ఆమ్ల లావాలో సిలికా శాతం ఎంత ఉంటుంది?

అగ్ని శిలలు
-అగ్నిపర్వత ప్రక్రియవల్ల భూమిపై ప్రథమంగా ఏర్పడిన శిలలు అయినందున వీటిని ప్రథమ శిలలు అని కూడా పిలుస్తారు.
-అగ్నిపర్వత ప్రక్రియ అంటే భూ అంతర్భాగంలోని శిలాద్రవం.. భూ పటలంలోని పగుళ్లు, సందుల గుండా భూ ఉపరితలాన్ని చేరి చల్లారి ఘనీభవించే ప్రక్రియ.
-మాగ్మా : భూ అంతర్భాగంలో వాయువులతో ఏర్పడి ఉన్న శిలాద్రవం.
-లావా : భూ ఉపరితలంపై వాయువులను పోగొట్టుకున్న శిలాద్రవం.
-లావాలోని సిలికా శాతాన్ని ఆధారంగా చేసుకుని దాన్ని 2 రకాలుగా విభజించవచ్చు.
1. ఆమ్ల లావా : లావాలో సిలికా ఎక్కువగా అంటే 80 శాతం వరకు ఉంటే అది ఆమ్ల లావా.
-ఇది చిక్కగా, జిగటగా ఉంటుంది.
-అగ్నిపర్వత ప్రక్రియలో ఇది భూ ఉపరితలంపైకి విడుదలైనట్లయితే శంఖు ఆకారంలోగల ఎత్తయిన పర్వతాన్ని పోలిన శిలా నిర్మాణాలు ఏర్పడుతాయి.
2. క్షార లావా/ మౌలిక లావా : లావాలో సిలికా తక్కువగా అంటే 40 శాతం వరకు ఉంటే అది క్షార లావా.
-ఇది పలుచగా ఉంటుంది.
-అగ్నిపర్వత ప్రక్రియలో శిలాద్రవం భూ ఉపరితలంపైకి విడుదలైనప్పుడు విశాల ప్రాంతాల్లో వ్యాపించి ఘనీభవించడం వల్ల పీఠభూములు లేదా మైదానాలను పోలిన భూస్వరూపాలు ఏర్పడుతాయి.
-అగ్ని శిలలు ఏర్పడే ప్రాంతాన్ని అనుసరించి వాటిని 2 రకాలుగా విభజించవచ్చు.
ఎ. ఉద్గమ అగ్నిశిలలు: శిలాద్రవం భూ ఉపరితలంపై చల్లారి, ఘనీభవించినప్పుడు ఏర్పడే శిలలు.
ఉదా: బసాల్ట్, ఆండిసైట్, రియొలైట్, అబ్సిడియన్
బి. అంతర్గమ శిలలు: శిలాద్రవం భూ ఉపరితలానికి కొంచెం దిగువ భాగంలోని రాతిపొరల మధ్య ఘనీభవించుటవల్ల ఏర్పడే శిలలు.
ఉదా: గ్రానైట్, గాబ్రో
అగ్నిశిలల లక్షణాలు-ఉపయోగాలు
-కఠినమైనవి, స్ఫటికాకృతిలో ఉంటాయి.
-అచ్ఛిద్రమైన శిలలు.
-నిర్మాణావసరాలకు, రోడ్డు, రైల్వే లైన్లను ఏర్పాటు చేయడంలో గ్రావెల్ రూపంలో ఉపయోగిస్తారు.
-విగ్రహాల తయారీలో వినియోగిస్తారు.
అవక్షేప శిలలు: (అనంతర/స్తరిత శిలలు)
-ఇవి ప్రథమ శిలల నుంచి ఏర్పడినందున వీటిని అనంతర శిలలు అని, పొరల రూపంలో ఉన్నందున స్తరిత శిలలు అని పిలుస్తారు.
-ఇవి మెత్తటి శిలలు, సచ్ఛిద్రమైన శిలలు, శిలాజాలు ఏర్పడటానికి అనువైనవి. వీటిపై నీటి కెరటాల గుర్తులు ఉంటాయి.
ఉదా: సున్నపురాయి, ఇసుకరాయి, గ్రిట్, కాంగ్లోమరేట్ (చిన్నచిన్న గులకరాళ్లు ఒకదానికొకటి అతుక్కుని ఏర్పడే పెద్దపెద్ద గులకరాళ్లు), షేల్, సిల్ట్, సోడియం క్లోరైడ్ (సాధారణ ఉప్పు), జిప్సం, బొగ్గు (హైడ్రోకార్బన్లు), ముడిచమురు (పెట్రోలియం-రాతి నూనె).
జిప్సం – జింక్ సల్ఫేట్
-గ్రిట్ – ముతక రూపంలో ఉన్న పెద్దపెద్ద శిలలు (గులకరాళ్లు)
-Shale – బంకమన్ను
-Silt – ఒండ్రుమట్టి
రూపాంతర శిలలు
అగ్ని శిలలు లేదా అవక్షేప శిలలు అధిక ఉష్ణోగ్రత లేదా అధిక పీడన ప్రభావానికి లోనైనప్పుడు అవి తమ సహజసిద్ధ ధర్మాలను కోల్పోయి నూతన ధర్మాలను పొందడం ద్వారా ఏర్పడే శిలలే రూపాంతర శిలలు.
కొన్ని రూపాంతరాలు…
అగ్నిశిల/అవక్షేప శిల రూపాంతర శిల
1. గ్రానైట్ నీస్, సిస్ట్
2. ఇసుకరాయి క్వార్జ్ (బంగారం,
సిల్వర్ ఖనిజాల లభ్యం)
3. సున్నపురాయి మార్బుల్ రాయి (పాలరాయి)
4. షేడ్ స్లేట్ (పలకరాయి)
5. బొగ్గు గ్రాఫైట్
6. గ్రాఫైట్ (రూపాంతర శిల), వజ్రం (సృష్టిలో
ఒకే ఒక మూలకంతో ఏర్పడినది)
సూర్యపుటం – ఉష్ణోగ్రత
-సౌరశక్తి: కేంద్రక సంలీనచర్య ద్వారా సూర్యునిలో జనించే శక్తి.
-సౌరవికిరణం: సూర్యునిలో జనించే సౌరశక్తి కాంతి, ఉష్ణం రూపంలో వికిరణ పద్ధతిలో విశ్వాంతరాళంలోకి ప్రసరించడాన్ని సౌరవికిరణం అంటారు.
-సూర్యపుటం: భూమివైపు ప్రసరించే సౌరవికిరణం లేదా భూమి గ్రహించే సౌర వికిరణం.
-సూర్యుని నుంచి విడుదలయ్యే మొత్తం సౌర వికిరణంలో 1/2000 మిలియన్ల వంతు మాత్రమే భూ ఉపరితలాన్ని చేరుతుంది.
-ఇంత తక్కువ పరిమాణంలో సౌరవికిరణం భూమిని చేరడానికి కారణాలు…
i. సూర్యునికి, భూమికి మధ్యగల సగటు దూరం ఎక్కువగా ఉండటం
ii. సూర్యుని పరిమాణంతో పోలిస్తే భూమి పరిమాణం చిన్నదిగా ఉండటం
-సౌర స్థిరాంకం: భూమిని చేరే మొత్తం సౌరవికిరణం (సూర్యపుటం) భూమి మీద గల ప్రతి చ.సెం.మీ భూ భాగాన్ని నిమిషానికి సగటున 1.94 గ్రా. కేలరీల చొప్పు న వేడిచేస్తుంది. దీన్నే భూమి సౌర స్థిరాంకం అని పిలుస్తారు.
ఉష్ణోగ్రత
-భూ వాతావరణం పగటి సమయంలో హ్రస్వ తరంగాల ద్వారా భూ ఉపరితలంవైపు ప్రసరించే సౌరవికిరణంవల్ల కొద్దిగా మాత్రమే వేడెక్కి, సాయంత్ర సమయం నుంచి భూ ఉపరితలం నుంచి దీర్ఘ/పరారుణ తరంగాల రూపంలో పైకివెళ్లే ఉష్ణశక్తి (భౌమ వికిరణం) ద్వారా అధికంగా వేడెక్కుతుంది. వాతావరణంలోని ఆ వేడి తీవ్రతే ఉష్ణోగ్రత.
-భూమిపై విస్తరించిఉన్న ఉష్ణోగ్రతను వివిధ ఉష్ణమాపకాలను ఉపయోగించి తెలుసుకోవచ్చు. (ఉష్ణశక్తిని కేలరీస్‌లో కొలుస్తారు. ఉష్ణోగ్రతను డిగ్రీలలో కొలుస్తారు)
1. ఒక భౌగోళిక ప్రాంతంలోని కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాలను ఉపయోగిస్తారు. శీతల ప్రాంతాల్లో ఉపయోగించే ఉష్ణమాపకాన్ని ఆల్కహాల్‌తోనూ, ఉష్ణప్రాంతాల్లో వాడే ఉష్ణమాపకాన్ని పాదరసంతోనూ నింపుతారు. ఈ ఉష్ణమాపకంలో 2 రకాల స్కేల్లను ఉపయోగిస్తారు.
ఎ. సెంటీగ్రేడ్ స్కేల్ రూపకర్త: వాండర్స్ సెల్సియస్
బి. ఫారన్‌హీట్ స్కేల్ రూపకర్త: ఫారన్‌హీట్
2. ఒక భౌగోళిక ప్రాంత అత్యధిక ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి ఉపయోగించే ఉష్ణమాపకం: ఫైరోమీటర్
3. ఒక భౌగోళిక ప్రాంత అత్యల్ప ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి: క్రయో మీటర్
4. నావికులు ప్రయాణిస్తున్న ప్రాంత ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి : బర్డోలి ట్యూబ్
-భూమిపై ఉష్ణోగ్రత విస్తరణను 2 అంశాలపరంగా తెలుసుకోవచ్చు. అవి…
i) క్షితిజ సమాంతర ఉష్ణోగ్రతా విస్తరణ
ii) ఊర్థ ఉష్ణోగ్రతా విస్తరణ
క్షితిజ సమాంతర ఉష్ణోగ్రతా విస్తరణ
-భూమి మీద క్షితిజ సమాంతర ఉష్ణోగ్రతా విస్తరణ అన్ని భౌగోళిక ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండక, కింద పేర్కొన్న అంశాలచే ప్రభావితమై ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అవి…
1. అక్షాంశాలు / భూమి మీద సూర్య కిరణాలు పడే కోణం
2. పగటి సమయం
3. సూర్యునికి, భూమికి మధ్యగల దూరం
4. వాతావరణ పారదర్శకత
5. సముద్ర సామీప్యత
6. భూభాగాల/పర్వతాల వాలు
7. భూభాగాల ఎత్తు
8. ఒక భౌగోళిక ప్రాంతంలో విస్తరించి ఉన్న నేలలు, వృక్ష సంపద, వర్షపాతం, ఆ ప్రాంతంలో వీచే పవనాలు
1. అక్షాంశాలు
-భూమి గోళాకారంగా ఉన్నందున భూమధ్య రేఖ ప్రాం తాల్లో సూర్యకిరణాలు తక్కువ దూరం ప్రయాణించి ఎక్కువ కోణంతో (90 0) భూమిపై పడి తక్కువ స్థలా న్ని ఆక్రమించి భూమిని అధికంగా వేడిచేస్తాయి.
-ధ్రువాలవైపు వెళ్లేకొద్దీ సూర్యకిరణాలు ఎక్కువదూరం ప్రయాణించి భూమిపై ఏటవాలుగా తక్కువ కోణంతో (<900) పడి ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి తక్కువగా వేడిచేస్తాయి.
-తద్వారా భూమధ్యరేఖ నుంచి ధ్రువాలవైపు వెళ్లేకొద్దీ అక్షాంశాలపరంగా చూస్తే ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయి.
2. పగటి సమయం
-పగటి సమయం అనేది రుతువును బట్టి మారుతూ ఉంటుంది.
-ఉత్తరార్ధగోళంలో వేసవికాలం ఉంటే భూమధ్య రేఖ నుంచి ఉత్తర ధ్రువంవైపు వెళ్లేకొద్దీ పగటి సమయం పెరగడంవల్ల సూర్యపుట పరిమాణం కూడా పెరుగుతుంది. అదే సమయంలో దక్షిణార్ధగోళంలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి.
ఉదా: 1.ఉత్తరార్ధగోళంలో వేసవి అయితే భారత్‌లోని ఏ ప్రాం తంలో ఎక్కువ పరిమాణంలో సూర్యపుటం చేరుతుంది?
1) లే (జమ్ముకశ్మీర్)
2) ఢిల్లీ
3) బెంగళూరు 4) కన్యాకుమారి
జవాబు : కన్యాకుమారి
-అధిక ఉష్ణోగ్రతలు కన్యాకుమారిలో నమోదవుతాయి.
2. ఉత్తరార్ధగోళంలో వేసవి అయితే భారత్‌లోని ఏ నగరంలో భూమికి చేరే సూర్యపుటం ఎక్కువగా పడుతుంది?
1) లే (జమ్ముకశ్మీర్) 2) ఢిల్లీ
3) బెంగళూరు 4) కన్యాకుమారి
జవాబు: లే
-అక్షాంశం పెరిగేకొద్దీ పగటి సమయం పెరుగుతుంది.
3. పై ప్రశ్న ప్రకారం ఉష్ణోగ్రత ఎక్కడ అధికంగా ఉంటుంది?
జవాబు: కన్యాకుమారి
-ఉష్ణోగ్రతపై అనేక అంశాల ప్రభావం ఉంటుంది.
3. సూర్యునికి, భూమికి మధ్య దూరం
-భూకక్ష్య దీర్ఘవృత్తాకారంలో ఉన్నందున భూమికి, సూర్యునికి మధ్యగల దూరం స్థిరంగా ఉండక మారుతూ ఉంటుంది.
-దీని కారణంగా జనవరి 3న భూమికి సూర్యుడు దగ్గరగా ఉన్నందున ఎక్కువ సూర్యపుటం భూమిని చేరి భూగోళ సగటు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. జూలై 4న భూమి సూర్యునికి ఎక్కువ దూరంలో ఉన్నందున తక్కువ సూర్యపుటం భూమిని చేరుతుంది. ఈ కారణంగా భూగోళ సగటు ఉష్ణోగ్రతలు జూలైలో తక్కువ. (భూగోళ సగటు ఉష్ణోగ్రత 15.40C)
4. వాతావరణ పారదర్శకత
-వాతావరణ పారదర్శకత దెబ్బతిన్న భౌగోళిక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, వాతావరణం పారదర్శకంగా ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.
-ఒక వస్తువు ఉష్ణోగ్రతను 10C మేర పెంచుటకు కావాల్సిన ఉష్ణశక్తి విశిష్టోష్ణం.
5. సముద్ర సామీప్యత
-భూ, జల భాగాలు ఉష్ణోగ్రతకు విభిన్నంగా స్పందించడంవల్ల ఒక అక్షాంశం మీద ఉన్న భూజల భాగాల్లో ఉష్ణోగ్రతా వ్యత్యాసాలు ఏర్పడుతాయి.
6. భూభాగాల ఎత్తు
-ఒక అక్షాంశంపై ఉన్న లూథియానా (పంజాబ్)తో పోలి స్తే సిమ్లాలో ఉష్ణోగ్రత తక్కువ. కారణం? – సిమ్లా ఎత్తు లో ఉంది. (ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి)
-సముద్ర మట్టం నుంచి ప్రతి 165 మీ. ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలు 10C చొప్పున తగ్గడంవల్ల ఒకే అక్షాంశం మీదున్న రెండు ప్రాంతాల మధ్య ఉష్ణోగ్రతా వ్యత్యాసాలు ఏర్పడుతాయి.
ఉదా: ఒకే అక్షాంశం మీద ఉన్న లూథియానాతో పోలిస్తే సిమ్లాలో వాతావరణం చల్లగా ఉండుటకు కారణం.. సముద్రమట్టం నుంచి ఎక్కువ ఎత్తులో ఉండటమే.
గ్రామీణ ఉపాధి హామీ పథకాలు
-పనికి ఆహార పథకం (ఎఫ్డబ్ల్యూపీ- 1977-78)- పనులులేని కాలంలో, సకాలంలో ఉద్యోగితను కల్పించి గ్రామాల్లో ఆస్తులను సృష్టించడం ఈ పథకం ఉద్దేశం.
-జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (ఎన్ఆర్ఈపీ- 1980)- తాగునీటి బావుల తవ్వకం, చెరువులు, చిన్న నీటి పారుదల పనులు, గ్రామీణ రోడ్ల వంటి సమాజపరమైన ఆస్తులు సృష్టించండం. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిధులు సమకూరుస్తాయి.
-గ్రామీణ, భూవసతి లేనివారికి ఉపధి హామీ పథకం (ఆర్ఎల్ఈజీపీ- 1980)- గ్రామాల్లో భూవసతి లేనివారికి 100 రోజుల పని కల్పించడం. నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది.
RELATED ARTICLES
-
General Studies – Groups Special | దేశంలోని మొదటి భూతాప విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏది?
-
DSC Special – Biology | Autogamy..Geitonogamy.. Xenogamy
-
Groups Special – Polity | ఎలక్టోరల్ కాలేజీతో ఎంపిక.. మహాభియోగంతో తొలగింపు
-
Economy | పశువైద్య సేవా సౌకర్యాలను అందించే టోల్ ఫ్రీ నంబర్
-
Indian Culture And Festivals | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
-
General Studies – Groups Special | ఆదిత్య-ఎల్ 1 మిషన్
Latest Updates
Economy – Groups Special | అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి రుణాలు ఇచ్చే సంస్థలేవి?
Current Affairs | ఏ రాష్ర్టానికి చెందిన ‘మట్టి బనానా’కు జీఐ ట్యాగ్ లభించింది?
DSC Special – Social | భారతదేశంలో ఇనుప ఖనిజం లభించే ప్రాంతం?
IELTS Exam | Language Tests for Overseas Education
Group 2,3 Special | వెట్టి చాకిరీ నిర్మూలనకు తీర్మానం చేసిన ఆంధ్ర మహాసభ?
Job updates | Job Updates 2023
Scholarships | Scholarships for 2023
Current Affairs | ఏ దేశంలో ‘గాంధీ వాక్’ నిర్వహిస్తారు?
NIMS Admissions 2023 | నిమ్స్‌లో ఎంపీటీ కోర్సు ప్రవేశాలు
JNTUH Admissions 2023 | జేఎన్టీయూహెచ్లో ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలు