సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1. అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి.
ఎ) చట్టపరంగా మైనారిటీ హోదాను మతపరంగా, భాషాపరంగా కల్పిస్తున్నారు
బి) కేంద్రం 1993లో 5 సముదాయాలను మైనారిటీలుగా గుర్తించింది. 2014లో జైనులను కూడా మైనారిటీలుగా గుర్తించారు
సి) భాషాపరమైన మైనారిటీలను రాష్ట్రస్థాయిలో గుర్తిస్తారు
డి) మతపరమైన మైనారిటీలను దేశవ్యాప్తంగా గుర్తిస్తారు
1) ఎ, బి 2) ఎ, బి, డి 3) బి 4) పైవన్నీ సరైనవే
2. మత వివక్షకు తావులేదని తెలిపే రాజ్యాంగ అధికరణను గుర్తించండి.
1) 29 2) 28 3) 15 4) 25
3. కింది వాటిని జతపర్చండి.
ఎ) 347 అధికరణ 1) రాష్ట్రాల్లో అల్పసంఖ్యా కుల భాషలకు ప్రత్యేక గుర్తిం పునివ్వాల్సిందిగా రాష్ట్రపతి రాష్ట్రాలను ఆదేశించవచ్చు
బి) 350 అధికరణ 2) అర్జీలు, ఫిర్యాదులు ఏ భాషలోనైనా పంపవచ్చు
సి) 350(ఎ) అధికరణ 3) మాతృభాషలో విద్యాబో ధన జరపాలని రాష్ట్రపతి ఆదే శాలు జారీ చేయవచ్చు
డి) 350(బి) అధికరణ 4) భాషాపరమైన మైనారి టీల కోసం రాష్ట్రపతి ప్రత్యేక అధికారిని నియమించాలి
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-4, సి-1, డి-3
4) ఎ-3, బి-1, సి-4, డి-2
4. నేషనల్ ఇంటిక్షిగేషన్ వారాన్ని గుర్తించండి.
1) జనవరి 1-7 2) ఫిబ్రవరి 12-18
3) నవంబర్ 11-17 4) నవంబర్ 19-25
5. ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్షికమంలో పొందుపర్చిన విషయం?
1) ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో ప్రాధాన్యత
2) కేడీఎస్లో సరైనవారు 3) రుణ సౌకర్యాలు
4) మత అల్లర్ల బాధితుల పునరావాసం
6. మైనారిటీ విద్యార్థులకు ఉద్దేశించిన సౌకర్యాల్లో సరైనది ఏది?
ఎ) 2007లో ప్రారంభించిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్‌కి 100 శాతం నిధులను కేంద్రమే అందిస్తుంది
బి) 2008లో ప్రారంభించిన ప్రి మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్నకు కేంద్రం 75 శాతం నిధులను సమకూరుస్తుంది
సి) మైనారిటీ పరిశోధక విద్యార్థులకు 2009 నుంచి మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ పథకం ద్వారా స్కాలర్షిప్లు అందిస్తున్నారు
డి) స్కీం ఆఫ్ సపోర్ట్ ఫర్ స్టూడెంట్స్ క్లియరింగ్ ప్రిలిమ్స్ అనే పథకాన్ని 2013లో ప్రారంభించారు
1) ఎ, డి 2) ఎ, సి
3) ఎ, బి, డి 4) పైవన్నీ సరైనవే
7. మైనారిటీల సంక్షేమం కోసం ఉద్దేశించిన సంస్థలు, అవి స్థాపించిన ఏడాదులను జతపర్చండి.
ఎ) ఎంఏఈఎఫ్ 1) 2014
బి) ఎన్ఎండీఎఫ్సీ 2) 1994
సి) ఎన్ఏడబ్లూడీసీవో 3) 1989
1) ఎ-3, బి-2, సి-1 2) ఎ-1, బి-2, సి-3
3) ఎ-2, బి-1, సి-3 4) ఎ-1, బి-3, సి-2
8. ఎవరి నివేదిక ఆధారంగా నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎన్ఎంఎఫ్డీఎఫ్సీ)ని స్థాపించారు?
1) సచార్ కమిటీ 2) అబ్దుల్లా నివేదిక
3) అంతూలే నివేదిక 4) గోపాల్‌సింగ్ నివేదిక
9. డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్‌వారి సహకారంతో ‘పీపీపీ’ పద్ధతిలో మైనారిటీల్లో డిజిటల్ లిటరసీని పెంపొందించడంకోసం ‘మైనారిటీ సైబర్గావ్’ పథకాన్ని 2014 ఫిబ్రవరిలో ఏ రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు?
1) జమ్ముకశ్మీర్ 2) ఉత్తరవూపదేశ్
3) తెలంగాణ 4) రాజస్థాన్
10. 2013లో ప్రారంభించిన ‘జియో పార్శీ’ పథకం ముఖ్య ఉద్దేశం?
1) పార్శీల్లో సమక్షిగతాభివృద్ధికి సంబంధించిన కార్యక్షికమం
2) పార్శీల్లో జనాభా తరుగుదలను అరికట్టడానికి ఉద్దేశించింది
3) పార్శీ విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఉద్దేశించింది
4) పరిశోధక పార్శీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు సంబంధించింది
11. మైనారిటీ సంక్షేమ పథకాలు, వాటి లక్ష్యాలను జతపర్చండి.
ఎ) సీకో ఔర్ కమావో 1) మైనారిటీల్లో
నైపుణ్యాభివృద్ధి
బి) హమారి దరోహార్ 2) భారతీయ సంస్కక్షుతి పరి రక్షణలో భాగంగా మైనారిటీ సముదాయాల సంస్కక్షుతిని పరిరక్షించడం
సి) మిషన్ 3) మైనారిటీల సంక్షేమ పథ
ఎంపవర్మెంట్ కాల అమలుతీరును పర్యవే క్షించడం
డి) పడో ప్రదేశ్ 4) సబ్సిడీతో కూడిన ఎడ్యు కేషన్ లోన్లు
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-2, బి-4, సి-1, డి-2
12. మైనారిటీలకు సంబంధించిన నలంద ప్రాజెక్టును ఏ యూనివర్సిటీలో ప్రారంభించారు?
1) జమ్ముకశ్మీర్ యూనివర్సిటీ
2) నలంద యూనివర్సిటీ
3) అలీఘడ్ యూనివర్సిటీ
4) త్రివేండ్రం యూనివర్సిటీ
13. మైనారిటీలు అధికంగా ఉన్న జిల్లాల్లో ప్రభుత్వ పథకాలు సక్రమంగా లబ్ధిదారులకు చేరేలా చేసేందుకు ఉద్దేశించిన ఐడెంటిఫికేషన్ ఆఫ్ మైనారిటీ కాన్సన్వూటేషన్ డిస్ట్రిక్ట్ అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) 1978 2) 1987 3) 1998 4) 1989
14. ఎన్జీవోలు, సివిల్ సొసైటీల భాగస్వామ్యంతో అమలుపర్చేందుకు 2012లో ప్రారంభించిన స్కీం ఆఫ్ లీడర్షిప్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీ ఉమెన్ అనే పథకాన్ని సూక్ష్మంగా ఏమని సంబోధిస్తారు?
1) వాహిని 2) రోషిణి
3) నయా రోషిణి 4) నయా హాసిని
15. ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ఉస్తాద్ పథకం ముఖ్య ఉద్దేశం?
1) హజ్ యాత్రకు సహకారం అందించడం
2) చిన్నతరహా పరిక్షిశమలకు ప్రోత్సాహం అందివ్వడం
3) వృత్తి నైపుణ్యాలను అభివృద్ధిపర్చడం
4) హస్తకళా నైపుణ్యాలను వెలికితీయడం
16. నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎన్ఎండీఎఫ్సీ) అనేది ఒక?
1) చట్టబద్ద సంస్థ 2) కార్యనిర్వహణ సంస్థ
3) సహకార సంస్థ 4) లాభాపేక్షలేని సంస్థ
17. ప్రపంచంలో అత్యధికంగా వక్ఫ్ ఆస్తులను కలిగి ఉన్న దేశం?
1) సౌదీ అరేబియా 2) పాకిస్థాన్
3) యూఏఈ 4) భారత్
18. మౌలానా ఆజాద్ సేహత్ కార్డుకు ఎన్నేండ్లలోపువారు అర్హులు?
1) 5-14 2) 10-15
3) 5-15 4) 18 పైబడినవారందరూ
19. రాష్ట్రంలో మైనారిటీల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన స్థితిగతులను అధ్యయనం చేసేందుకు 2015లో నియమించిన కమిటీ?
1) అంతూలే కమిటీ 2) నజ్మా కమిటీ
3) సుధీర్ కమిటీ 4) నసీం అహ్మద్ కమిటీ
20. మైనారిటీ హక్కులపై యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్‌ను ఎప్పడు ప్రకటించారు?
1) 1992, అక్టోబర్ 18 2) 1992, డిసెంబర్ 19 3) 1992, అక్టోబర్ 21 4) 1992, డిసెంబర్ 21
21. రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజున అబుల్ కలాం జయంతిని మైనారిటీ సంక్షేమ దినంగా ప్రకటించింది?
1) అక్టోబర్ 18 2) మార్చి 24
3) నవంబర్ 11 4) డిసెంబర్ 30
22. రాష్ట్రంలో ఉన్న మైనారిటీల శాతం?
1) 12.69 శాతం 2) 19.29 శాతం
3) 14.2 శాతం 4) 16.3 శాతం
23. 2006 నుంచి ప్రత్యేక మంత్రిత్వ శాఖగా ఏర్పడిన మైనారిటీ సంక్షేమ మంత్రిత్వశాఖకు మంత్రిగా నజ్మాహెప్తుల్లా వ్యవహరిస్తున్నారు. అయితే మొదటిసారి మంత్రిగా పనిచేసిందెవరు?
1) అంతూలే 2) గులాంనబీ ఆజాద్
3) నసీం అహ్మద్ 4) రషీద్ అల్వీ
24. 1957లో న్యూఢిల్లీలో మైనారిటీ భాషల సంక్షేమ కార్యాలయాన్ని ఎవరి సూచనతో ఏర్పాటు చేశారు?
1) అబ్దుల్ రహమాన్ 2) మౌలానా ఆజాద్
3) ఫజల్ అలీ 4) అనంత శయనం అయ్యంగార్
25. మైనార్టీల సంక్షేమం కోసం ఉద్దేశించిన సామాజిక శాసనాలు, వాటిని రూపొందించిన సంవత్సరాలను జతపర్చండి.
ఎ. The Dargah khwaja saheb Act 1. 1955
బి. National commission for Minorties Act 2. 1992
సి. National commission for Minortiy educational institution act. 3. 2004
డి. Arended waqf Act. 4. 2013
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-2, బి-4, సి-3, డి-1
26. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ (ఎన్సీఎంఈఐ)ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 2001 2) 2002 3) 2003 4) 2004
27. ఎన్సీఎంఈఐ అనేది ఒక?
1) Excutive body 2) Constitutional body 3) Statutary body 4) Non-Profit body
28. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ చైర్మన్ ఎవరు?
1) నసీం అహ్మద్ 2) నజ్మాహెప్తుల్లా
3) సచార్ 4) సుల్తానియా
29. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1954 2) 1995 3) 1964 4) 1974
30. నేషనల్ కమిషనర్ ఫర్ లిగ్వింస్టిక్ మైనారిటీస్ (NCLM)ను ఎప్పుడు ఏర్పాటుచేశారు?
1) 1956 2) 1957 3) 1958 4) 1959
31. NCLMకు సంబంధించి సరికాని వ్యాఖ్య?
1. రాజ్యాంగబద్ధ సంస్థ
2. అలహాబాద్‌లో ప్రధాన కేంద్రం ఉంది
3. SRC సూచనల మేరకు ఏర్పాటుచేశారు
4. శాసనబద్ధ సంస్థ
1) 2, 4 2) 4 3) 1, 2 4) 1, 2, 4
32. ప్రస్తుత ఎన్సీఎల్ కమిషనర్?
1) నసీం అహ్మద్ 2) అబ్దుల్వసీం
3) అక్తరుల్వాసీ 4) స్టీఫెన్రూల్
33. ఎస్ఆర్సీ సూచనల మేరకు 17వ విభాగంలో 17వ రాజ్యాంగ సవరణ ద్వారా 350-బిని చేర్చి తద్వారా ఏర్పాటుచేసిన సంస్థ?
1) ఎన్సీఎల్ఎం 2) ఎన్సీఎం
3) ఎన్సీఈఎం 4) సీడబ్లూసీ
34. నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్ (ఎన్సీఎం)ను ఎప్పుడు ఏర్పాటుచేశారు?
1) 1987 2) 1978 3) 1993 4) 2003
35. చట్టబద్ధమైన సంస్థగా నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ (ఎన్సీఎం) ఎప్పుడు ఏర్పడింది?
1) 1978 2) 1992 3) 1993 4) 1996
36. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్‌కు సంబంధించి సరైనదాన్ని గుర్తించండి.
ఎ. మొదటగా కార్యనిర్వాహక సంస్థగా ఏర్పరిచి తరువాత చట్టబద్ధ సంస్థగా మార్చారు
బి. ఎన్సీఎం మొదటి చైర్మన్ సర్దార్ అలీఖాన్, ప్రస్తుత చైర్మన్ నసీం అహ్మద్
సి. ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, ఐదుగురు సభ్యులతో ఏర్పడుతుంది
డి. సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) పైవన్నీ సరైనవే
RELATED ARTICLES
-
Geography | అత్యధిక వేలా పరిమితి ఎక్కడ నమోదవుతుంది?
-
Telangana History | తూముల యుద్ధం ఏయే రాజుల మధ్య జరిగింది?
-
INDIAN POLITY | ప్రకరణల ప్రకారం.. పరిపాలన విధానం
-
General Science | ఒక పార్సెక్ ఎన్ని కాంతి సంవత్సరాలకు సమానం?
-
Disaster Management | మనకు మాత్రమే కాదు.. భావి తరాలకు సొంతమే
-
Mathematics Group IV Special | 9,81,729; 8,64,512 అయితే 7,49,..?
Latest Updates
TSPSC Group-1 Prelims Practice Test | తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్ గ్రంథ కర్త?
SBI Recruitment | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ పోస్టులు
ITBP Recruitment | ఐటీబీపీలో 81 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
WCDSC Kamareddy Recruitment | కామారెడ్డి జిల్లా సంక్షేమ కార్యాలయంలో ఉద్యోగాలు
WCDSC Jayashankar Bhupalpally | జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంక్షేమ కార్యాలయంలో ఉద్యోగాలు
Current Affairs | ప్రపంచంలో ‘హంగర్ హాట్‌స్పాట్స్’ ఎన్ని ఉన్నాయి?
South Central Railway Recruitment | సౌత్ సెంట్రల్ రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు
NIT Faculty Recruitment | మేఘాలయా నిట్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
TSPSC Group-1 Prelims Practice Test | ‘తెలంగాణ భాషా దినోత్సవం’ ఎప్పుడు జరుపుకొంటారు?
TSPSC Group-1 Prelims Practice Test | ఏడుపు పుట్టించే వాయువు ఏది?