మత నియోజకవర్గాల పితామహుడు ఎవరు?
1. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి? (3)
ఎ) 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా గవర్నర్ ఆఫ్ బెంగాల్‌ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా మార్పుచేశారు?
బి) 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా 1774లో సుప్రీంకోర్టుని కలకత్తాలో నెలకొల్పారు
సి) కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే భావనలు పిట్స్ ఇండియా చట్టం 1784 ద్వారా సృష్టించారు
డి) 1833 చట్టం ద్వారా బాంబే, మద్రాస్ గవర్నర్ల శాసన అధికారాలు తగ్గించారు.
1) ఎ, బి 2) బి, సి, డి
3) పైవన్నీ సరైనవి 4) సి, డి సరైనవి
2. కిందివాటిలో సరైనవాటిని గుర్తించండి? (4)
ఎ) మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ లార్డ్ వారెన్ హేస్టింగ్
బి) మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ విలియం బెంటిక్
సి) మొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్
డి) చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ కానింగ్
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి 4) పైవన్నీ సరైనవి
3. కింది వాటిలో సరైన దానిని గుర్తించండి? (3)
ఎ) 1833 చార్టర్ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు
బి) 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాను వైస్రాయ్గా మార్చారు
సి) భారతదేశ చివరి ఆంగ్ల వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్
డి) దేశంలో మొదటి, చివరి భారతీయ వైస్రాయ్ రాజాజీ
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) పైవన్నీ సరైనవే 4) సి, డి మాత్రమే
4. కింది వాటిలో సరైన దానిని గుర్తించండి? (4)
ఎ) 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా పోస్ట్ సృష్టించారు
బి) 1858 భారతప్రభుత్వ చట్టం ద్వారా బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ విధానాలను రద్దు చేశారు
1) ఎ 2) బి 3) ఏవీకావు 4) ఎ, బి
5. కిందివాటిలో ఏ చట్టాన్ని భారత సుపరిపాలన చట్టంగా అభివర్ణిస్తారు? (4)
1) 1833 చార్టర్ చట్టం 2) 1853 చార్టర్ చట్టం
3) 1919 చట్టం 4) 1858 భారత ప్రభుత్వ చట్టం
6. కింది వారిలో ఎవరిని మత నియోజకవర్గాల పితామహునిగా పిలుస్తారు? (1)
1) లార్డ్ మింటో 2) లార్డ్ మాంటెంగ్
3) లార్డ్ ఇర్విన్ 4) లార్డ్ మోర్లే
7. 1919 భారత ప్రభుత్వ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? (2)
1) 1922 2) 1921 3) 1920 4) 1919
8. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి? (3)
ఎ) కేంద్రంలో ద్విసభా విధానాన్ని 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు
బి) ప్రావిన్స్‌లలో ద్విసభా విధానాన్ని 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు
సి) ప్రావిన్స్‌లలో ద్వంద్వ పాలనని (Dyarchy) 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు
డి) కేంద్రంలో ద్వంద్వ పాలనని 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) పైవన్నీ సరైనవి 4) సి, డి
9. సరైనదానిని గుర్తించండి? (3)
ఎ) 1909 మింటో మార్లే చట్టం ద్వారా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు
బి) 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా సిక్కులు, క్రిస్టియన్లు, ఆంగ్లో ఇండియన్లు, యూరోపియన్లకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు
సి) 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, మహిళలు, శ్రామికులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు
డి) 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రావిన్స్‌లలోని ద్వంద్వ పాలనను రద్దు చేసింది
1) ఎ, బి 2) సి, డి 3) పైవన్నీ సరైనవి 4) ఎ, సి
10. క్రిప్స్ ప్రతిపాదనలు ఒక దివాళా తీసే బ్యాంక్ ముందు తేదీవేసి అందించే చెక్కు లాంటివి అని ఎవరు విమర్శించారు?(3)
1) నెహ్రూ 2) నేతాజీ 3) మహాత్మాగాంధీ 4) పటేల్
11. 1946 నాటి మధ్యంతర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఎవరు? (1)
1) రాజాజీ 2) మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్
3) అసఫ్ అలీ 4) రాజ్‌కుమారి అమృత్‌కౌర్
12. 1947 నాటి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? (3)
1) రాజేంద్ర ప్రసాద్ 2) వీఎన్ గాడ్గిల్
3) షణ్ముఖ చెట్టి 4) జాన్ మథాయ్
13. 1946 నాటి మంత్రిత్వ శాఖలను జతపర్చండి? (4)
మంత్రి శాఖ
ఎ) రాజేంద్ర ప్రసాద్ i) ఆహారం, వ్యవసాయం
బి) జవహర్ లాల్ నెహ్రూ ii) న్యాయశాఖ
సి) లియాఖత్ అలీ iii) ఆర్థికశాఖ
డి) జోగిందర్‌నాథ్ మండల్ iv) విదేశాంగశాఖ,
కామన్వెల్త్ సంబంధాలు
1) ఎ- i, బి- ii, సి- iii, డి- iv
2) ఎ- i, బి- iii, సి- iv, డి- ii
3) ఎ- iv, బి- ii, సి- i, డి- iii
4)ఎ- i, బి- iv, సి- iii, డి- ii
14. 1947 నాటి మంత్రిత్వ శాఖలను జతపర్చండి? (2)
మంత్రి శాఖ
ఎ) జాన్ మథాయ్ i) రైల్వేలు, రవాణా
బి) బీఆర్ అంబేద్కర్ ii) ఆరోగ్యం
సి) రాజ్‌కుమారి అమృత్‌కౌర్ iii) న్యాయం
డి) సర్దార్ బల్దేవ్ సింగ్ iv) డిఫెన్స్ (రక్షణ రంగం)
1) ఎ- i, బి- ii, సి- iii, డి- iv
2) ఎ- i, బి- iii, సి- ii, డి- iv
3) ఎ- iv, బి- ii, సి- iii, డి- i
4) ఎ- i, బి- iv, సి- ii, డి- iii
15. కింది వాటిలో 1935 భారత ప్రభుత్వ చట్టంలోని అంశాలను గుర్తించండి? (3)
ఎ) ఫెడరల్ జాబితా (59 అంశాలు), రాష్ట్ర జాబితా (54 అంశాలు), ఉమ్మడి జాబితా (36 అంశాలు) ఏర్పాటయ్యాయి
బి) రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని పేర్కొంది
సి) ఫెడరల్ కోర్ట్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది
డి) 1935 చట్టం 321 సెక్షన్లు, 10 షెడ్యూళ్లని కలిగి ఉంది
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) పైవన్నీ సరైనవి 4) సి, డి మాత్రమే
16. భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన బ్రిటిష్ ప్రధాని ఎవరు? (1)
1) క్లెమెంట్ అట్లీ 2) వేవెల్
3) లార్డ్ క్రిప్స్ 4) మౌంట్ బాటన్
17. సరైనవాటిని గుర్తించండి? (3)
ఎ) 1947, ఫిబ్రవరి 20న బ్రిటిష్ ప్రధానమంత్రి భారతదేశంలో బ్రిటిష్ పాలన 1948, జూన్ 30న ముగుస్తుందని ప్రకటించారు
బి) 1947 భారత ప్రభుత్వ చట్టం వైస్రాయ్ పోస్ట్‌ని రద్దుచేసింది.
1) ఎ 2) బి 3) ఎ, బి 4) పైవేవీ కాదు
18. కింది వాటిలో ఏ చట్టం ద్వారా కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్‌ను వేరుచేశారు? (4)
1) 1909 2) 1935 3) 1961 4) 1919
lord-mountbatten
19. రామ్సే మెక్‌డొనాల్డ్ కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా గాంధీజీ ఏ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేశారు? (1)
1) ఎరవాడ జైలు 2) రంగూన్ జైలు
3) తీహార్ జైలు 4) ఢిల్లీ సెంట్రల్ జైలు
20. సరైనవాటిని ఎంపిక చేయండి? (3)
ఎ) సైమన్ కమిషన్ 1927, నవంబర్‌లో ఏడుగురు సభ్యులతో ఏర్పాటైంది
బి) సైమన్ కమిషన్ తన నివేదికను 1930లో అందజేసింది
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏవీకావు
21. మొట్టమొదటి భారత వ్యవహారాల మంత్రి ఎవరు? (2)
1) చార్లెస్ డికెన్స్ 2) చార్లెస్ ఉడ్
3) కానింగ్ 4) మెకాలే
22. భారతీయులు సైమన్ కమిషన్ని ఎందుకు బహిష్కరించారు? (1)
1) సైమన్ కమిషన్‌లో భారతీయులు లేరు
2) సైమన్ కమిషన్‌ను బ్రిటన్ ప్రభుత్వం నియమించింది
3) సైమన్ కమిషన్ కాలయాపన కోసమే నియమితమైంది
4) ఏవీకావు
23. జతపర్చండి? (2)
చట్టాలు సంవత్సరం
ఎ) సివిల్ ప్రొసీజర్ కోడ్ i) 1833 చట్టం
బి) క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ii) 1861
సి) ఇండియన్ పీనల్ కోడ్ iii) 1860
డి) లా కమిషన్ iv) 1859
1) ఎ- i, బి- ii, సి- iii, డి- iv
2) ఎ- iv, బి- ii, సి- iii, డి- i
3) ఎ- iv, బి- ii, సి- i, డి- iii
4) ఎ- ii, బి- i, సి- iii, డి- iv
24. ఏ చట్టం ద్వారా దేశంలో తొలిసారిగా సివిల్ సర్వీసెస్‌లో భారతీయులకు పోటీ పరీక్ష విధానం ప్రవేశపెట్టారు? (3)
1) 1858 2) 1813 3) 1853 4) 1833
25. భారత లా కమిషన్ మొదటి చైర్మన్? (1)
1) లార్డ్ మెకాలే 2) విలియం కాంప్
3) విలియం బెంటిక్ 4) మన్రో
26. కింది వాటిలో ఏ చట్టం ద్వారా కేంద్ర శాసనసభలో బడ్జెట్‌ని తొలిసారిగా చర్చించడానికి వీలు కల్పించారు? (2)
1) 1861 2) 1892 3) 1833 4) 1909
27. ఏ కమిటీ సిఫారసు మేరకు సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్‌ని 1921లో వేరు చేశారు? (2)
1) లీలానాథ్గో కమిటీ 2) ఆక్వర్త్ కమిటీ
3) మెకాలే కమిటీ 4) హంటర్ కమిటీ
28. కింది వాటిలో ఏ చట్టాన్ని అనుసరించి పోర్ట్‌పోలియో విధానాన్ని ప్రవేశపెట్టారు? (1)
1) 1861 2) 1863 3) 1892 4) 1813
29. స్వతంత్ర భారత్‌కు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? (2)
1) రాజగోపాల చారి 2) మౌంట్ బాటన్
3) కానింగ్ 4) అట్లీ
30. కింది వారిలో వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో చేరిన తొలి భారతీయుడు ఎవరు? (1)
1) సత్యేంద్ర ప్రసాద్ సిన్హా 2) సత్యేంద్రప్రసాద్ సింగ్ 3) సురేంద్రనాథ్ సింగ్ 4) సురేంద్రనాథ్ బెనర్జీ
31. 1861 చట్టాన్ని అనుసరించి భారతదేశంలో మొదటి హైకోర్టుని ఎక్కడ ఏర్పాటు చేశారు? (4)
1) బొంబాయి 2) మద్రాస్
3) ఢిల్లీ
4) కలకత్తా
32. క్యాబినెట్ మిషన్‌లోని సభ్యులను గుర్తించండి? (4)
1) పెథిక్ లారెన్స్ 2) స్టాపర్డ్ క్రిప్స్
3) అలెగ్జాండర్ 4) పైవారందరూ
33. కింది వాటిలో భారత స్వాతంత్య్ర చట్టానికి సంబంధించి సరైనవి పేర్కొనండి. (3)
ఎ) 1947, జూలై 4న భారత స్వాతంత్య్ర బిల్లును బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం
బి) 1947, జూలై 15న బ్రిటిష్ పార్లమెంట్ ఆమోందించడం
సి) 1947, జూలై 18న బ్రిటిష్ రాజమకుటం ఈ బిల్లును ఆమోందించడం
డి) ఈ చట్టం ప్రకారం భారత్, పాకిస్థాన్ దేశాలుగా విడిపోయాయి
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
34. 1947 భారత స్వాతంత్య్ర చట్టం ప్రకారం భారత యూనియన్‌లో చేరని సంస్థానాలు ఏవి? (2)
ఎ) జునాగఢ్ బి) జమ్ముకశ్మీర్
సి) ట్రావెన్కోర్ డి) హైదరాబాద్
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) సి, డి 4) ఎ, బి, డి
35. క్యాబినెట్ మిషన్ ప్లాన్‌లోని సిఫారసులను గుర్తించండి?(3)
ఎ) 1946, జూలైలో రాజ్యాంగపరిషత్కి ఎన్నికలు నిర్వహిస్తారు
బి) భారత రాజ్యాంగ రచన అనంతరం భారతదేశానికి స్వాతంత్య్రం అందిస్తామని ప్రకటించడం
1) ఎ 2) బి 3) రెండూ సరైనవి 4) రెండూ కాదు
36. క్రిప్స్ రాయబారం భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? (1)
1) 1942, మార్చి 22 2) 1943, మార్చి 22
3) 1946, మార్చి 23 4) 1942, మార్చి 23
37. భారతదేశానికి.. లేబర్ పార్టీ నాయకుడు అట్లీ క్యాబినెట్ మిషన్ ప్లాన్‌ని ఎప్పుడు పంపించారు? (2)
1) 1942, మార్చి 22 2) 1946, మార్చి 23
3) 1947, మార్చి 23 4) 1945, మార్చి 23
38. 1947 భారత స్వాతంత్య్ర చట్టానికి మూలం? (1)
1) మౌంట్ బాటన్ పథకం 2) క్యాబినెట్ మిషన్ ప్లాన్ 3) క్రిప్స్ రాయబారం 4) సైమన్ కమిషన్
39. రామ్సే మెక్‌డొనాల్డ్ ఏ సంవత్సరంలో కమ్యూనల్ అవార్డుని ప్రకటించారు? (1)
1) 1932 ఆగస్టు 2) 1931 ఆగస్టు
3) 1932 జనవరి 4) 1931 జనవరి
40. భారత యూనియన్‌లో సంస్థానాల విలీనం ఘనత ఎవరికి దక్కుతుంది? (4)
1) గాంధీ 2) నెహ్రూ
3) సుభాష్ చంద్రబోస్ 4) సర్దార్ వల్లభాయ్ పటేల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు