ప్రాచీనకాలంలో మతం – సమాజం
1. రాక్షస గుళ్లతో సంబంధం లేని అంశం (2)
1) పెద్ద పెద్ద బండరాళ్లతో గుడ్రంగా నిర్మిస్తారు
2) వీటిని కాల్చిన ఇటుకలతో సమాధులుగా నిర్మిస్తారు
3) మృతులతో పాటు వారు వాడిన వస్తువులను పూడ్చి పెట్టేవారు
4) చనిపోయిన పూర్వీకులను పూజించడం అత్యంత ప్రాధాన్యంగా భావించారు
2. మరణం తరువాత ఏం జరుగుతుందో ఏ కథ ద్వారా వివరించారు? (1)
1) నచికేతుని కథ 2) మార్కండేయుని కథ
3) లోహితుడు 4) సవ్యసాచి
3. నచికేతుని కథ ఏ ఉపనిషత్తులో చెప్పారు? (3)
1) ముండకోపనిషత్తు
2) బృహదారణ్యకోపనిషత్తు
3) కఠోపనిషత్తు
4) ఛాందోగ్యోపనిషత్తు
4. రుషులు అడవుల్లోని ఆశ్రమాల్లో నివసిస్తూ వాద సంవాదాలతో చర్చలు జరిపే విషయాల్లో లేని అంశం (4)
1) వినాశనం లేనిది 2) దుఃఖం లేనిది
3) చావు లేనిది 4) అశాశ్వతమైంది
5. ఆత్మజ్ఞానం ద్వారా కింది దాన్ని పొందగలమని మునులు తలచారు(1)
1) అమరత్వం 2) శారీరకానందం
3) మానసికానందం 4) అలౌకికానందం
6. పరివ్రాజకుల లక్షణం కానిది (3)
1) ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి తిరుగుతారు
2) ఒక అరణ్యం నుంచి మరో అరణ్యానికి తిరుగుతారు
3) సుఖ భోగాలతో జీవిస్తూ ఆత్మబోధ చేస్తారు
4) స్థిర నివాసం లేకుండా జ్ఞానాన్వేషణ కోసం తపస్సు చేస్తారు
7. కింది వారిలో ‘జినుడు’గా ఎవరిని పిలుస్తారు? (1)
1) కోరికలు జయించిన వారిని
2) కోరికలు తీర్చుకున్న వారిని
3) సుఖ భోగాల్లో మునిగితేలేవారిని
4) మరణానికి చేరువైనవారిని
8. మహావీరుడు అవలంబించిన మతం (1)
1) జైనమతం 2) బౌద్ధ మతం
3) పార్శీ మతం 4) వైదిక మతం
9. పరివ్రాజకుల్లో లేనివారు (3)
1) వర్ధమాన మహావీరుడు
2) గౌతమ బుద్ధుడు
3) యాజ్ఞవల్క్యుడు
4) మక్కలి గోశాల
10. మహావీరుని బోధనల్లో లేని అంశం (3)
1) ఇతరులకు దుఃఖాన్ని కలిగించకూడదు
2) చిన్న ప్రాణికి కూడా హింస తలపెట్టరాదు
3) విముక్తులు కావడానికి వేదాధ్యయనం చేయాలి
4) శరీరాన్ని కఠోర శ్రమకు గురిచేయాలి
11. బుద్ధుని బోధనలైన ‘త్రిపీటకాలు’లో లేనిది(4)
1) సుత్త 2) వినయ
3) అభిధమ్మ 4) విజ్ఞాన
12. బుద్ధుని జీవితంలోని ముఖ్య సంఘటనలను క్రమానుగతశ్రేణిలో అమర్చండి (3)
ఎ. జననం బి. నిర్వాణం
సి. ధర్మచక్ర పరివర్తన డి. మహాభినిష్క్రమణం
ఇ. మహాపరినిర్వాణం
1) ఎ, బి, సి, డి, ఇ 2) ఎ, డి, ఇ, సి, బి
3) ఎ, డి, బి, సి, ఇ 4) ఎ, సి, ఇ, డి, బి
13. దుఃఖ నివారణకు బుద్ధుడు చూపించిన మార్గం (1)
1) అష్టాంగ మార్గం 2) పంచాంగ మార్గం
3) స్యాద వాదం 4) పంచ సూత్రాలు
14. జైనులు తమ బోధనలకు ఉపయోగించిన భాష (1)
1) ప్రాకృత భాష 2) సంస్కృత భాష
3) శూరసేని 4) పైశాచీ
15. బౌద్ధసాహిత్యంలో జాతక కథలు కింది వాటి గురించి వివరిస్తాయి (2)
1) మరణం 2) జననం
3) కర్మ 4) వైవాహిక జీవితం
16. మతాలు, ప్రధాన మతాచారాలతో జతపరచండి (2)
ఎ) జైన మతం 1) పూర్వీకుల ఆరాధన
బి) బౌద్ధ మతం 2) యజ్ఞయాగాది క్రతువులు
సి) వైదిక మతం 3) అహింస
4) గొప్పమధ్యే మార్గం
1) ఎ-1, బి-2, స-4 2) ఎ-3, బి-4, సి-2
3) ఎ-3, బి-1, సి-2 4) ఎ-2, బి-1, సి-4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు