Telangana History | హల్కా ఎవరి పర్యవేక్షణలో ఉండేది?
గతవారం తరువాయి..
175. గణపతిదేవుడు, రుద్రమదేవి, రెండో ప్రతాపరుద్రుల శివదీక్షా గురువు ఎవరు?
a) పాల్కురికి సోమనాథుడు
b) రామేశ్వర పండితుడు
c) విశ్వేశ్వర శివాచార్యులు
d) ఏకాంతరామయ్య జవాబు: (c)
వివరణ: విశ్వేశ్వర శివాచార్యులు శైవమతంలో పాశుపత శాఖకు చెందినవాడు. గోళకీ మఠం నెలకొల్పేందుకు వీలుగా రుద్రమదేవి ఈయనకు వెలగపూడి, మందడం గ్రామాలను దానం చేసింది. ఈ వివరాలు మల్కాపురం శాసనంలో ఉన్నాయి.
176. కాకతీయ మహాదేవుడి శివదీక్షా గురువు ఎవరు?
a) విశ్వేశ్వర శివాచార్యులు
b) ధ్రువేశ్వర పండితుడు
c) రామేశ్వర పండితుడు
d) మల్లికార్జున పండితుడు జవాబు: (b)
177. స్వదేశీ, పరదేశీ, నానాదేశి పెక్కండ్రు అనే పదాలు కింది వాటిలో దేన్ని సూచిస్తాయి?
a) కాకతీయుల ఆస్థానం సందర్శించిన విదేశీయులు
b) విదేశీ వర్తక సంఘాలు
c) కాకతీయ కాలంలో దేశీయ వర్తకశ్రేణులు
d) స్వదేశీ, విదేశీ వస్తువులు జవాబు: (c)
178. బాలభారతం, కృష్ణచరితం మొదలైన 74 గ్రంథాలు రచించింది ఎవరు?
a) కృష్ణమాచార్యులు b) విద్యానాథుడు
c) తిక్కన
d) అగస్త్యుడు జవాబు: (d)
179. ‘నృత్యరత్నావళి’ అనే నాట్యశాస్త్ర గ్రంథాన్ని రచించిన జాయప సేనాని గణపతిదేవుడి ఆస్థానంలో ఏ పదవిలో ఉన్నాడు?
a) అశ్వసాహిణి b) గజసాహిణి
c) సైన్యాధ్యక్షుడు d) కోశాధికారి
జవాబు: (b)
180. ‘జినేంద్ర కల్యాణాభ్యుదయం’ అనే జైనమత ప్రధాన గ్రంథ రచయిత ఎవరు?
a) అప్పయాచార్యులు b) రాజశేఖరుడు
c) బద్దెన d) జినవల్లభుడు
జవాబు: (a)
వివరణ: ఈయన కాకతీయ రెండో ప్రతాపరుద్రుడి సమకాలీనుడు.
181. ఏ యుద్ధం తర్వాత గణపతిదేవుడు క్రియాశీల రాజ్యపాలన భారం నుంచి విరమించుకున్నాడు?
a) త్రిపురాంతకం b) జమ్మికుంట
c) ముత్తుకూరు d) నెల్లూరు
జవాబు: (c)
వివరణ: పాండ్యులతో 1263లో జరిగిన ముత్తుకూరు యుద్ధంలో కాకతీయ సేనలు పరాజయం పాలయ్యాయి. దాంతో గణపతిదేవుడు క్రియాశీల రాజకీయాల నుంచి విరమించుకున్నాడు. రాజ్యాన్ని రుద్రమదేవికి అప్పగించాడు. తాను సలహాదారుగా ఉండిపోయాడు.
182. హైదరాబాద్ రాజ్యంలోని సంస్థానాల్లో అతి పురాతనమైన సంస్థానం ఏది?
a) గద్వాల b) అమరచింత
c) వనపర్తి d) పాల్వంచ
జవాబు: (b)
వివరణ: అమరచింత (ఆత్మకూరు) సంస్థాన స్థాపకుడు గోపాలరెడ్డి.
183. దోమకొండ సంస్థాన మూలపురుషుడు ఎవరు?
a) కామినేని కామిరెడ్డి
b) కామినేని మల్లారెడ్డి
c) కామినేని పోతారెడ్డి
d) కామినేని ఎల్లారెడ్డి జవాబు: (a)
వివరణ: ఉమాపత్యభ్యుదయం, పద్మపురాణం, శివధర్మోత్తర ఖండం, భద్రాభ్యుదయం, శుకసంహిత మొదలైనవి దోమకొండ సంస్థాన చరిత్రకు సాహిత్య ఆధారాలు.
184. మొగల్ చక్రవర్తుల నుంచి గద్వాల పాలకుల్లో ఎవరికి ‘రాజ’ అనే బిరుదును ఇచ్చాడు?
a) తిరుమలరాయ
b) పెద సోమభూపాలుడు
c) ముష్టిపల్లి వెంకటభూపాలుడు
d) సీతారాం భూపాల్ జవాబు: (b)
వివరణ: ఈయననే సోమనాద్రి అని పిలుస్తారు. 1698-1704 మధ్య గద్వాల సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు.
185. చల్లపల్లి సుబ్బయ్య అనే సంగీత విద్వాంసుడు ఏ సంస్థానంలో ఉండేవాడు?
a) అమరచింత b) జటప్రోలు
c) వనపర్తి d) గద్వాల
జవాబు: (d)
186. విజయనగర పాలకుల నుంచి ‘సనద్’ అనుమతి పత్రం పొందిన సంస్థానం ఏది?
a) దోమకొండ b) జటప్రోలు
(c) అమరచింత d) వనపర్తి
జవాబు: (b)
వివరణ: జటప్రోలు లేదా కొల్లాపురం సంస్థానం విజయనగర రాజుల నుంచి సనద్‌ను 1507లో పొందింది.
187. కొల్లాపురం సంస్థానం స్థాపకుడు ఎవరు?
a) బేతాళ రెడ్డి
b) సురభి మాధవరాయలు
c) సురభి లక్ష్మణరావు
d) సురభి లక్ష్మీజగన్నాథరావు
జవాబు: (b)
188. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ ఎవరికి ‘వంత్ బహదూర్’ అనే బిరుదును ప్రదానం చేశాడు?
a) సురభి లక్ష్మణరావు
b) సురభి మాధవరాయలు
c) రాజా సురభి వెంకటలక్ష్మణరావు
d) రాజా వెంకట జగన్నాథరావు
జవాబు: (c)
189. కింది వారిలో ‘చంద్రికా పరిణయము’ను రచించారు?
a) అవధానం శేషశాస్త్రి
b) యణయపల్లి కృష్ణమాచార్యులు
c) అక్షింతల సుబ్బశాస్త్రి
d) రాజా సురభి మాధవరాయలు
జవాబు: (d)
190. ‘పాల్వంచ సంస్థాన చరిత్ర’ రచయిత ఎవరు?
a) కొత్తపల్లి వెంకట లక్ష్మీనారాయణ శర్మ
b) తిరుమల బుక్కపట్నం శ్రీనివాసాచార్యులు
c) వెంకటరమణ నరసింహ అశ్వారావు
d) వెల్లాల సదాశివశాస్త్రి
జవాబు: (a)
వివరణ: పాల్వంచ సంస్థానం ‘బొంది అశ్వారావు’ వంశస్థుల పాలనలో ఉంది.
191. నిజాంల కాలపు గ్రామీణ పాలనా వ్యవస్థకు సంబంధించి కింది వివరాలు పరిశీలించండి.
1. మాలీ పటేల్: శిస్తు వసూలు
2. నీరడి: నీటి పారుదల సౌకర్యాలు
3. తలారి: 50 ఇండ్లకు రక్షకుడు
4. దెహరీ: బంట్రోతు
పై వాటిలో సరిగా జతపరిచినవి ఏవి?
a) 1 b) 1, 2
c) 1, 2, 3 d) అన్నీ సరైనవే
జవాబు: (b)
వివరణ: గ్రామాల్లో తలారులు బంట్రోతులుగా ఉండేవాళ్లు. అధికారులకు వారి విధుల్లో సహాయం చేసేవాళ్లు. 50 ఇండ్లకు రక్షకుడిగా ఉండే వ్యక్తిని సేత్సిందీ అని పిలిచేవాళ్లు. దెహరీ అంటే ప్రభుత్వ సమాచారాన్ని గ్రామ వాసులకు చేరవేసే ఉద్యోగి.
192. నిజాం పాలనా వ్యవస్థకు సంబంధించి ‘హల్కా’ అంటే ఏమిటి?
a) ప్రభుత్వానికి రావాల్సిన పన్ను
b) సాగునీటి వసతి కల్పించినందుకు పన్ను
c) అనేక గ్రామాల సముదాయం
d) జిల్లాకు గల మరోపేరు జవాబు: (c)
193. హల్కా ఎవరి పర్యవేక్షణలో ఉండేది?
a) తహసీల్దార్ b) తాలూక్దార్
c) అవ్వల్ తాలూక్దార్ d) గిర్దావర్
జవాబు: (d)
వివరణ: శిస్తు వసూలు, భూముల సర్వే, రైతుల నుంచి ఆహార ధాన్యాల సేకరణ గిర్దావర్ విధులు. గిర్దావర్ అంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్.
194. నిజాం ప్రభుత్వ వ్యవస్థకు సంబంధించి కింది వాటిలో ఆరోహణ క్రమంలో సరైన దానిని గుర్తించండి.
a) పట్వారి, గిర్దావర్, తహసీల్దార్, అవ్వల్ తాలూక్దార్
b) గిర్దావర్, పట్వారి, తహసీల్దార్, అవ్వల్ తాలూక్దార్
c) పట్వారి, తహసీల్దార్, అవ్వల్ తాలూక్దార్, గిర్దావర్
d) పట్వారి, గిర్దావర్, అవ్వల్ తాలూక్దార్, తహసీల్దార్
జవాబు: (a)
వివరణ: అవ్వల్ తాలూక్దార్ అంటే ఇప్పటి జిల్లా కలెక్టరుకు సమానమైన ఉద్యోగం. రెవెన్యూ, సివిల్, క్రిమినల్ విషయాలను పర్యవేక్షించేవాడు.
195. నిజాం పాలనా వ్యవస్థకు సంబంధించి ‘మొహతామిన్’ దేన్ని సూచిస్తుంది?
a) పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్
b) పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్
c) డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్
d) జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్
జవాబు: (d)
196. హైదరాబాద్ రాజ్యంలో నిజాం రాజు అధీనంలో ఉన్న భూములను ఏమని పిలిచేవాళ్లు?
a) సర్ఫ్ ఎ ఖాస్ b) పాయిగా భూములు
c) ఇలాఖాలు d) అల్తమ్ఘా
జవాబు: (a)
వివరణ: సర్ఫ్ ఎ ఖాస్ భూముల విస్తీర్ణం 10,000 చదరపు మైళ్లు. వీటి నుంచి వచ్చే ఆదాయం, వనరులు రాచకుటుంబానికి చెందేవి.
197. కింది వివరాలను పరిశీలించండి.
1. నిజాం స్టేట్ గ్యారెంటీడ్ రైల్వే 1885లో ఏర్పాటైంది
2. హైదరాబాద్ రాజ్యంలో మొదటి రైల్వే లైను హైదరాబాద్-విజయవాడ మధ్య వేశారు
పై వాక్యాల్లో సరైనవి ఏవి?
a) 1 b) 2 c) 1, 2 సరైనవే
d) 1, 2 సరైనవి కాదు
జవాబు: (d)
వివరణ: నిజాం స్టేట్ గ్యారెంటీడ్ రైల్వే 1883లో అమల్లోకి వచ్చింది. హైదరాబాద్ రాజ్యంలో మొదటి రైలు మార్గం హైదరాబాద్-వాడి మధ్య వేశారు.
198. 1892లో హైదరాబాద్‌లో ఆర్యసమాజం శాఖను ఏర్పాటు చేసింది ఎవరు?
a) స్వామి దయానంద సరస్వతి
b) స్వామి నిత్యానంద సరస్వతి
c) ఇంద్రవిద్య వాచస్పతి
d) స్వామి శ్రద్ధానంద సరస్వతి
జవాబు: (b)
వివరణ: హైదరాబాద్ ఆర్యసమాజ్ శాఖకు కమలాప్రసాద్, లక్ష్మణ్దేశ్జీ తొలి అధ్యక్షుడు, కార్యదర్శులుగా ఉన్నారు. తర్వాత కాలంలో హైదరాబాద్ హైకోర్టు న్యాయవాది, పండితుడు కేశవరావ్ కోరాట్కర్, ఆయన కుమారుడు పండిట్ వినాయక్ రావ్ విద్యాలంకార్, పండిట్ నరేంద్రజీ సమాజ కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషించారు.
199. హైదరాబాద్‌లో సంఘ సంస్కరణ సంస్థలు, స్థాపకులకు సంబంధించి కింది వివరాలను పరిశీలించండి.
1. దివ్యజ్ఞాన సమాజం: రామస్వామి మొదలియార్
2. హ్యుమానిటేరియన్ లీగ్ (1913): రాయ్ బాలముకుంద్
3. సోషల్ సర్వీస్ లీగ్ (1915): భాగ్యరెడ్డి వర్మ
పై వాటిలో సరైనవి ఏవి?
a) 1, 3 b) 2 c) 3
d) 1, 2, 3 జవాబు: (b)
వివరణ: హైదరాబాద్‌లో దివ్యజ్ఞాన సమాజం 1882లో చాదర్‌ఘాట్‌లో ఏర్పాటైంది. దీనిని రామస్వామి అయ్యర్ ఏర్పాటు చేశారు. హ్యుమానిటేరియన్ లీగ్‌ను రాయ్ బాలముకుంద్ ఏర్పాటు చేయగా, సోషల్ సర్వీస్ లీగ్‌ను వామనరావ్ నాయక్ స్థాపించాడు.
200. హైదరాబాద్‌లో బ్రహ్మసమాజం మొదటి అధ్యక్షుడిగా ఎన్నికైంది ఎవరు?
a) అఘోరనాథ ఛటోపాధ్యాయ
b) రఘుపతి వెంకటరత్నం నాయుడు
c) నారాయణ గోవింద వెల్లంకర్
d) భాగ్యరెడ్డి వర్మ జవాబు: (c)
వివరణ: హైదరాబాద్‌లో బ్రహ్మసమాజం కార్యకలాపాల్లో అఘోరనాథ ఛటోపాధ్యాయ కుటుంబం చురుకైన పాత్ర పోషించింది. మహబూబియా కాలేజీలో అధ్యాపకులుగా ఉన్న సమయంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు కూడా బ్రహ్మసమాజ సిద్ధాంతాల వ్యాప్తికి కృషిచేశారు. బ్రహ్మసమాజం మొదటి సమావేశం 1914లో రెసిడెన్సీ బజార్లో జరిగింది.
201. మహమ్మద్ కులీకుతుబ్‌షాను ‘రా, పో’ అనేంత సాన్నిహిత్యం ఉన్న తెలుగు కవి ఎవరు?
a) కందుకూరి రుద్రకవి
b) పొన్నెగంటి తెలగన
c) సారంగు తమ్మయ్య
d) అద్దంకి గంగాధర కవి
జవాబు: (c)
వివరణ: మహమ్మద్ కులీకుతుబ్‌షా కాలంలో సారంగు తమ్మయ్య గోల్కొండ స్థల కరణంగా పనిచేశారు. ఈయన ‘వైజయంతీ విలాసం’ అనే శృంగార కావ్యం రచించారు.
202. తారామతి, ప్రేమామతి అనే నాట్యకత్తెలను ఏ కుతుబ్‌షాహీ రాజు చేరదీశాడు?
a) ఇబ్రహీం కులీకుతుబ్‌షా
b) అబ్దుల్లా కుతుబ్‌షా
c) అబుల్ హసన్ తానీషా
d) మహమ్మద్ కుతుబ్‌షా జవాబు: (b)
203. అబుల్ హసన్ తానీషాను ఏ సూఫీ సాధువు శిష్యుడుగా పేర్కొంటారు?
a) హజ్రత్ గేసు దరాజ్ బందా నవాజ్
b) హజ్రత్ నిజాముద్దీన్
c) బాబా బురానుద్దీన్
d) షా రాజు ఖట్టాల్ జవాబు: (d)
204. వరంగల్లు కోటలో ‘ఖుష్‌మహల్’ ఎవరి పేరుతో ప్రసిద్ధి చెందింది?
a) సీతాపతి రావు
b) మహమ్మద్ కులీ కుతుబ్ షా
c) ఇబ్రహీం కులీకుతుబ్‌షా
d) సర్దార్ సర్వాయి పాపన్న
జవాబు: (a)
వివరణ: సీతాపతి రావు ఖమ్మం మెట్టు పాలకుడు. కులీ కుతుబ్‌షా సమకాలికుడు. కులీ చేతిలో యుద్ధంలో ఓడిపోయాడు. సీతాపతి రావుకే షితాబ్ ఖాన్ అనే మారుపేరు కూడా ఉంది. ఖుష్‌మహల్‌ను తుగ్లక్‌ల కాలంలో నిర్మించినట్లు తెలుస్తుంది. కానీ సీతాపతి రావు పేరు మీదుగా ప్రసిద్ధి చెంది.
205. తెలుగు భాష వికాసానికి సాక్ష్యంగా నిలిచే ‘తొలుచువాండ్రు’ అనే పదం ఎక్కడ కనిపిస్తుంది?
a) ఫణిగిరి b) నాగార్జునకొండ
c) కేసరిగుట్ట d) యాదగిరిగుట్ట
జవాబు: (c)
206. ఇక్ష్వాకుల మూలానికి సంబంధించిన వివరాలను జతపరచండి.
A. కన్నడిగులు 1. వోగెల్
B. ఇక్షు చిహ్నం కలిగిన స్థానికులు 2. గోపాలచారి
C. తమిళులు 3. బిషప్ కాల్డెల్
D. స్థానికులు 4. బి.ఎస్.ఎల్. హనుమంతరావు
a) A-1, B-2, C-3, D-4
b) A-1, B-4, C-2, D-3
c) A-2, B-4, C-1, D-3
d) A-2, B-3, C-1, D-4
జవాబు: (b)
207. నాగార్జున కొండ శాసనాల్లో ఇక్షాకులు ఎవరి వంశస్థులని పేర్కొన్నారు?
a) మహావీరుడు b) కృష్ణుడు
c) గౌతమ బుద్ధుడు d) పాండవులు
జవాబు: (c)
హర్షవర్ధన్ చింతలపల్లి
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు