కౌటిల్యుని నోట.. ఖనిజ సంపద మాట
ఖనిజ వనరులు
భూ పటలం శిలలతో ఏర్పడి ఉన్నది. శిలలు ఖనిజాలతో ఏర్పడి ఉన్నాయి.ఈ ఖనిజాలు అనేక మూలకాల రసాయనిక సమ్మేళనాలతో సహజ సిద్ధంగా ఏర్పడిన కర్బన, అకర్బన సమ్మేళనాలు. ఏ రాష్ట్ర అభివృద్ధిలోనైనా వీటి పాత్ర కీలకం. ఖనిజాల లభ్యత,వాటి ప్రాముఖ్యం గురించి తెలుసుకుందాం.
- ఖనిజ వనరులు తరిగిపోయే వనరులు. ఈ వనరులను అభిలషణీయ రీతిలో ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
- ఒక రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో లభ్యమయ్యే ఖనిజాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. వీటిని ఖనిజ సంపదగా పేర్కొంటారు.
- ఖనిజాల ప్రాముఖ్యతను గురించి కౌటిల్యుని అర్థశాస్త్రంలో పేర్కొనబడింది. దీనిలో ఖనిజాలను సంపదగా పేర్కొన్నారు.
- భారతదేశంలో ఖనిజ సంపద విస్తారంగా లభిస్తున్న రాష్ర్టాలలో తెలంగాణ ఒకటి.తెలంగాణ భారతదేశంలోనే గాక యావత్ ప్రపంచంలోనే అతి పురాతన భూభాగాలలో ఒకటి.
- ఖనిజ సంపదకు మూలాలైన పురాతనమైన శిలా సముదాయాలు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కలవు.ఈ పురాతన శిలలతో కూడిన మన రాష్ట్రంలో బొగ్గు, ఇనుప ఖనిజం, మాంగనీసు, మెరుగుమట్టి, అభ్రకం, బంగారం మొదలైన ఖనిజాలు లభిస్తున్నాయి.
- తెలంగాణ వైవిధ్యభరితమైన భూగర్భ శాస్ర్తాన్ని కలిగి ఉంది. నిర్దిష్ట ఖనిజ పరిశ్రమలకు అనువైన అనేక రకాలైన ఖనిజాలను కలిగి ఉంది. మైనింగ్, క్వారీ కార్యకలాపాల కోసం ప్రభుత్వం 88,809 హెక్టార్ల భూమిని లీజుకు తీసుకుంది. రాష్ట్రంలో 1,904 ఖనిజ పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో జోగులాంబ-గద్వాల (723), ఖమ్మం (463), వికారాబాద్ (234), కుమ్రంభీం (183) యూనిట్ల గరిష్ఠ వాటాను కలిగి ఉన్నాయి. 2019-20లో రాష్ట్రం మొత్తం ఆదాయం ఖనిజ ఉత్పత్తి ద్వారా రూ. 3,715.78 కోట్లు. ఖనిజ ఆదాయ వసూళ్లు 2014-15 నుంచి 2019-20 మధ్య కాలంలో రూ.19,776 కోట్లు సాధించారు.
- తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TSMDC) అన్వేషణ, మైనింగ్ కార్యకలాపాల ద్వారా ఖనిజ వనరులను అభివృద్ధి చేయడానికి బాధ్యత వహిస్తుంది. TSMDCని 2016లో గనుల మంత్రిత్వ శాఖ నేషనల్ ఎ రేషన్ ఏజెన్సీ (NEA)గా ప్రకటించింది. రాష్ట్రం లోపల, వెలుపల ఖనిజాల అన్వేషణను చేపట్టింది.
- తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ మధ్యస్థాయి ఇనుప నిక్షేపాలు బయ్యారం అటవీ ప్రాంతంలో, ఖమ్మంలో అక్కడక్కడ రెవెన్యూ, పట్టా భూముల్లో కలవు.
- అల్పస్థాయి ఇనుప నిక్షేపాలు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉన్నాయి.
- తెలంగాణ రాష్ట్రం పీఠభూమితో ఆవరించి ఉంది. వీటిలో అతి ప్రాచీన యుగానికి చెందిన ధార్వార్ శిలలు వివిధ ప్రభావాలకు లోనై అభ్రకం శిలలుగాను, బంగారు శిలలుగాను, అవక్షేప శిలలుగాను, ఖనిజాలుగాను రూపాంతర ప్రాప్తి పొందినవి.
- తర్వాత భూకంపాలు, వరదలు సంభవించి నదీ ప్రవాహ మార్గాల్లో భ్రంశాలు ఏర్పడి వాటిలో వృక్షజాలం అభివృద్ధి చెంది కొంత కాలానికి నదీ అవక్షేపాలతో కప్పబడి అంతర్భాగంలో తీవ్రమైన వేడికి, ఒత్తిడికి రూపాంతర ప్రాప్తి చెంది బొగ్గుగా ఏర్పడింది.
ఉదా: సింగరేణి బొగ్గు గనులు
- స్వాతంత్య్రానికి పూర్వమే ఖనిజాల అన్వేషణ, సర్వేక్షణ అనేవి ఒక పద్ధతి ప్రకారం చేపట్టారు. వీటి లభ్యత తగ్గిపోవడం వల్ల ప్రత్యామ్నాయ పదార్థాలు తయారు చేయడం, అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి.
- ఖనిజాలు జాతీయ ఆదాయానికి ప్రధానమైన వనరులుగా ఉండడమే కాకుండా ఆర్థికాభివృద్ధికి, పారిశ్రామిక అభివృద్ధికి గట్టి పునాది ఏర్పడుతుంది.
- తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాలైన ఖనిజ నిల్వలు ఉండి అవి విస్తృత ఆర్థిక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి.
- జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్, అటామిక్ మినరల్ డివిజన్ మొదలైన ఏజెన్సీలు అనేక లోహ, అలోహ ఖనిజాలను కనుగొన్నారు.
- ఇనుము, మాంగనీసు, క్రోమైట్, కాపర్, మాలిబ్డినైట్, యురేనియం, బొగ్గు, లైమ్‌స్టోన్, బెరైటీస్, గ్రానైట్, క్వార్ట్, ఫెల్డ్స్ఫార్, డోలమైట్, షేల్, ఆస్బెస్టాస్ మొదలైన వాటి నిల్వలు ఉన్నాయి.
ఖనిజ వనరుల అధ్యయనం: మినరాలజీ
- తెలంగాణ వైవిధ్య భౌగోళికత కలిగి, నిర్దిష్ట ఖనిజ పరిశ్రమలకు విలువైన, విస్తృతమైన ఖనిజాలు కలిగి ఉంది.
- జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్న కొద్ది ఖనిజాల వినియోగం కూడా పెరుగుతుంది.
- తెలంగాణలో ముఖ్యంగా బొగ్గు, ముడి ఇనుము, సున్నపురాయి, డోలమైట్, మాంగనీస్, క్వార్ట్, ఫెల్డ్స్ఫార్, బెరైటీస్, యురేనియం, సాధారణ ఇసుక నిక్షేపాలు కలిగి ఉన్నాయి.
ఖనిజాలను ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:
1. లోహ ఖనిజాలు: రాగి, వెండి, బంగారం, ఇనుము, ప్లాటినం, మాంగనీసు, అల్యూమినియం మొదలైనవి.
2. అలోహ ఖనిజాలు: ముగ్గురాయి, సున్నపురాయి, ఆస్బెస్టాస్, మైకా, గ్రాఫైట్, వజ్రం మొదలగునవి.
3. అణు ఖనిజాలు: థోరియం, యురేనియం మొదలైనవి.
4. ఇంధన ఖనిజాలు: బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు మొదలైనవి.
రాగి
- తెలంగాణలో రాగి నిక్షేపాలు విస్తరించి ఉన్న ప్రాంతం మైలారం ప్రాంతం (భద్రాద్రి కొత్తగూడెం)
- ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రాగి నిక్షేపాలు గుర్తించారు.
- భారతదేశంలో రాగి నిక్షేపాలు ఎక్కువగా విస్తరించి ఉన్న రాష్ట్రం రాజస్థాన్.
- తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెంలోని మైలారం, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తున్నారు.
మాంగనీసు
- భారతదేశంలో మాంగనీస్ నిల్వలు అధికంగా గల రాష్ట్రం ఒడిశా.
- భారతదేశంలో మాంగనీస్‌ను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం మధ్యప్రదేశ్.
- తెలంగాణలో మాంగనీస్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లాలు: ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్.
- మాంగనీస్ ప్రధానంగా ఉక్కు, బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారు.
- ఈ ఖనిజం ఆదిలాబాద్ జిల్లాలోని ధామ్సీ, జైనాథ్, నిజామాబాద్ జిల్లాలోని ఖండాలీ, రతంపేట్లో ఉత్పత్తి చేస్తున్నారు.
ఇనుప ఖనిజం 4 రూపాల్లో లభిస్తుంది. అవి..
- భారతదేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అధిక మొత్తం హెమటైట్ రూపంలో ఇనుము లభిస్తుంది.
- భారతదేశంలో 1904లో కనుగొన్న మొదటి ఇనుప గని: సింగ్భమ్ (జార్ఖండ్)
- భారతదేశంలో జార్ఖండ్ రాష్ట్రంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు అధికంగా ఉన్నాయి.
- భారతదేశంలో కర్ణాటక రాష్ట్రం అధికంగా ఇనుమును ఉత్పత్తి చేస్తుంది.
- తెలంగాణలో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, కొత్తగూడెం, బయ్యారంలో ఇనుము విస్తరించి ఉంది.
- తెలంగాణలో ఇనుప ఖనిజాల నిల్వలు ఎక్కువగా బయ్యారం, కొత్తగూడెం, ఖమ్మంలో ఉన్నాయి.
మహబూబాబాద్‌లోని బయ్యారంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా లభ్యమవుతున్నాయి.
బంగారం
- బంగారంలో తెలుపు, పసుపు, ఆకుపచ్చ బంగారం అనే గ్రూపులు ఉంటాయి.
- వీటిలో ఆకుపచ్చ బంగారంలో అధిక శాతం బంగారం ఉంటుంది.
- తెలంగాణలో బంగారం విస్తరించి ఉన్న ప్రాంతాలు
- కిన్నెరసాని, గోదావరి నదులు కలిసే ప్రాంతం
- ములుగు జిల్లాలోని మంగపేట
- వనపర్తి జిల్లాలోని ఆత్మకూర్ బ్లాక్
- జోగులాంబ జిల్లాలోని గద్వాల శిలాబెల్ట్
- భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో బంగారం నిక్షేపాలు (లోహం రూపంలో) అధికంగా ఉన్నాయి.
- మహబూబ్‌నగర్ జిల్లా ప్రాంతంలో బంగారు నిక్షేపాల కోసం అన్వేషణ జరుగుతున్నది.
ముగ్గురాయి (బెరైటీస్)
- దీనికి మరో పేరు హెవీస్ స్పార్.
- తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో బెరైటీస్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి.
- రంగులు, రబ్బరు వస్తువులు, పేపర్స్, రసాయనాల పరిశ్రమల్లో ముగ్గురాయిని వాడతారు.
- మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో ముగ్గురాయి నిక్షేపాలు విస్తరించి ఉన్నాయి.
సున్నపురాయి (లైమ్ స్టోన్)
- భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో సున్నపురాయి నిల్వలు అధికంగా ఉన్నాయి.
- తెలంగాణలో బొగ్గు నిల్వల తర్వాత అధిక విస్తీర్ణంలో విస్తరించిన ఖనిజం ఇదే.
- తెలంగాణలో సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో సున్నపురాయిని అధికంగా ఉత్పత్తి చేస్తున్నారు.
- వికారాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో ఇది విస్తరించి ఉంది.
గ్రానైట్
- భారతదేశంలో కర్ణాటక, రాజస్థాన్ రాష్ర్టాల్లో గ్రానైట్ వనరులు అధికంగా ఉన్నాయి.
- గ్రానైట్ బ్లాక్ గ్రానైట్‌గా, కలర్ గ్రానైట్‌గా లభిస్తుంది.
- తెలంగాణలో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలు గ్రానైట్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు