Indian History | నలందలోని బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పినవారు?
1. గుప్తుల కాలంలో విదేశీ వాణిజ్య క్షీణతకు కారణం కానిది?
1) రోమ్ సామ్రాజ్య పతనం
2) ఎగుమతి అయ్యే వస్తువుల నాణ్యతలో క్షీణత
3) నౌకా నిర్మాణంలో అరబ్బులు, చైనీయుల పోటీ
4) స్మృతి గ్రంథాల్లో సముద్రయానంపై నిషేధం విధించడం
2. అలహాబాదు శాసనాన్ని రూపొందించినవారుఎవరు?
1) రవికీర్తి 2) హరిసేనుడు
3) సముద్రగుప్తుడు 4) పులకేశి – II
3. గుప్త రాజులు – వారి రాణులను సరిగా జతపరచండి.
అ) చంద్రగుప్త -1 1) దత్తాదేవి
ఆ) సముద్రగుప్తుడు 2) కుమార దేవి
ఇ) చంద్రగుప్త -2 3) మహాదేవి
ఈ) కుమారగుప్త -1 4) ధ్రువాదేవి
1) అ-2, ఆ-1, ఇ-4, ఈ-3
2) అ-1, ఆ-2, ఇ-3, ఈ-4
3) అ-2, ఆ-1, ఇ-3, ఈ-4
4) అ-4, ఆ-3, ఇ-2, ఈ-1
4) ప్రసిద్ధ వైద్యుడు ధన్వంతరి ఏ సామ్రాజ్య కాలంలో జీవించాడు?
1) గుప్త సామ్రాజ్యం
2) మౌర్య సామ్రాజ్యం
3) మగధ సామ్రాజ్యం
4) కళింగ సామ్రాజ్యం
5. గుప్తుల కాలంనాటి పరిపాలనా విభాగాలను సరైన క్రమంలో గుర్తించండి.
1) భుక్తి – విషయ-విధి-గ్రామ
2) విషయ -విధి- భుక్తి-గ్రామ
3) గ్రామ-విధి-భుక్తి-విషయ
4) విధి-విషయ-గ్రామ-భుక్తి
6. ఎవరి పాలనా కాలంలో ఆర్యభట్ట ఒక ప్రసిద్ధ పండితుడు?
1) మౌర్యుల పాలన 2) గుప్తుల పాలన
3) హర్ష పాలన 4) పైవేవీ కావు
8. ఫాహియాన్ చైనా యాత్రికుడు ఏ రాజు కాలంలో భారతదేశానికి వచ్చాడు?
1) హర్షుడు
2) 2వ చంద్రగుప్తుడు
3) సముద్రగుప్తుడు 4) శ్రీ గుప్తుడు
9. భూమిపై ఉన్న సమస్త రాజులను ఓడించినట్లు ఎరాన్ ప్రశస్తిలో పేర్కొన్న రాజు?
1) మొదటి చంద్రగుప్తుడు
2) రెండో చంద్రగుప్తుడు
3) సముద్రగుప్తుడు 4) స్కంద గుప్తుడు
10. తన కాలంలో బంగారు నాణేలపై వ్యాఘ్రానికి బదులు ‘సింహం గుర్తు’ వేయించిన వారు ఎవరు?
1) సముద్రగుప్తుడు 2) శ్రీ గుప్తుడు
3) 2వ చంద్రగుప్తుడు
4) కుమార గుప్తుడు
11. గుప్త సామ్రాజ్య రాజుల్లో ఒకరు?
1) సముద్రగుప్త 2) కుమారగుప్త
3) చంద్రగుప్త 4) పై వారందరూ
12. జతపరచండి.
1. ఇండియన్ నెపోలియన్ ఎ. రెండో చంద్రగుప్తుడు
2. కవి పండిత కల్పతరువు బి. సముద్ర గుప్తుడు
3. వ్యాఘ్రహ పరాక్రమ సి. కుమారగుప్తుడు
4. మహారాజాధి రాజ డి. మొదటి చంద్రగుప్తుడు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
13. రాజు నెమలికి మేత వేస్తున్నట్లుండే బంగారు నాణేలు ఏ గుప్త రాజు ముద్రించాడు?
1) సముద్రగుప్తుడు 2) కుమారగుప్తుడు
3) స్కందగుప్తుడు 4) శ్రీ గుప్తుడు
14. ‘అలహాబాద్’ ప్రశస్తి శాసనం ఏ రాజుకు సంబంధించింది?
1) సముద్రగుప్తుడు 2) అశోకుడు
2) కనిష్కుడు 4) హర్షుడు
15. నలందలోని బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పినవారు?
1) కనిష్కుడు 2) కుమారగుప్తుడు
3) హర్షుడు 4) ధర్మపాలుడు
16. మెహ్రౌలి ‘ఇనుప స్తంభం’ ఢిల్లీకి సమీపంలో ఏర్పాటు చేసింది ఎవరు?
1) చంద్రగుప్త మౌర్య 2) అశోకుడు
3) రెండో చంద్రగుప్తుడు 4) సముద్రగుప్తుడు
17. గుప్తుల కాలంనాటి అధికారులను సరిగా జతపరచండి.
అ) టిలుపతి 1) గజదళ అధ్యక్షుడు
ఆ) పుష్టపాల 2) భూవిక్రయాల రికార్డులు
ఇ) దివిర 3) లేఖకుడు
ఈ) శౌల్కిక 4) సుంకాల వసూలు అధికారి
1) అ-1 ఆ-2 ఇ-3 ఈ-4
2) అ- 2 ఆ-1 ఇ-4 ఈ-3
3) అ-4 ఆ-3 ఇ-2 ఈ-1
4) అ-3 ఆ-4 ఇ-1 ఈ-2
18. సముద్రగుప్తుడిని ‘ఇండియన్ నెపోలియన్’గా అభివర్ణించిన చరిత్రకారుడు ఎవరు?
1) హుయాన్త్సాంగ్ 2) మెగస్తనీస్
2) ఫాహియాన్ 3) వి.ఎ.స్మిత్
19. జతపరచండి.
1) కాళిదాసు ఎ) ముద్రరాక్షసం, దేవీచంద్రగుప్తం
2) విశాఖ దత్తుడు బి) అభిజ్ఞాన శాకుంతలం
3) శూద్రకుడు సి) పంచతంత్రం
4) విష్ణుశర్మ డి) మృచ్ఛకటికం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
20.‘కవిరాజు’ బిరుదు పొందిన గుప్త చక్రవర్తి ఎవరు?
1) చంద్రగుప్తమౌర్య 2) సముద్రగుప్త
3) 2వ చంద్రగుప్త 3) కుమారగుప్త
21. రెండో చంద్రగుప్తుడి ఆస్థానంలోని నవ రత్నాల్లో లేనివారు?
1) కాళిదాసు 2) సుశ్రుతుడు
2) వరరుచి 3) చరకుడు
22. మొట్టమొదటి హుణుల దాడి ఏ రాజు కాలంలో జరిగింది?
1) మొదటి కుమార గుప్తుడు
2) రెండో చంద్రగుప్తుడు
3) స్కంద గుప్తుడు
4) నరసింహ గుప్తుడు
23. కింది వాటిలో ఏది సరైన జత కాదు?
(గుప్త రాజులు) (వారి పట్ట మహిషులు)
1) సముద్రగుప్తుడు – దత్తాదేవి
2) రెండో చంద్రగుప్తుడు – ధ్రువాదేవి
3) కుమార గుప్తుడు – ప్రభావతి దేవి
4) మొదటి చంద్రగుప్తుడు- కుమారదేవి
24. నవరత్నాల్లో అగ్రగణ్యుడైన కాళిదాసుకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) కాళిదాసు రచించిన నాటకాలు – మాళవికాగ్నిమిత్రం, అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం
2) కాళిదాసు రచించిన కావ్యాలు – రఘువంశం, మేఘదూతం, కుమార సంభవం
3) కాళిదాసు రచించిన పద్యకావ్యం – రుతు సంహారం
4) పైవన్నీ
25. ఆర్యభట్ట తెలియజేసిన ఖగోళ అంశాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) గ్రహణాలు ఏర్పడే విధానాన్ని శాస్త్రీయంగా వివరించారు
2) భూభ్రమణం గురించి వివరించారు
3) స్థానం మారితే 0 విలువ మారడం గురించి తెలిపారు
4) పైవన్నీ
26. జతపరచండి.
1) భాస్కరాచార్య
ఎ) సిద్ధాంత శిరోమణి
2) పాణిని బి) అష్టధ్యాయి
3) పులవెంది సి) నలవెంబ
4) సుశ్రుతుడు డి) సుశ్రుత సంహిత
1) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
27. న్యూటన్ కంటే ముందే భూమ్యాకర్షణ శక్తి గురించి వివరించిన భాతరదేశ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎవరు?
1) బ్రహ్మగుప్త 2) ఆర్యభట్ట
3) వరాహమిహిరుడు 4) ఘటకర్ణ
28. పరంపరంగా కొనసాగుతున్న వైదిక సాహిత్యాన్ని ఏ పాలకుల కాలంలో రచించారు?
1) కుషాణులు 2) రాజపుత్రులు
3) గుప్తులు 4) చోళులు
29. భారతదేశంలో మొట్టమొదటి శస్త్రచికిత్స వైద్యుడు ఎవరు?
1) సుశ్రుతుడు 2) ధన్వంతరి
3) వాగ్భటుడు 4) పాలకాశ్యపుడు
30. గుప్తుల కాలంనాటి వైద్యశాస్త్ర గ్రంథాలు, వాటి రచయితలను జతపరచండి.
1. ధన్వంతరి ఎ. వైద్యశాస్త్రం
2. పాలకాశ్యపుడు బి. హస్తాయుర్వేదం
3. సుశ్రుతుడు సి. శుశ్రుత సంహిత
4. వాగ్భటుడు డి. అష్టాంగ సంగ్రహం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
4) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
31. గుప్తుల పరిపాలనా కాలంలో వెలసిన ప్రఖ్యాత నలంద విశ్వవిద్యాలయానికి అధిపతిగా పనిచేసిన ధర్మపాల ఏ నగరానికి చెందినవాడు?
1) బెనారస్ 2) మధుర
3) నాసిక్ 4) కాంచీపురం
32. తాను వీణ వాయిస్తున్నట్లుగా బంగారు నాణేలను జారీ చేసిన రాజు?
1) కుమారగుప్తుడు
2) చంద్రగుప్తు విక్రమాదిత్యుడు
3) సముద్ర గుప్తుడు
4) శ్రీగుప్తుడు
33. ‘కృష్ణ చరితం’ గ్రంథాన్ని రచించిన గుప్తరాజు?
1) సముద్ర గుప్తుడు
2) నరసింహ గుప్తుడు
3) మొదటి చంద్రగుప్తుడు
4) రెండో చంద్రగుప్తుడు
34. అశ్వమేథ నాణేలు జారీ చేసిన గుప్త రాజు?
1) విష్ణ గుప్తుడు 2) సముద్ర గుప్తుడు
3) కుమార గుప్తుడు 4) 2, 3
35. కింది వాటిలో గుప్తుల రాజధానిగా వర్ధిల్లిన నగరం ఏది?
1) పాటలీపుత్రం 2) ఉజ్జయిని
3) 1, 2 4) పైవేవీ కావు
37. కింది వాటిలో సరైంది ఏది?
1) గుప్తుల రాజభాష ‘సంస్కృతం’
2) గుప్తుల రాజముద్రిక ‘గరుడ’
3) గుప్తుల అధికారిక న్యాయ పుస్తకం ‘యాజ్ఞవల్క్యస్మృతి’
4) పైవన్నీ
38. గుప్తుల కాలం నాటి ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ఎవరు?
1) ఆర్యభట్ట 2) బ్రహ్మగుప్త
3) 1, 2 4) ఎవరూ కాదు
39. రెండో చంద్రగుప్తుడి కాలంలో గుప్త సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు?
1) ఫాహియాన్
2) హుయాన్త్సాంగ్
3) స్ట్రాబో 4) మార్కోపోలో
40. గుప్తుల కాలానికి చెందిన ప్రముఖ రచయితలు, వారి గ్రంథాలను జతపరచండి.
1. కౌముదీ మహోత్సవం ఎ. వజ్జిక
2. దేవీ చంద్రగుప్తం బి. విశాఖదత్తుడు
3. నీతిసారం సి. కామందకుడు
4. కథా సరిత్సాగరం డి. సోమదేవసూరి
5. మృచ్ఛకటికం ఇ. శూద్రకుడు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
2) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
3) 1-బి, 2-ఎ, 3-ఇ, 4-డి, 5-సి
4) 1-బి, 2-ఇ, 3-డి, 4-సి, 5-ఎ
41. జతపరచండి.
1) దిజ్ఞాగుడు ఎ) నీతిసారం
2) కామందకుడు బి) ప్రమాణ సముచ్ఛయం (తార్కిక గ్రంథం)
3) వాత్సాయనుడు సి) సూర్యశతకం
4) మయూరుడు డి) కామసూత్ర
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
7. జతపరచండి.
1. గుప్తవంశ స్థాపకుడు ఎ. మొదటి చంద్రగుప్తుడు
2. గుప్త రాజ్య స్థాపకుడు బి. శ్రీగుప్తుడు
3. గుప్తుల్లో గొప్పవాడు సి. సముద్ర గుప్తుడు
4. గుప్తుల చివరి రాజు డి. విష్ణు గుప్తుడు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
36. కింది వాటిని జతపరచండి.
గ్రూపు – ఎ గ్రూపు -బి
1. గుప్తశకం ప్రారంభకులు ఎ. మొదటి చంద్రగుప్తుడు
2. గుప్తుల్లో అగ్రగణ్యుడు బి. సముద్రగుప్తుడు
3. నలంద విశ్వవిద్యాలయ స్థాపకుడు సి. కుమారగుప్తుడు
4. ‘నవరత్నాలు’ అనే కవులను డి. రెండో చంద్రగుప్తుడు పోషించినవారు
5. గుప్త వంశ చివరి పాలకుడు ఇ. విష్ణుగుప్తుడు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ 2) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
3) 1-సి, 2-ఎ, 3-డి, 4-ఇ, 5-బి 4) 1-బి, 2-ఇ, 3-డి, 4-సి, 5-ఎ
సమాధానాలు
1. 2 2. 2 3. 1 4. 1
5. 1 6. 2 7. 3 8. 2
9. 3 10. 3 11. 4 12. 3
13. 2 14. 1 15. 2 16. 3
17. 1 18. 4 19. 2 20. 2
21. 4 22. 1 23. 3 24. 4
25. 4 26. 3 27. 1 28. 3
29. 1 30. 1 31. 4 32. 3
33. 1 34. 4 35. 3 36. 1
37. 4 38. 3 39. 1 40. 1
41. 4
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు