దక్షిణ భారతంలో బౌద్ధాన్ని రాజమతంగా స్వీకరించినవారు?

1. గౌతమ బుద్ధుడు క్రీ.పూ.563లో వైశాఖ శుద్ధ పూర్ణిమ రోజున లుంబిని గ్రామంలోని తరై అనే ప్రదేశంలో జన్మించాడు. తల్లి మాయాదేవి (కోలియ వంశం), తండ్రి శుద్ధోదనుడు (శాక్యవంశం). బుద్ధుడు పుట్టిన ఏడు రోజులకే తల్లి మాయాదేవి మరణించింది. దీంతో పినతల్లి అయిన గౌతమి అతనిని పెంచి పోషించింది. అయితే బుద్ధుడు గొప్ప సన్యాసి అవుతాడని జాతకం చెప్పిన పండితుడు ఎవరు?
1) కౌటిల్యుడు 2) కాలికేయుడు
3) కాశ్యపుడు 4) కౌండిన్యుడు
2. బుద్ధుడికి యశోధరతో వివాహం అయిన తరువాత రాహులుడు అనే కుమారుడు జన్మించాడు. కంటక అనే అశ్వంగల రథంపై కపిలవస్తు వీధుల్లో వెళ్తుండగా ముసలివాడిని, రోగ గ్రస్తున్ని, శవాన్ని, సన్యాసిని చూసి మనసు చలించి 29వ ఏట ఇల్లు వదిలి జ్ఞానాన్వేషణకు బయలుదేరాడు బుద్ధుడు. అయితే రథంపై ఉన్న రథసారధి ఎవరు?
1) చెన్నకేశవ 2) చెన్నడు
3) శల్యుడు 4) ఎవరూకాదు
3. బుద్ధుడి మొదటి గురువు అలారకామ. ఆ తర్వాత రాజగృహంలోని ఉదకరామపుత్రుడి వద్ద కూడా కొన్ని రోజులు శిష్యరికం చేశాడు. కానీ తనకు కావలసిన సమాధానం లభించకపోవడంతో నిద్రాహారాలు మాని ధ్యానంలో చేస్తుండగా సృహకోల్పోతాడు. అప్పుడు పాయసం ఇచ్చి రక్షించిన మహిళ ఎవరు?
1) రజిత 2) సునీత
3) సుజాత 4) సుమలత
4. బుద్ధుడు మొదట సారనాథ్‌లోని జింకల వనంలో కౌండిన్యుడు, జసు, సారిపుత్ర, ఉపతిశ్య, కశ్యపుడు/ఉపాలిలకు జ్ఞానబోధ చేశాడు. అయితే ఈ జ్ఞానబోధను ఏమంటారు?
1) ధర్మనీతి సారం 2) పంచశీల ధర్మం
3) అపరిగ్రహ ధర్మం 4) ధర్మచక్ర పరివర్తనం
5. బౌద్ధమత శాఖలు, వాటికి సంబంధించిన విషయాలను జతపర్చండి.
ఎ. మహాయానం 1. బుద్ధుని విగ్రహాలు చెక్కి భగవం తుడిగా పూజిస్తారు
బి. హీనయానం 2. బుద్ధుడిని సంస్కర్తగా, మార్గద ర్శకుడిగా భావించి కొలుస్తారు
సి. వజ్రయానం 3. తాంత్రికవాదం, బలులు ఇవ్వడం ఇది నమ్ముతుంది
1) ఎ-1, బి-3, సి-2 2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-1, బి-2, సి-3 4) ఎ-2, బి-3, సి-1
6. కిందివాటిని జతపర్చండి.
ఎ. బౌద్ధ విహారాలు 1. బౌద్ధ దేవాలయాలు
బి. చైత్యాలు 2. బౌద్ధ భిక్షువుల విశ్రాంతి మందిరాలు
సి. ఆరామాలు 3. బౌద్ధ భిక్షువులు నివసించే గృహాలు
1) ఎ-1, బి-2, సి-3 2) ఎ-3, బి-1, సి-2
3) ఎ-2, బి-3, సి-1 4) ఎ-3, బి-2, సి-1
7. బౌద్ధమత సాహిత్యమైన త్రిపీఠికలు పాళీ భాషలో ఉన్నాయి. వినయ పీఠికను ఉపాళి, సుత్త పీఠికను ఆనందుడు సంకలనం చేశారు. అయితే అభిదమ్మ పీఠికను సంకలనం చేసింది ఎవరు?
1) వసుబంధుడు 2) ఆచార్య నాగార్జునుడు
3) నాగసేనుడు 4) బుద్ధుడు
8. కిందివాటిని జతపర్చండి.
ఎ. జీవకుడు 1. బౌద్ధ భిక్షువుల వైద్యుడు
బి. దేవదత్తుడు 2. బుద్ధుని బాల్య స్నేహితుడు
సి. క్లెమెంట్ 3. బుద్ధుని గురించి ప్రస్తావించిన తొలి విదేశీయుడు
1) ఎ-3, బి-2, సి-1 2) ఎ-3, బి-3, సి-1
3) ఎ-1, బి-3, సి-2 4) ఎ-1, బి-2, సి-3
9. దక్షిణ భారతదేశంలో బౌద్ధాన్ని రాజమతంగా స్వీకరించింది ఎవరు?
1) శాతవాహనులు 2) ఇక్షాకులు
3) చాళుక్యులు 4) పాలరాజులు
10. బుద్ధుడు ఏ నదీ జలాల కోసం శాక్య, కోసల రాజ్యాల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించాడు?
1) గంగ 2) సింధు 3) రోహిణి 4) రాగిణి
11. నలంద, తక్షశిల, విక్రమశిల, ఉద్దండపుర విశ్వవిద్యాలయాలు దేశంలోని ప్రముఖ విద్యాకేంద్రాలు. తక్షశిల హుణుల దండయాత్రల కారణంగా పతనమైంది. నలంద, విక్రమశిల, ఉద్ధండపుర విశ్వవిద్యాలయాలు ఎవరి దండయాత్రల వల్ల పతనమయ్యాయి?
1) భక్తియార్ ఖిల్జీ 2) అల్లాఉద్దీన్ ఖిల్జీ
3) జలాలుద్దీన్ ఖిల్జీ 4) సుక్తియార్ ఖిల్జీ
12. జైనమతం వర్ధిల్లిన అనేక కేంద్రాల్లో ఏ కేంద్రం క్రీ.శ. ఒకటి, రెండో శతాబ్దాల్లో వజ్రముని ఆధ్వర్యంలో ఒక ముఖ్యమైన కేంద్రంగా అభివృద్ధి చెందింది?
1) కౌశాలి 2) రాజగృహం
3) వైశాలి 4) ఉజ్జయిని
13. ఎల్లోర గుహల్లోని రాతి చెక్కడాలు ఏ భావాలను ప్రస్ఫుటింపచేస్తాయి?
1) బ్రాహ్మణ భావాలు 2) బౌద్ధ భావాలు
3) జైన మత భావాలు
4) బ్రాహ్మణ, జైన, బౌద్ధమత భావాలు
14. అమరావతి, జగ్గయ్యపేట, నాగర్జునకొండలలో నిర్మించిన స్థూపాలు, విహారాలు ఎవరి మృత అవశేషాలపై నిర్మించబడినవి?
1) నాగార్జునుడు 2) మహావీరుడు
3) గౌతమ బుద్ధుడు 4) గోమఠేశ్వరుడు
15. బౌద్ధమతంలోని త్రిరత్నాల్లో లేనిది?
1) బుద్ధి 2) నిర్యాణ
3) ధర్మ 4) సంఘ
16. సర్వస్థివాద బౌద్ధం ఏ ప్రాంతంలో ప్రాచుర్యం పొందినది?
1) బెంగాల్ 2) దక్కన్
3) మహారాష్ట్ర 4) పంజాబ్
జవాబులు
1-4, 2-2, 3-3, 4-4, 5-3, 6-2, 7-1, 8-4, 9-2, 10-3, 11-1, 12-3, 13-2, 14-3, 15-2, 16-4
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు