అరువు లేదా పరాయి మాతృత్వం అంటే?
బయాలజీ
1. భారతదేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1) 1952 2) 1951
3) 1950 4) 1949
2. చట్ట ప్రకారం స్త్రీల వివాహ వయోపరిమితి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది?
1) 25 2) 21 3) 18 4) 20
3. చట్ట ప్రకారం పురుషుల వివాహ వయోపరిమితి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది?
1) 30 2) 25 3) 18 4) 21
4. ఒక స్త్రీకి రెండు ఫాలోపియన్ నాళాలు పూడుకుపోయి ఉన్నప్పుడు ఏ ప్రత్యుత్పత్తి సహాయ సాంకేతికతతో గర్భధారణను కలిగించవచ్చు?
1) AI 2) ZIFT
3) GIFT 4) IVF
5. కార్పస్ లూటియం స్రవించే హార్మోన్లలో అండాశయ పుటికల అభివృద్ధిని నిరోధించే గర్భనిరోధక మాత్ర కింది వాటిలో ఏది?
1) ప్రొజెస్టిరాన్ 2) ఆక్సిటోసిన్
3) FSH 4) LH
6. చనుపాల పోషణ శిశువుకు, తల్లికి ఎందుకు లాభదాయకం?
1) తల్లికి వెంటనే గర్భధారణ అవకాశాన్ని తగ్గిస్తుంది
2) అలర్జీ నుంచి శిశువును కాపాడుతుంది
3) శిశువు రోగనిరోధక శక్తిని పెంచుతుంది
4) పైవన్నీ
7. లైంగిక సంపర్క వ్యాధుల్లో వైరస్ కారకం కానిది ఏది?
1) గనేరియా 2) ఎయిడ్స్
3) హెపటైటిస్-బి
4) జననాంగ హెర్పస్
8. గర్భనిరోధక/సంతాన నిరోధకతకు దిగువ వాటిలో సహజ పద్ధతి?
1) నోటి మాత్రలు
2) అంతరాయ సంభోగం
3) డయాఫ్రమ్లు 4) తొడుగులు
9. ప్రసవానికి ముందు లింగ నిర్ధారణ కోసం దుర్వినియోగపరిచే పరీక్ష ఏది?
1) ఏంజియోగ్రామ్ 2) ఎరిత్రోబ్లాస్టోసిస్
3) ఉల్బద్రవ పరీక్ష
4) రక్త స్కందన పరీక్ష
10. వేసెక్టమీ అనంతరం పురుషుడి శుక్ర ద్రవంలో ఉండేది?
1) శుక్ర కణాలు మాత్రమే ఉంటాయి,శుక్రద్రవం ఉండదు
2) శుక్ర ద్రవంలో పౌరుష గ్రంథి స్రావాలు లోపిస్తాయి
3) అటువంటి పురుషుడు అసలు స్కలించలేడు
4) శుక్రకణాలు లేని శుక్రద్రవం
11. శస్త్ర చికిత్స పద్ధతుల ద్వారా శుక్రవాహికలను కత్తిరించడాన్ని ఏమంటారు?
1) మాసెక్టమీ 2) హిస్టరెక్టమీ
3) వేసెక్టమీ 4) ట్యూబెక్టమీ
12. శస్త్ర చికిత్స పద్ధతుల ద్వారా స్త్రీ బీజ వాహికలను/ఫాలోపియన్ నాళాలను కత్తిరించడాన్ని ఏమంటారు?
1) హిస్టరెక్టమీ 2) ట్యూబెక్టమీ
3) వేసెక్టమీ 4) మాసెక్టమీ
13. ఉల్బద్రవ పరీక్ష దేన్ని నిర్ధారిస్తుంది?
1) మెదడు సంబంధ వ్యాధులు
2) హృద్రోగాలు
3) పిండం జన్యు సంబంధ అపస్థితులు
4) పైవన్నీ
14. అరువు మాతృత్వం లేదా పరాయి మాతృత్వం అంటే?
1) సంతానలేమి వల్ల అనాథ పిల్లల్ని పెంచుకోవడం
2) ఇతరుల పిండాన్ని అభివృద్ధి చేయడం కోసం తన గర్భాశయాన్ని సమకూర్చే స్త్రీ
3) పరాయి తల్లి సంతాన జీవ సంబంధ తల్లి
4) సంతానానికి సంబంధించి ఇద్దరు తల్లిదండ్రులను కలిగి ఉండటం
15. కింది వాటిలో ఏ గర్భనిరోధక పద్ధతి పురుషులకు సంబంధించింది?
1) హిస్టరెక్టమీ 2) ప్రతిస్థాపకాలు
3) వేసెక్టమీ 4) ట్యూబెక్టమీ
16. కాపర్-T/లూప్ దేన్ని నిరోధిస్తుంది?
1) విదళనం
2) సంయుక్త బీజం ఏర్పడటం
3) ఫలదీకరణం 4) అండోత్సర్గం
17. దేన్ని ఆపేయడం ట్యూబెక్టమీ ముఖ్య ఉద్దేశం?
1) పిండాభివృద్ధి 2) అండోత్సర్గం
3) సంభోగం 4) ఫలదీకరణ
18. దంపతుల్లో వంధ్యత్వం/సంతానలేమికి ఎవరు కారణం?
1) పురుషులు 2) స్త్రీలు
3) స్త్రీ, పురుషులు సమానం
4) కేవలం పురుషులు
19. ఒక స్త్రీలో సెప్టెంబర్ 11న రుతుస్రావం జరిగినా, ఆమెలో అండోత్సర్గం (అండం విడుదల) ఏ తేదీన జరుగవచ్చు.
1) అక్టోబర్ 2 2) అక్టోబర్ 10
3) సెప్టెంబర్ 24 4) సెప్టెంబర్ 16
20. నవజాత శిశువుల అధ్యయనం ఏది?
1) టెరటాలజీ 2) జెరంటాలజీ
3) ఎంబ్రియాలజీ 4) నియోనెటాలజీ
21. కింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి.
1) శుక్ర కణం- ఏకస్థితికం
2) అండ కణం- ఏకస్థితికం
3) సంయుక్త బీజం- ఏక స్థితికం
4) సంయుక్త బీజం- ద్వయ స్థితికం
22. మానవ శుక్ర కణం జీవిత కాలం సుమారుగా ఎంత ఉంటుంది?
1) ఎనిమిది రోజులు (192 గంటలు)
2) మూడు రోజులు (72 గంటలు)
3) రెండు రోజులు (48 గంటలు)
4) 1 రోజు (24 గంటలు)
23. మానవ అండకణం జీవితకాలం సుమారు ఎంత ఉంటుంది?
1) నాలుగు రోజులు (96 గంటలు)
2) మూడు రోజులు (72 గంటలు)
3) రెండు రోజులు (48 గంటలు)
4) ఒక రోజు (24 గంటలు)
24. స్త్రీ ప్రత్యుత్పత్తి అనుబంధ గ్రంథులు ఏవి?
1) బార్తోలిన్ గ్రంథులు
2) స్కీన్ గ్రంథులు
3) క్షీర గ్రంథులు 4) పైవన్నీ
25. పురుష ప్రత్యుత్పత్తి అనుబంధ గ్రంథులు ఏవి?
1) శుక్రాశయాలు 2) పౌరుష గ్రంథి
3) బల్బోయురెత్రల్ గ్రంథులు/కౌపర్ గ్రంథులు
4) పైవన్నీ
26. ప్రసేకం ఏ రంధ్రం ద్వారా బయటకు తెరుచుకుంటుంది?
1) మన్రో రంధ్రం 2) పాయువు
3) యురెత్రల్ మీటస్
4) యూస్టాచియన్ నాళం
27. జీవ పరిణామం ఏ ప్రత్యుత్పత్తి ద్వారా సాధ్యపడుతుంది?
1) శాఖీయ ప్రత్యుత్పత్తి
2) లైంగిక ప్రత్యుత్పత్తి
3) అలైంగిక ప్రత్యుత్పత్తి
4) పైవన్నీ
28. జరాయువు స్రవించే హార్మోన్ ఏది?
1) ప్రొజెస్టిరాన్ 2) hCG
3) సొమాటో మమ్మోట్రోఫిన్
4) పైవన్నీ
29. మానవ పిండాభివృద్ధిలో ఏర్పడే ప్రథమ జనన స్తరం ఏది?
1) అంతస్తచం 2) మధ్య త్వచం
3) బహిస్తచం 4) పైవన్నీ
30. పిండాభివృద్ధిలో లోపించి ఉండే దశ ఏది?
1) మార్యులా 2) బ్లాస్టులా
3) గ్రాస్టులా 4) బ్లాస్టోసిస్ట్
31. కొలస్ట్రమ్ అంటే?
1) ప్రథమ జఠర రసం
2) ప్రథమ లాలాజలం
3) ప్రథమ చనుపాలు
4) ప్రథమ శుక్ర ద్రవం
32. యవనారంభ దశ అంటే?
1) అండోత్సర్గం ప్రారంభం అవటం
2) ద్వితీయ లైంగిక లక్షణాలు ఏర్పడటం
3) క్షీరోత్పాదన ప్రారంభం కావడం
4) రుతు చక్రాలు ప్రారంభం అయ్యే దశ
33. గర్భధారణ ఏ ప్రక్రియతో మొదలవుతుంది?
1) అండం ఫలదీకరణ చెందడం
2) బ్లాస్టోసిస్ట్ ప్రతిస్థాపన
3) క్షీర గ్రంథుల్లో క్షీరోత్పత్తి ప్రారంభమవడం
4) జరాయువు అభివృద్ధి చెందడం
34. గర్భం ధరించిన వారిలో అండం విడుదలను నివారించే హార్మోన్ ఏది?
1) ఈస్ట్రోజన్ 2) ప్రొజెస్టిరాన్
3) లూటినైజింగ్ హార్మోన్
4) ఫొలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్
35. రజస్వల కావడానికి సగటు వయస్సు ఏది?
1) 45 సంవత్సరాలు
2) 51 సంవత్సరాలు
3) 31 సంవత్సరాలు
4) 10-14 సంవత్సరాలు
36. రుతు విరతి (మెనోపాజ్) సంభవించే సగటు వయస్సు ఏది?
1) 51 సంవత్సరాలు
2) 45 సంవత్సరాలు
3) 31 సంవత్సరాలు
4) 15 సంవత్సరాలు
37. అండ కణం, శుక్ర కణం కలిసి ఫలదీకరణం జరిగితే రుతుచక్రం ఆగిపోయే దశ ఏది?
1) పుటిక దశ 2) లూటియల్ దశ
3) రుతుస్రావ దశ 4) అండోత్సర్గ దశ
38. అండం విడుదల (అండోత్సర్గం)అయ్యే సమయం?
1) రుతుస్రావం ఆగిన సుమారు 10వ రోజు
2) రుతుస్రావం తర్వాత సుమారు
14వ రోజు
3) రుతుస్రావం తర్వాత సుమారు 2వ రోజు
4) రుతుస్రావం తర్వాత సుమారు 20 రోజు
39. రుతస్రావం దేని వల్ల జరుగుతుంది?
1) ప్రోత్రాంబిన్ క్రియాశీలత వల్ల
2) గర్భాశయ అంతర ఉపకళాస్తరం విచ్ఛిన్నమవడం వల్ల
3) గర్భాశయ కండర స్తరం విచ్ఛిన్నమవడం వల్ల
4) హెపారిన్ లోపం వల్ల
40. స్త్రీలలో క్రియాత్మకంగా, పురుషుల్లో అవశేషావయవంగా ఉండే గ్రంథులు?
1) క్షీర గ్రంథులు 2) స్వేద గ్రంథులు
3) కౌపర్ గ్రంథులు
4) మూలాధార గ్రంథులు
41. స్త్రీలలో ఏర్పడే తాత్కాలిక అంతఃస్రావక గ్రంథి ఏది?
1) కార్పస్ ఆల్బికేన్స్
2) కార్పస్ లూటియం
3) కార్పస్ స్పాంజియోజం
4) కార్పస్ హేమరేజికం
42. శుక్రద్రవాన్ని స్రవించేది ఏది?
1) ఎపిడిడైమిస్ 2) శుక్రాశయం
3) పౌరుష గ్రంథి 4) పైవన్నీ
43. శుక్రకణాలు ఎక్కడ ఏర్పడతాయి?
1) మధ్యంతర కణాలు
2) శుక్రవాహిక 3) పౌరుష గ్రంథి
4) శుక్రోత్పాదక నాళికలు
44. కింది వాటిలో ప్రాథమిక లైంగిక అవయవాలేవి?
1) ముష్కాలు, స్త్రీబీజ కోశాలు
2) పౌరుషగ్రంథి, క్షీరగ్రంథులు
3) యోని, మేహనం
4) ముష్కాలు, మేహనం
45. వైవిధ్యాలకు కారణం ఏమిటి?
1) షైజోగని 2) కోరకీభవనం
3) బహుదా విచ్ఛిత్తి
4) లైంగిక ప్రత్యుత్పత్తి
46. హార్మోన్లు అనేవి?
1) ఎంజైమ్లు 2) పోషక పదార్థాలు
3) రసాయన వాహకాలు
4) ైవిద్యుత్ వాహకాలు
47. గర్భస్థ సమయంలో థైరాక్సిన్ అల్పోత్పత్తి వల్ల కలిగే అపస్థితి?
1) క్రెటినిజం 2) గాయిటర్
3) అతి మూత్రవ్యాధి 4) ైగ్లెకోసూరియా
48. పెరుగుదల హార్మోన్ ప్రభావం ప్రధానంగా దేనిపై ఉంటుంది?
1) రోగనిరోధకత 2) ఎముక
3) మూత్ర స్రావం 4) గ్లూకోజ్ స్థాయి
49. పిల్లల్లో పిట్యూటరీ కుబ్జత్వానికి కారణం ఏది?
1) సొమాటో ట్రోపిన్ తక్కువ ఉత్పత్తి కావడం
2) LTH అధిక స్రావం
3) థైరాక్సిన్ తక్కువగా ఉత్పత్తి కావడం
4) సొమాటో ట్రోపిన్ ఎక్కువ
ఉత్పత్తి కావడం
50. గొరిల్లా లాంటి ముఖం ఏ అపస్థితిలో ఏర్పడుతుంది?
1) అతికాయత
2) ఎక్రోమెగాలి/ఆక్రోమెగాలి
3) పిట్యూటరీ కుబ్జత్వం
4) ఇన్సులిన్ షాక్
51. ప్రౌఢ మానవుడిలో పెరుగుదల హార్మోన్ అధిక స్రావం వల్ల కలిగే అపస్థితి?
1) అతికాయత 2) క్రెటినిజం
3) ఎక్రోమెగాలి/ఆక్రోమెగాలి
4) కుబ్జత్వం
52. కార్టిసాల్ అధికోత్పత్తి వల్ల కలిగే అపస్థితి?
1) డౌన్ సిండ్రోమ్
2) కుషింగ్స్ సిండ్రోమ్
3) గ్రేవ్స్ వ్యాధి
4) కాన్స్ సిండ్రోమ్
53. అడిసన్స్ వ్యాధి వేటి అల్పోత్పత్తి వల్ల కలుగుతుంది?
1) ఆండ్రోజన్స్
2) కాటెకోలమైన్లు
3) గ్లూకోకార్టికాయిడ్స్
4) లైంగిక కార్టికాయిడ్స్
54. థైరాయిడ్ గ్రంథితో సంబంధం లేని అపస్థితి ఏది?
1) అతికాయత్వం 2) క్రెటినిజం
3) మిక్సిడిమా 4) సరళ గాయిటర్
55. ప్రౌఢ మానవుడిలో హైపోథైరాయిడిజం వల్ల కలిగే అపస్థితి ఏది?
1) ఎక్సాఫ్తాల్మిక్ గాయిటర్
2) క్రెటినిజం
3) సరళ గాయిటర్ 4) మిక్సిడిమా
56. మిక్సిడిమా అనే అపస్థితి ఏ గ్రంథికి సంబంధించింది?
1) క్లోమం 2) థైరాయిడ్
3) పారా థైరాయిడ్ 4) పిట్యూటరీ
57. చిన్న పిల్లల్లో హైపోథైరాయిడిజం వల్ల కలిగే అపస్థితి ఏది?
1) క్రెటినిజం 2) టెటాని
3) కుషింగ్స్ సిండ్రోమ్
4) అడిసన్స్ వ్యాధి
58. ప్రౌఢ మానవుడిలో హైపర్ థైరాయిడిజం వల్ల కలిగే అపస్థితి?
1) సరళ గాయిటర్ 2) మిక్సిడిమా
3) టెటాని 4) ఎక్సాఫ్తాల్మిక్ గాయిటర్
డాక్టర్ మోదాల మల్లేష్
విషయ నిపుణులు
పాలెం, నకిరేకల్, నల్లగొండ, 9989535675
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?