ఏ శాసనంలో శ్రీకృష్ణదేవరాయులు ఉపయోగించిన ‘తెలుంగాణ’ శబ్దం కనిపిస్తుంది? ( తెలంగాణ చరిత్ర)
1. బీరార్ ఒప్పందం ప్రకారం నాసీరుద్దౌలా ఏ భూ భాగాలను బ్రిటిష్ వారికి ధారదత్తం చేశాడు?
1) బీదర్, కర్నూల్, అనంతపురం
2) పర్బనీ, బీరార్, రాయచూర్
3) ఉస్మానాబాద్, బీరార్, రాయచూర్
4) రాయచూర్, బీదర్, కర్నూల్
2. ‘ది అన్ సంగ్ హీరో ఆఫ్ హైదరాబాద్’ అని ఎవరిని అంటారు?
1) మౌల్వి అల్లావుద్దీన్
2) తురేబాజ్ ఖాన్
3) మీర్ ఫిదా అలీ
4) మౌల్వి ఇబ్రహీం
3. 1వ శతాబ్దపు తెలుగుదేశాన్ని ‘టెలింగాన్’ అని పేర్కొన్న విదేశీ రచయిత?
1) అరిస్టాటిల్ 2) కొపర్నికస్
3) టాలమీ 4) కెప్లర్
4. 6వ శతాబ్దంలో భారతదేశలంలోని 16 జనపదాల్లో ఒకటిగా నిలిచింది?
1) అవంతి 2) గాంధార
3) పాంచాల 4) పైవన్నీ
5. భారతదేశంలో 6వ శతాబ్దంలో 16 జనపదాలు ఉండేవని పేర్కొన్న గ్రంథం?
1) మహాభారతం 2) రామాయణం
3) అంగుత్తర నికాయ 4) అభిదమ్మ పీఠిక
6. సుత్తనిపాత వ్యాఖ్యానంలో గోదావరి నదికి ఉభయ పార్శముల్లో అంధక రాష్ట్రములని చెప్పినవి ?
1) అశ్మక, అవంతి 2) అశ్మక, గాంధార
3) అశ్మక, కాంభోజ 4) అశ్మక, ములక
7. వాయు పురాణంలో పేర్కొన్న రాజధాని పోదన్ను ప్రస్తుత తెలంగాణలోని ఏ పట్టణంగా చరిత్రకారులు భావిస్తున్నారు?
1) నిర్మల్ 2) బోధన్
3) పెద్దపల్లి 4) నల్లగొండ
8. బోధన్ రాజధానిగా చేసుకొని పరిపాలించాడని జైన గ్రంథాలు తెలియజేస్తున్న రుషభనాథుని కుమారుడు?
1) వర్ధమాన మహావీరుడు
2) విక్రమేంద్రుడు
3) శీతలనాథుడు 4) బాబలి
9. కోసలరాజు కుల గురువైన భావరి అనే బ్రాహ్మణాచార్యుడు అస్సక జనపదంలో స్థిరపడి ఆశ్రమం నిర్మించుకొని విద్యాబోధన
చేసేవాడని ఏ గ్రంథంలో పేర్కొన్నారు?
1) అంగుత్తరనికాయ 2) సుత్తనిపాత
3) వినయపీఠిక 4) అభిదమ్మ పీఠిక
10. ఏ ప్రాంతాల్లో మహిషకులు ఉన్నట్లు పురావస్తు ఆధారాల వల్ల తెలుస్తుంది?
1) మెదక్ జిల్లా 2) నల్లగొండ జిల్లా
3) ధార్వాడ్ జిల్లా 4) పైవన్నీ
11. 12వ శతాబ్దానికి చెందిన ఏ శాసనంలో ‘తెలుంగ’ అనే పదం ఉన్నది?
1) కుర్గోడు 2) మస్కీ
3) రాజులమందగిరి 4) పైవన్నీ
12. తెలుగు తామ్ర శాసనంలో మొదటిసారి చరిత్రకారులు భావించిన శాసనం ?
1) విలాస శాసనం
2) తిరుమల శాసనం
3) అనుమకొండ శాసనం
4) మద్రాస్ మ్యూజియం తామ్ర శాసనం
13. ఆంధ్రదేశంలో మొదటి తెలుగు శాసనంగా పరిగణిస్తున్న కళ్లమళ్ల శాసనం వేయించినవారు ఎవరు?
1) ధనుంజయుడు
2) జయసింహ వల్లభుడు
3) కుబ్జ విష్ణువర్ధనుడు
4) బల్లియ చోళుడు
14. ఏ శాసనంలో శ్రీకృష్ణదేవరాయులు ఉపయోగించిన ‘తెలుంగాణ’ శబ్దం కనిపిస్తుంది?
1) చిన్నకంచి శాసనం
2) తిరుమల శాసనం
3) పైరెండూ 4) పైవేవీకావు
15. ఇటీవల సంగారెడ్డి జిల్లాలోని ఏ ప్రాంతంలో బయటపడిన 1417 సంవత్సరం నాటి శాసనంలో ‘తెలుంగాణ’ పదం పేర్కొన్నారు?
1) లింగంపల్లి 2) తుప్రాన్
3) వర్గల్ 4) తెల్లాపూర్
16. గోదావరికి ఇరువైపులా అళక (అశ్మక) ములక (నాందేడ్, ఔరంగాబాద్ జిల్లాలు) రాజ్యాలున్నాయని అవి అందకరార్థలుగా పేర్కొన్నది?
1) భావరి వృత్తాంతం
2) అంగుత్తరనికాయ
3) ఇండికా 4) మాళవికాగ్నమిత్ర
17. మౌర్యుల్లో చివరివాడైన బృహద్రదుడిని అతని సేనాని పుష్యమిత్రశుంగుడు హత్యచేసి అధికారంలోకి వచ్చాడని, ఈ కుట్రను వ్యతిరేకించి ఆంధ్రులు తిరుగుబాటు చేయగా వారిని శుంగులు ఓడించారని తెలుపుతున్న నాటకం?
1) థర్మామృతం 2) సుత్తనిపాదం
3) మాళవికాగ్నమిత్రం 4) క్రీడాభిరామం
18. సరికాని జతను గుర్తించండి
1) వడ్డెమాను శాసనం-రాజు సోమకుడు, జంటుపల్లిల ప్రస్తావన
2) వేల్పూరు శాసనం- సరిసద, అశోక సదల ప్రస్తావన
3) కోటిలింగాల- గోపద, సమగోప, కంవాయసిరిల నాణేల లభ్యం
4) వీరాపురం-నిగమసభ, గోష్టిల ప్రస్తావన
19. శివమహస్తిన్, శివస్కందహస్తిన్ అనే శాతవాహన పూర్వరాజుల నాణేలు లభించిన ప్రాంతం?
1) వడ్డెమాను కొండ 2) వేల్పూరు
3) కోటిలింగాల 4) వీరాపురం
20. కిందివాటిలో కాకతీయుల పుట్టుపూర్వోత్తరాలను గురించి వివరించే మొదటి శాసనం?
1) మాగల్లు శాసనం
2) చందుపట్ల శాసనం
3) ఖండవల్లి శాసనం 4) హనుమకొండ
21. ఎవరి కాలంలో తెలుగు రాజభాషగా, శాసన భాషగా అధికార ప్రతిపత్తి పొందింది?
1) రాష్ట్రకూటులు 2) రేనాటి చోళులు
3) కాకతీయులు 4) ఇక్షాకులు
22. శాతవాహనుల కాలంనాటి నాణేలు లభ్యమైన ప్రదేశం?
1) కోటిలింగాల 2) కొండాపురం
3) పెద్దబంకూరు 4) పైవన్నీ
23. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన ఏ రాజవంశ ప్రాకృత శాసనం హైదరాబాద్లోని చైతన్యపురిలో మూసీనది తీరంలో లభించింది?
1) శాతవాహనులు 2) ఇక్షాకులు
3) విష్ణుకుండినులు 4) కాకతీయులు
జవాబులు
1.3 2.2 3.3 4.4 5.3 6.4 7.2 8.4 9.2 10.4 11.1 12.4 13.1 14.3 15.3 16.1 17.3 18.4 19.4 20.1 21.4 22.4 23.3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు