శాతవాహనుల సైనిక శిబిరం స్కంధావారం ( గ్రూప్-2 హిస్టరీ )
శాతవాహనులు – పరిపాలనా విధానం తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర
# శాతవాహనులు మౌర్యులకు సామంతులు. గౌతమీపుత్ర శాతకర్ణ్ణికి ‘రామకేశవ’ అనే బిరుదు కలదు. దీని నిబట్టి వీరిది ‘రాజు దైవాంశ సంభూతుడు’ అనే సిద్ధాంతం కలిగి ఉన్న వారిగా చెప్పవచ్చు. సార్వభౌమాధికారం ప్రకటించుకోవడానికి మొదటి శాతకర్ణి అశ్వమేధయాగాలు నిర్వహించాడు. రాజరికం వంశపారంపర్యంగా శాసనాల్లో చెప్పబడింది. నాసిక్ శాసనంలో ‘కులపురుష పరంపరాగత విపుల’ రాజ్యం సంక్రమించినట్లు చెప్పబడింది. సామ్రాజ్యాన్ని ‘ఆహారాలు’గా విభజించారు.
# ఆహారాలకు – కుమారామాత్య, విషయాలకు -విషయపతులు, పట్టణాలకు – గహపతులు, గ్రామాలకు -గుల్మికలు పాలకులు. మ్యాకదొని శాసనంలో ఉన్న ‘గుల్మిక’ పదం, భూస్వామ్యాన్ని సూచిస్తుంది. నగరాలను నిగమ సభలు అనేవారు. ప్రతి ఆహారానికి నిగమ (కేంద్ర పట్టణం) ఒకటుండేది. పరిపాలనలో రాజుకు సహకరించే ఉద్యోగుల్లో 3 తరగతుల వారుండేవారు. వారు రాజామాత్యులు, అమాత్యు లు, మహామాత్యులు (మహాఆర్య – మతాధికారి), హిరణ్యాకుడు-కోశాధికారి,భాండాగారికుడు- వస్తు సంచయం చేసే అధికారి,లేఖకుడు-చక్రవర్తికి కార్యదర్శి, రాజ్యాలకు సంబంధించిన పత్రాలు రాసేవాడు. నిబంధనాకారుడు రాజు ఆజ్ఞలు పాటించే అధికారి ముఖ్యులు.
# ‘హాతిగుంఫా’ శాసనంలో చతురంగా బలాలున్నాయి. సైనిక శిబిరాన్ని ‘స్కంధావారం’ అనేవారు. సైన్యాగారాన్ని ‘కటకం’ అని పిల్చేవారు. ఇక సామ్రాజ్యాన్ని పరిశీలించినట్లయితే వీరిది ‘పితృస్వామిక’ సమాజం. సమాజానికి ‘వర్ణవ్యవస్థ’ మూలస్తంభం. గౌతమీపుత్ర శాతకర్ణి వర్ణ సంకరాన్ని నిల్పి ‘ద్విజవర కుటుంబ వివర్ధ్దనునడు’ అనే బిరదు పొందాడే . ఇంద్రదత్త, దమ్మదేవ, దమ్మరక్షిత అనే పేర్లతో ‘యవనులను’ ప్రస్తావించారు. వా త్సాయన కామసూత్రలో పట్టణ జీవితం, ఉల్లాసంగా, శృంగారంగా ఉండేదని పేర్కొనెను.
# ‘గాథాసప్తశతి’లో స్త్రీలకు ఎరని వసా్త్రలు, పుష్పాల మీద ఆసక్తి ఎక్కువ అని చెప్పబడింది. కామసూత్రలో వీణ, వేణువు, మృదంగం, శంకువు మొదలైన సంగీత పరికరాల గురించి వివరించెను. ప్రజలు ఎక్కువగా ‘హాలక’ ఉద్యానాగమన, ఘటనిబంధన, మదనోత్సాహం అనే పండుగలను జరుపుకొనేవారని వాత్సాయనుడు పేర్కొన్నారు.
సాంఘిక పరిస్థితులు
# శాతవాహనులు రాజులయ్యేటప్పటికి సంఘంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు ఏర్పడ్డాయి.
# వర్ణాలకంటే వృత్తిపరంగా కులాలు ఏర్పడినాయి. హాలికులు, శెట్లు, గధికులు (మందులు తయారు చేసేవారు), వర్థ్ధకులు (వడ్రంగులు), కొలికులు (నేతగాండ్లు), తిలపిసకులు (గానుగవాండ్రు), కమ్మరులు (ఇనుప పని చేసేవారు ) అనే కులాలు ప్రధానమైనవి.
# ఉమ్మడి కుటుంబాలు ఈ యుగ లక్షణం. వీరిది పితృస్వామ్య వ్యవస్థ.
# గౌతమీపుత్ర శాతకర్ణి వర్ణసంకరం మాన్పి బ్రాహ్మణ కుటుంబాల్ని పోషించినట్లు చెప్పుకున్నాడు.
# స్త్రీ, పురుషులకు ఆభరణాలపై ఎక్కువ మోజు ఉం డేది.
# ఇద్దరు ఒకే రకం ఆభరణాలు ధరించేవారు.
# స్త్రీలకు నడుము పైభాగాన ఆచ్ఛాదన ఉండేది కాదు.
భాష, సాహిత్యం
# శాతవాహనుల కాలంలో ప్రాకృతం రాజభాష.
# శాతవాహనుల శాసనాల్లో కూడా ప్రాకృతభాషనే ఉపయోగించేవారు.
# హాలుని ‘గాథాసప్తశతి’ ప్రాకృత భాషలో రచింపబడినా అనేక తెలుగు పదాలు కన్పిస్తాయి.
శాతవాహనుల కాలంనాటి ముఖ్య రచనలు
# శర్వవర్మన్- కాతంత్రం
#గుణాఢ్యుడు-బృహత్కత, దశరూప (గౌతమీపుత్ర శాతకర్ణి కాలంవారు)
#సోమదేవుడు-కథాసరిత్సాగరం.
# నాగార్జునుడు- శూన్యవాదం, మాధ్యమిక కారిక, ప్రజ్ఞాపరిమిత శాస్త్ర, ద్వాదశ నికాయ సూత్ర, సుహృల్లేఖ మొదలగునవి (యజ్ఞశ్రీ శాతకర్ణి కొలువులో ఉండేవాడు)
#హాలుడు- గాథాసప్తశతి, సట్టసి
# శాతవాహనుల వంశం అంతం కావడంతో దక్షిణాపతం రాజకీయ ఐక్యాన్ని కోల్పోయినా మతం, భాష, ఆచారాల్లో వారు ప్రారంభించిన సంప్రదాయాలు వారి తర్వాత రాజవంశాలు కొనసాగించిన దక్షిణాపథంలో సాంస్కృతిక సమైక్యాన్ని పెంపొందింపజేశారు.
ఆర్థిక విధానం:
# రాజులకు ప్రధాన ఆదాయం ‘భూమిశిస్తు’. పండిన పంటలో రాజు 1/6 వంతు సుంకం లేదా 18 శాతం పన్ను వసూలు చేసేవారు. ఇవిగాక అనేక వృత్తులు కలవు. అవి
# గధికులు – మందులు లేదా ఔషధాలు తయారుచేసేవారు
# వధకులు – వడ్రంగులు
# కోలికులు – నేతపనివారు
# సేలవధకులు – శిల్పులు
#సార్దవాలు – వ్యాపారులు
# వీటిపై ‘కారుకర’ అనే పన్నును రాజు వసూలు చేసేవారు. వైజయంతి (కర్ణాటక), పైఠాన్ (ప్రతిష్టానుపురం(మహారాష్ట్ర), కోరంగి(రాజమండ్రి), వినుకొండ వర్తక కేంద్రాలుగా పేర్కొనబడ్డాయి. తీరప్రాంతాల గురించి టాలమీ పేర్కొన్నవి, పశ్చిమ తీరంలోనివి..
#1. బారుగిజ – గుజరాత్
# 2. కళ్యాణి
# 3. సోపార
# పై తీరప్రాంతాల్లో నుంచి సుగంధ ద్రవ్యాలు, దం తపు వస్తువులు, పట్టువసా్త్రలు మొదలైనవి ఎగు మతులు. నాట్యగత్తెలు, ద్రాక్షాసారాయి, వజ్రాలు, బంగారం, వెండి మొ౹౹ దిగుమతులు. ‘‘రోమన్లు ‘భోగవస్తువుల’కై భారతదేశానికి రాగా శాతవాహనులు మతవ్యాప్తికి రోమ్ దేశంతో వ్యాపార సంబంధాలు పెట్టుకున్నారు.మధ్యదళారులుగా అరబ్బులు వ్యవహరించారు’’ అని అల్లూరి శాసనంలో(యోనక దివ్వె అనే ప్రాంతంలో ఉంది) ప్రస్తావించబడినది.
# నాణాలపై బ్రాహ్మీ, ప్రాకృత లిపి భాషలో పేర్లు కలిగి ఉన్నాయి. ఒక బంగారు సువర్ణానికి 35 కార్షపణలు(వెండి నాణెం), నాణాలపై ఓడ గుర్తులు ఎక్కువగా ముద్రించెను. ‘త్రప్పగ’ అనే నౌకల గురించి వివరాలు ఎక్కువగా ఉన్నాయి.‘విదేశీ నౌకలను దారిచూపే నౌకలను త్రప్పగా అని అనేవారని’ పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ అనే అజ్ఞాత నావికుడు రచించిన గ్రంథంలో పేర్కొనబడింది. ఇంక నూ ఈ గ్రంథంలో పేర్కొన్న పరిశ్రమలు..
# 1. నేత పరిశ్రమలు – గూడూరు
# 2. లోహాలకు – వినుకొండ
# 3. వజ్రాలు – పల్నాడు ప్రాంతాలు ప్రసిద్ధి.
# శాతవాహనులు ఎక్కువగా రోమ్తోనూ, తర్వాత స్థానాల్లో సువర్ణభూమి(బర్మా), రజితభూమి(అరకాన్), తామ్రదేశం(ఇండో-చైనా)తో వ్యాపారం నిర్వహించేవారు.
శాతవాహనులు – మతం
#శాతవాహనులు బ్రాహ్మణ మతాన్ని ప్రోత్సహించారు.
#రాజవంశీకులకు చెందిన రాణులు, యువరాణులు బౌద్ధమతానికి ప్రోత్సాహం ఇచ్చారు.
# జైన గ్రంథమైన కాలకసూరి ప్రబంధం, ప్రతిష్టానానికి వచ్చిన కాలకసూరి అను జైనాచార్యుని శాతవాహనులు ఆదరించినట్లు చెప్తుంది.
# వైష్ణవమతం కూడా శాతవాహనుల కాలంలోనే దక్షిణానికి వ్యాప్తి చెందింది.
# లవకుశ శివాచార్యుడు పాశుపత శైవ ధర్మాన్ని మొద టి శతాబ్దంలో వ్యాప్తిలోకి తెచ్చాడు.
వాస్తు శిల్పాలు, చిత్రకళ
#శాతవాహనులు మౌర్యులనాటి వాస్తుశిల్ప రీతులను మెరుగులు దిద్ది ఆంధ్ర వాస్తు శిల్ప రీతులను రూపొందించారు. దీన్ని అమరావతి శిల్పకళారీతిగా వ్యవహరిస్తారు.
8 అమరావతి శిల్పరీతికి ప్రధాన కేంద్రాలు అమరావతి, నాగార్జునకొండ, జగ్గయ్యపేట, ఘంటసాల, గోలి, గుమ్మడి, దురు మొదలగు ప్రాంతాలు ఈ శిల్పకళారీతికి ప్రాచుర్యం కల్పించాయి. (1797లో అమరావతి స్తూపం బయటపడింది )
# అమరావతి స్తూపం వంద అడుగుల ఎత్తు, 162 అడుగుల చుట్టుకొలత కలిగి దాని ప్రహరీ 102 అడుగుల చట్టుకొలతతో ఉంది. (బుద్ధుడు అంటరాని వాడిగా పూర్వ జన్మలో జన్మించిన జాతక కథ కలదు)
# నాగార్జునకొండలో మహాచైత్యంతోపాటు నాలుగు విహారాలు, ఆరు చైత్యాలు, ఎనిమిది స్తూపాలు ఉన్నా యి.
# లౌకిక మానవ మూర్తుల విగ్రహాలు మతపరమైన విగ్రహాల సంఖ్య కంటే చాలా ఎక్కువ.
# రకరకాల భంగిమలతో, ఆకృతులతో, అనుభూతులతో స్త్రీమూర్తులు కనులకింపుగా ఉంటారు.
# అజంతా గుహల్లో తొమ్మిది, పది సంఖ్యల గుహల్లోని వర్ణ చిత్రాలు ఆంధ్ర శాతవాహనుల కాలంనాటివని అమరావతి శిల్పాలతో గల సారూప్యతను బట్టి కళావిమర్శకులు నిర్ణయించారు.
డా౹౹ మురళి,
అసిస్టెంట్ ప్రొఫెసర్ నిజాం కళాశాల, హైదరాబాద్.
9701674383
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు