పాక శాస్త్రం.. ఉపాధి పక్కా !
పాక శాస్త్రం.. అత్యంత ప్రాచీనమైన శాస్త్రం. మానవ జీవితంలో ఆహారం ఎంతో ముఖ్యం. రోజు రోజు కొత్త కొత్త రుచుల కోసం జనం ఆరాటపడు తుంటారు. రకరకాల వంటలను రుచి చూడాలని ఉవ్విళ్లూరుతుంటారు. ప్రపంచం కుగ్రామంగా మారుతున్న నేపథ్యంలో విభిన్న రుచుల కోసం విభిన్న రకాల వంటలను ప్రజలు కోరుకుంటున్నారు. నిత్యనూతనమైన కెరీర్లో ఇది ఒకటి. ఈ రంగంలో నిపుణులను తయారుచేస్తుంది కలినరీ కాలేజీ. ఇందులో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా….
ఐసీఐ
– ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్. ఇది కేంద్ర టూరిజం శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఈ సంస్థ ఏర్పాటుకు ప్రధాన ఉద్దేశం భారతీయ వంటకాలను సంరక్షించడం, డాక్యుమెంట్ చేయడం, ప్రోత్సహించడం, ఈ వంటకాలను వ్యాప్తి చేయడం. దీనితోపాటు పాక శాస్త్ర నిపుణులను తయారుచేసి ఈ రంగంలో అవసరాలను తీర్చడం.
– డిగ్రీ, పీజీ స్థాయి కోర్సులను అందించడంతోపాటు పాక శాస్త్రంలో పరిశోధన, ఆవిష్కరణలను ఐసీఐ ప్రోత్సహిస్తుంది.
-కలినరీ టూరిజాన్ని ప్రోత్సహించడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది.
కోర్సులు- అర్హతలు
బీబీఏ
– బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
-కోర్సు కాలవ్యవధి: మూడేండ్లు (ఆరు సెమిస్టర్లు)
– అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత
ఎంబీఏ
– మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
-కోర్సు కాలవ్యవధి: రెండేండ్లు (నాలుగు సెమిస్టర్లు)
– అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఆర్ట్/హాస్పిటాలిటీ లేదా హోటల్ మేనేజ్మెంట్లో ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా ఫైనల్ ఇయర్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఐసీఐ క్యాంపస్లు: నోయిడా, తిరుపతి
– నోట్: ఈ కోర్సులను అమర్కంఠ్లోని ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ, ఐసీఐ సంయుక్తంగా అందిస్తున్నాయి.
ఎంపిక విధానం
ఐసీఐ నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్-2022 ద్వారా
ఉద్యోగ అవకాశాలు
-ఈ కోర్సులను పూర్తిచేసుకున్న వారికి హోటల్, అనుబంధ పరిశ్రమల్లో చెఫ్, హాస్పిటాలిటీ విభాగాల్లో ప్లేస్మెంట్స్ వస్తాయి. దీనితోపాటు ఫైవ్ స్టార్, క్రూజ్ లైన్స్లో కిచెన్ మేనేజ్మెంట్ ఉద్యోగాలకు అవకాశం ఉంది. ఎయిర్వేస్, రైల్వేస్, నేవీ తదితర సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
– స్వయం ఉపాధి, ఫుడ్ బ్లాగర్, ఫుడ్ స్టెల్ ఫొటోగ్రఫీ, జర్నలిజం, మేనేజ్మెంట్ ట్రెయినీ, ఫుడ్ అనలిస్ట్, ఫుడ్ పార్క్, ఫ్యాకల్టీ తదితర అవకాశాలు ఉంటాయి.
– ఐసీఐ ట్రెయినింగ్, ప్లేస్మెంట్ భాగస్వాములు: తాజ్, ఒబెరాయ్ గ్రూప్, మారియట్, నెస్టెల్, ఐటీసీ, లెమన్ ట్రీ తదితర సంస్థలు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూన్ 30
వెబ్సైట్: https://www.icitirupati.in
…కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు