స్వతంత్ర భారతదేశ తొలి ఆర్థిక మంత్రి ఎవరు?
1. రే బెరుబారి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని పీఠికను ఏ విధంగా పేర్కొన్నది?
ఎ) రాజ్యాంగంలో భాగం
బి) రాజ్యాంగంలో భాగం కాదు
సి) రాజ్యాంగంలో అతి ముఖ్య భాగం
డి) ఏదీకాదు
2. షెడ్యూల్ 12లోని అంశాలెన్ని?
ఎ) 19 బి) 18 సి) 29 డి) 28
3. అధికరణ 136 సుప్రీంకోర్టుకు కలిగించే అధికారం?
ఎ) సివిల్ జ్యూరిస్డిక్షన్ బి) అప్పిల్లేట్ జ్యూరిస్డిక్షన్
సి) స్పెషల్ లీవ్ అప్పీలు డి) ట్రాన్స్‌ఫర్డ్ జ్యూరిస్డిక్షన్
4. ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం 2020 వరకు రిజర్వేషన్లు పొడిగించబడ్డాయి?
ఎ) 77 బి) 98 సి) 95 డి) 84
5. కింది వారిలో రాష్ర్టపతి ఎన్నికలో ఓటు వేయనివారు?
ఎ) లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు
బి) రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు
సి) ఢిల్లీ, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికైన సభ్యులు
డి) రాష్ర్ట శాసనమండలికి ఎన్నికైన సభ్యులు
6. స్వతంత్ర భారతదేశ తొలి ఆర్థిక మంత్రి?
ఎ) ఆర్కే షణ్ముఖం శెట్టి బి) జాన్ మథాయ్
సి) సి.డి. దేశ్‌ముఖ్ డి) టి.టి. కృష్ణమాచారి
7. జాతీయ పార్టీలు, వాటిని స్థాపించిన సంవత్సరాలను జతపర్చండి.
1. బహూజన్ సమాజ్ పార్టీ అ. 1925
2. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆ. 1980
3. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇ. 1999
4. భారతీయ జనతాపార్టీ ఈ. 1984
ఎ) 1-ఆ, 2-అ, 3-ఇ, 4-ఈ
బి) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
సి) 1-ఆ, 2-ఇ, 3-అ, 4-ఈ
డి) 1-ఈ, 2-ఇ, 3-అ, 4-ఆ
8. ప్రాంతీయ పార్టీలు, వాటిని స్థాపించిన సంవత్సరాలను జతపర్చండి.
1. ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ అ. 2001
2. అసోం గణపరిషత్ ఆ. 1985
3. తెలంగాణ రాష్ట్ర సమితి ఇ. 1998
4. తెలుగుదేశం పార్టీ ఈ. 1982
ఎ) 1-ఆ, 2-అ, 3-ఇ, 4-ఈ
బి) 1-ఇ, 2-ఆ, 3-అ, 4-ఈ
సి) 1-ఆ, 2-ఇ, 3-అ, 4-ఈ
డి) 1-ఈ, 2-ఇ, 3-అ, 4-ఆ
9. కింది ప్రాంతీయ పార్టీలు, వాటి వ్యవస్థాపక అధ్యక్షులను జతపర్చండి.
1. శివసేన అ. సీఎన్ అన్నాదురై
2. ద్రవిడ మునేట్ర కజగం ఆ. ఎంజీ రామచంద్రన్
3. ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ఇ. బాల్‌థాకరే
4. దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం ఈ. విజయ్‌కాంత్
ఎ) 1-ఆ, 2-అ, 3-ఇ, 4-ఈ
బి) 1-ఇ, 2-ఆ, 3-అ, 4-ఈ
సి) 1-ఆ, 2-ఇ, 3-అ, 4-ఈ
డి) 1-ఇ, 2-అ, 3-ఆ, 4-ఈ
10. కమిటీలు, వాటి సిఫారసులను జతపర్చండి.
1. బల్వంతరాయ్ మెహతా కమిటీ
అ. రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి
2. అశోక్ మెహతా కమిటీ
ఆ. జిల్లా ప్రణాళికా బోర్డులను ఏర్పాటు చేయాలి
3. సీహెచ్ హనుమంతరావు కమిటీ
ఇ. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలి
4. ఎల్ఎం సింఘ్వీ కమిటీ
ఈ. పంచాయతీరాజ్ సంస్థలను రాజ్యాంగబద్ధం చేయాలి
ఎ) 1-ఆ, 2-అ, 3-ఇ, 4-ఈ
బి) 1-ఇ, 2-ఆ, 3-అ, 4-ఈ
సి) 1-ఇ, 2-అ, 3-ఆ, 4-ఈ
డి) 1-ఈ, 2-అ, 3-ఆ, 4-ఇ
11. మొదటి ఆర్థిక సంఘం అధ్యక్షుడు ఎవరు?
ఎ) కె. సంతానం బి) ఎ.కె. చాందా
సి) కె.సి. నియోగి డి) వై.బి. చవాన్
12. అతి తక్కువకాలం పదవిలో ఉన్న రాష్ట్రపతి ఎవరు?
ఎ) సర్వేపల్లి రాధాకృష్ణన్ బి) జాకీర్ హుస్సేన్
సి) జ్ఞానీ జైల్‌సింగ్ డి) ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
13. కింది వాటిలో ఎలక్షన్ కమిషన్ పరిధిలోని అంశాలేవి?
1. ప్రధానమంత్రి ఎన్నిక
2. రాజకీయ పార్టీల గుర్తింపు
3. రాష్ర్టపతి ఎన్నిక
4. రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాల కేటాయింపు
ఎ) 2, 3, 4 బి) 2, 3
సి) 3, 4 డి) 1, 2, 3
14. అఖిలభారత సర్వీసులను రద్దు చేయాలని సిఫారసు చేసిన కమిషన్ ఏది?
ఎ) దేబార్ కమిషన్ బి) కాలేకర్ కమిషన్
సి) ఖేర్ కమిషన్ డి) రాజమన్నార్ కమిషన్
15. కింది వాటిలో ఏవి భారత కౌన్సిళ్ల చట్టాలు?
1. 1909 చట్టం 2. 1861 చట్టం
3. 1813 చట్టం 4. 1892 చట్టం
ఎ) 1, 4 బి) 2, 4 సి) 2, 3, 4 డి) 1, 2, 4
16. కింది వాటిలో రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలేవి?
1. కఠిన రాజ్యాంగం 2. ద్వి శాసనసభ విధానం
3. కాగ్ కార్యాలయం 4. సమష్టి బాధ్యత
ఎ) 1, 2, 3 బి) 1, 4
సి) 1, 2, 3, 4 డి) 1, 2
17. రాష్ర్టాలు, వాటి పేర్లు మారిన సంవత్సరాలను జతపర్చండి.
1. ఒరిస్సా ఒడిశాగా అ. 1973
2. ఉత్తరాంచల్ ఉత్తరాఖండ్గా ఆ. 2010
3. అస్సాం అసోంగా ఇ. 2007
4. మైసూరు కర్ణాటకగా ఈ. 2006
ఎ) 1-ఆ, 2-ఈ, 3-ఇ, 4-అ
బి) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
సి) 1-ఈ, 2-ఇ, 3-అ, 4-ఆ
డి) 1-ఇ, 2-అ, 3-ఆ, 4-ఈ
18. కింది వారిలో బ్రిటిష్ పాలనాకాలంలో భారత ప్రభుత్వ కార్యదర్శులు ఎవరు?
1. చేమ్స్‌ఫర్డ్ 2. మార్లే 3. మింటో 4. మాంటేగ్
1) 1, 2 బి) 2, 3 సి) 3, 4 డి) 1, 4
19. ఏ తేదీన బాబూ రాజేంద్రప్రసాద్‌ని రాజ్యాంగ పరిషత్ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు?
1) 11-12-1946 2) 11-11-1946
3) 9-11-1946 4) 9-12-1946
20. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడు?
1) జేబీ కృపలానీ 2) ఫ్రాంక్ ఆంటోనీ
3) హెచ్‌సీ ముఖర్జీ 4) సర్దార్ వల్లభాయి పటేల్
21. రాజ్యాంగ పరిషత్‌కు సిక్కు కమ్యూనిటీల నుంచి ప్రాతినిధ్యం వహించింది ఎవరు?
1. సర్దార్ బల్దేవ్సింగ్
2. హుకుంసింగ్ 3. భగత్ సింగ్
1) 1,3 2) 1,2,3 3) 1,2 4) 2,3
22. ప్రవేశికకు సంబంధించి కింది వాటిలో ఏది నిజం కాదు?
1) దీనిని న్యాయస్థానం ద్వారా అమలుపర్చవచ్చు
2) న్యాయస్థానం ద్వారా అమలుపర్చలేం
3) రాజ్యాంగం ప్రజాధికారంపై ఆధారపడుతుందని
ప్రకటిస్తుంది
4) రాజ్యాంగం ఏర్పరచిన, అమలు చేయాల్సిన
లక్ష్యాలను తెలుపుతుంది
23. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ -2014 బిల్లు ఏ తేదీన చట్టంగా మారింది?
1) 18 ఫిబ్రవరి, 2014 2) 20 ఫిబ్రవరి, 2014 3) 28 ఫిబ్రవరి, 2014 4) 1 మార్చి, 2014
24. ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో ఏ భాగంలో, ఏ ప్రకరణలో పేర్కొన్నారు?
1) భాగం 4 ప్రకరణ 12 నుంచి 35 వరకు
2) భాగం 3 ప్రకరణ 12 నుంచి 35 వరకు
3) భాగం 4 ప్రకరణ 11 నుంచి 36 వరకు
4) భాగం 3 ప్రకరణ 11 నుంచి 36 వరకు
25. ప్రకరణ 32 ప్రకారం పౌరులకు లభించే రిట్లు ఎన్ని?
1. హెబియస్ కార్పస్ 2. మాండమస్
3. ప్రొహిబిషన్ 4. సెర్షియోరరీ 5. కోవారెంటో
1) 1, 2, 3 2) 2, 3, 4
3) 1, 3, 5 4) 1, 2, 3, 4, 5
26. హైకోర్టులకు రిట్లను జారీచేసే అధికారం కల్పించిన ప్రకరణ?
1) ప్రకరణ 32 2) ప్రకరణ 226
3) ప్రకరణ 32, 226 4) ప్రకరణ 216
27. ప్రాథమిక విధులను రాజ్యాంగంలోని ఏ భాగంలో, ఏ ప్రకరణలో పేర్కొన్నారు?
1) భాగం 4, ప్రకరణ 51
2) భాగం 4, ప్రకరణ 51ఏ
3) భాగం 4ఏ, ప్రకరణ 51
4) భాగం 4, ప్రకరణ 51ఏ
28. రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా ఎవరు తొలగిస్తారు?
1) సుప్రీంకోర్టు 2) రాజ్యసభ
3) లోక్‌సభ, రాజ్యసభ విడివిడి సమావేశాల ద్వారా
4) లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశాల ద్వారా
29. కిందివాటిలో సరైన దాన్ని గుర్తించండి.
ప్రతిపాదన (ఏ): భారత రాజ్యాంగం పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించాలి అని పేర్కొంటుంది.
కారణం (ఆర్): పేదరికం అనే కారణంతో న్యాయాన్ని తిరస్కరించకూడదు.
1) ఏ, ఆర్లు నిజం, ఏకు ఆర్ సరైన వివరణ
2) ఏ, ఆర్లు నిజం, ఏకు ఆర్ సరైన వివరణకాదు 3) ఏ నిజం, ఆర్ తప్పు 4) ఏ తప్పు, ఆర్ నిజం
30. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ప్రతిపాదన (ఏ): ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ ఉంది
కారణం (ఆర్): ఆదేశిక సూత్రాలను అమలు పర్చమని పౌరులు న్యాయస్థానాన్ని ఆశ్రయించరాదు
1) ఏ, ఆర్లు నిజం, ఏకు ఆర్ సరైన వివరణ
2) ఏ, ఆర్లు నిజం, ఏకు ఆర్ సరైన వివరణకాదు 3) ఏ నిజం, ఆర్ తప్పు
4) ఏ తప్పు, ఆర్ నిజం
31. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ప్రతిపాదన (ఏ): భారతదేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీద నిర్వహించబడుతుంది.
కారణం (ఆర్): ప్రకరణ 54 రాష్ట్రపతి ఎన్నిక గురించి పేర్కొంటుంది.
1) ఏ, ఆర్లు నిజం, ఏకు ఆర్ సరైన వివరణ
2) ఏ, ఆర్లు నిజం, ఏకు ఆర్ సరైన వివరణకాదు 3) ఏ నిజం, ఆర్ తప్పు 4) ఏ తప్పు, ఆర్ నిజం
32. కిందివాటిలో సరైన దాన్ని గుర్తించండి.
ప్రతిపాదన (ఏ): భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించవచ్చు.
కారణం (ఆర్): ప్రకరణ 252 జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన గురించి పేర్కొంటుంది.
1) ఏ, ఆర్లు నిజం, ఏకు ఆర్ సరైన వివరణ
2) ఏ, ఆర్లు నిజం, ఏకు ఆర్ సరైన వివరణకాదు 3) ఏ నిజం, ఆర్ తప్పు 4) ఏ తప్పు, ఆర్ నిజం
33. రెగ్యులేటింగ్ చట్టం,1773కు సంబంధించి కింది వాటిని పరిశీలించండి?
1) ఈ చట్టం కంపెనీ కార్యకలాపాలను నియంత్రించింది
2) కేంద్రీకృత పాలన ప్రారంభమైంది
3) బెంగాల్ గవర్నర్‌ను బెంగాల్ గవర్నర్ జనరల్‌గా
మార్చారు
4) వికేంద్రీకృత పాలన ప్రారంభమైంది
5) కారన్వాలిస్ – మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్
6) వారన్హేస్టింగ్- మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్
పైవాటిలో సరైన జవాబును గుర్తించండి.
1) 1,2,3,4 2) 1,2,3,6 3) 1,4,5 4) 3,5
34. పిట్స్ ఇండియా చట్టం,1784కు సంబంధించి కింది వాటిని పరిశీలించండి?
1) బ్రిటిష్ ప్రధాని విలియం పిట్స్ ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు. అందుకే దీనికి అతని పేరు వచ్చింది.
2) తొలిసారిగా ఈ చట్టం కంపెనీ ప్రాంతాలను భారత్‌లో బ్రిటిష్ పాలిత ప్రాంతాలుగా పేర్కొన్నారు
3) ఈ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్రలో ద్వంద్వ ప్రభుత్వాన్ని సూచిస్తుంది
4) గవర్నర్ జనరల్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 4 నుంచి 3కు పరిమితం చేసింది
పైవాటిలో సరైన జవాబు గుర్తించండి.
1) 1,2,3,4 2) 1,2,3 3) 2,3,4 4) 1,3,4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు