పద్మిని కోసం చిత్తోడ్‌పై దాడిచేసిన రాజు?
ఢిల్లీ సుల్తానులు
1. బానిస వంశం (మామ్లూక్ వంశం) (1206-1290, 84 ఏండ్లు 11 మంది రాజులు)
2. ఖిల్జీ వంశం (1320-1414, 94 ఏండ్లు)
3. సయ్యద్ వంశం (1414-1451, 37 ఏండ్లు)
4. లోడీ వంశం (1451-1526, 75 ఏండ్లు)
బానిస వంశం
1) కుతుబుద్దీన్ ఐబక్ (1206-10)
-ఐబక్ అంటే చంద్రునికి ప్రభువు. ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కుతుబ్ మినార్ (ఢిల్లీ)కు పునాదులు వేశాడు.
-1206లో పోలో ఆడుతూ చేగాన్ గుర్రంపై నుంచి కిందపడి మరణించాడు. ఇతడు టర్కీలో జన్మించాడు.
2) శంషొద్దీన్ ఇల్టుట్మిష్ (1211-36)
-టర్కీలోని ఇల్బరీ తెగకు చెందినవాడు. ఐబక్ అల్లుడు. ఇతడే నిజమైన సుల్తాన్ రాజ్య స్థాపకుడు.
-చెంఘిజ్‌ఖాన్ భారత సరిహద్దుల వరకు వచ్చింది ఇతని కాలంలోనే. చిహల్‌గనీ వ్యవస్థను రూపొందించాడు.
-కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తిచేయించాడు. సుల్తానా రజియా ఇతని కూతురు. ఇతను అందగాడు.
3) రక్నుద్దీన్ ఫిరోజ్ షా
-1236లో కొన్ని నెలల వరకే పాలించాడు.
4) సుల్తానా రజియా (1236-40)
-ఢిల్లీ సింహాసనం అధిష్టించిన ఏకైక మహిళ. భటిండా పాలకుడైన అల్తూనియాను వివాహమాడింది.
-ఢిల్లీలోని చిహల్‌గనీ సర్దారులు (40 మంది) తమకు ఇష్టంలేని అబిసీనియాకు చెందిన మాలిక్ యాకూబ్‌ను అమీర్-ఇ-అబుల్గా నియమించటంలో తిరుగుబాటు చేయగా, ఆ తిరుగుబాటును అణిచేక్రమంలో రజియా దంపతులిద్దరూ హత్యకు గురయ్యారు.
5) ముజుద్దీన్ బెహరమ్ (1240-42)
6) అల్లాఉద్దీన్ మసూద్ షా (1242-45)
7) నాసిరుద్దీన్ మహ్మద్ (1246-65)
8) ఘియాసుద్దీన్ బాల్బన్ (1266-86)
-చిహల్గనీని అణిచివేశాడు. బానిస వంశంలో గొప్పవాడు. పర్షియన్ సంప్రదాయాలైన పాయ్బాస్, జమిన్బాస్లను ప్రవేశపెట్టాడు.
9) కైకుబాద్ (1286-90)
-ఇతడు బాల్బన్ మనుమడు. వ్యసనపరుడు.
ఖిల్జీ వంశం (1290-1320)
1) జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ
-ఇతడు శాంతికాముకుడు, వృద్ధుడు. ధగ్గులు అనే బందిపోటు దొంగలను బంధించాడు.
2) అల్దాఉద్దీన్ ఖిల్జీ
-మార్కెట్ సంస్కరణలను ప్రవేశపెట్టాడు. మాలిక్ కాఫర్ అనే నపుంసకుడు ఇతని సైన్యాధికారుల్లో ఒకడు.
-మతాన్ని రాజకీయాలను వేరుచేసి పరిపాలించిన సుల్తాన్ ఇతను.
-రాజపుత్ర రాణి పద్మిని కోసం 1302లో చిత్తోడ్‌పై దాడిచేసి రాజా రతన్‌సింగ్‌ను ఓడించాడు.
-కాకతీయ 2వ ప్రతాపరుద్రునిపై, దేవగిరి రామచంద్రదేవునిపై, గుజరాత్ కర్ణదేవునిపై, హొయసాల వీర భల్లాలునిపై ఇతని సేనాని మాలిక్ కాఫర్ దాడులు చేశాడు.
-పాండ్యుల్లో సుందరపాండ్యుని మధుర సింహానంపై కూర్చోబెట్టాడు. మంగోలులు 12 సార్లు దాడి చేయగా తిప్పికొట్టాడు.
-నయా ముస్లింలను హతమార్చాడు. సిద్ధ సైన్యాన్ని ఏర్పాటుచేసి గుర్రాలపై ముదైల పద్ధతిని ప్రవేశపెట్టాడు.
-అలాయ్ దర్వాజాను నిర్మించాడు.
3) షహబుద్దీన్ ఉమర్ సుల్తాన్ (1316)
-ఇతన్ని కీలుబొమ్మగా చేసి మాలిక్ కాఫర్ అధికారం చెలాయించాడు.
-అల్లాఉద్దీన్ ఖిల్జీ భార్యను బలవంతంగా పెండ్లి చేసుకున్నాడు.
4) కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ (1316-20)
5) నాసిరుద్దీన్ ఖుస్రూఖాన్ (1320)
-ఘియాసుద్దీన్ తుగ్లక్ చేతిలో ఓడిపోయాడు.
-నాసిరుద్దీన్ అంటే హెల్పర్ ఆఫ్ ది ఫెయిత్ అర్థం.
-ఇతనికాలంలో మసీదుల్లో విగ్రహాలను పెట్టి పూజించారు. ఇందుకు ఆధారం పర్షియన్ గ్రంథం తబ్ఖత్-ఎ-అక్బరీ.
తుగ్లక్ వంశం
-తురుష్కుల్లో కరౌనా తెగ సుమారు శతాబ్దం పాలించింది.
1) ఘియాసుద్దీన్ తుగ్లక్ షా (1320-25)
-తల్లి హిందూ జాట్ వనిత. ఇతని ఆస్థాన కవి అమీర్ ఖుస్రో.
-ఓరుగల్లుకి సుల్తానాపూర్ పేరు పెట్టింది ఇతని కుమారుడైన మహ్మద్ బిన్ తుగ్లక్ (జునాఖాన్).
-తుగ్లకాబాద్‌లో ఏనుగుల ప్రదర్శన సమయంలో తండ్రిని చంపించాడు జునాఖాన్.
2) మహ్మద్ బిన్ తుగ్లక్ (1325-51)
-పిచ్చి తుగ్లక్, బాహుభాషా కోవిదుడు. బరౌనీ సృష్టి వైపరీత్యం అన్నాడు. హిందువుల పండుగల్లో పాల్గొన్న ప్రథమ ముస్లిం సుల్తాన్.
-రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరి (దౌల్తాబాద్)కి మార్చాడు (1327).
3) ఫిరోజ్ షా తుగ్లక్ (1351-88)
-ఇతడు ఉదారవాది, మత ఛాందసవాది.
-బ్రాహ్మణులపై జిజియా పన్ను విధించాడు. జాగీర్దారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు.
4) 1398లో పాలకులు
-1) మహ్మద్ షా, 2) తుగ్లక్ షా (మనుమడు), 3) హుమాయూన్ (మహ్మద్ షా కొడుకు), నాసీరుద్దీన్ మహ్మద్ (హుమాయూన్ సోదరుడు) ఈ గందరగోళంలోనే 1398లో భారత్‌పై దండయాత్ర జరిగింది.
5) తైమూరు దండయాత్ర (1398)
-బల్లాస్ తెగ, తండ్రి అమీర్ తుర్గాయ్. మల్ఫజల్-ఎ-తైమూరి, సాఫిర్నామా అనే గ్రంథాల ఆధారంగా భారతదేశంలోని విగ్రహారాధన నిర్మూలన కోసం దండెత్తినాడు. ముందుగా ఇతని మనుమడు పీర్ మహ్మద్ దాడి చేశాడు. ఆ తరువాత తైమూర్ ఢిల్లీపై పడి 15 రోజులు దోచుకున్నాడు.
సయ్యద్ వంశం (1414-51)
-వీరు తాము మహ్మద్ ప్రవక్త వారసులమని చెప్పుకున్నారు.
-నలుగురు సుల్తానులు 37 ఏండ్లు పాలించారు.
1) చిజిర్ ఖాన్ సయ్యద్ (1413-21)
-ఇతడు దయార్థ్ర హృదయుడు, న్యాయబుద్ధికలవాడు.
-ఇతని మంత్రి తాజ్ ఉల్ ముల్క్
2) ముబారక్ షా (1421-34)
-ఇతడు చిజిర్ఖాన్ కొడుకు. తన మంత్రి సర్వర్ ఉల్ ముల్క్ చేతిలో మరణించాడు.
3) మహ్మద్ (1434-45)
4) అల్లా ఉద్దీన్ ఆలం షా (1445-51)
లోడీ వంశం (1451-1526)
-ముగ్గురు సుల్తానులు 75 ఏండ్లు పాలించారు.
1) బహలాల్ లోడీ (1451-89)
-దయ, మానవత్వంగలవాడు.
-సేనానులపై, సామాన్య సైనికులపై సోదరభావం చూపేవాడు.
2) సికిందర్ లోడీ (1489-1517)
-ఇతని అసలు పేరు నిజాంఖాన్. లోడీవంశంలో గొప్పవాడు.
-ఇతను బహలాల్ లోడీ రెండో కొడుకు.
-ఆగ్రా పట్టణాన్ని 1504లో నిర్మించాడు.
-ఇతని కాలంలోనే సంస్కృత వైద్యగ్రంథాన్ని తిబ్బా సికిందరి అనే పేరుతో ఆస్థాన కవిమియాన్తువా పర్షియన్ భాషలోకి తర్జుమా చేశాడు.
3) ఇబ్రహీంలోడీ
-ఇతడు చివరి పాలకుడు. 1526లో మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ చేతిలో ఓడిపోయాడు. ఢిల్లీ సుల్తానుల పాలన అంతమయింది.
-మొదటి పానిపట్టు యుద్ధం 1526 ఏప్రిల్ 21న జరిగింది. ఈ యుద్ధంలోనే మొదటిసారిగా ఫిరంగిలను బాబర్ వినియోగించాడు.
సామాజిక పరిస్థితులు
-సుమారు మూడున్నర శతాబ్దాల ఢిల్లీ సుల్తానుల కాలంలో రెండు భిన్న సంస్కృతుల సమ్మేళనం దేశ చరిత్రలో జరిగింది.
-డీడీ కోశాంబి చెప్పినట్లుగా అప్పుడు ఒకదానిపై ఒకటి ప్రభావం చూపటం సహజం.
-టర్కీలు, ఆఫ్ఘన్ల రాకతో సమాజంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి.
-ప్రాచీన కాలంలోవలేగాక ముస్లింలు భారతీయ సమాజంలో కలిసిపోకుండా తమ ప్రత్యేకతను నిలబెట్టుకోగలిగారు.
-సమాజం హిందూ, ముస్లింలుగా విడిపోయింది. ముస్లింలు స్థానికులను కాఫర్లు అని పిలిచేవారు.
-మహ్మదీయ సమాజం భూస్వాములు, వర్తకులు, కార్మికులు, బానిసలు అనే వర్గాలుగా చీలిపోయింది.
-హిందువును మ్లేచ్చులు అని పిలిచేవారు.
-13వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానుల రాజ్యం ఏర్పడినప్పటి నుంచి భారతీయ సమాజంలో హిందూముస్లిం విభేదాలు అధికమయ్యాయి.
-హిందువులపై జిజియా వంటి పన్నులు వేశారు. హిందువులను నానా హింసలు పెట్టేవారు.
-హిందువులను ఆదుకునేవారుండేవారు కాదు.
-పండించటం అధిక సంఖ్యాకులైన హిందువుల పనైతే, లాభాలు ఆర్జించటం ముస్లింల హక్కుగా ఉండేది.
-ఫలితంగా సమాజంలో రెండు వర్గాల మధ్య ఈర్ష, అసూయ, ద్వేషాలు ప్రబలాయి.
-ఇబన్ బటూటా వంటి విదేశీ రచయితలు ఈ భావాన్నే వ్యక్తం చేశారు.
-ఈ ముస్లింల నిరంకుశత్వ ధాటికి తట్టుకోలేని హిందువులు కొందరు మతం మార్చుకున్నారు.
-మహ్మదీయ ధనిక సమాజంలో బహుభార్యత్వం, చట్టబద్ధమైన వ్యభిచారవృత్తి మొదలైన అంశాలు వారి అధికార దాహానికి, భోగలాలసత్వానికి తార్కాణం.
సమాజంలో స్త్రీ పాత్ర
-స్త్రీలకు సమాజంలో తక్కువ స్థానం ఉండేది.
-సతి, దేవదాసీ, వ్యభిచారం, బహుభార్యత్వం, జౌహర్ పద్ధతి ఉండటం వల్ల స్త్రీలను అధమంగా చూసేవారు.
-హిందూముస్లింలు ఉభయులు కూడా స్త్రీలకు ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు.
-అమీర్ ఖుస్రో అనే కవి తన కూతురును ఇంటినుంచి బయటకు రానిచ్చేవాడు కాదని, ఎప్పుడూ ఒక గదిలో రాట్నం వడుకుతూ, గోడవైపు చూస్తూ ఉండమని ఆదేశించినట్లుగా చరిత్ర చెబుతుంది.
-అంతఃపుర స్త్రీలకు ఎండ ఎలా ఉంటుందో తెలిసేదికాదు. స్త్రీలకు విద్యాగంధంలేకపోగా, బాల్యవివాహాలు, సతి దురాచారం, నిర్బంధ వైధవ్యం మొదలైన దురాచారాలు ఉండేవి.
-అయినప్పటికీ మీరాబాయి (శ్రీకృష్ణుని భక్తురాలు), రూపమతి, కాకతీయ రుద్రమదేవి వంటి విద్యావంతులు ఉన్నారు.
-సమాజంలో పర్షియన్లు, అరబ్బులు, అబిసీనయన్లు, టర్కీ, ఈజిప్టులు ఉన్నారు.
-ముస్లింలు అల్పసంఖ్యాకులైననూ పాలకులుగా స్థిరపడ్డారు. వీరిలో ఎక్కువమంది టర్కీవారు ఉన్నారు.
-వీరు 13వ శతాబ్దం పూర్తికాలం ఆసియా ఖండంలోని ముస్లిం ప్రజలకు నాయకత్వం వహించారు.
-మతమార్పిడులు కూడా జరిగేవి. మతం మార్చుకోని హిందువులను ప్రభుత్వ ఉద్యోగాల నుంచి వెలివేసిన సందర్భాలు కూడా లేకపోలేదు.
-హిందువులను వీరు కాఫిర్లు అని పిలిచేవారు. సమాజంలో 5 శాతం ఉన్న ముస్లింలు 95 శాతం ఉన్న హిందువులను పాలించారు.
-హిందువులు ముస్లింలను యవనులని, తురకలని, మ్లేచ్చులని పిలిచేవారు.
-గ్రామాల్లో హిందువులకు ఎంత గౌరవం ఉందో పీర్లు, షేక్‌లు, ఔలియాలు మొదలైనవారికి కూడా అంత గౌరవం దక్కింది.
-ధనికవర్గం వారు పాలకవర్గం, సైనికవర్గంగా పనిచేశారు. అటువంటివారిలో టర్కీలు, పర్షియన్లు, అరబ్‌లు, ఆఫ్ఘన్లు ఉన్నారు.
-ఈ ధనికవర్గంలో కొందరు జన్మతః ధనికులు కాగా, కొందరు బానిసలుగా జీవితం ప్రారంభించి తమ సామర్థ్యంతో ధనికులైనవారు కూడా ఉన్నారు.
-బానిస వంశ పాలనాకాలంలో ఏర్పడిన చిహల్‌గనీ అనే 40 మంది సర్దారుల కూటమి అటువంటిదే.
-ఇక హిందువులు కొందరు క్షుద్ర విద్యలు నేర్చి తమతమ స్వస్వరూపాన్ని కోల్పోయారు.
-హిందువులపై పన్నుల భారం ఎక్కువ. వీరికి విద్య కానీ, విద్యాసౌకర్యాలుకానీ తక్కువ.
-కరువు పరిస్థితుల్లో ముస్లిం సమాజంలో సుల్తానా రజియా వంటివారు పాలనలోకి వచ్చి చరిత్రకెక్కారు.
-రాజపుత్ర స్త్రీలు ముస్లిం సైనికులకు చిక్కకుండా జౌహర్ (చితి పేర్చుకొని మంటల్లో దూకుట) చేసేవారు.
-అల్లాఉద్దీన్ ఖిల్జీ దాడి సమయంలో చిత్తోడ్ రాణి రాజా రతన్‌సింగ్ భార్య పద్మిని జౌహర్ చేసింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు