రేచర్ల పద్మనాయకులు-పాలనాంశాలు
పన్నుల విధానం
రాజ్యానికి భూమిశిస్తు ప్రధాన ఆదాయం. పంట లో 1/6వంతు శిస్తు వసూలు చేసేవారు. మొత్తానికి పన్నుల భారం ఎక్కువ.
వ్యవసాయాభివృద్ధి
కాకతీయుల వలనే వ్యవసాయరంగానికి ప్రాముఖ్యత ఇచ్చారు. వీరు నిర్మించిన తటాకాలు..
1. అనపోతు సముద్రం 2. రాయసముద్రం 3. నాగ సముద్రం 4. పర్వత రావు తటాకం 5. వేదగిరి తటాకం మొదలైనవి ఉన్నాయి.
గ్రావిటితో నీరందించే చెరువులతోపాటు కొత్త రకాలైన నీటిపారుదల వ్యవస్థలు వీరికాలంలో వచ్చాయి.
1. ఏతాం 2. పర్రే కాలువలు 3. కోల్, నూతులు, రాట్నాలు, మోటలు 4. బావులు, వాగులు, కాలువలు, మొదలైన పద్ధతులు ఉపయోగించారు. ప్రజల ప్రధానవృత్తి వ్యవసాయం. పోతన లాంటి మహాకవులు కూడా వ్యవసాయం చేయడం దీనికి నిదర్శనం. వరి, జొన్న, సజ్జ, చెరుకు, నువ్వులు, పత్తి మొదలైనవి వీరి ప్రధాన పంటలు.
రాజధానులు
-ఆమనగల్లు: తొలి రాజధాని
-రాచకొండ: 2వ రాజధాని
-దేవరకొండ: బలిష్టమైన కోట. 7 కొండల చుట్టూ దక్షిణంగా ఉన్న బలిష్టమైన దుర్గం.
రాజులు వారి బిరుదులు
-అనపోతానాయకుడు: ఆంధ్రదేశాధీశ్వర, త్రిభువన రామరాయ
-కుమార సింగమనాయకుడు: ఆంధ్ర మండలాధీశ్వరుడు, ప్రతిదండ భైరవుడు, భట్టనారాయణుడు, కల్యా ణ భూపతి.
-2వ సింగభూపాలుడు: తెలంగాణ కృష్ణదేవరాయలు, సర్వజ్ఞ చక్రవర్తి.
పాలనా విధానం
-పద్మనాయకులు పాలనా విధానంలో కాకతీయులను అనుసరించారు. పాలనా విధానంలో..
1. ప్రధానులు 2. సేనానులు
3. పురోహితులు సలహాలిచ్చేవారు.
– రాచకొండ, దేవరకొండ, అనుముల, పొడిచేడు, ఆమనగల్లు, అనంతగిరి, స్తంభగిరి, భువనగిరి, జల్లపల్లి, పానగల్లు మొదలైన దుర్గాలు వీరి ఆధీనంలో ఉండి దుర్గాధ్యక్షులు నియమించబడ్డారు. వీరు రాజ్యాన్ని సీమలుగా విభజించారు. రాజ్యానికి గ్రామమే పునాది. గ్రామంలో 12 మంది వృత్తి పనివాళ్లు ఉండేవారు.
పరిశ్రమలు
నేత పరిశ్రమదే అగ్రస్థానం. సింహాసన ద్వాత్రింశిక అనే గ్రంథంలో పలు రకాల దుస్తులను పేర్కొన్నారు. ఓరుగల్లు, దేవరకొండ, గోల్కొండ ప్రాంతాలు వస్త్ర పరిశ్రమ కేంద్రాలు.
ఓడరేవులు
వాడపల్లి వీరి ప్రధాన నౌకా కేంద్రం. ఉక్కు, గాజు, అద్దాలు, కాగితం మొదలైనవి ప్రధాన ఎగుమతులు.
మతవిధానం
శైవ మత ప్రభావం ఎక్కువ. శైవ, వైష్ణవులకు మధ్య తరచూ విభేదాలు తలెత్తేవి. పద్మనాయకుల ఆస్థానంలో శాకల్య భట్టుకు పరాశర భట్టుకు జరిగిన వివాదం దీనికి ఒక ఉదాహరణ.
-అనపోతానాయకుడు శైవమతాభిమాని.
ఇతడు
1. ఉమామహేశ్వరం వద్ద శ్రీశైల ఉత్తర ద్వారం వద్ద మండపం నిర్మించాడు.
2. శ్రీ పర్వతశిఖరానికి సోపానాలు కట్టించడం, అనేక శివాలయాలు నిర్మించాడు.
-2వ సింగభూపాలుడు: వైష్ణవ మతాభిమాని.
-2వ అనపోతానాయకుడు: రామాలయం నిర్మించాడు. రామాయణంపై రాఘవీయ అనే వ్యాఖ్యానం రాశాడు. వడగల్, తెంగల్ అనే వైష్ణవంలో శాఖలు ఏర్పడ్డాయి.
– ఏకవీర: దేవతలకు కూడా ఆలయాలు నిర్మించబడ్డాయి.
-యక్షగానాలు, భాగవతులు ప్రాచుర్యం పొందాయి.
వాస్తు శిల్పకళ
-రాచకొండ, దేవరకొండల్లో దుర్గాలు నిర్మించారు.
-మాదానాయుడి భార్య నాగాంబిక నాగసముద్రం అనే తటాకం నిర్మించింది.
మాదిరి ప్రశ్నలు
1. ముసునూరి నాయక వంశస్థుల రాజధాని?
ఎ. రాచకొండ బి. కొండవీడు
సి. ఆమనగల్లు డి. రేఖపల్లి
2. కలువచేరు శాసనంలో ఎవరి విజయాలు ఉన్నాయి?
ఎ. కాపయనాయకుడు
బి.ప్రోలయనాయకుడు
సి.అనపోతానాయకుడు
డి. పైవారందరూ
3. ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్రసుత్రాణ అనే బిరుదులు ఎవరికి కలవు?
ఎ. ప్రోలయనాయకుడు బి. కాపయనాయకుడు
సి. గణపతిదేవుడు డి. రేచెర్ల రుద్రుడు
4. ఆంధ్ర మండలాధీశ్వరుడు బిరుదు ఎవరికి ఉంది?
ఎ. కుమారసింగనాయకుడు
బి. రెండో సింగభూపాలుడు
సి. అనపోతానాయకుడు డి. దామానాయుడు
5. బహ్మనీ రాజ్యాన్ని 1347లో స్థాపించినది ఎవరు?
ఎ. మాలిక్ మక్బూల్ బి. హసన్గంగూ
సి. మాలిక్నబి డి. మీర్ఖమ్రుద్దీన్
6. బహ్మనీ రాజ్య తొలి రాజధాని?
ఎ. బీదర్ బి. గోల్కొండ
సి. బీరార్ డి. గుల్బర్గా
7. రేచెర్ల పద్మనాయకుల తొలి రాజధాని?
ఎ. ఓరుగల్లు బి. రాచకొండ
సి. దేవరకొండ డి. ఆమనగల్లు
8. ప్రతిదండ భైరవుడు బిరుదు ఎవరికి కలదు?
ఎ. మాలిక్ మక్బూల్ బి. సింగభూపాలుడు సి. కుమార సింగనాయకుడు డి. దామానాయుడు
9. అమరకోశానికి వ్యాఖ్యానం రచించినది ఎవరు?
ఎ. బొమ్మకంటి అప్పయామాత్యుడు బి. భక్తపోతన
సి. రెండో సింగభూపాలుడు డి. విశ్వేశ్వర కవి
10. చమత్మార చంద్రిక గ్రంథ రచయిత?
ఎ. గౌరన బి. పోతన
సి. విశ్వేశ్వరుడు డి. అనపోతానాయ
సమాధానాలు
1. ఎ 2. ఎ 3. బి 4. బి 5. బి 6.డి 7. డి 8. సి 9. ఎ 10. సి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు