వెలుగుజిలుగుల తెలంగాణ
విద్యుచ్ఛక్తి
– దేశంలో మొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించిన ప్రదేశం – డార్జిలింగ్ (1899)
– దేశంలో మొదట విద్యుదీకరణ జరిగిన నగరం – కోల్‌కతా (1899)
– దేశంలో మొదటి భారీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించిన ప్రదేశం – శివసముద్రం (కర్ణాటక, 1902)
– స్థాపన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం – 4.5 మెగావాట్లు
– ప్రపంచంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేసిన మొదటి దేశం – అమెరికా
విద్యుత్ గణన
– ప్రపంచంలో, ఇండియాలో, తెలంగాణలో అత్యధికంగా ఉత్పత్తయ్యే, వినియోగించే విద్యుత్ – థర్మల్ విద్యుత్
విద్యుత్ ఉత్పత్తి వరుసక్రమం థర్మల్ > జల విద్యుత్ > సౌరవిద్యుత్ > అణువిద్యుత్
గమనిక: దేశంలో అత్యధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే రాష్ట్రం – – మహారాష్ట్ర
జలవిద్యుత్
– నీరు సహజ లేదా కృత్రిమ పద్ధతుల ద్వారా ప్రాజెక్టులు/ ఆనకట్టలు దాటినప్పుడు టర్బైన్లు తిప్పడం ద్వారా ఉత్పత్తి చేసే శక్తినే జలవిద్యుత్ శక్తి అంటారు.
– ఇది తరగని (పునరుత్పాదక) శక్తి వనరు.
– ఇది చౌకగా లభించే విద్యుత్.
– జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల జీవితకాలం ఎక్కువ.
– ఈ విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన వనరు – నీరు
– తెలంగాణలోని మొత్తం జల విద్యుత్ సామర్థ్యం – 2,385 మె.వా.
తెలంగాణలోని ప్రధాన జల విద్యుత్ కేంద్రాలు
1. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం
– కృష్ణానదిపై నిర్మించారు.
– స్థాపన – 1960-1980.
– స్థాపించిన ప్రదేశం – నాగర్‌కర్నూలు (టీఎస్) – కర్నూలు (ఏపీ) సరిహద్దు
– సామర్థ్యం – 900 మె.వా. (6X150 = 900 మె.వా.)
– ఇది రాష్ట్రంలో అధిక జలవిద్యుత్‌ను ఉత్పత్తిచేసే కేంద్రం
2. నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రం
– ఉత్పత్తి ప్రారంభం – 1978
– స్థాపించిన ప్రదేశం – నందికొండ, నల్లగొండ
– సామర్థ్యం – 815.6 మె.వా. (మొత్తం 8 యూనిట్లు)
– ఇది తెలంగాణలో ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం
– ఈ బహుళార్థ సార్ధక ప్రాజెక్టును కృష్ణానదిపై నిర్మించారు.
3. దిగువ (లోయర్) జూరాల జలవిద్యుత్ కేంద్రం
– కృష్ణా నదిపై నిర్మాణం.
– స్థాపన – 2008 (నిర్మాణంలో ఉంది)
– స్థాపించిన ప్రదేశం – ఆత్మకూరు (వనపర్తి మండలం)
– సామర్థ్యం- 240 మె.వా. (6X40 మె.వా. = 240 మె.వా.)
4. పులిచింతల జలవిద్యుత్ కేంద్రం
– కృష్ణానదిపై నిర్మాణం.
– ప్రదేశం – నెమలిపురి, సూర్యాపేట
– సామర్థ్యం – 120 మె.వా.
5. శ్రీరాంసాగర్ (పోచంపాడు) జలవిద్యుత్ కేంద్రం
– గోదావరి నదిపై నిర్మించారు.
– స్థాపన – 1963, జూలై
– స్థాపించిన ప్రదేశం – పోచంపాడు, (మెండోర మండలం), నిజామాబాద్
– సామర్థ్యం – 36 మె.వా.
6. సింగూరు జలవిద్యుత్ కేంద్రం
– మంజీర నదిపై నిర్మాణం.
– స్థాపన – 1978
– స్థాపించిన ప్రదేశం – సింగూరు, సంగారెడ్డి
– సామర్థ్యం – 15 మె.వా.
7. నిజాంసాగర్ జలవిద్యుత్ కేంద్రం (మంజీర నది)
– స్థాపన – 1923
– స్థాపించిన ప్రదేశం – అచ్చంపేట (నిజాంసాగర్ మండలం), కామారెడ్డి
– సామర్థ్యం – 10 మె.వా.
8. ప్రియదర్శిని జూరాల జలవిద్యుత్ కేంద్రం (కృష్ణా నది)
– స్థాపన – 1995
– స్థాపించిన ప్రదేశం – రేవులపల్లి (జోగుళాంబ గద్వాల)
– సామర్థ్యం – 234 మె.వా.
9. పుట్టంగండి జలవిద్యుత్ కేంద్రం
– ప్రదేశం – నల్లగొండ
– సామర్థ్యం – 72 మె.వా. (4X18 = 72 మె.వా.)
10. నాగార్జున సాగర్ ఎడమగట్టు కాలువ జలవిద్యుత్ కేంద్రం
– కృష్ణా నదిపై నిర్మాణం
– స్థాపించిన ప్రదేశం – నల్లగొండ
– సామర్థ్యం – 60 మె.వా.
11. పెద్దపల్లి మినీ జలవిద్యుత్ కేంద్రం
– గోదావరి నదిపై నిర్మాణం.
– స్థాపించిన ప్రదేశం – కాకతీయ కాలువపై, పెద్దపల్లి
– సామర్థ్యం – 9.16 మె.వా.
12. పాలేరు మినీ జలవిద్యుత్ కేంద్రం
– పాలేరు నదిపై నిర్మాణం.
– స్థాపించిన ప్రదేశం – ఖమ్మం
– సామర్థ్యం – 2 మె.వా.
సోలార్ విద్యుత్ (సౌరవిద్యుత్)
– సూర్యుడి నుంచి వచ్చే కాంతిశక్తి ద్వారా సోలార్ పలకలను ఉపయోగించి తయారుచేసే (ఉత్పత్తి చేసే) విద్యుత్‌ను సోలార్ విద్యుత్ అంటారు.
– ఇది తరగని (పునరుత్పాదక) శక్తి వనరు.
– సోలార్ శక్తికి ప్రధాన వనరు – సూర్యుడు
– ఇది సాంప్రదాయేతర, కాలుష్య కారకం కాని శక్తివనరు.
గమనిక: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5000 మె.వా. సౌర విద్యుత్ సామర్థ్యం లక్ష్యంగా తెలంగాణ సౌరవిద్యుత్ విధానం – 2015ను ప్రకటించింది.
– 2015, మే 18న ఈ విధానాన్ని ప్రకటించారు.
– ఈ విధానం ద్వారా తెలంగాణలో సౌరవిద్యుత్ ప్రాజెక్టులు, సోలార్ పార్కుల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు సింగిల్ విండో విధానంలో సత్వర అనుమతులు ఇస్తున్నారు.
– తెలంగాణలో 20.41 గి.వా. (గిగావాట్ల) సౌర విద్యుత్ సామర్థ్యం ఉందని అంచనా వేశారు.
గమనిక: దేశంలో సౌరవిద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణది మొదటి స్థానం.
– ప్రస్తుతం రోజూ గరిష్ఠంగా 2,357 మె.వా. ఉత్పత్తి చేస్తున్నారు.
– 2018, జనవరి నాటికి 3,400 మె.వా.ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేశారు.
– తెలంగాణలో తొలి సౌరవిద్యుత్ కేంద్రం – జూరాల సోలార్ విద్యుత్ కేంద్రం (జోగుళాంబ గద్వాల)
– స్థాపిత సామర్థ్యం- 1మె.వా. (2011లో) (PhotoVoltaic Plant) నడిపే సంస్థ – TSGENCO
ntpl-solar-power-plant1
థర్మల్ విద్యుత్
– బొగ్గు, నీటి ఆవిరి, ముడిచమురు ఆధారంగా ఉత్పత్తి చేసే విద్యుత్‌ను థర్మల్ విద్యుత్ అంటారు.
– తెలంగాణలో థర్మల్ విద్యుత్ ఉత్పాదన – 6,682.5 మెగావాట్లు
– రాష్ట్రంలో లభించే ఒకే ఒక శిలాజ ఇంధనం- బొగ్గు
రాష్ట్రంలోని ప్రధాన థర్మల్ పవర్ స్టేషన్లు హుస్సేన్‌సాగర్ థర్మల్ పవర్ స్టేషన్
– దీన్ని హుస్సేన్‌సాగర్ ఒడ్డున 1920లో అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్‌అలీఖాన్ ప్రారంభించారు.
– ఇది రాష్ట్రంలో మొదటి థర్మల్ పవర్‌స్టేషన్
– దీన్ని 1992లో మూసివేశారు.
గమనిక: దీని స్థానంలో ప్రస్తుతం ప్రసాద్ ఐమాక్స్, ఎన్టీఆర్ గార్డెన్స్ ఉన్నాయి.
2. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)
– 1966లో స్థాపించారు.
– స్థాపించిన ప్రదేశం- పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం సామర్థ్యం
– కేటీపీఎస్ – ఎ – (4 X 60 = 240 మె.వా.)
– కేటీపీఎస్ – బి, సి – (2 X 240 మె.వా. = 480 మె.వా.)
– కేటీపీఎస్ – V – (2 X 500 = 1000 మె.వా.)
– కేటీపీఎస్ – VI – (1 X 500 = 500 మె.వా.)మొత్తం = 2220 మె.వా.
3. రామగుండం బి – థర్మల్ పవర్ స్టేషన్
– 1971లో స్థాపించారు.
– స్థాపించిన ప్రదేశం – రామగుండం (పెద్దపల్లి)
– సామర్థ్యం – 62.50 మె.వా.
4. జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)
– ఈ ప్రాజెక్టును 1983 స్థాపించారు.
– స్థాపించిన ప్రదేశం – రామగుండం (పెద్దపల్లి)
– సామర్థ్యం – 2600 మె.వా.
గమనిక: ఇది ప్రపంచంలో అతిపెద్ద ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థ.
5. శంకర్పల్లి గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం
– దీన్ని 2002లో స్థాపించారు.
– ప్రస్తుతం ఈ విద్యుత్ కేంద్రాన్ని మూసివేశారు.
6. కాకతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ (కేటీపీసీ)- I
– 2009, ఫిబ్రవరిలో స్థాపించారు.
– స్థాపించిన ప్రదేశం – చెల్పూరు (ఘనపురం మండలం), జయశంకర్ భూపాలపల్లి
– సామర్థ్యం – 500 మె.వా.
– కాకతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ (కేటీపీసీ)- II
– స్థాపించిన ప్రదేశం – చెల్పూరు (ఘనపురం మండలం), జయశంకర్ భూపాలపల్లి
– సామర్థ్యం – 600 మె.వా.
కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు
1. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (వైటీపీసీ) (రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (REC) ఆధ్వర్యంలో)
– ప్రారంభం- 2015, జూన్ 8
– స్థాపించిన ప్రదేశం – వీర్లపాలెం (దామరచర్ల మండలం), నల్లగొండ
– సామర్థ్యం – 400 మె.వా.ఎ – స్టేషన్ – 2 X 800 = 1600 మె.వా. బి – స్టేషన్ – 3 X 800 = 2400 మె.వా. మొత్తం సామర్థ్యం = 4000 మె.వా.
2. జైపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రం (జేటీపీసీ)
– స్థాపించిన ప్రదేశం – పెగడపల్లి (జైపూర్ మండలం), మంచిర్యాల
– సామర్థ్యం- 1200 మె.వా. (2X600 = 1200 మె.వా.)
3. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (బీటీపీసీ)
– స్థాపించిన ప్రదేశం – రామానుజవరం (మణుగూరు మండలం), భద్రాద్రి కొత్తగూడెం
– బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో నిర్మాణం
– సామర్థ్యం – 4X270 = 1080 మె.వా.
4. కొత్తగూడెం థర్మల్ పవర్ కార్పొరేషన్ (కేటీపీసీ)- VIII
– స్థాపించిన ప్రదేశం – భద్రాద్రి కొత్తగూడెం
– సామర్థ్యం – 800 మె.వా.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు