పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు
సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు అందించే ప్రోత్సాహకాలు కింది విధంగా ఉన్నాయి
-పారిశ్రామిక వినియోగం నిమిత్తం కొనుగోలు చేసిన భూమి కోసం ఆ పరిశ్రమ చెల్లించిన స్టాంప్‌డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీల మొత్తం 100 శాతం తిరిగి చెల్లింపు.
-భూమి/షెడ్/భవనాల లీజు, అలాగే తనఖా, తాకట్టులపై 100 శాతం స్టాంప్ డ్యూటీ తిరిగి చెల్లింపు
-పారిశ్రామిక వినియోగానికి 25 శాతం భూమి మార్పిడి చార్జీలు
-వాణిజ్య ఉత్పత్తి ఆరంభించిన తేదీ నుంచి 5 ఏండ్ల పాటు యూనిట్‌కు రూ. 10.00 వంతున స్థిర విద్యుత్ ధర తిరిగి చెల్లింపు
-స్థిర మూలధన పెట్టుబడి గరిష్టంగా రూ. 20 లక్షల పరిమితితో 15 శాతం పెట్టుబడి సబ్సిడీ
-వాణిజ్య ఉత్పత్తి ఆరంభించిన తేదీ నుంచి 5 ఏండ్ల పాటు నికరవ్యాట్ / సీఎస్టీ, రాష్ట్ర వస్తు, సేవల పన్ను (ఎస్జీఎస్టీ)లపై 100 శాతం తిరిగి చెల్లింపు
-నూతన సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల స్థిర మూలధన పెట్టుబడిపై పావలా వడ్డీ పథకం కింద తీసుకున్న నియమితకాల రుణాలపై వాణిజ్య ఉత్పత్తి ఆరంభించిన తేదీ నుంచి 5 ఏళ్ల పాటు ఏడాదికి కనిష్టంగా 3 శాతం నుంచి గరిష్టంగా 9 శాతం వరకు వడ్డీ రాయితీ
-తొలితరం పారిశ్రామికవేత్తలు సూక్ష్మ తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వీలుగా యంత్రాల కొనుగోలు ఖర్చులో మూలధన సమీకరణలో 10 శాతం సహాయం. దీనిని అర్హులైన పెట్టుబడి సబ్సిడీ నుంచి తగ్గిస్తారు.
-నైపుణ్యాలను పెంచుకోవడానికీ, స్థానిక కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి అయ్యే ఖర్చులో వ్యక్తికి రూ. 2.000 పరిమితికి లోబడి 50 శాతం తిరిగి చెల్లింపు
-నాణ్యత ధ్రువీకరణకు/పేటెంట్ల నమోదుకు అయ్యే ఖర్చులో రూ. 2 లక్షల పరిమితికి లోబడి 50 శాతం సబ్సిడీ
-నిర్దిష్టమైన పరిశుభ్రత ఉత్పత్తి చర్యలపై రూ. 5 లక్షల పరిమితికి లోబడి 25 శాతం సబ్సిడీ
-రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల పరిధుల్లో ఏర్పాటైన పరిశ్రమలకు సంబంధించి గుర్తించిన సేవల కార్యకలాపాలపై అమలులో ఉన్న నిర్దిష్ట విధానం ప్రకారం పెట్టుబడి సబ్సిడీ పొడిగింపు
భారీ, మధ్య తరహా పరిశ్రమలకు…
భారీ, మధ్య తరహా పరిశ్రమలకు అందించే ప్రోత్సహకాలు కింది విధంగా ఉన్నాయి
-పారిశ్రామిక వినియోగం నిమిత్తం కొనుగోలు చేసిన భూమి కోసం పరిశ్రమ చెల్లించిన స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీల మొత్తం 100 శాతం తిరిగి చెల్లింపు
-తనఖా, తాకట్టుతో సహా భూమి/షెడ్ భవనాల లీజులపై 100 శాతం స్టాంప్ డ్యూటీ తిరిగి చెల్లింపు
-పారిశ్రామిక వాడలు/పారిశ్రామిక పార్కుల్లో భూమి విలువపై రూ. 10 లక్షల పరిమితితో 25 శాతం తగ్గింపు
-పారిశ్రామిక వినియోగ భూమి మార్పిడి చేయడానికి చెల్లించిన చార్జీల్లో రూ. 10 లక్షల పరిమితికి లోబడి మధ్యతరహా పరిశ్రమలకు 25 శాతం తగ్గింపు
-వాణిజ్య ఉత్పత్తి ఆరంభించిన తేదీ నుంచి 5 ఏండ్ల పాటు యూనిట్‌కు రూపాయి చొప్పున స్థిర విద్యుత్ ధర తిరిగి చెల్లింపు
-మధ్య తరహా పరిశ్రమలు వాణిజ్య ఉత్పత్తి ఆరంభించిన తేదీ నుంచి 7 ఏండ్ల పాటు కాలపరిమితి లేదా 100 శాతం స్థిర మూలధన పెట్టుబడి వసూలు కావడాల్లో ఏది ముందు పూర్తయితే అప్పటివరకు 75 శాతం నికర వ్యాట్/సీఎస్టీ లేదా రాష్ట్ర, వస్తు, సేవల పన్ను (ఎస్జీఎస్టీ) తిరిగి చెల్లింపు
-భారీ పరిశ్రమలు వాణిజ్య ఉత్పత్తి ఆరంభించిన 7 ఏండ్ల కాల పరిమితి 100 శాతం స్థిర మూలధన పెట్టుబడి వసూలు కావడాల్లో ఏది ముందు పూర్తయితే అప్పటివరకు 50శాతం నికరవ్యాట్/సీఎస్టీ, రాష్ట్ర వస్తు, సేవల పన్ను (ఎస్జీఎస్టీ) తిరిగి చెల్లింపు
-నైపుణ్యాలను పెంచుకోవడానికి, స్థానిక కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి అయ్యే ఖర్చులో వ్యక్తికి రూ. 2 పరిమితి లోబడి 50 శాతం తిరిగి చెల్లింపు. కేవలం మధ్య తరహా పరిశ్రమలకు మాత్రమే నాణ్య ధ్రువీకరణ/పేటెంట్ల నమోదుకు అయ్యే కర్చులో రూ. 2 లక్షల పరిమితిలోబడి 50 శాతం సబ్సిడీ
-నిర్దిష్టమైన క్లీనర్ ఉత్పత్తి చర్యలపై రూ. 5 లక్షల పరిమితికి లోబడి 25శాతం సబ్సిడీ
-పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఐఐడీఎఫ్) ద్వారా మౌలిక సదుపాయాల ఖర్చులో 50 శాతం సమకూరుస్తూ పరిశ్రమల స్వయం సమృద్ధి యూనిట్ల ముంగిటకే రోడ్లు, విద్యుత్, నీరు లాంటి మౌలిక సదుపాయాలను సమకూర్చడం జరుగుతుంది. దీని పరిమితి రూ. కోటి కాగా అది ఈ అంశాలకు లోబడి ఉంటుంది. (ఎ) పరిశ్రమ ప్రదేశం ప్రస్తుతం నడుస్తున్న పారిశ్రామిక వాడలు/ఐడీలకు 10 కిలోమీటర్లకు మించిన దూరంలో ఉండాలి. కేటాయించడానికి ఖాళీ భూమి/షెడ్లు ఉండాలి. (బి) పరిశ్రమలో పెట్టిన అర్హులైన స్థిర మూలధన పెట్టుబడిలో మౌలిక సదుపాయాల ఖర్చు 15 శాతానికి పరిమితమై ఉండాలి.
మహిళల యాజమాన్యంలోని పరిశ్రమలకు..
మహిళా పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన యూనిట్లకు అందించే ప్రోత్సాహకాలు కింద విధంగా ఉన్నాయి.
-ఎంఎస్ఈలకు రూ. 10 లక్షల గరిష్ట పరిమితికి లోబడి స్థిర మూలధన పెట్టుబడి మీద 10 శాతం అదనపు సబ్సిడీ
-సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు లభించే ఇతర అన్ని ప్రయోజనాలూ వర్తిస్తాయి
మెగా ప్రాజెక్టులకు..
మెగా ప్రాజెక్టులకు అందించే ప్రోత్సాహకాలు కింది విధంగా ఉన్నాయి (మెగా ప్రాజెక్టు అంటే రూ. 200 కోట్లు, అంతకుమించిన పెట్టుబడితో ఏర్పాటైన లేదా 1000 మందికిపైగా వ్యక్తులకు ఉపాధిని సృష్టించిన పారిశ్రామిక యూనిట్)
-ప్రతి పరిశ్రమకు దాని ప్రత్యేకమైన పెట్టుబడి అవసరాలకు సరిపడే అనువైన ప్రయోజనాలను మెగా ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం దేనికి దానికి నిర్ణయించి అందిస్తుంది.
పరిశ్రమలకు సహకారం..
ప్రస్తుత సింగిల్‌విండో అనుమతుల విధానాన్ని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టు అనుమతులు, స్వీయ ధ్రువీకరణ విధానం (టీఎస్ ఐపాస్) ద్వారా పటిష్టం చేయాలనే యోచన ఉంది.
సమర్థవంతమైన సింగిల్‌విండో యంత్రాంగం
రాష్ట్రంలో వ్యాపారం చేయడాన్ని అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలోను, అంతకు మించి సులభతరం చేసేందుకు, ఓ అంతర్గత అనుసంధాన వ్యవస్థను సృష్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టు అనుమతులు, స్వీయ ధ్రువీకరణ విధాన (టీఎస్ ఐపాస్) చట్టం 2014 (2014 చట్టం సంఖ్య 3)ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏపీ పారిశ్రామిక సింగిల్‌విండో అనుమతుల చట్టం 2002ను ఎత్తివేసి పారిశ్రామికవేత్త స్వీయ ధ్రువీకరణ ఆధారంగా దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయడం, పారిశ్రామిక నిర్వహణ సంస్థలను ఏర్పాటు చేయడానికి అవసరమయ్యే వివిధ లైసెన్సులు, అనుమతులు, సర్టిఫికెట్ల జారీ, అలాగే రాష్ట్రంలో పెట్టుబడీదారులకు అనుకూలమైన వాతారణాన్ని అందించడం కొత్త చట్టం ఉద్దేశం.
అభివృద్ధిచెందుతున్న కీలక రంగాలు
పురోగమిస్తున్న కీలక రంగాలుగా 14 రంగాలను ప్రభుత్వం గుర్తించింది. వీటిలో పెట్టుబడులకు మిగిలినవాటికన్నా అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది.
మౌలిక సదుపాయాల మద్దతు
మౌలిక సదుపాయాల మద్దతుకు సంబంధించి విధానంలో పొందుపరిచిన అంశాలు ఈ విధంగా ఉన్నాయి
-పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఐఐడీఎఫ్) పథకం కింద రోడ్లు, విద్యుత్, నీరు, వ్యర్థాల నిర్వహణ తదితర నాణ్యమైన మౌలిక సదుపాయాలను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం బడ్జెట్లో రూ. 100 కోట్లు కేటాయింపు.
-రాష్ట్రంలోపల విలువను పెంపొందిచేందుకు భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల చేకూరే బలాలను ప్రయోజనకరమైన అవకాశంగా మలచుకునేందుకు జాతీయ రహదారుల పొడవునా జాతీయ ఉత్పాదక పెట్టుబడుల జోన్ (NMIZ)లకు ప్రోత్సాహం.
-పనులను గరిష్టంగా వినియోగించుకోవడం కోసం ఇప్పుడున్న బలాల నుంచి సానుకూలత పొందడానికి పారిశ్రామిక కారిడార్లను ప్రోత్సహించడం.
-తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TSIIC) ద్వారా భవిష్యత్తులో అభివృద్ధి చేసే పారిశ్రామికవాడల్లో MSMEల కోసం 30-40 శాతం భూమిని రిజర్వ్ చేయడం.
-కొత్త పారిశ్రామిక వాడల్లో షెడ్యూల్డ్ కులాల పారిశ్రామికవేత్తలకు 15.44 శాతం స్థలాలు, షెడ్యూల్డ్ తెగల పారిశ్రామికవేత్తలకు 9.34 శాతం స్థలాల కేటాయింపు. ప్రస్తుతం ఉన్న పారిశ్రామికవాడల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయింపుల్లో ప్రాధాన్యం.
-కొత్త పారిశ్రామికవాడల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం స్థలాల కేటాయింపు.
తెలంగాణ సామాజిక ఆర్ధిక చిత్రణ -2015 పుస్తకం నుంచి..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు