భక్తి ఉద్యమకారుల ప్రధాన ధ్యేయం ఏమిటి? (tet special)
దేవునిపై ప్రేమ, భక్తి
- బ్రాహ్మణులు ఆశ్రమాలను నెలకొల్పి యజ్ఞయాగాది క్రతువులు, మత సంబంధమైన చర్చలు నిర్వహించేవారు.
- శ్రమణులు విహారాలను, స్థూపాలను స్థాపించి బౌద్ధ, జైన బోధనలు చేశారు.
- హిందూమతం ‘సర్వేజనా సుఖినోభవంతు’ ‘లోకాసమస్తా సుఖినోభవంతు’ అనే సూత్రాలను విశ్వసిస్తుంది.
- సాధారణ శకం 500 పూర్వమే హిందూమతంలో వైదిక యజ్ఞాలు చేయడం దేవతలను పూజించడం, దేవాలయాలను నిర్మించడం, తపస్సు ద్వారా మోక్షాన్ని పొందడం వంటివి రూపుదిద్దుకున్నాయి.
- హిందూమతంలో పవిత్ర గ్రంథాలుగా వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, భగవద్గీత, పురాణాలను పరిగణిస్తారు.
- విష్ణువునే ‘పరమాత్మ’గా విశ్వసించిన వారిని భాగవతులు అంటారు.
- భాగవతులు విష్ణువును భక్తితో ఆరాధించడం ద్వారా మోక్షాన్ని పొందగలమని విశ్వసిస్తారు.
- యజ్ఞాలు చేయడం, బ్రాహ్మణులకు దానాలివ్వటం, వేదాలను వల్లెవేయడంపై భాగవతులు విశ్వాసాన్ని చూపిచలేదు.
- 2000 సంవత్సరాల క్రితం నాటి దేవాలయాల శిథిలాలను మధ్యప్రదేశ్‌లోని విదిశలో పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
- విష్ణువు, శివుడు, దుర్గాదేవి ప్రధాన దైవాలుగా పూజించే ఆచారం కొనసాగుతోంది.
- బుద్ధుడిని, జైన తీర్థంకరులను శిల్పాలుగా మలచి పూజించి, ఆరాధించడం అమరా వతి, ఫణిగిరి, భట్టిప్రోలు, జగ్గయ్యపేట, నేలకొండపల్లి, కొలనుపాక, నాగార్జునకొండ ప్రాంతాల్లో కొనసాగింది.
- బుద్ధుని జననానికి సంబంధించిన జాతక కథలు, శివుడు, విష్ణువు కథలను పురాణాల పేరుతో రచించారు.
- పన్నెండు మంది ప్రధానమైన విష్ణుభక్తులను ఆళ్వార్లు అంటారు. వీరిలో పెరియాళ్వార్, నమ్మాళ్వార్,
- పెరియాళ్వార్ కుమార్తె ఆండాళ్ ముఖ్యులు. వీరు తమిళనాడులో భక్తి ఉద్యమ రూపకర్తలు.
- ఆళ్వార్లు విష్ణువును స్తుతిస్తూ పద్యమాలికలను అల్లిపాడిన వాటిని పాశురాలు అంటారు.
- తమిళనాడులో వైష్ణవంతో పాటు శైవం ప్రాశస్త్యం పొందింది. 63 మంది నయనార్లు శైవ భక్తులు.
- నందనర్, పుల్లయ్య, కన్నప్ప వంటి నిమ్నకులాల వారితో పాటు అప్పర్, మాణిక్య వాచకర్లు అనేక శివాలయాలు సంచరిస్తూ శివుడి గురించి కీర్తనలు పాడేవారు.
- నయనార్లలో కరైక్కాలమ్మ, అమ్మయ్యార్ అనే మహిళలు కూడా ఉన్నారు.
- ఇజ్రాయెల్, పాలస్తీనాల్లో భక్తితో, ప్రేమతో ఒకే దేవుణ్ణి ఆరాధించడం ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయని విశ్వాసంతో క్రైస్తవం ఏర్పడింది.
- ఇజ్రాయిల్‌లోని జెరూసలేం దగ్గరున్న బెత్లెహాంలో ఏసుక్రీస్తు జన్మించారు.
- క్రీస్తు బోధనల్లో ప్రజలంతా సమానం,
- ప్రేమతో మెలగాలి, శాంతి, ప్రేమ, కరుణ కలిగి ఉండాలన్నారు.
- ‘బైబిల్’ క్రైస్తవుల పవిత్ర గ్రంథం. ఆయన ప్రముఖ బోధన ‘పర్వతం మీద ప్రసంగం’ (సెరిమన్ ఆన్ ది మౌంట్) ప్రసిద్ధి పొందింది.
- భారతదేశానికి క్రీస్తు బోధనలను రోమన్ వర్తకులతో ‘సెయింట్ థామస్’ వచ్చి ప్రచారం చేశారు.
- అరేబియాలో మహ్మద్ ప్రవక్త స్థాపించిన మతం ‘ఇస్లాం’.
- మహ్మద్‌ప్రవక్త అరేబియాలోని ‘మక్కా’లో సాధరణ శకం 570లో జన్మించారు.
- మహ్మద్ ప్రవక్త బోధనల్లో దేవుడు ఒక్కడే, మానవులంతా భగవంతుని సృష్టి, దేవుడి దృష్టిలో
- మానవులంతా ఒక్కటే, దేవుడికి/అల్లాకు రూపం లేదు. విగ్రహారాధన సరికాదని బోధించాడు.
- మహ్మద్ ప్రవక్తను అల్లా/దేవుని దూతగా పరిగణిస్తారు.
- ‘ఖురాన్’ ఇస్లాం పవిత్ర గ్రంథం.
- అరబ్ వర్తకుల ద్వారా ఇస్లాం భారత్‌లోకి వచ్చింది. ఇస్లాంలోకి మారిన అరబ్, తుర్కిష్ విజేతల ద్వారా ఇస్లాం వ్యాప్తి జరిగింది.
ప్రాక్టీస్ బిట్స్
1. ‘సర్వేజనా సుఖినోభవంతు’ ‘లోకా సమస్తా సుఖినోభవంతు’ అనే సూత్రాలు ఏ మతానికి సంబంధించినవి?
1) జైన మతం 2) బౌద్ధ మతం
3) హిందూ మతం 4) షింటో మతం
2. హిందూ మత ముఖ్యలక్షణాల్లో లేనిది?
1) వైదిక యజ్ఞాలు చేయడం
2) దేవతలను పూజించడం, ఆలయాలను నిర్మించడం
3) కోరికలను నియంత్రించడం, ధ్యానం చేయడం
4) తపస్సు ద్వారా మోక్షాన్ని పొందడం
3. మోక్షసాధనకు భాగవతులు అవలంబించిన విధానం?
1) భక్తితో విష్ణువును ఆరాధించడం
2) వేదాలను వల్లెవేయడం
3) యజ్ఞాలు చేయడం 4) ధ్యానం చేయడం
4. తెలంగాణలోని బౌద్ధ కేంద్రాల్లో లేనిది?
1) కొలనుపాక 2) ఫణిగిరి
3) నేలకొండ పల్లి 4) నాగార్జున కొండ
5. ‘మోక్షం పొందడానికి ఆరాధనే మార్గం’ అనే భావనకు ప్రాధాన్యం ఇచ్చిన వారు?
1) బౌద్ధులు 2) జైనులు
3) వైదికులు 4) తత్వవేత్తలు
6. భక్తి ఉద్యమం ప్రారంభమైన రాష్ట్రం?
1) తెలంగాణ 2) కర్ణాటక
3) మహారాష్ట్ర 4) తమిళనాడు
7. భక్తి ఉద్యమకారుల ప్రధాన ధ్యేయం?
1) దేవుడి సాన్నిధ్యాన్ని పొందడం
2) సమస్యల పరిష్కారం కోసం
3) అధికారం కోసం
4) ధనం కోసం
8. భక్తి ఉద్యమానికి సంబంధించి కింది వాటిని పరిగణించండి
ఎ) యజ్ఞాలు, జంతుబలులు, ఆచారాలపై నమ్మకం లేదు
బి) బౌద్ధ, జైన మతాలను వ్యతిరేకించారు
సి) కుల, మత భేదాలు పాటిస్తూ ఆచారాలు పాటించేవారు
డి) భగవంతుని ప్రేమ కోసం పాడుతూ, నృత్యాలు చేసేవారు
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) బి, సి, డి 4) బి, సి
9. ‘పాశురాలు’ అనేవి?
1) శివుడిని స్తుతిస్తూ పాడిన గీతాలు
2) సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించే విధానం
3) విష్ణువును స్తుతిస్తూ పాడిన పద్యాలు
4) విష్ణువు అవతార గాథలు
10. 12 మంది ప్రధాన విష్ణు భక్తులకున్న పేరు?
1) ఆళ్వార్లు 2) నయనార్లు
3) వైదికులు 4) తాత్వికులు
11. ఆళ్వార్లలో ఉన్న ఒకే ఒక మహిళ?
1) నమ్మాళ్వార్ 2) ఆండాళ్
3) పెరియాళ్వార్ 4) పోయిగై ఆళ్వార్
12. కింది వారిలో శివభక్తులైన 63 మంది భక్తి ఉద్యమకారులు?
1) నయనార్లు 2) ఆళ్వార్లు
3) చైతన్యులు 4) ప్రబంధాలు
13. నయనార్లలో నిమ్నకులాలకు చెందిన భక్తి ఉద్యమకారుడు?
1) కన్నప్ప 2) పుల్లయ్య
3) అప్పర్ 4) నందనర్
14. 63 మంది నయనార్లలో మహిళా ఉద్యమకారులు
ఎ) కరైక్కాలమ్మ బి) మణిక్క వాచకర్
సి) అమ్మయ్యార్ డి) ఆండాళ్
15. భక్తి, ప్రేమ లక్ష్యంతో అభివృద్ధి చెందిన మతం ఏ దేశాల్లో ప్రారంభమైంది?
ఎ) ఇజ్రాయెల్ బి) సౌదీ అరేబియా
సి) పాలస్తీనా డి) టర్కీ
1) బి 2) డి
3) ఎ, సి 4) ఎ, బి, సి, డి
16. కింది వాటిలో ఏసుక్రీస్తు జననానికి సంబంధం లేని ప్రాంతం ?
1) జెరూసలేం 2) ఇజ్రాయెల్
3) బెత్లెహాం 4) ఈజిప్ట్
17. క్రీస్తు చేసిన ప్రముఖ బోధనకున్న పేరు?
1) ఓడ మీద ప్రసంగం
2) ప్యాలెస్‌లో ప్రసంగం
3) పర్వతం మీద ప్రసంగం
4) పశువుల కొట్టంలో ప్రసంగం
18. మతాలు, పవిత్ర గ్రంథాలు జతపరచండి
మతం పవిత్ర గ్రంథం
ఎ) హిందూ 1) ఖురాన్
బి) ఇస్లాం 2) త్రిపీటకాలు
సి) క్రైస్తవం 3) ఆగమాలు
డి) బౌద్ధం 4) బైబిల్
5) వేదాలు
1) ఎ-1, బి-2, సి-5, డి-3
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-5, బి-1, సి-4, డి-2
4) ఎ-5, బి-1, సి-4, డి-2
19. భారతదేశానికి ఏసుక్రీస్తు బోధనలు తీసుకొచ్చిన మత గురువు ?
1) మదర్ థెరిసా 2) సెయింట్ అగస్టీన్
3) సెయింట్ థామస్ 4) సెయింట్ ఫాతిమా
20. మహ్మద్ ప్రవక్త ఇస్లాం మతాన్ని స్థాపించింది?
1) అరేబియా 2) పాలస్తీనా
3) ఇజ్రాయెల్ 4) టర్కీ
21. మహ్మద్ ప్రవక్త సాధారణ శకం 570లో ఎక్కడ జన్మించారు?
1) మదీన 2) మక్కా
3) జెరూసలేం 4) బెత్లెహాం
22. మహ్మద్ ప్రవక్త బోధనల్లో లేనిది?
ఎ) వర్ణ, వర్ణ భేదాలను సమర్థించారు
బి) విగ్రహారాధనను వ్యతిరేకించారు
సి) దేవుడు ఒక్కడే
డి) మానవులంతా భగవంతుని సృష్టి
1) ఎ, బి, సి 2) ఎ, డి
3) బి, సి, డి 4) ఎ, సి
23. ఇస్లాంకు సంబంధించి కిందివాటిలో సరికానిది?
1) మహ్మద్ ప్రవక్తను అల్లాగా పరిగణిస్తారు
2) మహ్మద్ ప్రవక్తను ‘అల్లాదూత’గా పేర్కొంటారు
3) కేరళలోని చెరమాన్ మసీదు దేశంలో నిర్మించిన మొట్టమొదటి మసీదుగా నమ్ముతారు
4) అరబ్ వర్తకుల ద్వారా ఇస్లాం భారత్‌లోకి వచ్చింది.
24. బుద్ధ భగవానుడికి సంబంధించిన గాథలను ఏ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు?
1) ఉపనిషత్తులు 2) పురాణాలు
3) జాతక కథలు 4) అరణ్యకాలు
జవాబులు
1. 3 2. 3 3. 1 4. 1 5. 3 6. 4 7. 1 8. 2 9. 3 10. 1 11. 2 12. 1 13. 3 14. 2 15. 3 16. 4 17. 3 18. 4 19. 3 20. 1 21. 2 22. 3 23. 1 24. 3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు