జాతి తత్వం-సాంఘిక అసమానతలు
శ్రీకృష్ణ కమిషన్ ప్రకారం కొన్ని మతతత్వ సంస్థలు మన రాష్ట్రంలో గొడవలు పెంచి జాతుల విభజనకు ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి రాజకీయ లబ్ధి కోసం కూడా కొన్ని సందర్భాల్లో జాతులను ఉపయోగిస్తున్నట్లు కమిషన్ పేర్కొంది.
-చాలా సందర్భాల్లో మతతత్వ సంస్థలు మురికి వాడల ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆరోగ్యం విషయంలో ఉచిత అంబులెన్స్ సౌకర్యం పేదలకు కల్పించారు. జాతుల మధ్య సహకారం మంచిదే కానీ అది అభివృద్ధికి ఆటంకంగా మారరాదు.
-పేదల్లో టెన్షన్, రూమర్లు, ప్రొవొకేషన్, కాన్ఫ్లిక్ట్లను సులభంగా విస్తరింపజేయొచ్చు. అందువల్ల కొందరు పేదలకు సౌకర్యాలు కల్పించి జాతుల మధ్య గొడవలకు దారితీసే విధంగా చేసి అది చివరికి అభివృద్ధికి ఆటంకంగా మారే ప్రమాదం ఉంది.
-ముంబై గొడవలు, బాబ్రి మసీదు, గోద్రా మొదలైన సంఘటనలు ఆర్థిక అభివృద్ధి నిరోధానికి దారితీస్తాయి. గోద్రా రైలు దాడిలో దాదాపు 50 మంది హిందువులు సజీవ దహనమయ్యారు.
-శ్రీకృష్ణ కమిషన్ ప్రకారం పేదలు త్వరగా జాతిపర గొడవలకు ప్రభావితం అవుతారు. అందువల్ల దేశాన్ని మొదట మురికివాడలు లేని దేశంగా మార్చాలి.
-ఇసాపూర్, ధారవి లాంటి ప్రదేశాల్లో ఒకవైపు సమర్థమంతంగా చట్టం అమలు మరొకవైపు ప్రజల ఆర్థిక పరిస్థితులను చక్కపర్చాలి. ముఖ్యంగా రాజీవ్ ఆవాస్ యోజన లాంటి పథకాలు అమలు చేయాలి.
-దేశంలో కులం ఆధారంగా మాఫియా నెట్వర్క్ రాజకీయాలను శాసించడం, కొన్ని కులాలే ఆర్థిక ఫలాలు అనుభవిస్తున్నారు. రామ్రాజ్య పరిషత్, హిందూ మహాసభ, భారతీయ జనసంఘ్‌లు హిందూ మతాన్ని సమర్థిస్తున్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ, జనతా దళ్లు షెడ్యూల్డ్ కులాలను సమర్థిస్తున్నాయి.
-1970 నుంచి దేశంలో కొంతవరకు రాజకీయాల్లో కుల ప్రభావం తగ్గినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. కుల ప్రాతిపదికన ప్రారంభమై పార్టీలు కొంతవరకు వారి పంథాను మార్చుకున్నాయి. తమిళనాడులోని డీఎంకే పార్టీ అన్ని కులాలకు న్యాయం చేస్తామని పేర్కొంది. బీజేపీ ఎస్సీకి చెందిన బంగారు లక్ష్మణ్‌ను అధ్యక్షుడిని, ఉమా భారతిని మధ్యప్రదేశ్‌కు సీఎంని చేశాయి.
-దేశంలో కొన్ని రాష్ర్టాల్లో కొన్ని కులాలు రాజకీయ ఆర్థిక బలాన్ని కలిగి ఉండటంతో అసమానతలకు దారితీస్తున్నాయి.
-తెలంగాణ – వెలమ, రెడ్డి
-ఆంధ్రప్రదేశ్ – కమ్మ, రెడ్డి
-బీహార్ – యాదవ్, భూమిహార్ బ్రాహ్మణులు, రాజ్‌పుత్‌లు
-ఉత్తరప్రదేశ్ – గుర్జార్సిన్, బ్రాహ్మణులు, దళితులు, యాదవులు
-పశ్చిమ బెంగాల్ – ముస్లింలు
-కర్ణాటక – ఒక్కలిగ, లింగాయత్, అహింద
-తమిళనాడు – థేవర్, వన్నియార్, కొంగువెల్లలార్
-పంజాబ్ – దళితులు, జాట్, సిక్కులు
-రాజస్థాన్ – జాట్, బిషోని, రాజ్‌పుత్, గుర్జర్, గుజ్జర్లు
-మహారాష్ట్ర – మరాఠీ, కుంబి
-దేశంలో వెనుకబడిన కులాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు మండల్ కమిషన్ సూచనల మేరకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. సమాజంలో ఆర్థిక ఫలాలు పెరడగం కాదు ఆ ఫలాలు అందరికీ వర్తించాలి.
ప్రతిభకు పరీక్ష
1. జంతువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి (Foot and Mouth Disease) ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో విజృంభిస్తోంది. ఈ వ్యాధికారక సూక్ష్మజీవి ఏది?
1) బ్యాక్టీరియా 2) ఫంగస్
3) ప్రొటోజొవా 4) వైరస్
2. మినమేటా కన్వెన్షన్ దేనికి సంబంధించినది?
1) కార్బన్ డై ఆక్సైడ్ పొల్యూషన్ 2) ఓజోన్ గ్యాస్
3) మెర్క్యూరీ పొల్యూషన్ 4) వాతావరణ మార్పులు
3. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు అత్యధికంగా ఉండటం ఏ వ్యాధి లక్షణం?
1) ఆర్థరైటిస్ 2) గౌట్ 3) రుమాటిజమ్ 4) రుమాటిజమ్ హర్ట్
4. డిజిటల్ కంప్యూటర్ ఏ దేశంలో అభివృద్ధి చెందింది?
1) రష్యా 2) బ్రిటన్ 3) అమెరికా 4) జపాన్
5. సైబర్ దాడుల నుంచి రక్షణ కోసం సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సంస్థ అభివృద్ధి చేసిన కొత్త సాఫ్ట్వేర్ పేరు?
1) అవరోధ్ (AVARODH) 2) నయన్ (NAYAN)
3) త్రికాల్ (TRIKAL) 4) పైవేవీకావు
6. రక్తంలో ఉండి శోషరసంలో లోపించింది ఏది?
1) ప్లాస్మా 2) ఎర్రరక్త కణాలు
3) తెల్లరక్త కణాలు 4) రక్తఫలకికలు
7. శక్తిని తీసుకుపోని తరంగాలు ఏవి?
1) అనుధైర్ఘ్య తరంగాలు 2) తిర్యక్ తరంగాలు
3) విద్యుదయస్కాంత తరంగాలు 4) స్థిర తరంగాలు
8. పర్యావరణ పరిరక్షణ బిల్లును భారత పార్లమెంటు ఏ సంవత్సరంలో ఆమోదించింది?
1) 1986 2) 1981
3) 1984 4) 1972
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు