Indian History | స్వాతంత్య్రం వైపుగా ఒక్కొక్క అడుగు
అగస్టు డిక్లరేషన్ (1917)
- దీన్ని చేసింది మజేమ్స్ మాంటెగో
- మాంటెగో, భారతీయులు మొదటి ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయులకు సహకరిస్తే యుద్ధం తర్వాత భారతీయులకు స్వయం ప్రతిపత్తి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
ఆగస్టు ఆఫర్ (1940) - దీన్ని ప్రకటించింది లార్డ్ లిన్లిత్గో
- రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులు బ్రిటిష్‌వారికి సహకరిస్తే యుద్ధం తర్వాత స్వయం ప్రతిపత్తి, ఉద్యోగాల్లో భాగస్వామ్యం కల్పిస్తామని అన్నారు.
దీపావళి ప్రకటన (1929 అక్టోబర్ 31) - ప్రకటించినవారు లార్డ్ ఇర్విన్
- లార్డ్ ఇర్విన్ సైమన్ కమిషన్ సిఫారసులు భారతీయులు ఆమోదిస్తే వెంటనే స్వయం ప్రతిపత్తి ఇస్తామని ప్రకటించాడు.
ఉప్పు సత్యాగ్రహం (1930 మార్చి 120
- దీన్ని శాసనోల్లంఘన ఉద్యమం అని కూడా అంటారు.
- నిత్యం ఉపయోగించే ఉప్పుపై కూడా ఆంగ్లేయులు పన్నును విపరీతంగా పెంచారు.
- దీనితో గాంధీ 1930 మార్చి 12న 78 మంది అనుచరులతో సబర్మతి నుంచి ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు.
- సబర్మతి నుంచి 375 కి.మీ. నడిచి దండి అనే ప్రాంతంలో ఉప్పును తయారు చేశారు.
- 1930 ఏప్రిల్ 6 నాటికి (24 రోజుల్లో) దండి చేరుకొన్నారు
- దారిలో గాంధీకి మొదటగా సంఘీభావం తెల్పింది అబ్బాస్ త్యాబ్జి, సరోజిని నాయుడు
- ఈ సత్యాగ్రహంలో ఏకైక తెలుగువాడు ఎర్ణంనేని సుబ్బారావు
- కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన ఏకైక తెలుగు వ్యక్తి ఆనందాచార్యులు
- ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న మొత్తం సభ్యులు 90,000
గాయపడిన సభ్యులు 300
మరణించిన సభ్యులు 210
ఢిల్లీలో పాల్గొన్న మహిళల సంఖ్య -1600 - ఉప్పు సత్యాగ్రహం కాలంలో “వీరగదంబు తెచ్చినాడమ్మా వీరుడెవరో” రాసింది త్రిపురనేని రామస్వామి చౌదరీ
ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్ - బిరుదు – భారతదేశ సరిహద్దు గాంధీ షాఖాన్
- తెలంగాణ సరిహద్దు గాంధీ జమలాపురం కేశవరావు
- ఖాన్ అబ్దుల్ స్థాపించిన ఆర్మీ రెడ్ షర్ట్
- భారత రత్న పొందిన మొదటి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ (1987), రెండవ విదేశీయుడు నెల్సన్ మండేలా (1990).
సరోజిని నాయుడు - వీరి కుటుంబం బెంగాల్‌కు చెందినది.
- తండ్రి అఘోరనాథ ఛటోపాధ్యాయ, భర్త గోవిందరాజుల నాయుడు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందినవారు.
- సరోజిని నాయుడు బిరుదు భారత కోకిల
- గ్రంథాలు : ద బర్గర్ ఆఫ్ హైదరాబాద్
- గోల్డెన్ త్రిషోల్డ్
- బ్యాంగిల్ సెల్లర్
- మొదటి మహిళ గవర్నర్‌గా పని చేశారు. (ఉత్తరప్రదేశ్)
వ్యక్తిగత సత్యాగ్రహం (1940) - గాంధీ పత్రికా స్వేచ్ఛను కోరుతూ ప్రారంభించిన ఉద్యమం. దీన్నే ‘ఢిల్లీ ఛలో’ ఉద్యమం అంటారు.
- మొదటి వ్యక్తిగత సత్యాగ్రహి ఆచార్య వినోభా భావే
రౌండ్ టేబుల్ సమావేశాలు
1930, 1931, 1932 - మొదటి రౌండ్ టేబుల్ సమావేశం -1930
- సమావేశాలకు హజరైనవారు 1) అంబేద్కర్, 2) మహమ్మద్ అలీజిన్నా
- 1వ రౌండ్ టేబుల్ సమావేశం విఫలమైంది.
- 2వ సమావేశానికి గాంధీని పిల్చుకు రమ్మని రామ్సే మెక్ డొనాల్డ్ లార్డ్ ఇర్విన్‌ను
ఆదేశించాడు.
గాంధీ – ఇర్విన్ ఒడంబడిక – 1931
- గాంధీని 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకావాలని పిలవటం కోసం. అప్పటి వైస్రాయ్ ఇర్విన్-గాంధీతో ఢిల్లీలో చర్చలు జరిపారు. దీన్నే ఢిల్లీ ఒడంబడిక అంటారు.
- దీనితో ఉప్పు తయారీని నిలిపి గాంధీ సమావేశానికి హాజరయ్యారు.
- ఈ సమావేశంలో అంబేద్కర్- గాంధీ విభేదాల వల్ల గాంధీ ఆ సమావేశం నుంచి అర్ధంతరంగా ఇండియాకి వచ్చి 2వసారి ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించగా, మహారాష్ట్రలోని పూనేలోని ఎర్రవాడ జైలులో బంధించారు.
కమ్యూనల్ అవార్డ్ (1932)
- దీన్ని రామ్సే మెక్‌డొనాల్డ్ ప్రకటించాడు.
- కమ్యూనల్ అవార్డ్ ప్రచారం బలహీన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. కానీ గాంధీ దీన్ని తిరస్కరించి ఎరవాడ జైలులో నిరాహార దీక్ష చేశారు.
- గాంధీ అంబేద్కర్ల మధ్య పూనా ఒడంబడిక -1932
- కమ్యూనల్ అవార్డును నిరసిస్తూ గాంధీ పూనె జైలులో నిరాహార దీక్ష చేయగా అంబేద్కర్ మదన్ మోహన్ మాలవీయను మధ్యవర్తిగా తీసుకెళ్లి గాంధీ-అంబేద్కర్ చర్చలు జరిపారు. (పూనెలోని ఎరవాడ జైలులో) నియోజకవర్గాలు పంచుకొని కమ్యూనల్ అవార్డును తిరస్కరించారు.
1935 భారత ప్రభుత్వ చట్టం - దీన్ని మినీ రాజ్యాంగం అంటారు.
- ఇది బ్రిటిష్‌వారు చేసిన అతిపెద్ద చట్టం.
- దీనిలోనే మొదటిసారి ఎస్సీ, ఎస్టీ అనే పదాలు రాశారు.
- ఈ చట్టం ప్రకారం కేంద్ర స్థాయిలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
- ఈ చట్టం ప్రకారం 1937లో 11 రాష్ర్టాల్లో ఎన్నికలు జరగ్గా 8 రాష్ర్టాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.
క్రిప్స్ రాయబారం 1942
- దీన్నే నాయకులు లేని ఉద్యమం, ఆగస్టు ఉద్యమం, వార్ధా తీర్మానం అని కూడా పిలుస్తారు.
- ఈ ఉద్యమాన్ని గాంధీ 1942 ఆగస్టు8న గాంధీ ప్రారంభించారు.
- 1942 ఆగస్టు 9న నాయకులందరినీ నిర్బంధించారు. ఈ ఉద్యమ కాలంలో గాంధీ నినాదం ‘డూ ఆర్ డై’ విజయమో వీర స్వర్గమో, సాధించు లేదా ఘతించు.
- ఈ ఉద్యమ కాలంలో గాంధీని ‘అఘాఖాన్ ప్యాలస్’ నిర్బంధ గృహంలో బంధించారు. ఇక్కడే కసూర్బా గాంధీ మరణించారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ అరుణా అసఫ్‌అలీ. ఈమె దేశవ్యాప్తంగా పర్యటించి, ఉద్యమాన్ని వ్యాప్తి చేశారు. ఈ ఉద్యమాన్ని రేడియో ద్వారా ప్రచారం చేసింది ఉషా మెహతా. ఈ ఉద్యమ తీర్మానాన్ని గాంధీ వార్ధా(ఎంఎన్)లో చేయటం వల్ల వార్ధా తీర్మానం అని కూడా అంటారు.
రాజాజీ ప్రణాళిక -1944 - సి. రాజగోపాలచారి మొదటి కాంగ్రెస్ అభ్యర్థి. ఇతడు మొదట స్వతంత్య్రాన్ని సాధించండని తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా కానీ ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని పాకిస్తాన్లో హిందువులు ఎక్కువుగా ఉన్న ప్రాంతాన్ని భారత్‌లో కలపమని సూచించెను.
వేవెల్/ సిమ్లా ప్రణాళిక / సమావేశం-1945
- ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది వైస్రాయ్ వేవెల్
- ఇతడు 14 శాఖల్లో తప్ప మిగిలిన 13 శాఖలు భారతీయులకు ఇచ్చారు. ఇందులో కాంగ్రెస్‌కు-7, ముస్లిం లీగ్‌కు-6 ఇవ్వాలి అన్నాడు.
- దీన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది.
క్యాబినెట్ మిషన్ ప్రణాళిక -1946 - ఈ ప్రణాళికను అప్పటి భారతదేశంలో స్థానిక పరిస్థితులను అధ్యయనం చేయడానికి వేసింది.
- అధ్యక్షుడు- పెథ్యిక్ లారెన్స్
సభ్యులు 1) ఎ.వి. అలెగ్జాండర్, 2) క్రిప్స్ - ప్రస్తుతం ఉన్న స్టాఫర్డ్ రాజ్యాంగాన్ని సూచించిన ప్రణాలిక క్యాబినెట్ మిషన్ ప్రణాళిక.
లార్డ్ మౌంట్ బాటన్ ప్లాన్ 1947
- క్యాబినెట్ మిషన్ ప్రణాళికనే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును కూడా సూచించింది.
- లార్డ్ అట్లీ ప్రభుత్వం భారత్‌ను విభజించడానికి నియమించిన ప్రణాళిక కమిటీ
- ఇతడు భారత్ పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దు రేఖను గీయడానికి నియమించిన కమిటీ రాడ్‌క్లిఫ్ కమిటీ
- ఇతడు మొదట భారత్ సమైక్యంగానే ఉంటుందన్నాడు.
- లేకపోతే ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా దేశాన్ని విభజిస్తామన్నాడు.
- ఈ ప్రణాళిక మరోపేరు డిక్కిబార్డ్ ప్రణాళిక
- ఈ ప్రణాళిక 1947లో ఆగస్టు 14న పాకిస్థాన్‌కు స్వాతంత్య్రాన్ని ఇచ్చింది.
- 1947 ఆగస్టు 15న భారత్‌కు స్వాతంత్య్రాన్ని ఇచ్చింది.
- స్వాతంత్య్రం వచ్చినపుడు భారత్‌లోని సంస్థానాలు 562
- వీటికి మౌంట్‌బాటెన్ స్వేచ్ఛనిస్తూ భారత్‌లో లేదా పాక్‌లో కలవవచ్చు అన్నాడు.
- దాదాపు అని సంస్థానాలు భారత్‌లో కలువగా కొన్ని పాక్‌లో కలిశాయి. 4 సంస్థానాలు మాత్రం స్థిరంగా ఉండిపోయాయి.
1) కశ్మీర్ 2) జునాగడ్
3) ట్రావెన్కోర్
4) హైదరాబాద్ సంస్థానాలు ఎక్కడ కలువలేదు. - కానీ కొన్ని చర్చల ద్వారా జునాగఢ్, ట్రావెన్కోర్ భారత యూనియన్‌లో కలిసాయి.
- 7వ నిజాంగా పేరుగాంచిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత్‌లో హైదరాబాద్‌ను కలుపటానికి నిరాకరించాడు.
- దీనితో సర్థార్ వల్లభాయ్ పటేల్ 1948 సెప్టెంబర్ 13-17 వరకు మేజర్ జనరల్ చరణ్ సింగ్ నాయకత్వంలో ఆపరేషన్ పోలో పోలీస్ చర్య ద్వారా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌ను భారత్ యూనియన్‌లో కలిపారు.
గవర్నర్ జనరల్స్ యుగం
- 1961 డిసెంబర్లో మేజర్ జనరల్ కామ్ బేత్డ్ నాయకత్వంలో ఆపరేషన్ విజయ్ అనే పోలీసుచర్య ద్వారా గోవా, డామన్ డయ్యు లను భారత్ యూనియన్‌లో కలిపారు.
- బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్ (1773 చట్టం ప్రకారం)
- భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ (1883 చట్టం)
- భారతదేశ మొదటి వైస్రాయ్ – లార్డ్ కానింగ్ (1858)
- భారతదేశ బ్రిటిష్ చిట్టచివరి వైస్రాయ్, స్వతంత్ర భారతదేశ మొదటి వైస్రాయ్ – లార్డ్ మౌంట్ బాటన్
- భారతదేశ ఏకైక గవర్నర్ జనరల్ – సి. రాజగోపాలచారి
వారెన్ హేస్టింగ్ - ఇతడు బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్.
- ఇతడు పోలీసు వ్యవస్థను, కలెక్టర్ పదవి ప్రవేశ పెట్టాడు.
- జిల్లా సూపర్ మేజర్లను కలెక్టర్లుగా మార్చారు.
- ఇతని కాలంలోనే భారతదేశ మొదటి పత్రిక అయిన ‘The Bengal gazzite’ కలకత్తా నుంచి 1780లో వచ్చింది.
- తాత్కాలిక భూమి శిస్తు విధానాన్ని ప్రవేశ పెట్టారు.
- ఇండియన్ షేక్స్‌స్పియర్ అయిన కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం సంస్కృతం ఇంగ్లిష్‌లో అనువదించారు.
కారన్ వాలీస్ - ఇతడిని సివిల్ సర్వీసుల పితామహుడు అంటారు.
- భారతదేశ సివిల్ సర్వీస్ పితామహుడు సర్దార్ వల్లభాయ్ పటేల్
- ఇతడు శాశ్వత భూమిశిస్తు విధానాన్ని 1793లో (జమీందారీ వ్యవస్థను) ప్రవేశ పెట్టాడు.
- ఇతడు న్యాయశాస్ర్తాన్ని క్రోడికరించాడు.
- సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేశారు.
- డీఎస్పీ పదవిని ఏర్పాటు చేశాడు. పిండారీలను అణచివేశాడు.
లార్డ్ వెల్లస్లీ
బిరుదులు: సర్వసైనిక అధ్యక్షుడు, బెంగాల్ పులి, బ్రిటిష్ సామ్రాజ్య అక్బర్ - 1798లో సైన్య సహకార వ్యవస్థను ప్రవేశ పెట్టాడు. ఇతడు 2 లక్ష్యాలతో భారత్ వచ్చాడు. 1) బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, 2) బ్రిటిష్ సైన్యాన్ని విస్తరించాలి.
విలియం బెంటింక్ - 1829లో సతి నిర్మూలన చట్టాన్ని చేశాడు.
- స్త్రీ విద్యను ఆంగ్లవిద్యను ప్రవేశ పెట్టాడు.
- దారి దోపిడీ దొంగలైన థగ్గులను అణిచివేశాడు.
- కలకత్తాలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశాడు.
చార్లెస్ మెట్కాఫ్ - భారతీయ పత్రికలకు స్వేచ్ఛను ఇచ్చారు.
- అందుకే ఇతడిని లిబరేషన్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ అంటారు.
- భారతీయ పత్రికలపై ఆంక్షలను తొలగించారు.
హర్డింజ్ - గొండ్లను అణిచివేశాడు.
- నరబలులను నిషేధించాడు.
డల్హౌసీ - 1848 రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశ పెట్టాడు
- భారత్‌లో మొదటి రైల్వేలైన్‌ను 1853లో బొంబాయి – థానే మధ్య నిర్మించాడు. (34 కిలో మీటర్లు)
- పోస్టాఫీసుల పితామహుడు. స్త్రీ విద్యను, ఆంగ్లవిద్యను అభివృద్ధి చేసాడు
- 1856లో వితంతు పునర్వివాహ చట్టం చేశాడు.
ఆంజనేయులు
ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీ సర్కిల్
Previous article
Telangana History | హల్కా ఎవరి పర్యవేక్షణలో ఉండేది?
Next article
DEET Recruitment 2023 | ‘డీట్’లో ఉద్యోగాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు