TSPSC Group 4 Model Paper | సబ్బు బుడగ అనేక రంగులతో మెరవడం ఏ చర్య ఫలితం?
1. ప్రాథమిక అనువర్తిత విజ్ఞాన శాస్ర్తాల్లో పరిశోధనలు నిర్వహించే కొన్ని ప్రధాన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, వాటి ప్రదేశాలను సరిగా జత చేయండి.
1. బోస్ ఇన్స్టిట్యూట్ ఎ. ముంబై
2. అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బి. బెంగళూరు
3. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సి. పుణె
4. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజమ్ డి. కోల్‌కతా
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
2. మానవ ఎంబ్రియోలను క్లోనింగ్ ద్వారా మూలకణాల తయారీకి పరిశోధన అనుమతులను (లైసెన్సులను) జారీ చేసిన మొదటి దేశం?
ఎ) యునైటెడ్ స్టేట్స్ బి) బ్రిటన్
సి) జర్మనీ డి) ఆస్ట్రేలియా
3. జీవ ఇంధనాలపై భారత జాతీయ విధానాన్ని అనుసరించి కింది వాటిలో వేటిని జీవ ఇంధనాల ఉత్పత్తికి ముడి పదార్థాలుగా వాడతారు?
1. కర్ర పెండలం
2. దెబ్బతిన్న గోధుమ గింజలు
3. వేరుశనగ గింజలు
4. ఉలవలు
5. కుళ్లిన బంగాళదుంపలు
6. చక్కెర దుంప (షుగర్ బీట్)
ఎ) 1, 2, 5, 6 బి) 1, 3, 4, 6
సి) 2, 3, 4, 5 డి) 1, 2, 3, 4, 5, 6
4. కింది వాటిలో ఏది విద్యుత్‌తో పాటు ఎరువును కూడా ఉత్పత్తి చేస్తుంది?
ఎ) న్యూక్లియర్ ప్లాంట్
బి) థర్మల్ ప్లాంట్
సి) బయోగ్యాస్ ప్లాంట్
డి) హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్
5. మొక్కజొన్నకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి. సరైన వ్యాఖ్య/వ్యాఖ్యలను గుర్తించండి.
1. మొక్కజొన్నను స్టార్చ్ తయారీకి ఉపయోగిస్తారు
2. మొక్కజొన్న నుంచి తీసిన చమురు బయోగ్యాస్ ఉత్పత్తికి ముడి పదార్థంగా ఉపయోగపడుతుంది
3. మొక్కజొన్నను ఉపయోగించి మద్య పానీయాలను తయారు చేయవచ్చు
ఎ) 1 బి) 1, 2
సి) 1, 3 డి) 1, 2, 3
6. కింది వాటిలో ఏ వ్యాధి/వ్యాధులను భారతదేశం పూర్తిగా నిర్మూలించింది?
1. డిఫ్తీరియా (కంఠవాతం)
2. చికిన్పాక్స్ (అమ్మవారు)
3. స్మాల్‌పాక్స్ (మశూచి)
ఎ) 1, 2 బి) 3
సి) 1, 2, 3 డి) ఏది కాదు
7. కింది సమ్మేళనాల్లో దేన్ని మత్తుమందు (సెడటివ్)గా ఉపయోగిస్తారు?
ఎ) పొటాషియం బ్రోమైడ్
బి) కాల్షియం క్లోరైడ్
సి) ఇథైల్ ఆల్కహాల్
డి) ఫాస్ఫరస్ ట్రై క్లోరైడ్
8. కింది వాటిలో దేని లోపం వల్ల ఏ వ్యాధి వస్తుందో సరిగా జత చేయండి.
1. విటమిన్-సి ఎ. రేచీకటి
2. ఫోలిక్ యాసిడ్ బి. బెరి-బెరి
3. విటమిన్-ఎ సి. స్కర్వీ
4. విటమిన్-బి1 డి. రక్తహీనత
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
9. మనిషి ఉదరం లోపలి భాగాలను పరీక్షించడానికి వైద్యులు ఎండోస్కోప్‌ను ఉపయోగిస్తారు. ఈ పరికరం ఏ సూత్రంపై పని చేస్తుంది?
ఎ) కాంతి ప్రతిబింబ సూత్రం
బి) కాంతి విక్షేపణ సూత్రం
సి) కాంతి సంపూర్ణ పరావర్తన సూత్రం
డి) కాంతి వక్రీభవన సూత్రం
10. నీటిని శుభ్రపరిచే వ్యాధి నిరోధకాలు వ్యాధికారక సూక్ష్మ జీవులను చంపివేస్తాయి లేదా అచేతనం చేస్తాయి. కింది వాటిలో అటువంటి వ్యాధి నిరోధకాలు ఏవి?
1. క్లోరిన్ 2. హైడ్రోజన్ పెరాక్సైడ్
3. అతినీలలోహిత కిరణాలు
ఎ) 1, 2 బి) 1, 3
సి) 2, 3 డి) పైవన్నీ
11. పలుచటి సబ్బు బుడగ అనేక రంగులతో మెరవడం ఏ చర్య ఫలితం?
ఎ) ధ్రువీకరణం, వ్యతికరణం
బి) వివర్తనం, విక్షేపణం
సి) బహుళ విరళీకరణం, విక్షేపణం
డి) బహుళ పరావర్తనం, వ్యతికరణం
12. ఎలక్ట్రోమ్యాగ్నెట్ అంతర్భాగాన్ని మృదు ఇనుముతో తయారు చేస్తారు. ఎందుకు?
ఎ) తక్కువ గ్రహణ శక్తి, తక్కువ నిలుపుకొనే శక్తి కలిగి ఉండటం వల్ల
బి) ఎక్కువ గ్రహణ శక్తి, తక్కువ నిలుపుకొనే శక్తి కలిగి ఉండటం వల్ల
సి) ఎక్కువ సాంద్రత, ఎక్కువ నిలుపుకొనే శక్తి (ధారణ శక్తి) ఉండటం వల్ల
డి) తక్కువ సాంద్రత, ఎక్కువ నిలుపుకొనే శక్తి (ధారణ శక్తి) ఉండటం వల్ల
13. కాంతివంతమైన ప్రాంతం నుంచి ఒక్కసారిగా చీకటి గదిలోకి ప్రవేశించినప్పుడు మనకు కొద్దిసేపు ఏదీ స్పష్టంగా కనిపించకపోవడానికి కారణం?
ఎ) కంటి లోపలి రెటీనా ముందుకు కదలడం
బి) కంటి లోపలి రెటీనా వెనుకకు కదలడం
సి) నల్ల కనుగుడ్డు కనుపాపను వస్తువులను చూసేందుకు వీలుగా వెంటనే వ్యాకోచింపచేయలేక పోవడం వల్ల
డి) చీకటిలో చూసే శక్తి కన్నుకు లేదు
14. జంతువులు గ్లూకోజ్ (చక్కెర)ను ఏ రూపంలో నిల్వ ఉంచుకుంటాయి?
ఎ) ఎమలైజ్ బి) ైగ్లెకోజన్
సి) గ్లిజరాల్ డి) గుయానైన్
15. హ్రస్వదృష్టి (మయోపియా) లోపాన్ని సరి చేయడానికి ఏ కటకాన్ని వాడతారు?
ఎ) కుంభాకార కటకం
బి) పుటాకార కటకం
సి) ద్విపుటాకార కటకం
డి) ద్వి కుంభాకార కటకం
16. వివిధ దేశాల న్యూస్ ఏజెన్సీలను సరిగా జత చేయండి.
1. రాయిటర్స్ ఎ. జపాన్
2. అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) బి. ఇండోనేషియా
3. అంతారా సి. యూఎస్ఏ
4. క్యోడో డి. యూకే (బ్రిటన్)
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
17. వివిధ దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించి సరైన వ్యాఖ్య/వ్యాఖ్యలను గుర్తించండి.
1. బ్యూరో ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ అనేది దక్షిణాఫ్రికా దేశ ఇంటెలిజెన్స్ సంస్థ
2. ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) అనేది బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ సంస్థ
3. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనేది భారతదేశ ఇంటెలిజెన్స్ సంస్థ
4. మొస్సాద్ అనేది ఇజ్రాయెల్‌కు చెందిన డిటెక్టివ్ ఏజెన్సీ
ఎ) 1, 3, 4 బి) 1, 2
సి) 2 డి) 3, 4
18. కింది అంతర్జాతీయ సంస్థలు, వాటి ప్రధాన కార్యాలయాలను సరిగా జత చేయండి.
1. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఎ. మనీలా (ఫిలిప్పీన్స్)
2. ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ బి. లండన్ (ఇంగ్లండ్)
3. ఏసియన్ సి. బ్రస్సెల్స్ (బెల్జియం)
4. నాటో డి. జకార్తా (ఇండోనేషియా)
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
19. భారత్, బంగ్లాదేశ్‌లను కలుపుతూ ప్రవేశపెట్టిన మొదటి రైలు మైత్రి ఎక్స్‌ప్రెస్, అయితే రెండో రైలు ఏది?
ఎ) బంధన్ ఎక్స్‌ప్రెస్
బి) వందే భారత్
సి) సంజోత ఎక్స్‌ప్రెస్
డి) ఏదీ కాదు
20. అంతర్జాతీయ అంశాలను మొదట 1919లో ఏ విశ్వవిద్యాలయం ఒక అధ్యయన అంశంగా చేర్చింది?
ఎ) టొరంటో విశ్వవిద్యాలయం
బి) బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం
సి) వేల్స్ విశ్వవిద్యాలయం
డి) ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం
21. అంతర్జాతీయ అంశాలకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించి సరైన వ్యాఖ్య/వ్యాఖ్యలను గుర్తించండి.
1. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తుర్కియె అధ్యక్షుడిగా తయ్యిప్ ఎర్డోగాన్ ఎన్నికయ్యారు. 69 ఏళ్ల ఎర్డోగాన్ 2028 వరకు అధ్యక్షుడిగా కొనసాగుతారు.
2. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ తదుపరి అధ్యక్షుడిగా ట్రినిటాడ్ అండ్ టొబాగో దౌత్యవేత్త డెన్నిస్ ఫ్రాన్సిస్ ఎన్నికయ్యారు.
3. భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యంజయ్ మహాపాత్ర ప్రపంచ వాతావరణ సంస్థ ముగ్గురు ఉపాధ్యక్షుల్లో ఒకరిగా ఇటీవల ఎన్నికయ్యారు.
4. ఐరాస వాతావరణ విభాగం తొలి మహిళా అధిపతిగా అర్జెంటీనా వాతావరణ శాస్త్రవేత్త సెలెస్టెసౌలో ఎన్నికయ్యారు.
ఎ) 1, 4 బి) 1, 3
సి) 1, 2, 3 డి) 1, 2, 3, 4
22. భారత్‌తో కింది ఏ దేశం లేదా దేశాల దౌత్య సంబంధాలు మొదటి నుంచి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా కాలపరీక్షకు తట్టుకుని పటిష్టంగా సాగుతున్నాయి?
1. రష్యా 2. మయన్మార్
3. యూఎస్ఏ 4. పాకిస్థాన్
ఎ) 1 బి) 1, 2
సి) 4 డి) 3
23. భారత్, జపాన్, యూఎస్ఏ, ఆస్ట్రేలియాలతో ఏర్పడిన క్వాడ్రీలేటరల్ సెక్యూరిటీ డైలాగ్’ (క్వాడ్) కూటమి ప్రాథమిక లక్ష్యం ఏమిటి?
ఎ) ఆసియా దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం
బి) అన్ని రకాలుగా ఇండో-పసిఫిక్ ప్రాంత అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయడం
సి) చైనాపై దాడికి వ్యూహ రచన చేయడం
డి) కేవలం సభ్య దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపరచుకోవడం
24. ఐక్యరాజ్య సమితికి సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించి సరికాని వ్యాఖ్య/వ్యాఖ్యలను గుర్తించండి.
1. ఐరాస 1945, అక్టోబర్ 24 నుంచి అధికారికంగా పని చేయడం ప్రారంభించింది. అందువల్లే అక్టోబర్ 24ను ఐరాస దినోత్సవంగా జరుపుకొంటాం.
2. ఐరాస ప్రధాన కార్యాలయం న్యూయార్క్ (యూఎస్ఏ)లో ఉండగా ప్రాంతీయ కార్యాలయం బాగ్దాద్‌లో ఉంది.
3. ఐరాస ధర్మకర్తృత్వ మండలిలో భారతదేశం ఒక సభ్యురాలు
4. ఐరాస మొదటి సమావేశం 1946, జనవరిలో జరిగింది
ఎ) 1 బి) 2, 4 సి) 3 డి) 1, 2
25. ఐరాస సంవత్సరాలను సరిగా జత చేయండి.
1. అంతర్జాతీయ అడవుల సంవత్సరం ఎ. 2012
2. అంతర్జాతీయ సహకార సంవత్సరం బి. 2011
3. దేశీయ భాషల అంతర్జాతీయ సంవత్సరం సి. 2016
4. అంతర్జాతీయ పప్పు/ కాయగూరల సంవత్సరం డి. 2019
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
26. కంప్యూటర్స్‌కు సంబంధించి కింది వాటిలో ఏది అప్లికేషన్ సాఫ్ట్వేర్ కాదు?
ఎ) వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్
బి) ఆపరేటింగ్ సిస్టమ్
సి) గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్
డి) స్ప్రెడ్‌షీట్ సాఫ్ట్వేర్
27. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను వాటిని అభివృద్ధి చేసిన కంపెనీలను సరిగా జత చేయండి.
సిస్టమ్ అభివృద్ధి చేసిన సంస్థ
1. ఆండ్రాయిడ్ ఎ. వేరియాస్
2. విండోస్ బి. యాపిల్
3. లైనెక్స్ సి. గూగుల్
4. మ్యాక్ ఓఎస్ డి. మైక్రోసాఫ్ట్
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
28. భారత క్షిపణుల్లో 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణి ఏది?
ఎ) నాగ్ బి) అగ్ని-1
సి) అగ్ని-5 డి) పృథ్వీ
29. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు ప్రమాదవశాత్తు మరణిస్తే ఏ పథకం కింద బీమా సొమ్ము అందజేస్తారు?
ఎ) అంత్యోదయ బి) ఆపద్బంధు
సి) డ్వాక్రా డి) ఆశ్రమ బీమా
30. అమెచ్యూర్ రేడియోను ఇలా కూడా పిలుస్తారు?
ఎ) ఎఫ్ఎమ్ రేడియో బి) ఆకాశవాణి
సి) హేమ్ రేడియో డి) వివిధ భారతి
31. భారతదేశంలో కరువు కింది ఏ అంశంతో ముడిపడి ఉంది?
ఎ) వరదలు
బి) ఎరువుల కొరత
సి) రుతుపవనాలు
డి) ఎండ తీవ్రత
సమాధానాలు
1. బి 2. బి 3. ఎ 4. సి
5. డి 6. బి 7. ఎ 8. ఎ
9. సి 10. డి 11. డి 12. బి
13. సి 14. బి 15. బి 16. బి
17. ఎ 18. డి 19. ఎ 20. సి
21. డి 22. ఎ 23. బి 24. సి
25. డి 26. బి 27. ఎ 28. సి
29. బి 30. సి 31. సి
బీవీ రమణ
డైరెక్టర్, ఏకేఆర్ స్టడీ సర్కిల్,
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు