కైలాస్ శ్రేణిని చైనాలో ఏమని పిలుస్తారు?
![](https://s3.ap-south-1.amazonaws.com/media.nipuna.com/wp-content/uploads/2022/06/Shigar_Gilgit-baltistan_Pakistanf.jpg)
భారతదేశ భౌగోళిక స్వరూపాలు-2
# ట్రాన్స్ హిమాలయాల్లోని ‘కారకోరమ్ పర్వతశ్రేణి’ తర్వాత మరొక శ్రేణి లఢక్ శ్రేణి.
లఢక్ శ్రేణి (Ladhak Range)
# కారకోరమ్ దక్షిణ భాగాన్ని లఢక్ శ్రేణి అంటారు.
# లఢక్ అంటే ఎత్తయిన కనుమల భూభాగం (Land of High Passes) అని అర్థం.
#వీటి పొడవు 370 కిలోమీటర్లు. ష్యోక్, సింధూ నదుల మధ్యలో ఏర్పడి ఉన్నాయి. దీనిలో ఎత్తయిన శిఖరం
స్టాక్ కాంగ్రి (6,153 మీటర్లు). ఇది హెమిస్ నేషనల్ పార్క్’లో ఉంది. ఇది భారత్‌లో అతిపెద్ద నేషనల్ పార్క్.
# లఢక్ శ్రేణులకు ఉత్తర భాగాన భారత్‌లో ఎత్తయిన ‘లఢక్ పీఠభూమి’ ఉంది. దీన్ని భారతదేశ పైకప్పు అంటారు.
#లఢక్ పీఠభూమి ప్రాంతాన్ని ‘భారతదేశ శీతల ఎడారి (Cold Desert of India)’గా పిలుస్తారు.
#లఢక్ శ్రేణులకు పశ్చిమ భాగాన ‘డియోసాయ్ పర్వతాలు’ ఉన్నాయి. వీటికి దక్షిణ అంచులో ‘శిగర్ నది’ ప్రవహిస్తుంది. కార్గిల్ పట్టణం ఈ నది ఒడ్డున ఉంది.
కైలాస్ శ్రేణి (Kailas Range)
# లఢక్ శ్రేణి తూర్పు కొనసాగింపును కైలాస్ శ్రేణి అంటారు. ఇవి టిబెట్‌లో ఉన్నాయి. దీన్ని చైనాలో ‘గ్యాంగ్ డైజ్’ అని అంటారు. వీటిలో ఎత్తయినది మౌంట్ కైలాస్ (6,714మీటర్లు). దీన్ని టిబెట్ బౌద్ధులు మౌంట్ సుమేర్ అని పిలుస్తారు. దీనికి దక్షిణ వాలుల దగ్గర ‘మానస సరోవర్ సరస్సు’ ‘రాకాస్తల్ సరస్సు’ ఉన్నాయి.
# ఈ సరస్సు నుంచి సింధూ, బ్రహ్మపుత్ర, సట్లెజ్, ఘాగ్రా నదులు జన్మించాయి.
జస్కార్ శ్రేణి (Zaskar Range)
#దీన్ని జంగ్స్కర్ శ్రేణి అని కూడా అంటారు.
# ఈ శ్రేణిని హిమాద్రి రూపాంతరాలు అని అంటారు. ఇవి లఢక్, హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్నాయి.
#లఢక్, జస్కార్ శ్రేణులకు మధ్యలో సింధూ నది ప్రవహిస్తుంది.
#జస్కార్ పర్వతాల పశ్చిమ భాగాన దేశంలో అల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ద్రాస్ ప్రాంతం (ద్రాస్ సెక్టార్) ఉంది.
#ఈ శ్రేణుల్లో ఉన్న కార్గిల్ ప్రాంతాన్ని పాకిస్థాన్ దురాక్రమణ చేయడానికి ప్రయత్నించడంతో భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ ను 1999 మే 26 నుంచి జూన్ 26 వరకు చేపట్టి పాకిస్థాన్ సైన్యాలను వెనక్కిపంపింది. ఇదే కార్గిల్ యుద్ధం.
# జస్కార్ శ్రేణులు జమ్ముకశ్మీర్‌ను, లఢక్ ప్రాంతాన్ని వేరుచేస్తున్నాయి.
హిమాద్రి హిమాలయ పర్వతాలు
# వీటిని ఉన్నత లేదా బహిర్ హిమాలయాలు అని కూడా అంటారు.
#వీటి సగటు ఎత్తు 6,100 మీ. పొడవు 2,500 km, సగటు వెడల్పు 25 కిలోమీటర్లతో అవిచ్ఛిన్నంగా ఉన్నాయి.
# ఇవి 25 నుంచి 40 మిలియన్ సంవత్సరాల క్రితం ‘ఒలిగోసిస్’ యుగంలో ఏర్పడ్డాయి. ఇవి హిమాలయాల్లో మొదటగా ఏర్పడిన పురాతన, అత్యంత దుర్బేధ్యమైన శ్రేణి.
#వీటిలో నదుల వల్ల కనుమలు ఏర్పడ్డాయి. ఇవన్నీ శాశ్వత హిమస్థిర రేఖ (Permanent Snow line)ను కలిగి ఉంటాయి.
#హిమాచల్, శివాలిక్ శ్రేణులతో పోలిస్తే వర్షపాతం తక్కువే. శిలా శైథిల్యం (Weathering) తక్కువే.
#ఈ శ్రేణిలో పశ్చిమ భాగాన గల చివరి శిఖరం నంగాపర్బత్ (8,126 మీటర్లు), తూర్పున గల శిఖరం నామ్చా బర్వా (7,756 మీటర్లు).
# ఇవి చాపం ఆకారంలో లేదా కొడవలి ఆకారంలో నైరుతి నుంచి ఆగ్నేయ దిశలో విస్తరించి ఉన్నాయి.
#ప్రపంచంలోని 10 ఎత్తయిన శిఖరాల్లో 9 హిమాద్రిలోనే ఉన్నాయి. అవి..
1. ఎవరెస్ట్ శిఖరం- జార్జ్ ఎవరెస్ట్ పేరుతో ఏర్పడింది. ప్రపంచంలో ఎత్తయినది. ఎత్తు 8,848 మీటర్లు.
# నేపాల్‌లో సాగర్మాత (Goddess of Keys), టిబెట్‌లో చోమలుంగ్మా అని పేరు.
#ఇది సాగర్మాత నేషనల్ పార్క్‌లో ఉంది.
2. K2 లేదా గాడ్విన్ ఆస్టిన్ శిఖరం- ఇది కారకోరమ్ పర్వతంపై ఉంది. దీని ఎత్తు 8,611 మీటర్లు.
# ఇది ప్రపంచంలో రెండో, భారత్‌లో అత్యంత ఎత్తయిన శిఖరం.
# ఇది పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉంది.
# డాప్సంగ్, చోగోరి అనే పేర్లు ఉన్నాయి.
3. కాంచన గంగ శిఖరం- సిక్కిం, నేపాల్ సరిహద్దులో 8,598 మీటర్ల ఎత్తులో హిమాద్రిలో ఉంది.
# ప్రపంచంలో మూడోది, భారత్‌లో రెండో ఎత్తయిన శిఖరం.
#సిక్కిం భాషలో కాంచనగంగ అంటే అయిదు గొప్ప మంచు కోశాగారాలు (Five Treasures of Great Snow).
# కాంచనజంగ బయోస్పియర్ రిజర్వ్ ఇక్కడ ఉంది.
4. లోట్సే (Lhotse) శిఖరం- ఇది నేపాల్‌లో 8,516 మీటర్ల ఎత్తు (హిమాద్రి)లో ఉంది.
#ప్రపంచంలో నాలుగో ఎత్తయినది.
# దీన్ని దక్షిణ శిఖరం (South Peak) అని అంటారు.
5. మకాలు శిఖరం- ఇది నేపాల్‌లో 8,481 మీటర్ల ఎత్తు (హిమాద్రి)లో ఉంది. ప్రపంచంలో 5వ ఎత్తయిన శిఖరం.
# ఇది ఎవరెస్ట్‌కు ఎడమవైపున ‘బారున్ నేషనల్ పార్క్’లో ఉంది.
6. చో ఒయు శిఖరం- నేపాల్‌లో 8,201 మీటర్ల ఎత్తు (హిమాద్రి)లో ఉంది.
#ఇది ప్రపంచంలో 6వ ఎత్తయిన శిఖరం.
7. ధవళగిరి శిఖరం- నేపాల్‌లో 8,172 మీటర్ల ఎత్తు (హిమాద్రి)లో ఉంది.
# ప్రపంచంలో 7వ ఎత్తయిన శిఖరం.
# దీనికి శ్వేతపర్వతం (White Mountain) అని పేరు.
8. మానుస్లూ శిఖరం- నేపాల్‌లో 8,163 మీటర్ల ఎత్తు (హిమాద్రి)లో ఉంది.
#ఇది ప్రపంచంలో 8వ ఎత్తయిన శిఖరం.
9. నంగా పర్బత్ శిఖరం- ఇది లఢక్‌లో 8,126 మీటర్ల ఎత్తు (హిమాద్రి)లో ఉంది.
#ప్రపంచంలో తొమ్మిదో ఎత్తయిన శిఖరం.
#హిమాద్రికి పశ్చిమ సరిహద్దు గల శిఖరం.
# నంగా పర్బత్ అంటే నగ్న పర్వతాలు (Naked Mountains).
#దీన్ని కిల్లర్ మౌంటెయిన్ అని కూడా పిలుస్తారు.
10. అన్నపూర్ణ శిఖరం- నేపాల్‌లో 8,078 మీటర్ల ఎత్తు (హిమాద్రి)లో ఉంది.
#ప్రపంచంలో 10వ ఎత్తయిన శిఖరం.
11. నందా దేవి శిఖరం- ఉత్తరాఖండ్‌లో 7,817 మీటర్ల ఎత్తు (హిమాద్రి)లో ఉంది.
#నందాదేవి బయోస్పియర్ రిజర్వ్‌లో ఉంది.
# ఇది ఉత్తరాఖండ్‌లో ఎత్తయినది.
12. నామ్చా బర్వా శిఖరం- టిబెట్‌లో 7,756 మీటర్ల ఎత్తు (హిమాద్రి)లో ఉంది.
# దిహంగ్ నది ఈ శిఖరం దగ్గర దక్షిణంగా మలుపు తిరుగుతుంది.
# హిమాద్రి పర్వతాల తూర్పు అంచున ఉన్న శిఖరం.
# కామెట్ శిఖరం- ఉత్తరాఖండ్‌లో 7,756 మీటర్ల ఎత్తులో జస్కార్లో ఉంది.
# ఉత్తరాఖండ్‌లో రెండవ ఎత్తయిన శిఖరం.
హిమాద్రి హిమాలయ పర్వతాల్లోని ప్రధాన కనుమలు
1) జమ్ముకశ్మీర్‌లో..
జోజిలా కనుమ: ఇది శ్రీనగర్, కార్గిల్‌ను కలుపుతుంది.
బర్జిల్ కనుమ: శ్రీనగర్, లేహ్‌లను కలుపుతుంది.
2) హిమాచల్ ప్రదేశ్‌లో..
బారాలాచాల కనుమ: మనాలి, లేహ్‌లను కలుపుతుంది.
షిప్కిలా కనుమ (5669మీటర్ల ఎత్తు): సిమ్లా, టిబెట్‌ను కలుపుతుంది. ఇది భారత్‌లో రెండవ ఎత్తయిన కనుమ. సట్లెజ్ నది దీని గుండా భారత్‌లోకి ప్రవేశిస్తుంది
3) ఉత్తరాఖండ్‌లో..
మనకనుమ: ఉత్తరాఖండ్, టిబెట్‌ను కలుపుతుంది.
నితిలా కనుమ: ఉత్తరాఖండ్ నుంచి మానససరోవర్ వరకు ఉంటుంది.
లిపులేఖ్ కనుమ: 1992లో చైనాతో వ్యాపారం కోసం దీన్ని తెరిచారు. కైలాస్ మానస సరోవర్ యాత్రికులు దీన్ని ఉపయోగిస్తారు.
4) సిక్కింలో..
నాథులా కనుమ: సిక్కిం, టిబెట్‌ను కలుపుతుంది. భారత్, చైనాను కలుపుతుంది.
జెలెప్లా కనుమ: సిక్కిం నుంచి లాసాను కలుపుతుంది.
5) అరుణాచల్ ప్రదేశ్‌లో..
బొమ్డిలా కనుమ: తవాంగ్ నుంచి లాసాను కలుపుతుంది.
దీపు కనుమ: అరుణాచల్ ప్రదేశ్, మయన్మార్‌ను కలుపుతుంది. ఇక్కడ భారత్, చైనా, మయన్మార్ల (‘త్రి) సరిహద్దు ఉంది.
దిహంగ్ కనుమ: అరుణాచల్ ప్రదేశ్, మయన్మార్‌ను కలుపుతుంది.
హిమాచల్ హిమాలయాలు
#ఇవి హిమాద్రికి శివాలిక్ శ్రేణులకు మధ్యలో విస్తరించిన పర్వతాలు.
# వీటి ఎత్తు 3,700 నుంచి 4,500 మీటర్లు, పొడవు 2000 KM వరకు సరాసరి వెడల్పు 60 నుంచి 80 కి.మీ మధ్యన ఉన్నాయి.
# వేసవి విడుదులను (Hill Stations) కలిగి ఉన్నాయి.
# హిమాద్రి, హిమాచల్ శ్రేణులకు మధ్యలో కశ్మీర్‌లోయ, ఖఠ్మాండ్ లోయలు కలిగి ఉన్నాయి.
# వీటి నిట్రవాలులో ఆల్పైన్ గడ్డి భూములు, శృంగాకారపు అడవులు ఉన్నాయి.
#ఈ హిమాచల్ శ్రేణులను ప్రాంతీయంగా విభజించారు.
1. పీర్‌పంజల్ శ్రేణి (పంచలదేవ శ్రేణి): ఇది జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లోని శ్రేణి. అత్యంత ఎత్తు, అత్యంత పొడవు (320 కి.మీ) ను కలిగి ఉన్నాయి.
వీటిలో ఉన్న కనుమలు
1) బనిహాల్ కనుమ: ఇది పీర్పంజల్లో ఉంది.
#జమ్ము, శ్రీనగర్‌ను కలుపుతుంది.
# బనిహల్ అంటే మంచు తుఫాను.
#జవహర్ టన్నెల్ నిర్మాణం దీని గుండా జరుగుతుంది.
2) పీర్‌పంజల్ కనుమ: పీర్పంజల్లో ఉంది.
3) రోహ్తంగ్ కనుమ: ఇది పీర్‌పంజల్ హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది.
# రోహ్తంగ్ అంటే ‘శవాలభూమి’
4) హాజిపూర్ కనుమ, 5) సింధన్ కనుమ: ఇవి పీర్పంజల్లో ఉన్నాయి.
#జీలం, చీనాబ్ నదులు పీర్‌పంజల్ శ్రేణిని ఖండించుకుంటూ ప్రవహిస్తున్నాయి.
#ఉన్నత హిమాలయాలకు, పీర్‌పంజల్ శ్రేణులకు మధ్య కశ్మీర్‌లోయ (Kasmir vally)లో ఉంది.
# హిమాచల్ ప్రదేశ్‌లో ఇంద్రసాన్ శిఖరం (6,220 మీటర్లు), డియోతిబ్బ శిఖరం (6,001 మీటర్లు) ఈ శ్రేణుల్లో ఉన్నాయి.
# సోనాపానీ, బారాశిగ్రీ అనే హిమానీనదాలు ఉన్నాయి.
#గుల్మార్గ్, కీలాంగ్, మురే వంటి వేసవి విడుదులు దీనిలో ఉన్నాయి.
# అటల్ టన్నెల్ (రోహ్తంగ్ టన్నెల్): 2020 అక్టోబర్‌లో హిమాచల్ ప్రదేశ్‌లోని పీర్‌పంజల్ శ్రేణుల తూర్పుభాగంలో నిర్మించారు.
# దీని పొడవు 9.02 కి.మీ. ఎత్తు 3100 మీటర్లు, 33 అడుగుల వెడల్పుతో రెండు వరుసల్లో నిర్మించారు.
# దీన్ని మనాలీ నుంచి లేహ్ వెళ్లే జాతీయ రహదారి కోసం రోహ్తంగ్ కనుమ కింది భాగంలో నిర్మించారు.
జీ గిరిధర్
సీనియర్ ఫ్యాకల్టీ
ఫైవ్ మంత్ర ఇన్స్టిట్యూట్
అశోక్‌నగర్
9966330068
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు