అణ్వాయుధాల్లో వినియోగించే మూలకం? పోటీపరీక్షల ప్రత్యేకం (సైన్స్ అండ్ టెక్నాలజీ)
1. అణుధార్మికతకు సంబంధించిన కింది వాక్యాల్లో సరికానిది?
1) పరమాణు సంఖ్య 82 కంటే అధికంగా ఉన్న పరమాణువుల కేంద్రకాలు అస్థిరంగా ఉంటాయి
2) స్థిరత్వాన్ని సంపాందించుకునే క్రమంలో ఈ కేంద్రకాలు శక్తిని కిరణాల రూపంలో ఉద్గారిస్తాయి
3) రేడియో ధార్మికతను 1896లో రూథర్‌ఫర్డ్ కనుగొన్నాడు
4) అస్థిర పరమాణు కేంద్రకాల నుంచి వెలువడే ఆల్ఫా, బీటా, గామా కిరణాలను బెకరల్ కిరణాలు అంటారు
2. రేడియో ధార్మిక అంశాలు, వాటి ఆవిష్కర్త ఆధారంగా సరికాని జతను గుర్తించండి?
1) ఆల్ఫా కణాలు- రూథర్‌ఫర్డ్
2) బీటా కణాలు- హెన్రీ బెకరల్
3) గామా వికిరణాలు- పాల్ విల్లార్డ్
4) కృత్రిమ రేడియో ధార్మికత-రూథర్‌ఫర్డ్
3. అణువిద్యుత్ కేంద్రంలోని న్యూక్లియర్ రియాక్టర్‌లోని కింది చర్య నియంత్రించిన పరిస్థితిలో జరుగుతుంది?
1) కేంద్రక విచ్ఛిత్తి 2) కేంద్రక సంలీనం
3) అణు సంయోగం 4) అణుసాంద్రీకరణ
4. అణురంగానికి సంబంధించి హైదరాబాద్‌లో ఉన్న సంస్థ?
1) హెవీ వాటర్ బోర్డ్
2) యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
3) న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్
4) బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్
5. భారతదేశ మొదటి రిసెర్చ్ రియాక్టర్?
1) కామిని 2) ధ్రువ
3) పూర్ణిమ 4) అప్సర
6. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే రేడియో ఐసోటోప్?
1) సోడియం-24 2) కోబాల్ట్-60
3) అయోడిన్- 1 4) కోబాల్ట్- 90
7. రేడియోధార్మికతను కొలవడానికి ఉపయోగించే పరికరం?
1) క్యూరి మీటర్ 2) రేడియో మీటర్
3) గోనియో మీటర్ 4) గిగర్ కౌంటర్
8. సోడియం-24 అనే రేడియో ఐసోటోప్‌ను దేనికి ఉపయోగిస్తారు?
1) క్యాన్సర్ నిర్ధారణకు
2) రక్తప్రసరణలోని అడ్డంకులు తెలుసుకోవడానికి
3) శిలాజాల వయస్సును లెక్కించడానికి
4) థైరాయిడ్ చికిత్స కోసం
9. భారత్‌లో ఏర్పాటైన అణు రియాక్టర్లు ఏ రకానికి చెందినవి?
ఎ. బాయిల్డ్ వాటర్ రియాక్టర్స్
బి. ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్
సి. వాటర్- వాటర్ ఎనర్జీ రియాక్టర్స్
డి. గ్యాస్ కూల్డ్ రియాక్టర్స్
1) ఎ, బి, డి 2) ఎ, బి, సి, డి
3) బి, సి, డి 4) ఎ, సి, డి
10. భారత్‌లో ఎక్కువగా ఉన్న అణు ఇంధన నిల్వలు ఏవి?
1) యురేనియం 2) ప్లూటోనియం
3) థోరియం 4) జిర్కోనియం
11. గామా వికిరణాలకు సంబంధించి సరికానిది గుర్తించండి?
1) అస్థిర కేంద్రకాల్లోని శక్తి గామా వికిరణాల రూపంలో వెలువడుతుంది
2) వీటిని 1900వ సంవత్సరంలో పాల్ విల్లార్డ్ కనుగొన్నాడు
3) పరమాణు కేంద్రకంలో ప్రోటాన్ విచ్ఛిన్నం చెందినప్పుడు గామా వికిరణాలు వెలువడుతాయి
4) వీటిని విద్యుదావేశం లేని ఎక్స్-కిరణాలతో పోల్చవచ్చు
12. కింది వాటిలో సరికానిది?
1) అణు ధార్మికతకు ప్రమాణాలు బెకరల్, రూథర్‌ఫర్డ్, క్యూరీ
2) అణుధార్మికతను బబుల్ ఛాంబర్, గిగర్ కౌంటర్, సింటిలేషన్ కౌంటర్ల సహాయంతో కొలుస్తారు
3) 1903లో ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్ కేంద్రక శక్తిని కనుగొన్నాడు
4) బెకరల్ భావన అయిన ‘పరమాణువును విచ్ఛిత్తి చెందించడం’ ఆధారంగా కేంద్రక శక్తి ప్రాచుర్యం పొందింది
13. కేంద్రక పరివర్తనానికి సంబంధించిన కింది వాక్యాల్లో సరైనది గుర్తించండి?
ఎ. దీనిని ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్ 1917లో కనుగొన్నారు
బి. నైట్రోజన్ పరమాణువును ఆల్ఫా కణంతో తాడనం చెందించినప్పుడు అది ఆక్సిజన్‌గా మారుతుంది
సి. 1940లో మెక్‌మిలన్, ఎబెల్ సన్ యురేనియం-238ను న్యూట్రాన్లతో తాడనం చెందించి నెప్ట్యూనియమ్ను ఆవిష్కరించారు
డి. కేంద్రక పరివర్తన ఆధారంగా 1940 తర్వాత 22 రేడియో ధార్మిక మూలకాలు కృత్రిమంగా రూపొందిచారు
1) ఎ, సి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4)ఎ, సి, డి
14. పరమాణు కేంద్రకాల నుంచి వేటి ఉద్గారం వల్ల ద్రవ్యరాశి సంఖ్య, పరమాణు సంఖ్యలు మారవు?
ఎ. ఆల్ఫా కణాలు బి. బీటా కణాలు
సి. పాజిట్రాన్ డి. గామా వికిరణాలు
1) ఎ, బి 2) బి, డి
3) సి, డి 4) డి మాత్రమే
15. కేంద్రక చర్యలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి?
ఎ. కేంద్రక చర్యల వేగం, పీడనం, ఉష్ణోగ్రత వంటి వాటిపై ఆధారపడి ఉండదు
బి. కేవలం పరమాణు కేంద్రకాల్లో ఉండే కణాల మాత్రమే కేంద్రక చర్యల్లో పాల్గొంటాయి
సి. అధిక మొత్తంలో ఉష్ణోగ్రత విడుదల అవుతుంది
డి. నూతన మూలకాలు ఏర్పడే అవకాశం లేదు
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3)బి, సి, డి 4) ఎ, సి, డి
16. భారత్‌లో అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించి కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి?
ఎ. మన దేశంలో మొదటి అణు రియాక్టర్‌ను 1963లో రాజస్థాన్‌లో స్థాపించారు
బి. ఈ మొదటి అణురియాక్టర్ డగ్లస్లోని Candu రియాక్టర్‌ను పోలి ఉంటుంది
సి. అటామిక్ ఎనర్జీ ఆఫ్ కెనడా లిమిటెడ్ సంస్థ సహకారంతో దీన్ని నిర్మించారు
డి. రెండో యూనిట్‌ను 1966లో రావత్‌భటా అటామిక్ పవర్ ప్లాంట్‌లో ఏర్పాటు చేశారు
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) బి, సి, డి 4) ఎ, సి, డి
17. పరిశోధన రియాక్టర్లను వాటిలో వాడే ఇంధనం ఆధారంగా జతపర్చండి
ఎ. ధ్రువ 1. ప్లూటోనియమ్ ఆక్సైడ్
బి. పూర్ణిమ-3 2. ఎన్రిచ్డ్ యురేనియం
సి. పూర్ణిమ- 1 3. యురేనియం 233
డి. అప్సర 4. సహజ యురేనియం
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-2, బి-4, సి-3, డి-1
18. పరిశోధన రియాక్టర్లు వాటిని ఏర్పాటు చేయడానికి సహకరించిన దేశం ఆధారంగా గుర్తించండి?
ఎ. అప్సర 1. భారత్
బి. సిరస్ 2. బ్రిటన్
సి. FBTR 3. ఫ్రాన్స్
డి. కామిని 4. కెనడా
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-2, బి-4, సి-3, డి-1
19. రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ కు సంబంధించి కింది వాక్యాల్లో సరికానిది గుర్తించండి?
1) ఇది భారత్, రష్యా, బంగ్లాదేశ్ ఉమ్మడి ప్రాజెక్ట్
2) 2.4 గిగావాట్ల సామర్థ్యం గల ఈ కేంద్రాన్ని పద్మా నది ఒడ్డున నిర్మించారు
3) ఈ ప్రాజెక్టుకు అవసరమైన అణుఇంధనాన్ని కెనడా సరఫరా చేయనుంది
4) 1200 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం గల రెండు యూనిట్లు వరుసగా 2022, 2024 నాటికి పూర్తి కానున్నాయి
20. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లకు సంబంధించి కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి?
ఎ. ప్రపంచంలో మొట్టమొదటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ రష్యాలోని బెలోయార్స్క్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో ఏర్పాటయింది
బి. ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్లు అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేసే క్రమంలో తాము వినియోగించుకున్న ఇంధనం కంటే అధిక ఇంధనాన్ని ఉత్పత్తి చేయగలుగుతాయి
సి. భారత్‌లోని కల్పకంలో ఏర్పాటయిన తొలి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ 1985లో క్రిటికాలిటీకి చేరుకుంది
డి. కల్పకంలో ఏర్పాటయిన కామిని రియాక్టర్‌ను భారత పురాణాల్లో అక్షయ పాత్రతో పోలుస్తారు
1) ఎ, డి, బి 2) ఎ, బి, సి, డి
3) బి, సి, డి 4) ఎ, సి, డి
21. అప్సర-U పరిశోధన రియాక్టర్‌కు సంబంధించి కింది వాక్యాల్లో సరైనది?
ఎ. 2010లో మూసివేసిన అప్సర రియాక్టర్‌ను మరింత ఆధునికీకరించి రూపొందించారు
బి. 2018 సెప్టెంబర్‌లో ఇది క్రిటికాలిటీకి చేరుకుంది
సి. ఇంధనంగా స్వదేశీయంగా అభివృది ్ధచేసిన LEU అనే యురేనియం సిలికైడ్ను వినియోగిస్తారు
డి. కేంద్రక భౌతికశాస్త్రంలో, రేడియేషన్ షీల్డింగ్ ప్రక్రియల్లో పరిశోధనలకు, అదే విధంగా రేడియో ఐసోటోప్ల తయారీకి ఇది ఉపయోగపడుతుంది
1) ఎ, బి, డి
2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి
4) ఎ, సి, డి
22. ఆవిష్కర్తల పరంగా కింది వాటిలో సరికానిది?
1) కేంద్రక విచ్ఛిత్తి- అట్టహాన్, స్ట్రాస్ మన్
2) కేంద్రక శక్తి- ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్
3) అణు రియాక్టర్- ఎన్రికో ఫెర్మి
4) న్యూక్లియర్ ట్రాన్స్ఫర్మేషన్
23. ఐసోటోప్‌లకు సంబంధించి కింది వాటిలో సరైనది?
ఎ. ఇవి ఒకే పరమాణు సంఖ్య వేర్వేరు ద్రవ్యరాశులు కలిగి ఉన్న మూలకాలు
బి. ఐసోటోప్‌లను గురించి తొలుత ఫ్రెడరిక్ సాది వివరించారు
సి. ఇవి ప్రోటాన్ల సంఖ్యలో విభేదిస్తుండగా, సమాన సంఖ్యలో న్యూట్రాన్లను కలిగి ఉంటాయి
డి. ఆవర్తన పట్టికలో ఒక మూలకానికి సంబంధించిన ఐసోటోప్‌లను ఒకే చోట అమర్చుతారు
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
24. భారతదేశంలో రేడియో ఐసోటోప్ ఉత్పత్తిని వివిధ రంగాల్లో వినియోగానికి కృషి చేస్తున్న సంస్థలు?
ఎ. బోర్డ్ ఆప్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ (BRIT )
బి. వేరియబుల్ ఆఫ్ సైక్లోట్రాన్ సెంటర్ (VECC )
సి. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (DAE)
డి. అటామిక్ మినరల్ డైరెక్టరేట్ (AMD )
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
25. రేడియో ఐసోటోపులు, వాటి వినియోగానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి
1) రేడియో పాస్ఫరస్- లుకేమియా క్యాన్సర్ చికిత్స
2) రేడియో కార్బన్ – శిలాజాల వయసు నిర్ధారణ
3) రేడియో క్లోరిన్ – భూగర్భ జలాల పరిశీలన
4) రేడియో స్ట్రాన్షియం – ఉల్కలు, శిలల వయసు నిర్ధారణ
26. డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని ఏర్పాటు చేసిన సంవత్సరం?
1) 1954 2) 1945
3) 1942 4) 1924
27. ముంబైలోని భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్లో ఏర్పాటవని పరిశోధన రియాక్టర్?
1) అప్సర 2) ధ్రువ
3) భావిని 4) జర్లీనా
28. అణ్వాయుధాల్లో వినియోగించే మూలకం?
1) సహజ యురేనియం
2) లో ఎన్రిచ్డ్ యురేనియం
3) హై ఎన్రిచ్డ్ యురేనియం
4) ప్లూటోనియం
29. కేంద్రక ద్రవ్యరాశికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి?
1) కేంద్రకంలోని ప్రోటాన్ల మొత్తం ద్రవ్యరాశికి సమానం
2) కేంద్రకంలోని కణాల మొత్తం ద్రవ్యరాశి కంటే ఎక్కువగా ఉంటుంది
3) కేంద్రక ద్రవ్యరాశి అనేది కేంద్రక కణాల మొత్తం ద్రవ్యరాశి కంటే తక్కువగా ఉంటుంది
4) కేంద్రకంలోని న్యూట్రాన్ల మొత్తం ద్రవ్యరాశికి సమానంగా ఉంటుంది
30. కేంద్రక విచ్ఛిత్తికి సంబంధించిన సరికానిది?
1) కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియను అట్టోహాన్, ఫ్రిట్జ్, స్ట్రాస్‌మన్ కనుగొన్నారు
2) న్యూట్రాన్ వంటి తేలిక కణాలు యురేనియం వంటి కేంద్రాకాలను ఢీ కొట్టినప్పుడు అవి విచ్ఛిత్తి చెంది శక్తి వెలువడుతుంది
3) న్యూక్లియర్ రియాక్టర్లో నియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియ ద్వారా అణు విద్యుత్త్ ఉత్పత్తి చేస్తారు
4) హైడ్రోజన్ బాంబులో కేంద్రక విచ్ఛిత్తి ప్రధాన భూమిక వహిస్తుంది.
31. భారత్‌లో అణు ఇంధనాల వెలికితీతలో నిమగ్నమైన సంస్థ?
1) భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్
2) అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రిసెర్చ్
3) న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
4) భారతీయ నభికియా విద్యుత్ నిగం లిమిటెడ్
32. అటామిక్ ఎనర్జీ కమిషన్‌కి సంబంధించి కింది వాక్యాల్లో సరైనది గుర్తించండి?
ఎ. దీన్ని దేశంలో అణుశక్తి కార్యకలాపాలు నిర్వహించే సంస్థలన్నింటిలోకి అత్యున్నత సంస్థగా పరిగణిస్తారు
బి. దీని పరిధిలోనే ముంబైలో స్థాపించిన అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు పనిచేస్తుంది
సి. అణుశక్తి రంగానికి సంబంధించిన విధానాల రూపకల్పన దీని ప్రధాన బాధ్యత
డి. అటామిక్ ఎనర్జీ కమిషన్‌ను ముంబై ప్రధాన కేంద్రంగా 1948లో ఏర్పాటు చేశారు
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, డి
3) బి, సి, డి 4) ఎ, సి, డి
జవాబులు
1-3, 2-4, 3-1, 4-3, 5-4, 6-2, 7-4, 8-2, 9-2, 10-3, 11-3, 12-4, 13-3, 14-4, 15-1, 16-2, 17-34, 18-4, 19-3, 20-2, 21-3, 22-4, 23-1, 24-1, 25-4, 26-1 , 27-3, 28-3, 29-3, 30-4, 31-2 32-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు