Dada saheb phalke award | భారతీయ సినిమాకు దిక్సూచి.. దాదాసాహెబ్ ఫాల్కే
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
- భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నతమైనది దాదాసాహెబ్ఫాల్కే అవార్డు. 2021 సంవత్సరానికి 53వ దాదాసాహెబ్ఫాల్కే అవార్డును వహీదా రెహమాన్ ఎంపికైనట్టు 2023 సెప్టెంబర్ 26న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. అవార్డుకు ఎంపిక చేసిన కమీటీలో ఆశాపరేఖ్, చిరంజీవి, పరేష్ రావెల్, ప్రసేజ్జిత్ చటర్జీ, శేఖర్ కపూర్ ఉన్నారు.
- భారతీయ సినిమాకు పితామహుడిగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే శతజయంతి సందర్భంగా 54 సంవత్సరాల క్రితం 1969లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ దాదాసాహెబ్ఫాల్కే అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది. డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ ద్వారా ఏటా జాతీయ చలనచిత్ర వేడుకల్లో గ్రహీతలకు అందచేస్తారు. ప్రతి సంవత్సరం వివిధ భాషల్లో భారతీయ సినిమాకు గణనీయమైన సేవలు చేసిన వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారం. ప్రారంభంలో ఈ అవార్డు విలువ రూ.2 లక్షలు. దాదాసాహెబ్ అవార్డు గ్రహీతలకు శాలువా, స్వర్ణ కంకణం, రూ.10,00,000 నగదు అందజేస్తారు.
దాదాసాహెబ్ ఫాల్కే (1870-1944)
- దర్శకుడు, నిర్మాత దాదాసాహెబ్ ఫాల్కే భారతదేశ మొట్టమొదటి నిడివి మూకీ చలన చిత్రం రాజాహరిశ్చంద్ర తీశారు. ఈ చిత్రాన్ని 1913లో విడుదల చేశారు. ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 1969లో ఏర్పాటు చేశారు.
వివిధ భాషల్లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు
- హిందీ 28, బెంగాలీ 11, తెలుగు 7, తమిళం 3, మళయాళం, అస్సామి, మరాఠి, కన్నడ నుంచి ఒక్కొక్కరు అందుకున్నారు.
- దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఇప్పటి వరకు 53 మంది అందుకున్నారు. మొదటి గ్రహీత దేవికా రాణి. ఈమె 1936 ఫిబ్రవరి 3న తమిళనాడులోని చంగల్‌పట్‌లో జన్మించారు.
- 2023లో జరిగే 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవాల సందర్భంగా వహీదా రెహమాన్‌కు అవార్డును అందజేస్తారు.
- అక్కినేని నాగేశ్వరరావుతో తొలిసారిగా రోజులు మారాయి (1955)తో వెండి తెరపై మెరిసిన వహీదా అందులో ‘ఎరువాకా సాగారో రన్నో చిన్నన్నా..’ అనే పాటకు చేసిన నృత్యం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తరవాత ఎన్టీఆర్‌తో కలిసి జయసింహలో నటించాక , హిందీ చలన చిత్రరంగంలో ప్రవేశించి హిందీలో సి.ఐ.డి చిత్రంలో తొలిసారిగా నటించింది. హిందీ చలన చిత్రరంగంలో ప్యాసా, కాగజ్కే పూల్, కాలాబజార్, బాత్ ఏక్ రాత్ కీ, సాహిబ్ బీబీ ఔర్ గులామ్, నీల్ కమల్, చాంద్ వి కా చాంద్, రామ్ ఔర్ శ్యామ్, ఖామోసి లాంటి చిత్రాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. రేష్మా ఔర్ షేర్లో తన నటనతో జాతీయస్థాయిలో ఉత్తమ నటి అవార్డును అందుకున్నది.
- భారత సినీరంగం అభ్యున్నతికి చేసిన సేవకు ఆమెకు భారత ప్రభుత్వం 1972లో పద్మశ్రీ, 2011లో పద్మ భూషణ్ అవార్డులను ప్రకటించినది. 2006 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ అవార్డు, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నది.
- వహీదా రెహమాన్‌తో కలిసి నటించిన కమల్ జీత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని బెంగుళూరులో స్థిరపడ్డారు.
పైడి జయరాజ్: తెలంగాణ గడ్డపై పుట్టి, భారతీయ చలనచిత్ర రంగంలో అగ్రస్థానానికి ఎదిగి, తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో చాటి చెప్పిన గొప్ప నటుడు. ఈయన జన్మస్థలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ప్రసుతం జగిత్యాల. పైడి జయరాజ్ హిందీలోనే కాకుండా మరాఠీ, ఒరియా, బెంగాలీ, పంజాబీ, కొంకణి, గుజరాతీ, మలయాళం సహా పలుభాషల్లో దాదాపు 300 చిత్రాలకు పైగా నటించిన అగ్రగణ్యుడు.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విశేషాలు
- మరణించిన తరవాత పృథ్వీరాజ్‌కపూర్ (1971), వినోద్‌ఖన్నా (2017)కు ప్రకటించారు.
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును తండ్రి, కొడుకులు పృథ్వీరాజ్ కపూర్, రాజ్‌కపూర్ అందుకున్నారు.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు
1. 1969 దేవికారాణి (నటి)
2. 1970 బి.ఎన్.సర్కార్ (నిర్మాత)
3. 1971 పృథ్వీ కపూర్ (నటుడు)
4. 1972 పంకజ్ మల్లిక్ (సంగీత దర్శకుడు)
5. 1973 రూబీ మైయర్స్ (సులోచన) (నటి)
6. 1974 బి.ఎన్.రెడ్డి (దర్శక నిర్మాత)
7. 1975 ధీరేన్ గంగూలీ (నటుడు)
8. 1976 కానన్ దేవి (నటి)
9. 1977 నితిన్ బోస్ (దర్శకుడు)
10. 1978 ఆర్.సి. బోరల్ (స్క్రీన్ ప్లే)
11. 1979 సోహ్రాబ్ మోదీ (దర్శక, నిర్మాత)
12. 1980 పైడి జైరాజ్ (దర్శకుడు, నటుడు)
13. 1981 నౌషాద్ (సంగీత దర్శకుడు)
14. 1982 ఎల్.వి.ప్రసాద్ (దర్శకుడు, నిర్మాత, నటుడు)
15. 1983 దుర్గా ఖోటే (నటి)
16. 1984 సత్యజిత్ రే (దర్శకుడు)
17. 1985 వి.శాంతారాం (దర్శకుడు, నిర్మాత, నటుడు)
18. 1986 బి.నాగిరెడ్డి (నిర్మాత)
19. 1987 రాజ్‌కపూర్ (నటుడు, దర్శకుడు)
20. 1988 అశోక్ కుమార్ (నటుడు)
21. 1989 లతా మంగేష్కర్ (గాయని)
22. 1990 అక్కినేని నాగేశ్వరరావు (నటుడు)
23. 1991 బాల్జీ పెండార్కర్ (గాయకుడు, సంగీత దర్శకుడు)
24. 1992 భూపేన్ హజారికా(గాయకుడు,
సంగీత దర్శకుడు)
25. 1993 మజ్రాహ్ సుల్తాన్‌పురి (పాటల రచయిత)
26. 1994 దిలిప్‌కుమార్ ( నటుడు, గాయకుడు)
27. 1995 రాజ్‌కుమార్ (నటుడు, గాయకుడు)
28. 1996 శివాజీ గణేశన్ ( నటుడు)
29. 1997 కవి ప్రదీప్ (పాటల రచయిత)
30. 1998 బి.ఆర్.చోప్రా (దర్శకుడు, నిర్మాత)
31. 1999 హృషీకేశ్ ముఖర్జీ (దర్శకుడు)
32. 2000 ఆశా భోంస్లే (గాయని)
33. 2001 యష్. చోప్రా (దర్శకుడు, నిర్మాత)
34. 2002 దేవానంద్ (నటుడు, దర్శకుడు, నిర్మాత)
35. 2003 మృణాల్ సేన్ ( దర్శకుడు)
36. 2004 అదూర్ గోపాల్ కృష్ణన్ (దర్శకుడు)
37. 2005 శ్యాం బెనగల్ (దర్శకుడు)
38. 2006 తపన్ సిన్హ (దర్శకుడు)
39. 2007 మన్నాడే (గాయకుడు)
40. 2008 వి.కే.మూర్తి (ఛాయాగ్రాహకుడు)
41. 2009 డి.రామానాయుడు (దర్శకుడు, నిర్మాత, నటుడు)
42. 2010 కైలాసం బాలచందర్ (దర్శకుడు)
43. 2011 సౌమిత్ర ఛటర్జీ (నటుడు)
44. 2012 ప్రాణ్ (నటుడు)
45. 2013 గుల్జార్ (సంగీత దర్శకుడు)
46. 2014 శశికపూర్ ( నటుడు)
47. 2015 మనోజ్ కుమార్ (నటుడు, దర్శకుడు, నిర్మాత)
48. 2016 కె.విశ్వనాథ్ (నటుడు, దర్శకుడు, నిర్మాత)
49. 2017 వినోద్‌ఖన్నా (నటుడు)
50. 2018 అమితాబ్‌బచ్చన్ (నటుడు)
51. 2019 రజనీకాంత్ (నటుడు)
52. 2020 ఆశా పరేఖ్ (నటి)
53. 2021 వహీదా రెహమన్ (నటి)
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న తెలుగువారు
1. 1974 బొమ్మిరెడ్డి నర్సింహారెడ్డి (దర్శక, నిర్మాత)
2. 1980 పైడి జయరాజ్ (నటుడు, దర్శకుడు, నిర్మాత)
3. 1982 అక్కినేని లక్ష్మీవర ప్రసాద్ (ఎల్.వి.ప్రసాద్) (నటుడు, దర్శకుడు, నిర్మాత)
4. 1986 బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (నిర్మాత)
5. 1990 అక్కినేని నాగేశ్వరరావు (నటుడు)
6. 2009 డి.రామానాయుడు (నిర్మాత)
7. 2016 కె.విశ్వనాథ్ (నటుడు, దర్శకుడు, నిర్మాత)
భాష లక్షణాలు
ప్రధాన లక్షణాలు :
1. ద్వివిధ నిర్మాణం, నిర్మాణ వైవిధ్యం : మానవ భాషకు రెండు రకాల వైవిధ్యాలుంటాయి.
1. కొన్ని వర్ణాలు/ధ్వనులు కలిసి ఒక పదంగా ఏర్పడటం.
2. కొన్ని పదాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడటం. వక్తృ శ్రోతృ విపరిమాణం :
- భాష ద్వారా మానవుడు వినగలడు, మాట్లాడగలడు.
- వ్యక్తులకు గల పరస్పర మాట్లాడగలిగే శక్తి, అర్థం చేసుకునే శక్తి.
- కోతుల అరుపుల్లో, తేనెటీగల నాట్యంలో కనిపించే లక్షణం.
శబ్దార్థ సంబంధ కృత్రిమత - శబ్దాల మధ్య సంబంధం యాదృచ్ఛికం, కృత్రిమం.
- శబ్దానికీ, అర్థానికీ సహజ సంబంధ స్థితి లేకపోవడం
- ప్రపంచంలోని అన్ని భాషల్లోను ఉన్న శబ్దాలకు రకరకాల అర్థాలు ఉంటాయి. (పర్యాయ పదాలు, నానార్థాలు)
- పదాలు వేర్వేరు ప్రయోగాలను బట్టి వాటి అర్థాలు మారుతాయి.
ప్రత్యేకత
వార్తా ప్రసారంలో భాగాలు 2
1. ప్రేరణ 2. ప్రతిక్రియ - వార్తా ప్రసారంలో ప్రేరణ ప్రతిక్రియల మధ్య సహజ సంబంధం లేకపోవడం.
ఉదా : వడ్డిస్తున్నాను రండి అన్నప్పుడు కాళ్లు కడిగి వెళ్లు
ప్రేరణ ప్రతిక్రియ - ప్రేరణ దూరత/ కాలాంతర ప్రాప్తి
- దూరత = భవిష్యత్
- వర్తమానంలో కలిగే మానసిక ప్రేరణ లేకుండానే భూత, భవిష్యత్ గూర్చి మాట్లాడగలగటం.
- సృజనాత్మకత / ఉత్పాదకత /
- తెలిసిన వాక్య నిర్మాణం అనుసరించి కొత్త వాక్యాలు రాయడం.
- పరిచయం ఉన్న పదాలను దృష్టిలో పెట్టుకొని, పరిచయం లేని కొత్త పదాలను ఉత్పత్తి చేయడం
- సొంతంగా, నూతనంగా, కొత్తగా చేసే వాక్య నిర్మాణం.
- మనకు తెలిసిన రీతులేగాక ఊహించి కొత్త పదాలను, వాక్యాలను నిర్మించి ఉపయోగించగల శక్తి.
సాంస్కృతిక ప్రసరణ : - సంస్కృతి సంప్రదాయాలు ఒక తరం నుంచి మరొక తరానికి ఎలా ప్రసరిస్తుందో అలాగే భాష కూడా తరతరాలకు ప్రసరిస్తుంది.
- అనుకరణతో తరతరాలకు ఆచార వ్యవహారాలు అందటం.
అదనపు లక్షణాలు :
ఉద్దేశపూర్వక ఉచ్ఛారణ : - చిలుకలు, గోరింకలు అభ్యాసం చేసి యాంత్రికంగా వల్లెవేసి పలుకుతాయి. కాని మానవుడు అలా కాదు.
దేశాంతర ప్రాప్తి : - మానవ భాష దేశాంతరమందునూ
వ్యవహృతం కాగలదు. - వక్తముఖ నిర్ణీత ధ్వనులకే భాషా యోగ్యత ఉంది. కాని విద్యుదయస్కాంత తరంగాలుగా మారిన ధ్వనులకు లేదు.
- కాని భాష బహిస్వరూపమైన ధ్వని సముదాయం నిలిచి ఉంది కనుక భాషగా పరిగణించవచ్చు.
పరస్పర వినిమయం : - వక్త ధ్వనికి శ్రోత ప్రచోదనం /
ప్రేరణ పొందుతాయి. అంటే ప్రతిక్రియ ఉంటుంది. - వాచిక సంకేతానికి మాత్రమే, వాచ్యత, శ్రావ్యత అనే రెండు ధర్మాలున్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?