ఓల్గా నది ఏ సముద్రంలో కలుస్తుంది?
1. పూర్వాంచల్ పర్వతాలు ఏ రాష్ట్రంలో విస్తరించి లేవు ? (1)
1) సిక్కిం 2) అరుణాచల్‌ప్రదేశ్
3) అసోం 4) మిజోరాం
2. నిమ్న హిమాలయాల్లో లేని వేసవి విడిది? (4)
1) నైనిటాల్ 2) కులు 3) ముస్సోరి 4) కొడైకెనాల్
3. దక్షిణ భారత్ ఏ భూభాగం నుంచి ఏర్పడింది? (2)
1) లారెన్షియా 2) గోండ్వానా
3) ఆర్కియన్ 4) ఏదీకాదు
4. దక్కన్ పీఠభూమి ఎటువైపు వంగి ఉంది? (2)
1) పశ్చిమం 2) తూర్పు
3) ఉత్తరం 4) దక్షిణం
5. జీవ నదులు ఏ హిమాలయాల్లో జన్మించాయి? (1)
1) హిమాద్రి 2) నిమ్న హిమాలయాలు
3) బాహ్య 4) పూర్వాంచల్
6. అరుణాచల్‌ప్రదేశ్‌లో సూర్యుడు ఉదయించిన రెండు గంటల తర్వాత ఎక్కడ ఉదయిస్తాడు? (3)
1) అహ్మదాబాద్ 2) సూరత్
3) రాణ్ ఆఫ్ కచ్ 4) డయ్యు దీవి
7. 82 1/2 తూర్పు అక్షాంశం ఏ దేశానికి/దేశాలకు ప్రామాణిక కాలం? (4)
1) భారత్ 2) నేపాల్ 3) శ్రీలంక 4) పైవన్నీ
8. మయన్మార్‌లోని కొండలు? (3)
1) పాట్కాయ్ 2) ఆరకాన్ 3) 1, 2 4) ఏదీకాదు
9. విస్తీర్ణపరంగా దక్కన్ పీఠభూమి, మాళ్వా పీఠభూములు పెద్దవి. వీటిని విభజిస్తున్న నది ఏది? (1)
1) నర్మద 2) తపతి 3) మహానది 4) కృష్ణ
10. భారత్, శ్రీలంకలను వేరుచేస్తున్న జలసంధి? (1)
1) పాక్ 2) హడ్సన్ 3) జిబ్రాల్టర్ 4) ఏదీకాదు
11. రాబోయే కాలంలో సగటు ఉష్ణోగ్రతలు 20C పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల సముద్ర మట్టం ఎన్ని మీటర్లు పెరుగుతుంది? (2)
1) 2 మీ. 2) 1 మీ. 3) 3 మీ. 4) ఏదీ కాదు
12. ఐలా తుపాను వల్ల 2008లో అతలాకుతలమైన డెల్టా? (4)
1) గోదావరి డెల్టా 2) కావేరి డెల్టా
3) కృష్ణా డెల్టా 4) సుందర్బన్ డెల్టా
13. కిందివాటిలో హరిత గృహ వాయువు కానిది? (4)
1) కార్బన్ డై ఆక్సైడ్ 2) మీథేన్ 3) సీఎఫ్‌సీ 4) పైవన్నీ
14. ఊటి వేసవి విడిది ఎక్కడ ఉంది? (1)
1) నీలగిరి పర్వతాలు 2) పళని కొండలు
3) అన్నామలై పర్వతాలు 4) ఏదీకాదు
15. భగీరథ, అలకనంద నదులు దేవప్రయాగ వద్ద కలుసుకొని గంగానది ఏర్పడింది. అది ఏ రాష్ట్రంలో ఉంది? (2)
1) ఉత్తరప్రదేశ్ 2) ఉత్తరాఖండ్
3) బీహార్ 4) పశ్చిమబెంగాల్
16. బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్‌ప్రదేశ్‌లో ఏమంటారు? (3)
1) ఎరుపు నది 2) త్సాంగ్పో 3) దిహంగ్ 4) జమున
17. బ్రహ్మపుత్ర ఉపనది కానిదేది? (3)
1) దిహంగ్ 2) తీస్తా 3) మేఘన 4) సియాంగ్
18. ద్వీపకల్ప పీఠభూముల్లో జన్మించని నది? (3)
1) సోన్ 2) కెన్ 3) గండక్ 4) చంబల్
19. సహ్యాద్రి పర్వతశ్రేణికి వర్షాఛాయ ప్రాంతంలో కరువు జిల్లాగా ఉన్నది? (4)
1) సూరత్ 2) కచ్ 3) బరోడా 4) అహ్మదాబాద్
20. భారత్ మొదటి జనగణన ఎప్పుడు జరిగింది? (2)
1) 1871 2) 1872 3) 1881 4) 1882
21. ప్రపంచంలో మొత్తం 24 కాలమండలాలు ఉన్నాయి. ఒక కాలమండలానికి, మరొక కాలమండలానికి గంట తేడా ఉంటుంది. ఆ తేడా ఎన్ని డిగ్రీల రేఖాంశాలు ఉంటాయి? (2)
1) 20 డిగ్రీలు 2) 15 డిగ్రీలు
3) 10 డిగ్రీలు 4) 25 డిగ్రీలు
22. భూభ్రమణంలో తూర్పునకు వెళ్లేకొద్ది కాలం? (1)
1) పెరుగుతుంది 2) మారదు
3) తగ్గుతుంది 4) ఏదీకాదు
23. భూభ్రమణంలో ఏ రెండు రేఖాంశాల మధ్య కాల వ్యత్యాసం? (1)
1) 4 నిమిషాలు 2) 3 నిమిషాలు
3) 5 నిమిషాలు 4) 2 నిమిషాలు
24. ప్రపంచంలో అతిపెద్ద అగాథదరి అయిన గ్రాండ్ కాన్యన్ ఏ నదిపై ఉంది? (2)
1) మిసిసిపి 2) కొలరాడో
3) నైలునది 4) అమేజాన్
25. ప్రపంచంలో అత్యధిక లవణీయత ఉన్న జలభాగం? (1)
1) వాన్ సరస్సు 2) మహా లవణ సరస్సు
3) హడ్సన్ ఖాతం 4) బాల్టిక్ సముద్రం
26. ప్రపంచ పంచదార ఉత్పత్తిలో భారత్ స్థానం? (3)
1) మొదటి 2) మూడో 3) రెండో 4) ఏదీకాదు
27. భారత్‌లో మొదటి తోళ్ల పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారు? (4)
1) ముంబై 2) కలకత్తా 3) హైదరాబాద్ 4) కాన్పూర్
28. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? (4)
1) 1910 2) 1920 3) 1810 4) 1856
29. కోర్బా బొగ్గు గని ఏ రాష్ట్రంలో ఉంది? (2)
1) ఉత్తరప్రదేశ్ 2) ఛత్తీస్‌గఢ్
3) ఆంధ్రప్రదేశ్ 4) తెలంగాణ
30. భూ ఉపరితలంపై మంచినీరు మంచు ప్రాంతంలో ఎంత శాతం ఉంది? (4)
1) 29.9 శాతం 2) 1.4 శాతం
3) 97.1 శాతం 4) 68.7 శాతం
31. ప్రపంచంలో లోతైన అగాథం? (3)
1) జావా అగాథం 2) ప్యూటొర్టికా అగాథం
3) మేరియానా అగాథం 4) ఏదీకాదు
32. మహా సముద్రంలో సరాసరి లవణ శాతం? (2)
1) 3.5 శాతం 2) 35 శాతం
3) 4.5 శాతం 4) 45 శాతం
33. కోరియాలసిస్ ప్రభావం ఎక్కువ దేనిపై ఉంటుంది? (2)
1) భూమధ్యరేఖ 2) ధృవాల వద్ద
3) కర్కటరేఖ 4) మకరరేఖ
34. వాతావరణంలో అత్యధిక శాతంగా ఉన్న వాయువు? (3)
1) ఆక్సిజన్ 2) కార్బన్ డై ఆక్సైడ్
3) నైట్రోజన్ 4) ఆర్గాన్
35. లూ వేడి పవనాల వల్ల భారత్ ఏ ప్రాంతంలో ఎక్కువ నష్టం జరుగుతుంది? (1)
1) వాయవ్యంలో 2) ఉత్తరాన
3) ఆగ్నేయం 4) నైరుతి
36. వివిధ ఖండాల పశ్చిమ అంచున ఏ అడవులు విస్తరించి ఉన్నాయి? (4)
1) కోనిపెరస్ 2) సతత హరిత
3) ఆకురాల్చే 4) ముళ్ల
37. కిందివాటిలో రబీ పంట ఏది? (3)
1) వరి 2) చిరుధాన్యాలు
3) గోధుమ 4) పత్తి
38. రైన్ నది కింది ఏ దేశం గుండా ప్రవహించదు? (1)
1) ఇటలీ
2) ఫ్రాన్స్
3) జర్మనీ
4) నెదర్లాండ్
39. నల్ల సముద్ర తీరం లేని దేశం ఏది? (4)
1) రష్యా 2) ఉక్రెయిన్ 3) టర్కీ 4) చైనా
40. మధ్యదరా సముద్రాన్ని సరిహద్దుగా లేని దేశం? (3)
1) ఇటలీ 2) ఫ్రాన్స్ 3) జర్మనీ 4) స్పెయిన్
41. యూరప్ ఖండానికి దక్షిణాన లేని సముద్రం? (2)
1) మధ్యదరా సముద్రం 2) ఎర్ర సముద్రం
3) నల్ల సముద్రం
4) కాస్పియన్ సముద్రం
42. కిందివాటిలో ద్వీపకల్ప దేశం? (1)
1) ఇటలీ 2) ఇంగ్లండ్ 3) ఆస్ట్రియా 4) పోలెండ్
43. ఓల్గా నది ఏ సముద్రంలో కలుస్తుంది? (2)
1) నల్ల సముద్రం 2) కాస్పియన్ సముద్రం
3) మధ్యదరా సముద్రం
4) అట్లాంటిక్ మహాసముద్రం
44. భూభాగంలోకి చొచ్చుకొచ్చిన సముద్రాన్ని ఏమంటారు? (4)
1) అగాథం 2) ద్వీపకల్పం
3) జలసంధి 4) సింధుశాఖ
45. భూమధ్యరేఖ ఏ ఖండం గుండా పోదు? (3)
1) ఆఫ్రికా 2) ఆసియా
3) అంటార్కిటికా 4) దక్షిణ ఆఫ్రికా
46. ఆఫ్రికా ఖండానికి ఉత్తర సరిహద్దు? (3)
1) ఎర్ర సముద్రం 2) అట్లాంటిక్ సముద్రం
3) మధ్యదరా సముద్రం 4) అరేబియా సముద్రం
47. కిందివాటిలో సరైన జత కానిది? (2)
1) నైలునది-మధ్యదరా సముద్రం
2) కాంగోనది-ఎర్ర సముద్రం
3) నైగర్-అట్లాంటిక్ మహాసముద్రం
4) జాంబేజి నది-హిందూమహాసముద్రం
48. విక్టోరియా సరస్సు గుండా పుట్టిన నది? (2)
1) నైగర్ 2) నైలు 3) జాంబేజి 4) ఏదీకాదు
49. కిందివాటిలో మంచినీటి సరస్సు? (2)
1) చాడ్ 2) విక్టోరియా 3) గామి 4) ఏదీకాదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు