మరాఠాల్లో గొప్ప గెరిల్లా తంత్ర యోధుడిగా పేరుగాంచింది?
ఆధునిక భారతదేశ చరిత్ర
1. ఔరంగజేబు అనంతరం సింహాసనం అధిష్ఠించిన బహదూర్షా ధరించిన బిరుదు ఏది?
1) రెండవ ఆలంగీర్ 2) ఆలంగీర్
3) రెండవ షా ఆలం 4) మొదటి షా ఆలం
2. ఫరూక్ సియార్ ఎవరిని వజీరుగా నియమించారు?
1) జుల్ఫికర్ ఖాన్ 2) అబ్దుల్లా ఖాన్
3) స్సేన్ అలీఖాన్ 4) పైవేవీ కావు
3. నాదిర్షా క్రీ.శ. 1738-39లొ ఏ మొగలు చక్రవర్తి కాలంలో భారత్‌పై దండయాత్ర జరిపాడు?
1) బహదూర్ షా 2) జహాందర్ షా
3) మహ్మద్ షా 4) అహ్మద్ షా
4. నిజామ్ ఉల్‌ముల్క్ క్రీ.శ. 1724లో ఎవరి కాలంలో హైదరాబాద్ సంస్థానాన్ని స్థాపించాడు?
1) బహదూర్ షా 2) జహాందర్ షా
3) మహ్మద్ షా 4) అహ్మద్ షా
5. అహ్మద్ షా అబ్దాలీ క్రీ.శ. 1748లో ఏ మొగలు చక్రవర్తి కాలంలో భారత్‌పై దండయాత్ర జరిపాడు.
1) మహ్మద్ షా 2) రెండవ ఆలంగీర్
3) అహ్మద్ షా 4) జహాందర్ షా
6. బక్సార్ యుద్ధంలో పాల్గొన్న మొగలు చక్రవర్తి ఎవరు?
1) రెండవ షా ఆలం 2) రెండవ అక్బర్
3) రెండవ ఆలంగీర్ 4) ఎవరూ కాదు
7. రాజారాం మోహన్ రాయ్‌కు ‘రాజా’ బిరుదు ఇచ్చిన మొగలు చక్రవర్తి?
1) రెండవ షా ఆలం 2) రెండవ అక్బర్
3) అహ్మద్ షా 4) రెండవ ఆలంగీర్
8. కింది వాటిలో సరైన జతను గుర్తించండి
1) మొదటి ఆంగ్లో-మరాఠీ యుద్ధం : మాధవరావు – 2
2) రెండో ఆంగ్లో-మరాఠీ యుద్ధం : బాజీరావు – 1
3) మొదటి ఆంగ్లో-మైసూరు యుద్ధం : టిప్పుసుల్తాన్
4) మొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధం : రంజిత్‌సింగ్
9. ‘మహ్మద్ షా’ బిరుదు ఏమిటి?
1) ఆలంగీర్ 2) రెండవ ఆలంగీర్
3) రంగీలా 4) ఏదీ కాదు
10. ఫరూక్ సియార్ ఏ దేశ కంపెనీకి బెంగాల్లో ఎటువంటి సుంకం లేకుండానే వ్యాపారం చేసుకునే హక్కును ఇచ్చాడు?
1) ఇంగ్లిషు 2) ఫ్రెంచ్
3) డచ్ 4) పోర్చుగీసు
11. మహ్మద్ షా కాలంలో స్వతంత్రమైన మొగలు రాష్ట్రాలు ఏవి?
1) హైదరాబాదు 2) బెంగాల్
3) అవధ్ 4) పైవన్నీ
12. హైదరాబాద్ సంస్థానాన్ని స్థాపించిన చిన్కిలిచ్ఖాన్కు ఫరూక్ సియార్ ప్రదానం చేసిన బిరుదులు ?
1) ఖాన్-ఇ-దౌరాన్
2) నిజాం ఉల్ ముల్క్
3) 1, 2 4) షా ఆలం
13. కింది వ్యాఖ్యల్లో సరైనది గుర్తించండి
ఎ. దాదాభాయ్ నౌరోజీ లేబర్ పార్టీ తరఫున బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడయ్యాడు
బి. దాదాభాయి నౌరోజీని గ్రాండ్ ఓల్డ్‌మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు
1) ఎ 2) బి 3)ఎ, బి 4) ఏదీకాదు
14. మహారాష్ట్ర ప్రజలను ప్రభావితం చేసిన భక్తి ఉద్యమకారుడు?
1) ఏక్నాథ్ 2) తుకారాం
3) వామన్ పండిట్ 4) సమర్థ్ రామదాస్
15. కింది వాటిలో మహల్వారీ భూమిశిస్తు విధానం ప్రవేశపెట్టిన ప్రాంతాలు?
1) పంజాబ్, వాయవ్య ప్రాంతాలు
2) బెంగాల్, బీహార్
3) ఒడిశా 4) మద్రాసు
16. తన తండ్రి నుంచి శివాజీ వారసత్వంగా పొందిన జాగీరు?
1) జావళి 2) తోరన
3) పూనా 4) కొల్హాపూర్
17. బీజాపూరు ఆదిల్షాహీలకు వ్యతిరేకంగా శివాజీ తన దాడులను నిలిపేందుకు ప్రధాన కారణం?
1) బీజాపూరు పాలకుడు శివాజీ తండ్రిని నిర్బంధించడం
2) శివాజీని అరెస్టు చేయడం
3) మరాఠీ నాయకుల అంతర్గత తగాదాలు
4) మొగలు వ్యతిరేకత
18. కింది వాటిలో సరైన జతలను గుర్తించండి
ఎ.జమిందారీ పాలకుడు శివాజీ తండ్రిని నిర్భందించడం
బి.రైత్వారీ విధానం-కల్నల్ రీడ్, థామస్ మన్రో
సి.మహల్వారీ విధానం- ఆర్.ఎం బర్ట్
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
19. మొగలు సేనాని జైసింగ్ పురంధర్ కోటను ముట్టడించడానికి ప్రధాన కారణం?
1) శివాజీ విశ్రాంతి విడిది
2) బలహీనమైన కోటకావడం
3) మొగలుల ప్రాంతం మధ్యలో ఉంది
4) శివాజీ రాజ్యానికి కేంద్ర స్థానంలో ఉన్న ఈ కోటలో శివాజీ కుటుంబం, సంపద ఉన్నాయి
20. క్రీ.శ. 1665 లో పురంధర్ ఒప్పందం ఎవరెవరి మధ్య కుదిరింది?
1) శివాజీ, షాయీస్థాఖాన్
2) శివాజీ, బ్రిటిషువారు
3) శివాజీ, డచ్చివారు
4) శివాజీ, రాజా జై సింగ్
21. బీజాపూరు రాజ్యంలో కర్ణాటక ప్రాంతాలను ఆక్రమించడానికి శివాజీ ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు?
1) గోల్కొండ కుతుబ్ షాహీలు
2) అహ్మద్‌నగర్ నిజాం షాహీలు
3) మొగలులు
4) పెనుగొండ అరవీటివంశం
22. ‘పర్వత రాజు’గా చరిత్రకారులు ఎవరిని పేర్కొన్నారు?
1) పృథ్వీరాజ్ 2) రాణా సంగుడు
3) మహారాణా ప్రతాప్ 4) శివాజీ
23. శివాజీ ఎప్పుడు మరణించాడు?
1) 1679 2) 1680
3) 1681 4) 1678
24. రాయ్‌గఢ్ పతనానంతరం మరాఠీలు తమ రాజధానిని ఎక్కడకు మార్చారు?
1) సతారా 2) కొల్హాపూర్
3) పూనా 4) సుపా
25. ఎవరి పాలనా కాలం నుంచి పీష్వాల ప్రాముఖ్యత పెరగడం ప్రారంభమైంది?
1) సా 2) రామానుజ
3) రెండవ సా 4) ప్రతాప్ సింగ్
26. మొగలులు ఏ మరాఠీ పాలకుడిని ప్రప్రథమంగా అధికారికంగా గుర్తించారు?
1) సా 2) రాజారామ్
3) శంభాజీ 4) రెండవ శివాజీ
27. మరాఠా చరిత్రలో ‘నానాసాహెబ్’గా ప్రఖ్యాతి వహించింది?
1) బాలాజీ విశ్వనాథ్
2) రెండవ బాజీరావు
3) సవాయ్ మాధవరావు
4) బాలాజీ బాజీరావు
28. సైనిక నైపుణ్యంలో శివాజీ తరువాత అంత ఖ్యాతి వహించిన వ్యక్తి?
1) సా 2) బాజీరావు
3) నానాఫడ్నవీస్
4) మహ్మద్జీ సింథియా
29. మరాఠాల్లో గొప్ప గెరిల్లాతంత్ర యోధుడుగా పేరుగాంచింది?
1) సాహు 2) బాలాజీ విశ్వనాథుడు
3) బాజీరావు 4) తారాబాయి
30. ఎవరు పీష్వాగా ఉన్నప్పుడు మరాఠాలు గుజరాత్‌ను ఆక్రమించారు?
1) రాజా గంగాధర్ రావు
2) బాలాజీ విశ్వనాథుడు
3) బాలాజీ బాజీరావు
4) రెండవ బాజీరావు
31. బాలాజీ బాజీరావు కాలంలో మహారాష్ట్ర ప్రభుత్వ కేంద్రం?
1) రాయ్‌గఢ్ 2) పురంధర్
3) పూనా 4) కొల్హాపూర్
32. మరాఠా సమాఖ్య ఎప్పుడు ఐదు స్వతంత్ర రాజ్యాలుగా విచ్ఛిన్నమైంది?
1) క్రీ.శ. 1761- మూడవ పానిపట్టు యుద్ధం
2) క్రీ.శ. 1748- మహారాష్ట్ర ఆక్రమణ
3) క్రీ.శ. 1749- సాహు మరణం
4) క్రీ.శ. 1740- మొదటి బాజీరావు మరణం
33. బిటిషు వారు ఏ పీష్వా కాలంలో ‘పీష్వా పదవి’ని రద్దు చేశారు?
1) నారాయణ్ రావు 2) రఘునాథ రావు
3) మొదటి మాధవ రావు
4) రెండవ బాజీరావు
34. మూడవ పానిపట్టు యుద్ధంలో మరాఠా సైన్యానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించినది?
1) నానాఫడ్నవీస్ 2) విశ్వాసరావు
3) సదాశివరావు బాపు
4) మల్హర్రావు హోల్కర్
35. మూడవ పానిపట్టు యుద్ధంలో మరాఠా ఫిరంగి దళానికి నాయకత్వం వహించినది?
1) విశ్వాసరావు 2) సదాశివరావు బాపు
3) ఇబ్రహీం ఖాన్ గార్థి 4) మల్హర్ రావు హోల్కర్
36. క్రీ.శ. 1761 మూడవ పానిపట్టు యుద్ధంలో మరాఠాలకు తాత్కాలికంగా సహాయం చేసింది?
1) రాజపుత్రులు 2) మొగలులు
3) సిక్కులు 4) జాట్లు
37. మూడవ పానిపట్టు యుద్ధం వల్ల ఎవరు లాభపడ్డారు?
1) మరాఠాలు 2) అఫ్గాన్లు
3) ఇంగ్లిష్ వారు 4) ఫ్రెంచి
38. పీష్వాకు వ్యతిరేకంగా బ్రిటిష్ వారి సహాయం కోరిన శివాజీ వారసుడు ?
1) రామరాజు 2) రెండవ సా
3) ఒకటవ సా 4) ప్రతాప్ సింగ్
39. దియోగావ్ ఒప్పందం ఏ యుద్ధానికి ముగింపు పలికింది?
1) మొదటి కర్నాటక యుద్ధం
2) రెండవ కర్నాటక యుద్ధం
3) రెండవ ఆంగ్ల-మరాఠా యుద్ధం
4) మూడవ ఆంగ్ల-మరాఠా యుద్ధం
40. మూడవ మరాఠా యుద్ధంలో (క్రీ.శ. 1817-1818) ఇంగ్లిష్‌వారికి వ్యతిరేకంగా మరాఠా నాయకుల కూటమిని ఏర్పాటు చేయడానికి కృషి చేసింది?
1) పీష్వా 2) సింధియా
3) హోల్కర్ 4) గైక్వాడ్
41. భారతదేశానికి సముద్రమార్గాన్ని కనిపెట్టడంలో మొట్టమొదటగా విజయాన్ని సాధించిన ఐరోపావారెవరు?
1) డచ్చివారు 2) ఫ్రెంచివారు
3) పోర్చుగీసువారు 4) ఆంగ్లేయులు
42. బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందాన్ని చివరిగా కుదుర్చుకున్న మరాఠా నాయకుడు ?
1) భోన్స్లే 2) సింధియా
3) హోల్కర్ 4) పీష్వా
43. మరాఠా రాజరికం ఎవరి కాలంలో వికేంద్రీకృత భూస్వామ్య వ్యవస్థగా మారింది?
1) శంభు 2) రాజారాం
3) తారాబాయి 4) సాహు
44. పీష్వా వ్యవస్థను ప్రారంభించింది?
1) తారాబాయి 2) శివాజీ
3) శంభాజీ 4) రాజారాం
45. శివాజీ ప్రభుత్వ వ్యవస్థలో పీష్వా ఏ బాధ్యతలు నిర్వర్తించాడు?
1) ప్రధానమంత్రి 2) రెవెన్యూ మంత్రి
3) ప్రభుత్వ రికార్డుల సంరక్షణ
4) విదేశాంగ మంత్రి
46. శివాజీ అష్ట ప్రధానుల్లో ప్రజల్లో నైతికవర్తనను పెంచడానికి కృషి చేసిన మంత్రి?
1) సచిన్ 2) పండిత్ రావు
3) అమాత్య 4) న్యాయాధీశుడు
47. శివాజీ తన రాజ్యాన్ని ఎన్ని ప్రాంతాలుగా విభజించారు?
1) 3 2) 4 3) 5 4) 6
48. ‘మిరాస్దార్లు’ అంటే ఎవరు?
1) జాగీర్దారులు 2) సైన్యాధిపతి
3) భూమిపై సాంప్రదాయకంగా వారసత్వ హక్కున్నవారు 4) పైవేవీకాదు
49. ‘జాగీర్దారీ వ్యవస్థ’ను ఏ పీష్వా కాలంలో పునఃప్రతిష్ఠించారు?
1) బాలాజీ విశ్వనాథ్ 2) మాధవరావు
3) రాజారాం 4) నారాయణ్ రావు
50. శివాజీ రాజ్యంలో భూమి కొలతకు ఉపయోగించిన సాధనం?
1) సికిందర్ ఇ ఘజ్ 2) జరీబ్
3) కథి 4) తనాబ్
51. మూడవ పానిపట్టు యుద్ధాన్ని విపులంగా వర్ణించిన ప్రత్యక్ష సాక్షి?
1) కాఫిఖాన్ 2) కాశీరాజు పండిట్
3) దత్తాజీ పింగలే 4) హర్చరన్ దాస్
52. 18వ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్య పతనం కావడానికి కారణం?
1) సరైన ఆర్థిక విధానం లేకపోవడం
2) ప్రజలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నించలేదు
3) జాగీర్దార్ వ్యవస్థను పునఃప్రతిష్ఠించడం
4) పైవన్నీ
53. శాంతియుతంగా జీవించే సిక్కులను సైనికజాతిగా రూపొందించింది ఎవరు?
1) గురు గోవింద్‌సింగ్
2) గురు తేజ్‌బహదూర్
3) గురు అర్జున్దేవ్
4) గురు హరగోవింద్
54. అకల్తఖ్త్ను నిర్మించిందెవరు?
1) గురు హరగోవింద్
2) గురు రామ్‌దాస్
3) గురు అర్జున్దేవ్
4) గురు గోవింద్‌సింగ్
55. ఏ సిక్కు గురువు తనను ‘పచ్చా పాద్ షా’గా పేర్కొన్నాడు?
1) గురు గోవింద్‌సింగ్
2) గురు హరగోవింద్
3) గురు తేజ్ బహదూర్
4) గురు అర్జున్దేవ్
56. మొగలుల ఆస్థానంలో 5000 జాత్, 5000 సవార్ హోదా పొందిన సిక్కు గురువు ఎవరు?
1) గురు హరగోవింద్
2) గురు హరకిషన్
3) గురు తేజ్‌బహదూర్
4) గురు గోవింద్‌సింగ్
58. గురుగోవింద్ సింగ్ మరణంతో ఆగిపోయిన గురు పరంపర అత్యున్నత మతాధికారం ఎవరికి బదిలీ అయింది?
1) గురు హక్కులు
2) గ్రంథ్ సాహెబ్
3) ఉపనయన క్రియ 4) భగవంతుడు
59. బందాబహదూర్ పరిపాలనలో ప్రవేశపెట్టిన ఏ సంస్కరణ అనంతర చరిత్రపై అమిత ప్రభావాన్ని చూపింది?
1) రాజాధికారాన్ని చెలాయించడం
2) గురుగోవింద్ సింగ్ పేరుతో నాణేలను విడుదల చేయడం
3) జమీందారీని రద్దు చేయడం
4) అధికార ముద్రను ప్రవేశపెట్టడం
జవాబులు
1.4 2.2 3.3 4.3 5.3 6.1 7.2 8.1 9.3 10.1 11.4 12.3 13.3 14.4 15.1 16.3 17.1 18.4 19.4 20.4
21.1 22.4 23.2 24.1 25.1 26.1 27.4 28.2 29.3 30.3 31.3 32.4 33.4 34.2 35.3 36.4
37.3 38.1 39.4 40.1 41.3 42.3 43.4 44.2 45.1 46.2 47.2 48.3 49.1 50.3 51.2 52.4
53. 4 54. 1 55. 2 56. 4 57. 4 58. 2 59.3
- Tags
- competitive exams
- Groups
- upsc
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు