శాతవాహనుల నాణేలు మొదట ఏ ప్రాంతంలో లభించాయి?
1. మహామాత్రులు అనే పరిపాలనాధికారి విధులేవి?
1) ప్రజల నుంచి శిస్తును వసూలు చేయటం
2) బౌద్ధ భిక్షుల బాధ్యతలను చూడటం
3) భండాగారాన్ని కాపాడటం
4) రాజుకు సలహాలు ఇవ్వటం
2. శాతవాహన యుగంలో ఎన్ని రకాల వృత్తులు ఉండేవి?
1) 12 2) 14 3) 16 4) 18
3. శాతవాహనుల కాలంలో నేతకారులను ఏమని పిలిచేవారు?
1) మాలాకారులు 2) తెసకారులు
3) సువణకారులు 4) కోలికులు
4. గుల్మిక అనే అధికారులు ఏ బాధ్యతలను నిర్వర్తించేవారు
1) గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతలు
2) పట్టణ ప్రాంతాల్లో శాంతిభద్రతలు
3) శిస్తు వసూలు చేయడం
4) కోశాగార పరిరక్షణ
5. గౌతమీపుత్ర శాతకర్ణి తన తల్లి గౌతమీ బాలశ్రీ గౌరవార్థం బౌద్ధ భిక్షువులకు దానమిచ్చిన గ్రామం?
1) త్రిరత్న 2) త్రిరశ్మి
3) తామ్రపర్ణి 4) పల్లవబొగ్గ
6. తెలంగాణలో శాతవాహనుల కాలంనాటి అతి ప్రాచీన బౌద్ధస్థూపాలు ఎక్కడ బయట పడ్డాయి?
1) ధూళికట్ట 2) ఫణిగిరి
3) పాశాయిగాం 4) పైవన్నీ
7. డి.సి సర్కార్ అభిప్రాయంలో కన్నడ, తెలుగు భాషలకు మూలమైన భాష ఏది?
1) దేశి 2) ప్రాకృతం
3) సంస్కృతం 4) బ్రహ్మిలిపి
8. తెలంగాణలోని ఏ ప్రాంతంలో నిర్వహించిన తవ్వకాల్లో శాతవాహనుల కాలంనాటి కోటలు, బురుజులు, సింహద్వారాలు బయట పడ్డాయి?
1) ఫణిగిరి 2) ధూళికట్ట
3) కొండాపూర్ 4) కోటిలింగాల
9. తెలంగాణలో ఎక్కడ ఇటుక కోటలు, ఇటుక తోకట్టిన 22 చేద బావులు, మట్టిగాజులతో నిర్మించిన బావి, ఇనుప గొడ్డళ్లు, మేకులు కత్తులు, బరిసెలు, కొడవళ్ళు, పూసలు, టెరకోట ముద్రికలు దొరికాయి?
1) పెద్దబంకూరు 2) కొండాపూర్
3) కోటిలింగాల 4) ఫణిగిరి
10. ఏనుగు దంతంతో చేసిన దువ్వెన ఏ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో లభించింది?
1) కొండాపూర్ 2) ధూళికట్ట
3) కోటిలింగాల 4) ఫణిగిరి
11. శాతవాహనుల కాలంనాటి సాంఘిక పరిస్థితు లను, గ్రామీణ ప్రజల శృంగార జీవితాన్ని విశదీకరిస్తూ మధుర భక్తికి ప్రతీకగా భావించే రాధను గురించి తొలిసారిగా ప్రస్తావించిన గ్రంథం ఏది?
1) కథాసరిత్సాగరం 2) గాథాసప్తశతి
3) లీలావతి పరిణయం 4) బృహత్కథ
12. శాతవాహనుల కాలం నాటి విదేశీ రచనలు ఏవి?
1) పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ
2) మెగస్తనీస్ ఇండికా
3) ్యయాన్త్సాంగ్ రచనలు
4) పైవన్నీ
13. తెలంగాణ చరిత్రకు, శాతవాహనుల చరిత్రకు ఎక్కువ ప్రామాణికమైన పురాణం ఏది?
1) బ్రహ్మ పురాణం 2) విష్ణు పురాణం
3) మత్స్యపురాణం 4) భాగవత పురాణం
14. శాతవాహనుల నాణేలు మొదట ఏ ప్రాంతం లో లభించాయి?
1) కోటిలింగాల 2) ధూళికట్ట
3) పెద్దబంకూరు 4) కొండాపూర్
15. శాతవాహనులు నిగమాలుగా పిలిచే నాటి తెలంగాణ నగరాలేవి?
1) కోటిలింగాల, ధూళికట్ట, ఏలేశ్వరం, కొండాపూర్
2) ఫణిగిరి, పెద్దబంకూరు
3) విజయపురి, గోవర్థన, సోపార
4) పైవేవీ కాదు
16. కోటి లింగాల కొండాపూర్లలో లభించిన శ్రీముఖుడి నాణేల ఆధారంగా శాతవాహ నులు జన్మస్థలం కోటిలింగాలని పేర్కొన్నది?
1) జి. రాంబాబు
2) మల్లంపల్లె సోమశేఖర వర్మ
3) శ్రీరామ శర్మ
4) పి.వి. పరబ్రహ్మశాస్త్రి
17. క్రీ.పూ.271లో బిందుసారుడు మరణించగా, అశోకుడికి తన సోదరులతో వారసత్వ పోరాటం జరుగుతున్న సమయంలో, సిము కుడు దీన్ని అవకాశంగా తీసుకొని స్వతం త్రించాడని అభిప్రాయపడ్డవారు?
1) గుర్తి వెంకటరావు
2) కె. గోపాలచారి
3) మారేమండ రామారావు
4) పార్గిటర్ పండితుడు
18. శాతవాహనుల్లోశాసనాన్ని వేయించిన మొదటి రాజు ఎవరు?
1) మొదటి శాతకర్ణి 2) రెండో శాతకర్ణి
3) హాలుడు 4) కృష్ణుడు
19. పశ్చిమ క్షాత్రపరాజు నహపాణునికి సంబం ధించిన నాణేలు గౌతమీపుత్ర శాతకర్ణి పునర్ ముద్రించినవి 9,270 నాణేలు ఒక రాశిగా ఎక్కడ లభ్యమయ్యాయి?
1) జోగల్ తంబి 2) నాసిక్
3) ఫణిగిరి 4) కొండాపూర్
20. శాతవాహనుల పాలనా విధానం గురించి తెలిపే శాసనాలు ఏవి?
1) నాసిక్, కార్లే గుహ 2) మ్యాకదోని
3) నానాఘాట్ 4) పైవేవీకావు
21. ఇక్ష్వాకుల కాలంలో ఉన్నత కుటుంబాలకు చెందిన స్త్రీలు స్వతంత్రంగా దానాలు చేయడాన్ని పేర్కొన్న శాసనాలు?
1) కొంబపూర్
2) అమరావతి, నాగార్జున కొండ
3) భట్టిప్రోలు 4) ఫణిగిరి
22. కిందివారిలో ఆచార్య నాగార్జునుడి శిష్యులు ఎవరు?
1) ఆర్యదేవుడు 2) ధర్మనంది
3) ఆనందుడు 4) పై వారందరూ
23. శ్రీలంక భాషలో ఉన్న అట్ట కథలను పాళీభాషలో రాయాలనే సంకల్పంతో శ్రీలంకకు వెళ్లి, అమరాధపురం విహారంలో నివసిస్తూ అక్కడి థేరవాదుల (హీనయా నులు) కోసం విశుద్ధమొగ్గ అనే గ్రంథాన్ని రాసినవారు?
ఎ) సిద్ధ నాగార్జునుడు బి) భావవివేకుడు
సి) బుద్ధఘోషుడు డి) ధర్మకీర్తి
24. ధాన్యకటకం, శ్రీ పర్వతంపై నివాసం ఉన్న సిద్ధ నాగార్జునుడు బౌద్ధంలో తాంత్రిక వాదమైన వజ్రాయాన మతస్థుడు. ఇతడు తెలుగువాడని తెలియజెప్పిన శాసనం ఏది?
1) నాగార్జున కొండ 2) ఫణిగిరి
3) రామిరెడ్డి పల్లి 4) నేలకొండపల్లి
25. బౌద్ధమతంలో వజ్రయాన కేంద్రాలుగా ఏ ప్రాంతాలుండేవి?
1) ధాన్యకటకం 2) శంఖవరం
3) రామతీర్థం, శాలిండం
4) పైవన్నీ
26. ఇక్ష్వాకుల కాలంలో ప్రధాన జైనమత కేంద్రాలేవి?
1) పిఠాపురం, నేదునూరు
2) తాటిపాక, ఆర్యవటం
3) ద్రాక్షారామం, పెనుగొండ
4) పైవన్నీ
27. క్రీ.శ. మూడో శతాబ్దానికి చెందిన ఆరుగురి తీర్థంకరుల విగ్రహాలు ఎక్కడ దొరికాయి?
1) పెనుగొండ 2) తాటిపాక
3) ఆర్యవటం 4) నేదునూరు
28. ధాన్యకటకం, నాగార్జున కొండల్లో ప్రసిద్ధి గాంచిన విశ్వవిద్యాలయాలు వర్థిల్లాయని, ఇక్కడికి విద్యార్జన కోసం శ్రీలంక టిబెట్ నేపాల్ నుండే గాక మనదేశంలోని అన్ని ప్రాంతాల నుంచే బౌద్ధ భిక్షువులు వచ్చే వారని క్రీ.శ. 8వ శతాబ్దానికి చెందిన ఉద్యోతనుడు ఏ గ్రంథంలో పేర్కొన్నాడు?
1) కువలయమాల 2) చిత్తశుద్ధి ప్రకరణ
3) విశుద్ధమొగ్గ 4) ప్రజ్ఞాప్రదీప
29. క్రీ.శ.3వ శతాబ్దంలో నిర్మించిన బౌద్ధ స్థూపాలు, విహారాలు తెలంగాణలో ఏ ప్రాంతంలో బయటపడ్డాయి?
1) నేలకొండపల్లి (ఖమ్మం)
2) గాజులబండ (నల్లగొండ)
3) నందికొండ, తుమ్మల గూడెం (నల్లగొండ)
4) పైవన్నీ
30. నాగార్జున కొండలో కిందివాటిలో ఏకం స్థూపాలు బయట పడ్డాయి?
1) బుద్ధుడు లేదా ప్రముఖ బౌద్ధ భిక్షువు శరీర అవశేషాలైన ఎముకలు దంతాలు, వెంట్రుకలు, గోళ్లు మొదలైన వాటిపై నిర్మించే స్థూపాలు
2) బౌద్ధ భిక్షువులు వాడిన భిక్షా పాత్రలు. వస్తువులు మొదలైన వాటిపై నిర్మించే స్థూపాలు
3)అస్తికలు, వస్తువులు ఏవీ లేకుండా బుద్ధునిదో ఆయన శిష్యులదో స్మృతి చిహ్నంగా కట్టిన స్థూపాలు 4) పైవన్నీ
31. తెలంగాణలోని ఏ జిల్లాలను వాకాటకుల్లోని వత్సగుల్మశాఖ రాజులు పాలించారు?
1) ఆదిలాబాద్ 2) నిజామాబాద్
3) కరీంనగర్ 4) పైవన్నీ
32. ఏ చాళుక్య రాజుకు సోలదగండ అనే బిరుదు ఉంది?
1) వినయాదిత్యుడు 2) మొదటి అరికేసరి
3) బద్దెగుడు 4) రెండోనరసిండు
33. తూర్పు చాళుక్యరాజు గుణగ విజయాదిత్యుడ్ని ఓడించిన వేములవాడ చాళుక్య రాజు ఎవరు?
1) మొదటి అరికేసరి
2) రెండో నరసిండు
3) రెండో అరికేసరి 4) బద్దెగుడు
34. బద్దెగను ఓడించిన ముదిగొండ చాళుక్య వంశానికి చెందిన రాజు ఎవరు?
1) కుసుమాయుధుడు 2) గుణగ
3) రెండో విజయాదిత్యుడు
4) బేతరాజు
35. కన్నడ సాహిత్యంలో పంపకవి రచించిన గొప్ప గ్రంథం విక్రమార్జున విజయం ఎవరి పోషణలో రచించాడు?
1) రెండో అరికేసరి
2) రెండో బద్దెగుడు 3) వేగరాజు
4) రెండో నరసిండు
36. రెండో అరికేసరికి సంబంధించిన ఏ శాసనం లో విజయాదిత్య యుద్ధమల్లు నుంచి రెండో అరికేసరి వరకు గల వేములవాడ చాళుక్యుల వంశవృక్షం ఉంది?
1) బద్దెగ శాసనం
2) కరీంనగర్ శాసనం
3) పర్బణి శాసనం
4) వేములవాడ శాసనం
37. ఎవరి కాలంలో బొమ్మలగుట్ట గొప్ప జైన కేంద్రంగా వర్దిల్లింది?
1) రెండో అరికేసరి 2) రెండో బద్దెగుడు
3) వేగరాజు 4) రెండో నరసిండు
38. మూడో అరికేసరి తన తండ్రి రెండో బద్దెగుడు సోమదేవసూరి కోసం నిర్మించిన శుభదామ జినాలయానికి రేపాక గ్రామాన్ని దానం చేశాడు. ఈ గ్రామం ప్రస్తుతం ఎక్కడ ఉంది?
1) జగిత్యాల జిల్లా 2) సిరిసిల్ల జిల్లా
3) కరీంనగర్ జిల్లా
4) నిజామాబాద్ జిల్లా
39. వేములవాడ చాళుక్యులు నిర్మించిన ఏ ఆల యాలు ఈ నాటికీ ప్రసిద్ధిగాంచినవి?
ఎ) రాజరాజేశ్వరి ఆలయం
బి) భీమేశ్వరాలయం
సి) కీసర
1) ఎ, సి 2) బి, సి
3) ఎ,బి 4) ఎ, బి, సి
40. గుణగ విజయాదిత్యుడు పల్లవులు, పాండ్యు లపై విజయాలు సాధించినట్లు తెలియ జేస్తున్న శాసనం?
1) సాతలూరు శాసనం
2) అత్తిలి శాసనం
3) ధర్మవరం శాసనం
4) పాడేరు శాసనం
41. జినవల్లభుని కుర్క్యాల శాసనం, కరీంనగర్ మ్యూజియంలోని శిలాశాసనాలు వేముల వాడ చాళుక్యుల వంశవృక్షాన్ని తెలియజేస్తే వారి చరిత్ర నిర్మాణానికి ఉపకరించే శాసనాలు ఏవి?
ఎ) కొల్లిపర తామ్రశాసనం
బి) పర్బణి తామ్రశాసనం
సి) వేములవాడ శిలాశాసనం
1) ఎ,బి 2) ఎ, సి
బి) బి,సి డి) ఎ,బి,సి
42. స్వతంత్ర రాష్ట్రకూట రాజ్య స్థాపకుడు?
1) దంతి దుర్గుడు
2) మొదటి కృష్ణుడు
3) రెండో గోవిందుడు
4) ధృవరాజు
43. దంతిదుర్గుడి యుద్ధ విజయాలను గురించి వివరించే శాసనాలు ఏవి?
ఎ) సాయంగఢ్ శాసనం
2) ఎల్లోరాలోని దశావతార గుహాలయ శాసనం
3) ఎ, బి డి 4) పైవేవీకావు
44. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జైన క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి?
ఎ) వేములవాడ బి) కొలనుపాక
సి) బోధన్ డి) పొట్లచెరువు
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
45. వేములవాడ చాళుక్యరాజైన 2వ అరికేసరి ఆస్థానాన్ని అలరించిన కవులు ఎవరు?
ఎ) పద్మకవి బి) మల్లియ రేచన
సి) పంపకవి డి) పైవారందరూ
46. సోమదేవసూరి రచనలు ఏవి?
1) యుక్తి చింతామణి
2) నీతివాక్యామృత
3) యశస్తిలకం 4) పైవన్నీ
47. తూర్పు చాళుక్యులు -రాష్ట్రకూటులు మధ్య జరిగిన యుద్ధాల్లో ముఖ్యభూమిక పోషిం చిన కుసుమాయుధుడు గురించి తెలియజేసే శాసనం ఏది?
ఎ) కొరవి శాసనం
బి) కుర్క్యాల శాసనం
సి) పర్భణి శాసనం
డి) కరీంనగర్ శాసనం
48. పంపకవి తమ్ముడైన జినవల్లభుడు తన కుల దేవత చక్రేశ్వరీ విగ్రహాన్ని ప్రతిష్టించాడు. ఆ తర్వాతి కాలంలో ఇది చక్రేశ్వరీ తీర్థం పేరుతో గొప్ప జైన క్షేత్రంగా వర్థిల్లింది?
1) పర్బణి 2) కుర్క్యాల
3) బోధన్ 4) వేములవాడ
49. తెలంగాణలో బౌద్ధం కంటే ముందే జైనం ప్రవేశించిందని తెలిపిన జైన ఇతిహాస గ్రంథమేది?
1) పట్టావళి
2) ధర్మామృత గ్రంథం
3) బృహత్కథా కోశం 4) పైవేవీకాదు
50. తెలంగాణలోని జైన దేవాలయాలు, బసదులు గురించిన వివరాలు తెలిపే గ్రంథం?
1) ధర్మామృత గ్రంథం
2) పట్టావళి
3) ఆవశ్యక సూత్రం
4) బృహత్కథా కోశం
51. నాగార్జున కొండలో ఉన్న పారావత మహా చైత్యాన్ని పునర్నిర్మించినది, ఘంటశాలలో రాతి మండపాన్ని నిర్మించినది ఎవరు?
1) ఉపాసిక బోధిశ్రీ 2) శాంతిశ్రీ
3) కొండ బలిశ్రీ 4) భట్టిమహాదేవి
52. వీరపురుషదత్తుడి కాలంలో బౌద్ధమత వ్యాప్తికి విశేష కృషి చేసిన బౌద్ధసన్యాసిని ఎవరు?
1) ఉపాసిక బోధిశ్రీ
2) భట్టిమహాదేవి
3) కొండబలిశ్రీ 4) మాధురీదేవి
జవాబులు
1-2 2-4 3-4 4-1 5-2 6-4 7-1 8-4 9-1 10-2 11-2 12-4 13-3 14-1 15-1 16-4 17-1 18-4 19-1 20-1
21-2 22-4 23-3 24-3 25-4 26-4 27-3 28-1 29-4 30-4 31-4 32-3 33-4 34-1 35-1 36-4
37-2 38-2 39-3 40-1 41- 1 42-1 43-3 44-4 45-4 46-4 47-1 48-2 49- 1 50-1 51- 2 52-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు