీరు
1) 1 2) 2 3) 1, 2 4) ఏవీకాదు
25. సర్ఫ్-ఏ-ఖాస్ అంటే?
1) వ్యక్తిగత ఆదాయం 2) వ్యక్తిగత వ్యయం
3) ప్రత్యేక ఆదాయం 4) ప్రత్యేక వ్యయం
26. కింది వాటిలో సరైన దానిని గుర్తించండి.
1) హైదరాబాద్లో 65శాతం ఖల్సా భూమి ఉండేది
2) సర్బస్తా అంటే సాగులో లేని భూములను సాగులోకి తెచ్చే పద్ధతి
1) 1 2) 2 3) 1, 2
4) ఏదీకాదు
27. దివానీ విధానంలో స్థిరమైన శిస్తును చెల్లించే విధానం?
1) పాన్మక్తా 2) సర్బస్తా
3) గల్లామక్తా 4) ఇజారా
28. ఖల్సా విధానంలో వేలంపాట ద్వారా శిస్తు వసూలు చేసుకునే అధికారం పొందేవారు?
1) పాన్మక్తా 2) సర్బస్తా
3) గల్లామక్తా 4) ఇజారా
29. థామస్ మన్రో రైత్వారీ విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1) 1808 2) 1793 3) 1807 4) 1805
30. కిందివాటిలో సరైనది గుర్తించండి.
1) లార్డ్ కారన్వాలీస్ 1792లో బెంగాల్లో జమిందారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు.
2) మహల్వారీ విధానంలో రైతు ప్రభుత్వానికి నేరుగా శిస్తు చెల్లిస్తాడు.
1) 1 2) 2 3) 1, 2 4) ఏదీకాదు
31. కింది వాటిలో సరైన దానిని గుర్తించండి.
1) అసామీషక్మీదారుడు షక్మీదారుడిగా మారడానికి 13 ఏండ్లు కౌలు చేస్తూ ఉండాలి
2) ఎంఎస్ బరూచా కమిటీ కౌలుదారుడు 6 ఏండ్లు భూమిని కౌలు చేస్తే షక్మీదారుడని పేర్కొంది.
3) ఎంఎస్ బరూచా కమిటీ 1943లో నియమించారు
1) 1, 2, 3 2) 2, 3 3) 2 4) 1, 3
32. ఒక వ్యక్తికి బండనేలను శాశ్వతంగా ఇస్తే అతడు దాన్ని ఉద్యానవనంగా మారుస్తాడు. ఒకవేళ మంచి తోటను 9 ఏండ్లు కౌలు ఇస్తే ఎడారిగా మార్చుతాడు అని కౌలు విధానం గురించి విమర్శనాత్మకంగా వివరించింది ఎవరు?
1) ఆర్థర్ లూయిస్ 2) ఆర్థర్ యంగ్
3) లెచ్కజన్సి 4) స్వామినాథన్
33. హైదరాబాద్లో జాగీర్దారీ రద్దు చట్టం-1949, హైదరాబాద్లో ఎన్ని జాగీర్లను రద్దు చేసింది?
1) 3,565 2) 6,534 3) 6,535 4) 6,435
34. ఆంధ్రప్రదేశ్లో ఇనామ్ల రద్దు చట్టం ఎప్పుడు చేశారు?
1) 1955 2) 1967 3) 1961 4) 1970
35. హైదరాబాద్ ప్రివెన్సెన్ ఆఫ్ ఏవియేషన్-1952కి సంబంధించిన వాస్తవాంశాలు?
1) కౌలు పరిమాణం మాగాణి భూమిలో ఉత్పత్తిలో 1/4వ వంతు మెట్టభూమి అయితే 1/4 వంతు ఉండాలని నిర్ణయించారు
2) భూస్వామి తన భూమిని అమ్మదలిస్తే ముందుగా కౌలుదారునికి అమ్మజూపాలి
3) 1950 హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల చట్టం వలన కలిగిన దుష్పరిణామాల నివారణకు ఈ చట్టం చేశారు
4) కౌలుదారుడు భూమిని కొనాలనుకుంటే నీటి పారుదల సౌకర్యం ఉన్న భూమికి చెల్లించే కౌలుకి 9 రెట్ల మెట్ట భూమి అయితే 15 రెట్ల ధర చెల్లించాలి.
1) 2,3 2) 1,2,3,4 3) 2,3,4 4) 1,2,3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు