ప్రణాళిక, సమయ పాలనతోనే విజయం !
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫైనల్ టిప్స్
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష పూర్తయింది. ఇక కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఈనెల 28న జరుగనుంది. ఈ కొద్ది సమయంలో అభ్యర్థులు ప్రిరేషన్లో తీసుకోవలసిన జాగ్రత్తలు.
ఇప్పటికే మీ దగ్గర ఉన్న స్టడీ మెటీరియల్‌తో ప్రిపరేషన్ మొదలుపెట్టారు కాబట్టి దాన్నే రివిజన్ చేయండి. కొత్తగా ఇప్పుడు ఏ పుస్తకాలు కొనద్దు.
జనరల్ స్టడీస్‌లో అన్ని సబ్జెక్టులకు సంబంధించి చాప్టర్ల వారీ ప్రశ్నలన్నింటినీ ఒకసారి రివిజన్ చేయండి.
అర్థమెటిక్, రీజనింగ్‌కు సంబంధించి ప్రతిరోజు చాప్టర్ వైజ్ ప్రశ్నలను వీలైనంత వరకు ప్రాక్టీస్ చేయండి. అర్థమెటిక్, రీజనింగ్ ప్రాక్టీస్‌కు గ్రూప్ డిస్కషన్స్ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వీలైతే అర్థమెటిక్, రీజనింగ్ వరకు గ్రూప్ డిస్కషన్స్ ప్రాక్టీస్ చేయండి.
ఈ సమయంలో రోజులో దాదాపు 12 నుంచి 14 గంటల సమయం పూర్తిగా ప్రిపరేషన్‌కు కేటాయించండి.
ప్రతి అభ్యర్థి కచ్చితంగా గత 10 సంవత్సరాల ప్రీవియస్ ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. దీని వల్ల ఏ చాప్టర్ నుంచి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు, ప్రశ్నల సరళి ఏవిధంగా ఉంటుంది, ఎంత సమయంలో చేయగలుగుతున్నాం అనే విషయంలో పూర్తి అవగాహన వస్తుంది.
ఆరు నెలల వర్తమాన అంశాల్లోని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ విషయాలను తిరగేయండి. వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు తప్పనిసరిగాఅధ్యయనం చేయాలి.
భారతదేశ చరిత్ర సబ్జెక్టులో ప్రాక్టీస్ బిట్స్‌తో పాటు థియరీ చదవడం ఉపయోగకరంగా ఉంటుంది.
ఇండియన్ పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్టుల్లోని అంశాలకు వర్తమాన అంశాలు అన్వయించి చూసుకోవాలి. పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి వాటికి కచ్చితంగా వర్తమాన అంశాలను అన్వయించుకోవాలి.
ఈ కొద్ది సమయంలో రాత్రంతా త్వరగా పడుకొని ఉదయం త్వరగా లేచి ప్రిపరేషన్ చేయడం చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
జనరల్ ఇంగ్లిష్ విభాగంలో దాదాపు అన్ని చాప్టర్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఇంగ్లిష్ సబ్జెక్టును నిర్లక్ష్యం చేయవద్దు.
ఇన్ని రోజుల ప్రిపరేషన్‌కు ఈ కొద్ది రోజుల సమయంలో సబ్జెక్టుల రివిజన్ చాలా కీలకమైన అంశం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దు.
కోచింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు క్లాస్ నోట్స్ మొత్తాన్ని ఒకసారి తప్పనిసరిగా రివిజన్ చేసుకోవాలి.
తెలంగాణ చరిత్ర, తెలంగాణ ప్రభుత్వ పథకాలు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించిన ప్రశ్నలపైన పూర్తి అవగాహన ఏర్పరుచుకోవడం వల్ల జనరల్ స్టడీస్ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.
ఓఎంఆర్ షీట్‌పైన రిజిస్ట్రేషన్ నంబర్, హాల్‌టికెట్ నెంబర్ రాయడం విషయంలో స్పష్టత ఉండాలి. ఈ విషయంలో పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్త వహించాలి.
పరీక్ష హాల్లో ప్రశ్నపత్రం ఇవ్వగానే పేపర్‌ను పూర్తిగా చదవండి. ప్రశ్నపత్రం సులభంగా ఉంది అనే పాజిటివ్ దృక్పథంతో ఉండండి.
ప్రశ్నపత్రంలో ముందుగా మీకు సులభంగా అనిపించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి. రాని ప్రశ్నల కోసం ముందుగానే సమయం వృథా చేసుకోవద్దు.
ప్రశ్నపత్రంలో ముందుగా జనరల్ స్టడీస్ చేద్దాం, అర్థమెటిక్ చేద్దాం అని కాకుండా ముందుగా ఏ ప్రశ్నలు సులభం అనిపిస్తే వాటికి సమాధానాలు గుర్తించుకుంటూ వెళ్లండి.
ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని వెంటనే ఓఎమ్ఆర్లో గుర్తించండి. అలా కాకుండా ప్రశ్న పత్రంలో టిక్ చేసి తర్వాత అన్నీ ఒకేసారి ఓఎమ్ఆర్లో గుర్తిద్దాం అనుకుంటే నంబర్ సిరీస్ మారి సమాధానాలు తారుమారయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది అభ్యర్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం.
ఓఎమ్ఆర్లో సమాధానాలు గుర్తిం చేటప్పుడు సర్కిల్ పైనుంచి లోనికి ఫిలప్ చేయడం వల్ల స్కానింగ్‌లో సమస్య ఉండదు.
నెగెటివ్ మార్కులపైన విద్యార్థులు ఎక్కువగా ఆందోళనకు గురవుతున్నారు. 5 తప్పు సమాధానాలకు 1 మార్కు మాత్రమే మైనస్ అవుతుంది.
వెంకట్‌రెడ్డి వేట
చైర్మన్, టాపర్స్/భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్,
హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?