సుల్తానుల కాలంలో ఢిల్లీ జనజీవనాన్ని చిత్రించిన గ్రంథం?
సుల్తానుల కాలంలో విద్యాభ్యాసం మత గ్రంథాల ద్వారానే జరిగింది. ముస్లింలు తమ పిల్లలకు 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు రాగానే అక్షరాభ్యాసం చేసేవారు. దీన్ని ‘బిస్మిల్లా’ అంటారు. విద్యా కేంద్రాలుగా రాజధాని నగరాలు, పుణ్యక్షేవూతాలు, మదర్సాలు, దేవాలయాలు, ఖాంక్వాలు, మసీదులుండేవి. ప్రాథమిక విద్యను నేర్పేది మౌల్వీలు. మదర్సా-ఇ-ఫిరోజ్‌షాహి (ఢిల్లీ)లో తఫనీర్, హడీలు, ఫిక్, సాహిత్యం, తర్కం, వ్యాకరణం మార్మివ్ సిద్ధాంతం నేర్పేవారని బరౌనీ తెలిపాడు.
-పాలకులు అరబ్బీ, ఉర్దూ, పర్షియన్ భాషలను ఆదరించారు. ఢిల్లీ, జలంధర్, ఆగ్రా, ఫిరోజాబాద్, నలంద, కశ్మీర్, వల్లభి, ధారా, పాటలీపుత్రం, వారణాసి, కంచి విద్యాకేంవూదాలు. ఢిల్లీ సుల్తానుల పాలనకంటే ముందుగానే ‘మదర్సాలు’ భారతదేశంలో ఉన్నాయి. మొదటి మదర్సాను అజ్మీర్‌లో షహబుద్దీన్ మహమ్మద్ స్థాపించాడు. ఇల్టుట్మిష్, మహ్మద్ బిన్ తుగ్లక్‌లు ఢిల్లీలో మదర్సాలు స్థాపించారు.
-ముఖ్యమైన విద్యాకేంవూదాల్లో గ్రంథాలయాలు కూడా ఉన్నాయి. ఢిల్లీలో పెద్ద గ్రంథాలయం ఉంది. ముస్లింలకు సంస్కక్షుతం అభ్యసించాలన్న కోరిక ఉండేదికాదు. అల్ బెరూనీ తర్వాత సంస్కక్షుతాన్ని నేర్చుకొన్న విద్యావంతులు లేరు. ఫిరోజ్‌షా తుగ్లక్, సికిందర్లోడీ వంటి సుల్తానులు కొన్ని సంస్కక్షుత గ్రంథాలను పర్షియా భాషలోకి అనువాదాన్ని ప్రోత్సహించారు. ఉర్దూ భాషను వీరి కాలంలో మొదట ‘జబానేహింద్’ అనేవారు. తర్వాత ఉర్దూగా పిలువబడింది.
హిందూ గ్రంథాలు
-కల్హణుడు – ‘రాజతరంగిణి’. ఇది కాశ్మీరదేశ చరిత్ర. దీన్ని 1148-50లో రాశారు.
-యశోవర్మ – గౌడ వధ
-పద్మగుప్తుడు – నవసాహసాంక చరిత్ర
-బిల్హణుడు – విక్రమాంకదేవ చరిత్ర (కల్యాణి దేశ చరిత్రను గురించి చెబుతుంది)
-హిందీలో చాంద్బర్దాయ్ – ‘పృథ్వీరాజ్ రాసో’లో 11వ శతాబ్దంలో ఢిల్లీ, అజ్మీర్ చరిత్ర గురించి రాశారు.
1. షేక్ నిజాముద్దీన్ జేనియా సందేశాలను (1307-1322 వరకు) అమీర్హసన్ సిజ్జి ‘పునైదుల్ వునాద్’ అనే గ్రంథంలో సంకలనం చేశారు. అమీర్హసన్ సిజ్జీ.. షేక్ నిజాముద్దీన్ జేనియా శిష్యుడు.
2. షేక్ మొయినొద్దీన్ చిస్తీ ప్రవచనాలను ‘సరూర్-అజ్ సుదూర్’ గ్రంథంలో హమీదుద్దీన్ నగౌరీ, అతని కొడుకు ఫరీదుద్దీన్ మహమూద్ సంకలనం చేశారు.
3. ‘సియర్-ఉల్-జేనియా’ గ్రంథాన్ని అమీర్ ఖుస్రో రాశారు. ఈ గ్రంథం ఢిల్లీ సుల్తానుల కాలంనాటి మత సాంస్కక్షుతిక విషయాలను తెలుపుతుంది.
4. సయ్యద్ జలాలుద్దీన్ బుకారి ప్రవచనాలను ‘సిరాజ్-ఉల్-హిదయా’ గ్రంథంలో ముఖదుమ్ జదు అబ్దుల్లా సంకలనం చేశాడు.
5. షేక్ షరఫొద్దీన్ యాహ్యమనేరి సంభాషణలు మౌలానాజైన బదర అరబిచే ‘మదిన్-ఉల్-మ’ అనే గ్రంథంలో సంకలనం అయ్యాయి.
6. షేక్ బుర్హానుద్దీన్ ఫరీద్ సంభాషణలను ‘అహసాన్-ఉల్-అక్వల్’ గ్రంథంలో మౌలానా అహ్మద్ సంకలనం చేశారు.
7. క్వాజీ హమీదుద్దీన్ నగౌరి రాసిన ‘ఇష్క్వియా’, షేక్ జమాలుద్దీన్ హన్సీ రాసిన ‘ముల్హమత్ దివాన్’ 13వ శతాబ్దంలో మత విషయాలను తెలుపుతున్నాయి.
8. ఇల్టుట్మిష్ కాలంలో మహమ్మద్ అఫి సేకరించిన ‘జవామీ-అల్-హికాయత్’ కథల సంపుటి ముస్లిం ప్రజల జీవనం, ఢిల్లీ ప్రజల దైనందిన జీవితం గురించి తెలుపుతుంది.
9. విద్యావతి రాసిన ‘పురుష్ పరీక్ష’ ఈ కాలం నాటిదే.
దక్షిణ భారతదేశం – జీవిత చరిత్రలు
-బిల్హణుడు రాసిన ‘విక్రమాంకదేవ చరిత్ర’. ఇది కల్యాణి చాళుక్యుల నాటి సామాన్య పరిస్థితులను తెలుపుతుంది. గొప్పవాడైన 6వ విక్రమాదిత్యుని పాలన గురించి (1072-1128) 18 అధ్యాయాల్లో రాశాడు.
-వామనభట్టు బాణుడు: కొండవీడు రెడ్డి రాజుల ఆస్థాన కవి. పెదకోమటి వేమాడ్డి (1398-1415) జీవిత చరివూతను ‘వేమ భూపాల చరివూత’గా రాశాడు.
-కుమార కంపన భార్య గంగాంబ ‘మధురా విజయం’ రాసింది.
-రాజనాథ డిండిముడు ‘సాళువాభ్యుదయం’ గ్రంథంలో సాళువ నరసింహుని జీవిత చరిత్ర రాశాడు.
-కుమార ధూర్జటి రాసిన ‘కృష్ణరాజ విజయం’ శ్రీకృష్ణ దేవరాయల జీవిత చరిత్రను తెలుపుతుంది.
-తిరుమలదేవి ‘వరదాంబికా పరిణయం’ రాసింది.
వంశావళులు-ఆలయ చరిత్రలు
-వెలుగోటి వారి వంశావళి – రచయిత పేరు తెలియదు
-రామరాజీయం – అందుగుల వెంకయ్య
-కొంగు దేశ రాజకుళ చరిత్ర, కెళది నృప విజయం, చిక్కదేవరాయ వంశావళి
-తిక్కన రాసిన ‘నిర్వచనోత్తర రామాయణం’
-శ్రీనాథుని ‘కాశీ ఖండం’
-కుమారగిరి రెడ్డి రాసిన ‘వసంత రాజీయం’
-జాయప రాసిన ‘నృత్యరత్నావళి, గీతరత్నావళి, వాద్య రత్నావళి’
-వినుకొండ వల్లభరాయుని ‘క్రీడాభిరామం’
-నంది మల్లయ్య, ఘంట సింగన్న అనే జంట కవులు రాసిన ‘వరాహ పురాణం’
-పెద్దన – మనుచరిత్ర
-శ్రీకృష్ణ దేవరాయల ‘అముక్త మాల్యద’.
-బండారు లక్ష్మీనారాయణ ‘సంగీత సూర్యోదయం’ గ్రంథాలు ఢిల్లీ సుల్తానుల సమకాలీన కాలంలోనివే.
పర్షియన్ సాహిత్యం
-పర్షియన్ భాష రాజభాష. దేశంలోని ప్రాంతీయ భాషలైన హిందీ, బెంగాలీ వంటి భాషలపై పర్షియన్ భాషా ప్రభావం పడింది. ‘షానామ’ అనే గ్రంథం రాసిన ఫిరదౌసికి ‘హోమర్’ అనే బిరుదు ఉంది. సాహితీ ప్రక్రియలన్నింటిలో నైపుణ్యం చూపిన కవి ‘అమీర్ ఖుస్రో’. మహ్మద్‌బిన్ తుగ్లక్ ఆస్థానంలోని బద్రుద్దీన్ మహమ్మద్ అనే కవి అనేక సాహితీ ప్రక్రియలు చేపట్టాడు. ఇతను క్వానీడాలతోనూ, ఘజల్లతోనూ, క్వితాలతోనూ, రుబాయీలతోనూ కలిపి ‘దివాన్’ రచించాడు. కాంగ్రాలో గ్రంథాలయాన్ని సందర్శించిన ఫిరోజ్ తుగ్లక్ అందులోని సంస్కక్షుత గ్రంథాలను చూసి, పండితులను రప్పించి పర్షియన్ భాషలోకి అనువదింపజేశాడు.
ఉర్దూ సాహిత్యం
మకీ.శ. 1200 నుంచి 1700 వరకు ఉర్దూ, హిందీ ఒక్కటిగానే ఉన్నాయి. రెండింటి వాక్య నిర్మాణం, వ్యాకరణం ఒక కొందరు చరివూతకారుల అభివూపాయం. అమీర్‌ఖుస్రో పర్షియన్లోనే ఎక్కువ రచనలు చేశాడు. తాను ఉపయోగించిన ప్రాంతీయ భాషకు ‘హిందవై’, దెహ్లావి అని పేర్లు పెట్టాడు. ఇవి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వాడేవారు. హిందీ+ఉర్దూల కలయిక. ఇది ఎక్కువగా దక్కన్లో పోషించబడింది. ఈ భాషపై మరాఠీ, గుజరాతీల ప్రభావం ఉంది. ఉర్దూలో ప్రథమక్షిగంథ రచయిత క్వాజా బందానవాన్గే సుదారాజ్ రాసిన ‘మీరట్-అల్-అషివ్విన్’ ఇది గోల్కొండ, బీజాపూర్లలో అధికార భాష. మహ్మద్ కులీ కుతుబ్‌షా, అబ్దుల్లా కుతుబ్‌షా, తానీషాలు స్వయంగా ఈ భాషలో రచనలు చేశారు. ఉర్దూ అంటే టర్కీ భాషలో సైనిక శిబిరం.
– అమీర్ ఖుస్రో భారతీయ కవులందరిలోకెల్లా గొప్పవాడు. తన 72వ ఏట 1325లో మరణించాడు. తండ్రి టర్కిస్థాన్ జాతీయుడు. ఇతని అసలుపేరు ‘యామిని ఉదుద్దీన్ మహ్మద్ హసన్’. నిజాముద్దీన్ జేనియా శిష్యుడు. 4 లక్షలకు పైగా ద్విపదలు రాశాడు. కైకుబాద్ అనుమతితో ‘కిరన్-అస్-సాదీన్’ అనే గ్రంథం రాశాడు. ఇంకా ‘నుహ్ సిఫిర్’ – ‘ది నైన్ సై్కస్’, ముఫ్తా ఉల్ ఫతాహ్, ‘తారీఖీ-అతై, లేదా ‘ఖజైన్-ఉల్-ఫతాహ్’ మొదలైన గ్రంథాలు రాశాడు. ఇతడు ఉర్దూ భాషకు ఆదికవి.
ఉత్తర, దక్షిణ భారతంలో ఇంటిపేర్లు
– ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాల్లో వారు నివసించే ప్రదేశాన్ని బట్టి ఇంటిపేర్లు, శాఖలు ఏర్పడ్డాయి. ఉత్తర భారతంలో వారు నేర్చిన విద్యనుబట్టి ద్వివేది, త్రివేది, చతుర్వేది అని పేర్లు ఉండేవి. అర్చించే అగ్నినిబట్టి ఇస్టిస్, అగ్నిహోవూటిన్, దీక్షిత్ అని పేర్లు వచ్చాయి.
సాహిత్యం – రచయితలు
ఢిల్లీ సుల్తానుల కాలంలో ఎక్కువగా పర్షియన్ రచయితలుండేవారు.
1. హసన్ నిజామీ – ఉంతాజుల్ మాసీర్
2. మిన్హాజుద్దీన్ సిరాజ్ – తబ్కా తే నాసిరి
3. జియావుద్దీన్ బర్ని – తారీఖె ఫిరోజ్‌షాహి, ఫత్వాయే జహందరీ
4. షమ్స్ సిరాజ్ అఫీస్
5. యహ్యబిన్ అహ్మద్ – తారీఖె ముబారక్ షాహి
6. ఇసామీ – పుతాహ్ ఉజ్ సలాతిన్
అమీర్ ఖుస్రో (1253-1325):
ప్రథమ హిందీ రచయిత. 1253లో పాటియాలాలో జన్మించారు. అసలుపేరు మహ్మద్ హసన్. ఇండియాలో పుట్టి పర్షియన్లో కవిత్వం రాశారు. తన చివరికాలంలో షేక్ నిజాముద్దీన్ మౌల్వీ శిష్యుడిగా చేరారు.
ఇతని గ్రంథాలు: 1. ఖాజైనుల్ ఫుతుఃతుగ్లక్ నామ
2. తారీఖె అలై
అమీర్ హసన్ ది హల్వీ: గొప్ప మేధావి. అసలుపేరు నజీముద్దీన్ హసన్.
– దక్షిణ భారతదేశంలో ఇదే సమయంలో బ్రహ్మసూవూతాలపై రామానుజాచార్యులు వ్యాఖ్యానం రాశారు. జయదేవుడు గీతాగోవిందం రాశాడు. 1219-1229ల మధ్య జైసింగ్ సూరి.. హమీర్ మదమర్ధన గ్రంథాన్ని, రవివర్మ.. ప్రద్యుమ్నాభ్యుదయం గ్రంథాన్ని రాశారు.
– బౌద్ధ మతానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిన ఆదిశంకరులు ఈ కాలంవారే. క్రీ.శ. 1479లో కాశీలో జన్మించిన వల్లభాచార్యుడు ఈ కాలంవారే.
1. అమీర్ ఖుస్రో
ఎ. 1289లో ‘క్విరాన్-అజ్-సదైన్’ గ్రంథంలో బెంగాల్ గవర్నర్ బగాఖాన్, ఢిల్లీ సుల్తాను కైకుబాద్ల కలయిక గురించి రాశారు.
బి. 1291లో ‘మిఫ్తా-ఉల్-వుటూ’ గ్రంథంలో ‘జలాలుద్దీన్ ఖిల్జీ దండయావూతను వివరించాడు.
సి. ‘అషికా’ గుజరాత్ రాకుమారి దేవలదేవి, ఖిజిర్ఖాన్ల ప్రేమ వ్యవహారం గురించి తెలుపుతుంది.
2. హసన్ నిజామీ: ‘లూజ్-ఉల్-మానిరో’.
3. ఫక్రముదబ్బిర్: ‘బహృల్ అన్సబ్’ గ్రంథాన్ని ఇల్టుట్మిష్కు అంకితమిచ్చాడు.
4. జియాఉద్దీన్ బరౌని: ఇతడు మొదటి భారతీయ ముస్లిం చరిత్రకారుడు.
ఎ. ‘తారీఖీ ఫిరోజ్‌షాహి’ గ్రంథంలో బాల్బన్ పాలన నుంచి మహ్మద్‌బిన్ తుగ్లక్ పాలన వరకుగల సంఘటనలు, ఫిరోజ్‌షాహి రాజ్యంలోని మొదటి 6 సంవత్సరాల పాలన గురించి రాశాడు.
బి. ‘ఫిటావై జహందరీ’ అనే గ్రంథంలో బరేనీ ఇస్లాం, రాచరికానికి మధ్య వ్యత్యాసాన్ని రాశాడు.
5. ఇసామీ: 1350లో ‘ప్యుటూ-అజ్-సరీటిన్’ కావ్యాన్ని బహమనీ సుల్తాన్ అల్లావుద్దీన్ హసన్ షా ఆస్థానంలో రాశాడు. అందులో గజనీ మహ్మద్ దాడి నుంచి మహ్మద్‌బిన్ తుగ్లక్ పాలనవరకుగల చరివూతను వివరించాడు.
6. షామ్స్-ఇ-సిరాజ్ అఫీస్: ఇతను ఫిరోజ్‌షా తుగ్లక్కు ఆప్తుడు. ‘తారీఖీ ఫిరోజ్ షాహి’ని రాశాడు.
7. ఫిరోజ్‌షా: ‘ఫుటూహట్-ఇ-ఫిరోజ్‌షాహి’ 32 పేజీల గ్రంథం.
8. తైమూర్ తన ఆత్మ కథను ‘ముల్పూజాత్-ఇ-తైమూరి’ పేరుతో టర్కీ భాషలో రాశాడు. దీన్ని అబూతారిబ్ హుసేని పర్షియన్ భాషలోకి అనువదించాడు.
9. యహ్యబిన్ అహ్మద్: ‘తారీఖీ ముబారక్ షాహి’. ఇది 1434-35లో రాయబడింది. ఘోరీ నుంచి సయ్యద్ వంశంలో 3వ వాడైన సుల్తాన్ మహ్మద్కాలం వరకు చరిత్ర ఇందులో ఉంది.
10. షేక్ రిజ్క్వుల్లా: 1. వాక్వియాత్-ఇ-ముస్తాక్వి’
2. తారీఖీ ముస్తాక్వి గ్రంథాలను 1573లో రాశాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు