World GeoGraphy | జెట్ స్ట్రీమ్స్ వల్ల ఏ ఆవరణంలో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది?
1. కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి.
1. అధిక వర్షపాతం లభించే మేఘాలు ఎ. క్యుములోనింబస్
2. తక్కువ ఎత్తులో ఏర్పడే మేఘాలు బి. నింబోస్టాటస్
3. కాలిఫ్లవర్/గుమ్మడి ఆకారంలో మేఘాలు సి. స్టాటస్
4. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానిచ్చే మేఘాలు
డి. క్యుములస్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
3) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
2. జతపరచండి.
1. ఉష్ణవహనం ఎ. సముద్ర, భూ పవనాలు ఏర్పడటం
2. ఉష్ణ సంవహనం బి. సూర్యుని నుంచి ఉష్ణం భూమిని చేరడం
3. ఉష్ణ వికిరణం సి. భూమి కింద పొరలు వేడెక్కడం
1) 1-సి, 2-ఎ, 3-బి
2) 1-ఎ, 2-బి, 3-సి
3) 1-బి, 2-ఎ, 3-సి
4) 1-సి, 2-బి, 3-ఎ
3. కింది వాటిలో సరైనవి ఏవి?
1. క్యుములస్ మేఘాలు – దట్టంగా ఏర్పడే మేఘాలు. ఇవి గాలి ప్రవాహాల ఎత్తును బట్టి ఉంటాయి
2. క్యుములో నింబస్ మేఘాలు – ఉరుములతో, మెరుపులతో కుంభవృష్టి సంభవిస్తుంది
1) 1 2) 2
3) 1, 2 4) పైవేవీకావు
4. ఆర్ధ్రతను ఏ పరికరంతో కొలుస్తారు?
1) బారోమీటర్ 2) ఉష్ణమాపకం
3) అనార్ధ్ర భారమితి 4) హైగ్రో మీటర్
5. నిర్ణీత ప్రాంతంలోని గాలిలో గల నీటి ఆవిరిని, ఆ గాలి పరిణామానికి గల నిష్పత్తిని ఏమంటారు?
1) విశిష్ట ఆర్ధ్రత 2) నిర్దిష్ట ఆర్ధ్రత
3) సాపేక్ష ఆర్ధ్రత 4) ఆర్ధ్రత
6. కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి.
1. నక్షత్రాల్లో ఉష్ణోగ్రత కొలిచే పరికరం
ఎ. పైరోమీటర్
2. అతి శీతల ప్రాంతాల గురించి అధ్యయనం
బి. క్రయోజెనిక్స్
3. అత్యధిక ఉష్ణోగ్రతలు కనుగొనడం సి. ఆప్టికల్ పైరోమీటర్
4. అత్యల్ప ఉష్ణోగ్రతలు కనుగొనడం డి. క్రయోమీటర్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
4) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
7. సూర్యుని నుంచి వెలువడే తరంగాలు ?
1) హ్రస్వ తరంగాలు
2) దీర్ఘ తరంగాలు
3) విద్యుదయస్కాంత తరంగాలు
4) తిర్యక్ తరంగాలు
8. భూమిపై అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం?
1) వెర్కోయాన్స్కి 2) ఓమికాన్
3) వోస్టాక్(vostok) 4) మృతలోయ
9. కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి.
1. నార్వెస్టర్లు ఎ. న్యూజిలాండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం
2. హర్మటన్ బి. ఆఫ్రికా పశ్చిమతీరం
3. బెర్గ్ సి. దక్షిణాఫ్రికాలో డ్రాకెన్స్బర్గ్ పర్వతాల వెంబడి
4. బ్యూరాన్ డి. అర్జెంటీనా, రష్యా మధ్య ప్రాంతం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
10. సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1) భారమితిలో పాదరస మట్టం అకస్మాత్తుగా తగ్గడం – తుఫాను
2) భారమితిలో పాదరస మట్టం నెమ్మదిగా తగ్గడం – వర్షం
3) వాయు పీడనం కొలిచే పరికరం – మానోమీటర్
4) పీడనాన్ని కొలిచే ఆధునిక ప్రమాణం – మిల్లీమీటర్
11. కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి.
1. ఉత్తర పసిఫిక్ తీరం ఎ. విల్లీవిల్లీలు
2. మెక్సికో సింధూశాఖ బి. సైక్లోన్స్
3. అరేబియా, బంగాళాఖాతం సి. హరికేన్స్
4. దక్షిణ ఆస్ట్రేలియా డి. టైఫూన్
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
3) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
12. కింది వాటిలో శీతల ఎడారి?
1) కలహారి ఎడారి 2) అరేబియా ఎడారి
3) పెటగోనియా ఎడారి
4) సోనారన్ ఎడారి
13. కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి.
1. ఆస్ట్రేలియా ఎ. గోబి ఎడారి
2. దక్షిణ అమెరికా బి. పెటగోనియా ఎడారి
3. అర్జెంటీనా సి. అటకామా ఎడారి
4. చైనా డి. గ్రేట్ ఆస్ట్రేలియా ఎడారి
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
14. కింది వాటిలో ఉష్ణ/పొడి పవనం కానిదేది?
1) శాంటా అన్నా 2) సిరాకో
3) బోరా 4) పంపిరో
15. భూమిపై అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం?
1) వెర్కోయాన్స్కీ 2) ఓమికాన్
3) వోస్టాక్(vostok) 4) అల్ ఆజీజియా
16. గాలికి బరువు ఉందని మొదటిసారి వివరించిన వారు?
1) గెలీలియో 2) టారిసెల్లి
3) మైక్రోబార్ వారియో
4) డీబార్ట్
17. కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి.
1. స్పెయిన్ ఎ. చిలీ ఉష్ణ పవనాలు
2. ఇటలీ బి. బ్రిక్ ఫీల్డర్స్ ఉష్ణ పవనాలు
3. ఆస్ట్రేలియా సి. సిరాకో ఉష్ణ పవనాలు
4. ట్యునీషియా డి. లెవిచె ఉష్ణపవనాలు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
18. ‘ఆర్ధ్రత’ను కొలిచే పరికరం?
1) హైడ్రోమీటర్ 2) హైగ్రోమీటర్
3) భారమితి 4) బారోమీటర్
19. సూర్య కిరణాలు ఏటవాలుగా ప్రసరించడం వల్ల ఏ మండలంలో తక్కువ ఉష్ణోగ్రత నమోదై అధిక పీడనం ఏర్పడుతుంది?
1) ఉపధ్రువ అల్పపీడన మేఖల
2) ధ్రువ అధిక పీడన మేఖల
3) భూమధ్యరేఖ అల్పపీడన మేఖల
4) ఉప అయనరేఖ అధిక పీడన మేఖల
20. ఏ ఉష్ణోగ్రత వద్ద వాతావరణం నీటి ఆవిరితో సంతృప్తి చెందుతుందో ఆ ఉష్ణోగ్రతను ఏమంటారు?
1) శ్వేత తుహనం 2) తుషార స్థానం
3) హేజ్ 4) తుహినం
21. జెట్ విమానాల విమానయానానికి అనుకూలంగా ఉండే పొర ఏది?
1) ట్రోపో ఆవరణం 2) మీసో ఆవరణం
3) ఐనో ఆవరణం 4) స్ట్రాటో ఆవరణం
22. మేఘాలు ఎంత ఎత్తులో ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగించేది?
1) సిలోమీటర్ 2) హైగ్రోమీటర్
3) ఎనిమోమీటర్ 4) హైడ్రోమీటర్
23. కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి.
1. అంధీలు ఎ. కర్ణాటక
2. నార్వెస్టర్స్ బి. కేరళ
3. మ్యాంగోషవర్స్ సి. అసోం
4. చెర్రీ బ్లోసమ్ డి. ఉత్తర ప్రదేశ్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
4) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
24. జెట్ స్ట్రీమ్స్ వల్ల గందరగోళ పరిస్థితి ఏ ఆవరణంలో ఏర్పడుతుంది?
1) ఎక్సో ఆవరణం
2) ట్రోపో ఆవరణం
3) థర్మో ఆవరణం
4) స్ట్రాటో ఆవరణం
25. జతపరచండి.
1. ట్రోపోపాస్ ఎ. మీసో, ఐసో ఆవరణ మధ్య
2. స్ట్రాటో పాస్ బి. స్ట్రాటో, మీసో ఆవరణ మధ్య
3. మీసోపాస్ సి. ఐనో, ఎక్సో ఆవరణ మధ్య
4. ఐనోపాస్ డి. ట్రోపో, స్ట్రాటో ఆవరణ మధ్య
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
3) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
4) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
26. ఏ ఆవరణంలో పదార్థం ప్లాస్మా స్థితిలో ఉంటుంది?
1) ఎక్సో ఆవరణం
2) ఐనో ఆవరణం
3) స్ట్రాటో ఆవరణం 4) ట్రోపో ఆవరణం
27. జతపరచండి.
1. ఉల్కాపాతాలు సంభవించే పొర ఎ. స్ట్రాటో ఆవరణం
2. సమాచార వ్యవస్థ పొర బి. మీసో ఆవరణం
3. noctilucent మేఘాలు సి. థర్మో ఆవరణం
4. సిర్రస్ మేఘాలు డి. ఎక్సో ఆవరణం
1) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
28. మేఘాల వేగం, దిశను తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం?
1) మానోమీటర్ 2) హైగ్రోమీటర్
3) ఎనిమోమీటర్ 4) నెఫోస్కోప్
29. ‘రుతుపవన ఆరంభపు జల్లులు’ అని ఏ వర్షపాతాన్ని పిలుస్తారు?
1) పర్వతీయ వర్షపాతం
2) చక్రవాత వర్షపాతం
3) సంవహన వర్షపాతం
4) 1, 2
30. అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో బాష్పీభవనం ఎక్కువగా ఉన్నందువల్ల మేఘాలు ఏర్పడి ఉరుములతో కురిసే వర్షపాతాన్ని ఏమంటారు?
1) చక్రవాత వర్షపాతం
2) సంవహన వర్షపాతం
3) పర్వతీయ వర్షపాతం
4) హిమానీ వర్షపాతం
31. శీతాకాలంలో తెల్లవారుజామున చిన్ననీటి బిందువులుగా ఏర్పడిన వాటిని ఏమంటారు?
1) మంచు
2) పలుచని పొగమంచు
3) తుషారం
4) గ్లౌజ్
32. సమాన వడగండ్ల వాన ఎదుర్కొనే ప్రాంతాలను ఏమంటారు?
1) ఐసోబార్స్ 2) ఐసోహైలైన్స్
3) ఐసోహైల్స్ 4) ఐసోబ్రాంట్స్
33. సమాన మేఘావృతమైన ప్రాంతాలను కలిపే రేఖ?
1) ఐసోనిప్స్ 2) ఐసోబాథ్స్
3) ఐసోక్రోన్స్ 4) ఐసోలైన్స్
34. మధ్య ఆర్ధ్రశుష్కత లేని శీతోష్ణస్థితి కింది ఏ ప్రాంతంలో కనిపిస్తుంది?
1) చైనా 2) పశ్చిమ యూంప్
3) అస్ట్రేలియా 4) ఇండియా
35. అల్ ఆజీజియా వద్ద నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత?
1) 480C 2) 580C
3) 680C 4) 550C
36. ఖండాల తూర్పు భాగంలో మాత్రమే వర్షపాతం అధికంగా ఉండటానికి కారణం?
1) తూర్పు పవనాలు
2) వ్యాపార పవనాలు
3) ధ్రువ పవనాలు
4) పశ్చిమ పవనాలు
37. ఆసియా ఖండం ఏ భాగంలో నుంచి భూమధ్య రేఖ వెళ్తుంది?
1) ఆగ్నేయం 2) నైరుతి
3) ఈశాన్యం 4) వాయవ్యం
38. నైరుతి రుతుపవనాల సమయంలో వర్షం పొందని ప్రాంతం ఏది?
1) జైపూర్ 2) తంజావూర్
3) జబల్పూర్ 4) కొచ్చిన్
39. జతపరచండి.
1. అతి తక్కువ ఎత్తులో ఏర్పడే మేఘాలు
ఎ. స్ట్రాటస్
2. అధిక వర్షపాతాన్ని ఇచ్చే మేఘాలు బి. నింబోస్ట్రాటస్
3. గుమ్మటం ఆకారంలో ఉండేవి సి. క్యుములస్
1) 1-బి, 2-ఎ, 3-సి
2) 1-ఎ, 2-బి, 3-సి
3) 1-సి, 2-బి, 3-ఎ
4) 1-సి, 2-ఎ, 3-బి
40. జతపరచండి.
1. మిస్ట్రల్ ఎ. యుగోస్లేవియా నుంచి ఏడ్రియాటిక్ సముద్రం మీద వీచేవి
2. బోరా బి. యూరప్లో ఆగ్నేపీఠభూమి నుంచి రోన్లోయ
3. బెర్గ్స్ సి. దక్షిణాఫ్రికాలో వీచేవి
4. బ్లిజార్డ్స్ డి. అంటార్టికాలో వీచేవి
1) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
4) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
41. చెదురుముదురు చెట్లతో ఉన్న తూర్పు ఆసియా అడవులు?
1) సమశీతోష్ణ అడవులు
2) రుతుపవన అడవులు
3) భూమధ్యరేఖ అడవులు
4) స్టెప్పీలు
జవాబులు
1.3 2.1 3.3 4.4
5.1 6.2 7.3 8.3
9.1 10.4 11.1 12.3
13.4 14.3 15.4 16.1
17.3 18.2 19.2 20.2
21.4 22.1 23.2 24.2
25.2 26.1 27.3 28.4
29.3 30.2 31.3 32.4
33.1 34.2 35.2 36.2
37.1 38.2 39.2 40.2
41.1
టాపర్స్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు