రక్తాన్ని గ్రహించి.. మలినాలను తొలగించి..
జంతువులు తీసుకున్న ఆహారం జీర్ణమైన తర్వాత మిగిలిన నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలను బయటకు పంపించే ప్రక్రియను ‘విసర్జన’ అంటారు. ప్రోటోజోవన్లు, సీలెంటిరేట్లు, ఇఖైనోడెర్మ్లలో తప్ప అన్ని జంతువుల్లో విసర్జక అవయవాలు ఉంటాయి. అయాన్లు, శరీర ద్రవాల తులస్థితిని కాపాడటమే ‘విసర్జక వ్యవస్థ’ ప్రాథమిక కర్తవ్యం. నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలను విసర్జించటం ద్వితీయ కర్తవ్యం.
మూత్రపిండం నిర్మాణం
- సకశేరుకాల్లో మూత్ర పిండాలు విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి.
- మూత్రపిండాలు పిండాభివృద్ధిలో ‘మధ్య త్వచం’ నుంచి ఏర్పడుతాయి.
- సైక్లోస్టొమేటా వంటి ప్రౌఢ జీవుల్లో ‘ప్రాథమిక వృక్క మూత్రపిండం’ ఉంటుంది. చేపలు, ఉభయ చరాల్లో
- ‘మధ్యవృక్క’ మూత్రపిండం ఉంటుంది. అనెలిడా జీవుల్లో వృక్క మూత్రపిండాలు ‘అంత్యవృక్క’ రకానికి చెందినవి.
- క్షీరదాల మూత్రపిండాల్లో లోపలితలం వైపున ఉన్న పుటాకార నిర్మాణాన్ని ‘హైలమ్’ అంటారు.
- మూత్రపిండంలో మూత్రనాళం జనించే ప్రదేశాన్ని ‘పెల్విన్’ అంటారు.
మూత్ర పిండాలు
- మానవునిలో ఒకజత మూత్రపిండాలు ఉదరభాగంలో వెన్నెముకకు ఇరువైపులా, పృష్ట శరీరకుడ్యానికి అంటుకుని ఉంటాయి.
- మానవుని విసర్జకవ్యవస్థలో ఒకజత మూత్రపిండాలు, ఒకజత మూత్రనాళాలు, ఒక మూత్రకోశం ఉంటాయి.
- మూత్రపిండాలను కప్పి ఉంచే పొరను ‘ట్యూనికా ఫైబ్రోసా’ అంటారు.
- మూత్రపిండాల అధ్యయనాన్ని ‘నెఫ్రాలజీ’ అంటారు.
- మూత్రపిండాలు ‘చిక్కుడు గింజ’ ఆకారం లో, ‘ముదురు ఎరుపు రంగు’లో ఉంటాయి.
- ప్రతి మూత్రపిండం మీద అధివృక్క గ్రంథి ఉంటుంది. ఇది వినాళ గ్రంథి (నాళములేని గ్రంథి). దీనికి విసర్జకవ్యవస్థతో సంబంధం లేదు.
- వెలుపలి అంచు కుంభాకారంగాను, లోపలి అంచు పుటాకారంగానూ ఉంటాయి. పుటాకార తలంలోని నొక్కుని ‘నాభి’ అంటారు.
- హృదయం నుంచి మూత్రపిండానికి రక్తాన్ని తెచ్చే ధమనిని ‘వృక్కధమని’అంటారు. ఇది నాభి ద్వారా మూత్రపిండంలోకి ప్రవేశిస్తుంది.
- మూత్రపిండాల నుంచి హృదయానికి రక్తాన్ని తీసుకునిపోయే సిరను ‘వృక్కసిర’ అంటారు.
- మూత్రనాళం పలుచని కుడ్యం గల గొట్టం. మూత్రనాళం పూర్వాంతం (మూత్రపిండం వైపు ఉండే చివర) వెడల్పుగా ఉంటుంది. దీన్ని ‘వృక్కద్రోణి’ అంటారు. వృక్కద్రోణిలో పెరిస్టాలిటిక్ చలనాలు ఉంటాయి. దీనివలన మూత్రం నాళిక ద్వారా మూత్రకోశంలోకి చేరుతుంది.
- క్షీరదాలు తప్ప మిగిలిన సకశేరుకాల్లో మూత్రనాళం పరాంత పార్శం నుంచి ఏర్పడుతుంది.
- మూత్రకోశంలోకి 200-400ml మూత్రం చేరగానే విసర్జితమవుతుంది.
మూత్రపిండం నిలువుకోత
- మూత్రపిండం ఉపరితల భాగం గాఢ ఎరుపు రంగులో ఉంటుంది. దీన్ని ‘వల్కలం’ (Cortex) అంటారు.
- లోపలి భాగం లేత ఎరుపు రంగులో ఉంటుంది. దీనిని ‘దవ్వ’ (Medu lla) అంటారు.
- దవ్వ నుంచి ఏర్పడిన త్రిభుజాకార నిర్మాణాలను ‘పిరమిడ్స్’ అంటారు.
- పిరమిడ్ల మధ్యనున్న Cortex నిర్మాణాలను ‘కాలమ్స్ ఆఫ్ బెర్టినీలు’ అంటారు.
- మిగిలిన సకశేరుకాల్లో కాలమ్స్ ఆఫ్ బెర్టినీలు, హైలమ్, పెల్విస్ అనే నిర్మాణాలు ఉండవు. ఇవి కేవలం క్షీరదాల్లో మాత్రమే ఉంటాయి.
- దవ్వలో 9 నుంచి 12 వరకు ‘సూచీ స్తంభాలు’ ఉంటాయి. వీటి విశాలమైన ఆధార భాగాలు వల్కలం వైపు ఉంటాయి.
- సూచీ స్తంభాల విశాలమైన చివరలు శాఖలు, పుష్పంలోని రక్షక పత్రాల్లా ఉంటాయి. కాబట్టి వీటిని ‘కేలిసెస్’ అంటారు.
- మూత్రకోశం లేని జీవులు: చేపలు, సర్పాలు, ఎగిరే పక్షులు, మొసళ్లు.
విసర్జక పదార్థాలు కాలేయంలో ఏర్పడుతాయి.
విసర్జక పదార్థాలు
విసర్జక పదార్థాలు మూడు రకాలు. అవి.. 1. అమ్మోనియా 2. యూరియా 3. యూరికామ్లం
నత్రజని వ్యర్థం ఆ జంతువుకందే నీటి లభ్యతపై ఆధారపడి ఉంటుంది.
1. అమ్మోనియా:
అమ్మోనియా విసర్జించే జీవులను ‘అమ్మోనోటెలిక్’ జీవులు అంటారు. నీటి లభ్యత అధికంగా ఉండే ప్రాంతంలోని జీవులు దీన్ని విడుదల చేస్తాయి. ఎల్లప్పుడు నీటిలో ఉండే జీవుల్లో అమ్మోనియా విసర్జక పదార్థంగా ఉంటుంది. అమ్మోనియా కాలేయంలో డి అమినేషన్ పద్ధ్దతిలో ఏర్పడుతుంది.
ఉదా: అమీబా, హైడ్రా, అస్థిచేపలు
2. యూరియా:
యూరియాను విసర్జించే జీవులను ‘యూరియోటెలిక్’ జీవులు అంటారు. ఈ జీవులు ఓ మోస్తారు నీరు లభించే ప్రాంతాల్లో ఉంటాయి.
ఉదా: ఉభయచరాలు, కొన్ని క్షీరదాలు, మృదులాస్థి చేపలు (యూరియా అర్నిథిన్ వలయం ద్వారా ఏర్పుడుతుంది)
3. యూరికామ్లం:
యూరికామ్లాన్ని విసర్జించే జీవులను ‘యూరికోటెలిక్’ జీవులు అంటారు. ఈ జీవులు నీటికొరత ప్రాంతాల్లో ఉంటాయి.
ఉదా: సరీసృపాలు, పక్షులు, కీటకాలు
నెఫ్రాన్ (మూత్రనాళిక)
- మూత్రనాళికలు ఒక మూత్రపిండంలో సుమారు ఒక మిలియన్ (10 లక్షలు) ఉంటాయి.
- మూత్రనాళికలో రెండు భాగాలు ఉన్నాయి. అవి 1. మాల్ఫీజియన్ దేహం, 2. మూత్రనాళిక
- మాల్ఫీజియన్ దేహంలో రక్తనాళికా గుచ్ఛం, భౌమన్స్ గుళిక ఉంటాయి.
- మూత్రనాళికలో మూడు భాగాలున్నాయి అవి.. 1. సమీప సంవళిత నాళం, 2. హెన్లీశిక్యం, 3. దూరాగ్ర సంవళితనాళిక
- భౌమన్స్ గుళిక కప్పు భాగంలో అనేక రక్తకేశ నాళికలు ఒక వలలా ఏర్పడుతాయి. దీన్ని ‘రక్తకేశనాళికా గుచ్ఛం’ అంటారు.
- క్షీరదాలు, పక్షుల లాంటి అభివృద్ధి చెందిన సకశేరుకాల్లో మూత్రనాళిక ‘U’ ఆకారంలో వంపు తిరిగి ఉంటుంది. దీన్ని ‘హెన్ల్లీశిక్యం’ అంటారు.
- హెన్ల్లీశిక్యంలో ‘కౌంటర్ కరెంట్ మెకానిజం’ అనే ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియ రక్తంలోని లవణ, నీటి గాఢతను క్రమపరుస్తుంది.
- రక్తకేశనాళికా గుచ్ఛం వద్ద సూక్ష్మ గాలనం (Ultra Filtretion) జరుగుతుంది.
- వృక్కధమని మూత్రపిండంలోకి ప్రవేశించిన తర్వాత అనేక శాఖలుగా విడిపోతుంది. ఈ శాఖలు నెఫ్రాన్లోకి రక్తాన్ని తీసుకొనిపోతాయి.
- నెఫ్రాన్కు రక్తాన్ని తీసుకొని వెళ్లే వృక్క ధమని శాఖను ‘అభివాహి రక్తనాళం’ అంటారు.
- అభివాహి రక్తనాళం అనేక రక్త కేశనాళికలుగా చీలి ‘రక్త కేశనాళికా గుచ్ఛం’ లేదా ‘గ్లోమరులిస్’ను ఏర్పరుస్తుంది.
- రక్త కేశనాళికా గుచ్ఛం నుంచి ఏర్పడే చిన్నచిన్న రక్త కేశనాళికలన్నీ కలిసి ‘అపవాహి రక్త నాళం’ను ఏర్పరుస్తాయి.
- అభివాహి రక్త నాళంలో ప్రసరించే రక్తం అధిక పీడనాన్ని, విసర్జక పదార్థాలను కలిగి ఉంటుంది.
- అపవాహి రక్త నాళంలోని రక్తం తక్కువ పీడనాన్ని కలిగి ఉంటుంది. విసర్జక పదార్థాలు ఉండవు.
- మూత్రనాళికల దూరాగ్ర సంవళిత నాళికలు సంగ్రహణ నాళాల్లోకి తెరుచుకుంటాయి.
- మూత్రనాళాలు మూత్రకోశంలోకి తెరుచుకుంటాయి.
- లేని జీవులు: చేపలు, సర్పాలు, ఎగిరే పక్షులు, మొసళ్లు.
- విసర్జక పదార్థాలు ‘కాలేయం’లో ఏర్పడుతాయి.
ప్రాక్టీస్ బిట్స్
1. నత్రజని వ్యర్థాలను బయటికి పంపించే ప్రక్రియ?
ఎ. విసర్జక క్రియ బి. శ్వాసక్రియ
సి. జీర్ణక్రియ డి. పైవన్నీ
2. మూత్రపిండాలను కప్పి ఉంచే పొర ?
ఎ. ఎన్యూరా బి. హెమటూరియం
సి. ట్యూనికాఫైబ్రోసా డి. ఏదీకాదు
3. మూత్రపిండాల అధ్యయనాన్ని ఏమంటారు?
ఎ. యూరాలజీ బి. నెఫ్రాలజీ
సి. డయాలజీ డి. లిమ్నాలజీ
4. దవ్వలోని సూచీస్తంభాల సంఖ్య?
ఎ. 8-12 బి. 12-9
సి. 9-13 డి. 9-12
5. ఫ్లనేరియాలో విసర్జక అవయవాలు?
ఎ. వృక్కాలు బి. జ్వాలాకణాలు
సి. మూత్రపిండాలు
డి. మాల్ఫీజియన్ నాళికలు
6. కృత్రిమ మూత్రపిండ నిర్మాణాన్ని తెలిపిన శాస్త్రవేత?
ఎ. జీన్ లామార్క్ బి. అలెగ్జాండర్
సి. విలియం జె కాఫ్ డి. విలియం హార్వే
7. మూత్రంలో ఉండే విటమిన్లు?
ఎ. B, C బి. B, D
సి. A, B డి. B కాంప్లెక్స్
8. సాధారణంగా మానవుడు విసర్జించే మూత్రం పరిమాణం ఒక రోజుకు?
ఎ. 1.8 లీటర్లు బి. 1.5 లీటర్లు
సి. 120 మిల్లిలీటర్లు
డి. 170-180 మిల్లీలీటర్లు
9. హెన్లీశిక్యం ఏ ఆకారంలో ఉంటుంది?
ఎ. C బి. D
సి. సర్పిలాకారం డి. U
10. అమ్మోనియాని విసర్జించే జీవులను ఏమంటారు?
ఎ. యూరియోటెలిక్ జీవులు
బి. యూరికోటెలిక్ జీవులు
సి. అమ్మోనోటెలిక్ జీవులు
డి. క్షీరదాలు
11. జీవితాంతం శరీరం నుంచి నత్రజని సంబంధిత వ్యర్థాలను విడుదల చేయని జీవి?
ఎ. సిల్వర్ ఫిష్ బి. మాత్లు
సి. చేపలు డి. అమీబా
12. శరీరం నుంచి వ్యాపనం, విసరణ విధానంలో విసర్జన చేసే జీవులు?
1. ప్రోటోజొవా 2. సీలెంటిరేటా
3. ఇఖైనోడెర్మేటా 4. మొలస్కా
ఎ. 1, 2, 4 బి. 1, 2, 3
సి, 2, 3, 4 డి. 1, 3, 4
13. వ్యర్థాలను జీవిత కాలం యూరికామ్ల స్పటికాల రూపంలో నిల్వ ఉంచుకునే జీవి?
ఎ. సిల్వర్ ఫిష్
బి. ఇఖైనోడెర్మేటా జీవులు
సి. బొద్దింక
డి. పైవన్నీ
14. ‘హెమటూరియా’ అంటే..
ఎ. మూత్రంలో రక్త పీడనం
బి. మూత్రంలో రక్త శాతం
సి. మూత్రంలో వర్ణకాలు
డి. మూత్రం స్థితి
15. మధుమేహ వ్యాధి కానిది ఏది?
ఎ. డయాబెటిస్ మిల్లిటస్
బి. అతిమూత్ర వ్యాధి
సి. డయాబెటిస్ ఇన్ సిఫిడస్
డి. బి, సి
జవాబులు
1. ఎ 2. సి 3. బి 4. డి 5. బి 6. సి 7. ఎ 8. బి 9. డి 10. సి 11.ఎ 12. బి 13.ఎ 14.ఎ 15.డి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు