ఆకృతినిచ్చే డెంటిన్.. దృఢమైన ఎనామిల్ ( పోటీ పరీక్షల ప్రత్యేకం)
competitive exams, tspsc, groups
అందులో ముఖ్యమైనవి దంతాలు. మానవుడి దంతాలు ఆహారం నమలడానికి, ముఖం ఆకృతికి దోహదపడతాయి. ఇవి నోటిలోని ఆస్యకుహరంలో ప్రత్యేకమైన స్థానాల్లో అమరి ఉంటాయి. ఆహారం నమలడంలో ఒక్కో దంతం ఒక్కొక్క విధంగా ఉపయోగపడుతుంది. మానవ దంత నిర్మాణం, దంతాల రకాలు, వాటి విధుల గురించి తెలుసుకుందాం..
దంతాలు
మానవుడిలో రెండు దవడలపైన థీకోడాంట్, విషమ దంతి రకపు దంతాలు ఉంటాయి. మానవుడిలో 4 రకాల దంతాలు ఉంటాయి. అవి కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు. కుందేలులో రదనికలు లోపించి ఉంటాయి. కుందేలు శాకాహారి కాబట్టి చీల్చడానికి ఉపయోగపడే రదనికలు లోపించి ఉంటాయి. రదనికలు లోపించడం వల్ల కుంతకాలకు, అగ్రచర్వణకాలకు మధ్య ఖాళీ ఏర్పడుతుంది. దీన్ని డయాస్టీమా అంటారు. కుందేలులో 28 దంతాలుంటాయి. కుంతకాలు ఆహారాన్ని కొరకడానికి.. అగ్రచర్వణకాలు, చర్వణకాలు ఆహారాన్ని నమలడానికి తోడ్పడతాయి.
దంత నిర్మాణం
క్షీరద దంతాల్లో 3 భాగాలుంటాయి. అవి కిరీటం (బయటకు కనిపించే దంత భాగం), గ్రీవం (చిగుళ్లలో ఆవరించిన భాగం), మూలం (దవడ ఎముక గుంతలో ఇమిడి ఉంటుంది). దంతంలో అధిక భాగం డెంటిన్ అనే దృఢమైన పదార్థంతో ఏర్పడుతుంది. దంతం లోపల పల్ప్ కుహరం ఉంటుంది. డెంటిన్లోకి అనేక సూక్ష్మకుల్యలు వ్యాపించి ఉంటాయి. కిరీట భాగంలో డెంటిన్‌ను ఆవరించి తళతళా మెరిసే దృఢమైన తెల్లని పింగాణి (ఎనామిల్) పదార్థపు పొర ఉంటుంది. ఇది దేహంలో అత్యంత కఠిన పదార్థం.
నాలుక
ఆస్యకుహరానికి ఉదరతలంలో ఉండే కండరయుతమైన బల్లపరుపు నిర్మాణం. నాలుక పైభాగంలో రుచి గుళికలతో కూడిన నాలుగు రకాల సూక్ష్మంకురాలు ఉంటాయి. అవి 1. ఫంజీఫారమ్ సూక్ష్మంకురాలు 2. తంతురూప సూకా్ష్మాంకురాలు 3. సర్కంవెల్లేట్ సూక్ష్మంకురాలు 4. ఫోలియేట్ సూక్ష్మంకురాలు
మానవుడి దంత సూచిక
కు=కుంతకాలు కు 2/1
ర=రదనికలు ర 1/1
అచ= అగ్రచర్వణకాలు అచ 2/2
చ= చర్వణకాలు చ 3/3
2123/2123 x2= 32
వివిధ జీవుల దంత విన్యాసం
1. కుందేలు 2033/1023×2= 28
2. కుక్క 3143/3142×2= 42
3.ఎలుక 1003/1003×2= 16
4. పిల్లి 3131/3121×2= 30
5. కంగారూ 3124/2024×2= 34
6. గురం, పంది 3143/3143×2= 44
7. అపోసం 5134/4134×2= 50
రక్త స్కందనం
# శరీరానికి గాయం అయినప్పుడు రక్తం కొద్దిసేపు కారుతుంది. ఆ తర్వాత రక్తస్రావం నిలిచిపోయి ఎరని గడ్డలా ఏర్పడుతుంది. ఈ విధంగా గడ్డలా ఏర్పడటాన్నే రక్తస్కందనం అంటారు.
# రక్తం గడ్డకట్టడానికి సాధారణంగా 3 నుంచి 6 నిమిషాల సమయం పడుతుంది.
#రక్త స్కందనంలో రక్తఫలకికలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
# గాయమైన చోటు నుంచి రక్తం స్రవించిప్పుడు రక్తఫలకికలు త్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్‌ను స్రవిస్తాయి.
#ఈ త్రాంబోకైనేజ్ రక్తంలో ఉన్న ప్రోతాంబిన్ను త్రాంబిన్‌గా మారుస్తుంది.
# త్రాంబిన్ రక్తంలోని ద్రవరూపంలో ఉన్న ఫైబ్రినోజన్ను ఘనరూపంలో ఉండే ఫైబ్రిన్ తంతువులుగా మారుస్తుంది.
# ఈ తంతువుల్లో రక్తకణాలు చిక్కుకుని స్కందనం ఏర్పడుతుంది.
#ఫైబ్రిన్ దారాలు దెబ్బతిన్న రక్తనాళపు లంబికలకు అతుక్కొని సంకోచించడం వల్ల వాటి అంచుల దగ్గరకు లాగబడతాయి.
# రక్తం గడ్డకట్టిన తర్వాత మిగిలిన గడ్డి పసుపు రంగు ద్రవాన్ని సీరం అంటారు.
పోత్రాంబిన్ త్రాంబోకైనేజ్ త్రాంబిన్
—————-
ఫైబ్రినోజన్ త్రాంబిన్ ఫైబ్రిన్
————–
# రక్తస్కందనంలో విటమిన్- కె ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కె-విటమిన్ లోపం వల్ల రక్తం గడ్డకట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది.
# జన్యులోపం వల్ల కూడా కొందరిలో రక్త స్కందనం జరగదు. ఈ లోపాన్ని హీమోఫీలియా అంటారు.
# ప్రపంచ హీమోఫీలియా దినోత్సవాన్ని ఏటా ఏప్రిల్ 17న జరుపుకొంటారు.
# తలసేమియా అనే వంశపారంపర్య వ్యాధి వల్ల రక్తంలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది.
# రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా నిరోధించే కారకం హెపారిన్.
# రక్తం గడ్డకట్టకుండా నివారించడానికి బ్లడ్ బ్యాంకుల్లో ఉపయోగించే రసాయనాలు సోడియం సిట్రేట్, సోడియం ఆక్సలేట్.
# రక్తం నీలిరంగులో ఉండటానికి కారణమైన వర్ణకం హీమోసయనిన్. ఇది నత్త, పీతల రక్తంలో ఉంటుంది.
# బొద్దింక రక్తంలో హీమోగ్లోబిన్ లోపించడం వల్ల రక్తం వర్ణరహితంగా ఉంటుంది.
ప్రాక్టీస్ బిట్స్
1. లాక్‌జా (Lock jaw) అని ఏ వ్యాధిని పిలుస్తారు?
1) న్యుమోనియా 2) ధనుర్వాతం
3) ప్లేగు 4) గనేరియా
2. లైంగిక సంబంధాల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి?
1) గనేరియా 2) న్యుమోనియా
3) ప్లేగు 4) కలరా
3. ఆడ ఎనాఫిలిస్ దోమల ద్వారా ఏ వ్యాధి వ్యాప్తి చెందుతుంది?
1) డెంగీ జ్వరం 2) మలేరియా
3) చికున్ గున్యా 4) మెదడు వాపు
4. అమీబియాసిస్ ఏ సూక్ష్మజీవి వల్ల కలుగుతుంది?
1) ప్లాస్మోడియం
2) క్లాస్ట్రేడియం
3) ఎంటమీబా హిస్టాలిటికా
4) ట్రిపనోసోమా పల్లిడమ్
5. సీసీ (Tsetse) ఈగ ద్వారా ఏ వ్యాధి వ్యాప్తి చెందుతుంది?
1) అమీబియాసిస్ 2) మలేరియా
3) కలరా 4) ట్రిపనోసోమియాసిస్
6. ఓరియంటల్ సోర్స్ (ఢిల్లీ బోయిల్) వ్యాధి ఏ క్రిమి వల్ల కలుగుతుంది?
1) లీష్మానియా డోనోవాని
2) లీష్మానియా ట్రోపికా
3) ట్రైకోమోనాస్ విజినాలిస్
4) ఎంటమీబా హిస్టాలిటికా
7. గ్రాండ్ ఓల్డ్‌మాన్ ఆఫ్ ఇంటెస్టెన్ అని ఏ వ్యాధిని పిలుస్తారు?
1) జియార్డియాసిస్ 2) విజినైటిస్
3) బ్లాక్ సిక్నెస్ 4) టీనియాసిస్
8. కొంకి పురుగు ద్వారా ఏ వ్యాధి వ్యాప్తి చెందుతుంది?
1) ఆస్కారియాసిస్
2) ఎంకైలోస్టోమియాసిస్ (క్ వామ్ డిసీజ్)
3) ఎంటిరోబియాసిస్ (పిన్ వామ్ డిసీజ్)
4) ఫైలేరియాసిస్
9. ఎలిఫెంటియాసిస్ (బోదకాలు) ఏ క్రిమి వల్ల వస్తుంది?
1) ఎంటిరోబియస్ వర్మికులారిస్
2) ఉకరేరియా బాంక్రాప్టి
3) ఎంకైలోస్టోమా డ్యుయేడినేల్
4) ఎంటమీబా హిస్టాలిటికా
10. ట్రైకోఫైటాన్ శిలీంధ్రం ద్వారా ఏ వ్యాధి సంక్రమిస్తుంది?
1) మధుర ఫుట్ 2) దోబిఇట్స్
3) అథ్లెట్స్ ఫుట్ 4) తామర
11. చంద్రయాన్-2 ఆన్‌బోర్డ్‌లోని ఏ పరికరం చంద్రుడి ఉపరితలంలోని ఆర్గాన్ ఉద్గారాలను పరిశీలిస్తుంది?
1) విక్రమ్ లాండ్సర్ 2) ప్రజ్ఞాన్ రోవర్
3) చెస్-2 4) ఏదీకాదు
12. కింది వాటిలో పీఎస్ఎల్వీ-సీ52 కు సంబంధించి సరికానిది ఏది?
1) పీఎస్ఎల్వీ- సీ52ను 2022 ఫిబ్రవరి 14న షార్ నుంచి ప్రయోగించారు
2) దీని ద్వారా ఈవోఎస్- 04, ఐఎన్ఎస్- 2 టీదే, ఇన్స్పైర్ శాట్-1 ను కక్ష్యలో ప్రవేశపెట్టారు
3) ఇది 50వ పీఎస్ఎల్వీ వాహక నౌక
4) ఈ ఉపగ్రహాలు భూ పరిశీలనతో పాటుగా అన్ని వాతావరణాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా చిత్రీకరణ చేస్తుంది. వ్యవసాయం, నేల తేమ విపత్తులపై పరిశీలన చేస్తుంది
13. దివ్యాంగుల కాళ్లకు సరిగ్గా సరిపోయేలా, నిజమైన పాదాల మాదిరిగా కన్పించేలా 3D ప్రింటింగ్ సాంకేతికతతో కృత్రిమ పాదాన్ని రూపొందించినవారు?
1) ఐఐటీ- ముంబయి
2) ఐఐటీ- కాన్పూర్
3) ఐఐటీ- ఖరగ్‌పూర్
4) ఐఐటీ- మద్రాస్
14. చంద్రుడిపై నీటి జాడను కనుగొన్న చాంగే-5 ఏ దేశానిది?
1) అమెరికా 2) జపాన్
3) చైనా 4) ఫ్రాన్స్
15. ఇస్రో రెండో వాణిజ్య విభాగం కింది వాటిలో?
1) న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్
2) యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్
3) నేషనల్ స్పేస్ ఇండియా లిమిటెడ్
4) న్యూ యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్
16. సూర్యుడికి దగ్గరలో ఉన్న మరో ఉపగ్రహం (సూపర్ ఎర్త్)ను ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు?
1) బ్రిటన్ 2) అమెరికా
3) జర్మనీ 4) ఫ్రాన్స్
17. భారత్ ఇటీవల అభివృద్ధి చేసిన మొట్ట మొదటి సంప్రదాయక క్వాజే-బాలిస్టిక్ క్షిపణి ఏది?
1) సరస్ 2) వినయ్
3) విక్రమ్ 4) ప్రళయ్
సమాధానాలు
1. 2 2. 1 3. 2 4. 3 5. 4 6. 2 7. 1 8. 2 9. 2 10. 4 11. 3 12. 3 13. 4 14. 3 15. 1 16. 1 17.4
ఏవీ సుధాకర్
స్కూల్ అసిస్టెంట్
జడ్పీహెచ్ఎస్
లింగంపల్లి
రంగారెడ్డి జిల్లా
9000674747
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?