ఆస్ట్రోశాట్ ఉపగ్రహాన్ని ఏ రోజున ప్రయోగించారు?
రేడియేషన్ డోస్ మానిటర్
-ఇది బల్గేరియా దేశపు పరికరం.
-చంద్రుడి చుట్టూ రేడియేషన్ వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది.
-సుమారు 386 కోట్ల వ్యయంతో కూడిన చంద్రయాన్ -1 ఉపగ్రహం తనకు అప్పగించిన విధులను 95 శాతం నిర్వర్తించింది.
-మొత్తం 312 రోజుల్లో 3400 సార్లు చంద్రుని చుట్టూ పరిభ్రమించి అత్యంత విలువైన సమాచారాన్ని సేకరించినట్లు ఇస్రో ప్రకటించింది.
-మిషన్ కాలపరిమితి రెండేండ్లు. కాగా, కక్ష్యలో అధిక రేడియేషన్ ప్రభావం, పవర్ సప్లయ్ యూనిట్లు దెబ్బతినడం వల్ల చంద్రయాన్-1, మిషన్ విఫలమైంది. తద్వారా 2009, ఆగస్టు 29న చంద్రయాన్‌తో సంబంధాలు తెగిపోయాయి.
చంద్రయాన్-1 విజయాలు
-2008, అక్టోబర్ 28న ప్రారంభమై దాదాపు 70,000కు పైగా ఫొటోలను టెర్రయిన్ మ్యాపింగ్ కెమెరా భూమికి పంపించింది. చంద్రునిపై అపోలో-15 (అమెరికా) దిగిన ప్రదేశాన్ని కూడా గుర్తించింది.
-మూన్ మినరాలజీ మ్యాపర్ సేకరించిన సమాచారం ద్వారా, మాగ్మా దషన్ సిద్ధాంతం ద్వారా చంద్రుని ఆవిర్భావం గురించి సమాచారం సేకరించారు.
-చంద్రయాన్-1 మరో పేలోడ్ ఇమేజింగ్ ఎక్స్‌రే స్పెక్టోమీటర్ సాయంతో రెండు డజన్లకు మించిన సౌరమంటలను గుర్తించారు.
-M3 సేకరించిన సమాచారం ఆధారంగా, సిలికేట్ ఆధారాలను హైడ్రాక్సెల్ రూపంలో నీటి జాడలను కనుగొన్నారు.
-చంద్రుని ఉపరితల సంఘటనాన్ని అధ్యయనం చేసే సబ్ Kev ఆటం రిఫ్లెక్టింగ్ అనలైజర్ వల్ల, చంద్రుని బలహీన గురుత్వాకర్షణ వల్ల ప్రతి ఐదు హైడ్రోజన్ పరమాణువుల్లో ఒకటి సుమారు 200 కి.మీ./సెకన్ వేగం తో అంతరిక్షంలోకి వెదజల్లబడతాయని గుర్తించారు.
ఘనతలు
-అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ (ఏఐఏఏఏ) వారి ఆన్యువల్ స్పేస్-2009 అవార్డును చంద్రయాన్-1 గుర్తించింది.
-నేషనల్ స్పేస్ సొసైటీ (అమెరికా) సైన్స్, ఇంజినీరింగ్ విభాగంలో స్పేస్ పయనీర్ అవార్డు-2009ని ఇస్రో గెల్చుకుంది.
-ఇంటర్నేషనల్ లూనార్ ఎక్స్‌ప్లోరేషన్ వర్కింగ్ గ్రూప్ బహూకరించే ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ అవార్డును 2008కి గాను చంద్రయాన్-1 గెల్చుకుంది.
మంగళ్యాన్
-ఇది భారత్‌కు మొదటి ఇంటర్‌ప్లానెటరీ మిషన్.
-మంగళయాన్ కార్యక్రమాన్ని 2013, నవంబర్ 5 పీఎస్ఎల్వీ-సీ 25 ద్వారా ప్రయోగించారు.
-మంగళ్‌యాన్‌ను అంగారక కక్ష్యలోకి చేర్చడానికి ముం దుగా దాన్ని భూ అనువర్తిత కక్ష్య (జియో సింక్రనస్ ఆర్బిట్)లోకి చేర్చారు.
-2013, నవంబర్ 5న భూమికి చేరువగా అంగారకుడు ఉండటంతో తక్కువ ఖర్చు, శ్రమతో మొదటి ప్రయత్నంలోనే భారత్ అరుణగ్రహ యాత్రను విజయవం తం చేసిన మొదటి దేశంగా ఆవిర్భవించింది.
-అంగారకయాత్రను చేపట్టిన 4వ దేశం భారత్ (అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ)
-తక్కువ ఇంధనంతోనే మంగళ్‌యాన్‌ను అంగారక కక్ష్యలోకి చేర్చడానికిగాను హ్యూమన్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లేదా కనిష్ట శక్తి బదిలీ కక్ష్య అనే పరిజ్ఞానాన్ని ఇస్రో అవలంబించింది.
-2013, నవంబర్ 30 హీలియో సెంట్రిక్ ఆర్బిట్‌లోకి ప్రవేశించిన మామ్.. 2014, సెప్టెంబర్ 24న అంగారకుని కక్ష్యలోకి ప్రవేశించింది.
-బెంగళూరు ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్, ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ (బ్సేలాలు)లు అంగారక యాత్రను పర్యవేక్షించాయి.
-ఈ ప్రయోగానికి రూ. 454 కోట్లు ఖర్చయ్యాయి.
మంగళ్యాన్ ప్రధాన ఉద్దేశం
-భూ కేంద్రక కక్ష్యల నుంచి సూర్యకేంద్రక కక్ష్యలకు తదుపరి అంగారక కక్ష్యల్లోకి స్పేస్ క్రాఫ్ట్‌లను ప్రవేశపెట్టడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని స్వదేశీయంగా అభివృద్ధిచేశారు.
-పవర్, సమాచార ప్రసారం, థర్మల్, పేలోడ్ ఆపరేషన్లకు కావలసిన వ్యవస్థలను వృద్ధి పర్చడం.
లక్ష్యాలు
-అంగారక గ్రహ ఉపరితల లక్షణాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం
-అంగారక గ్రహ వాతావరణంలోని మీథేన్, కార్బన్ డైఆక్సైడ్‌లను రిమోట్ సెన్సింగ్ పద్ధతుల ద్వారా అంచనావేయడం.
-అంగారకుడి ఉపరితల వాతావరణంపై సౌర పవనాలు, రేడియేషన్, బాహ్య అంతరిక్షంలోని పలాయన వేగాలకు సంబంధించిన అంశాల అధ్యయనం.
-అంగారకుని ఉపగ్రహాలైన ఫోబోస్, డిమోస్లను అధ్యయనం చేయడం, ఇతర ఆస్టరాయిడ్ల కక్ష్యలను పరిశీలించడం.
-అంగారకుని ఉపరితలంలోని ఖనిజాల సంఘటనాన్ని అధ్యయనం చేయడం.
ప్రధాన పేలోడ్లు
లైమన్ ఆల్ఫా ఫొటోమీటర్ (ఎల్ఏపీ)
-అంగారకుని బాహ్య వాతావరణంలో డ్యుటీరియం, హైడ్రోజన్ల లభ్యతను పరిశీలించడం, దానిద్వారా బాహ్య అంతరిక్షంలో నీటి నష్టాన్ని డ్యుటీరియం, హైడ్రోజన్ల నిష్పత్తిని గణించి అంచనావేయవచ్చు.
మీథేన్ సెన్సల్ ఫర్ మార్స్ (ఎంఎస్ఎం)
-అంగారకుని వాతావరణంలో మీథేన్ వాయువును, దాని మూలాలను అధ్యయనం చేస్తుంది.
మార్స్ ఎక్సోస్పెరిక్ న్యూట్రల్ కంపోటిషన్ అనలైజర్
-ఇది ద్రవ్యరాశి స్పెక్టోమెట్రీలో కణాల ద్రవ్యరాశిని అధ్యయనం చేసే పరికరం.
థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్టోమీటర్
-ఇది అంగారకుని ఉపరితల సంఘటనాన్ని, ఖనిజాలను అధ్యయనం చేస్తుంది.
-దీంతోపాటు వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్‌ను, ఉష్ణ వికిరణాల ఉద్గారాన్ని అధ్యయనం చేస్తుంది.
మార్స్ కలర్ కెమెరా (ఎంసీసీ)
-ఇది ఇతర పేలోడ్లకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది.
-అంగారకుని ఉపగ్రహాలైన ఫోబోస్, డియోస్లను పరిశీలిస్తుంది.
-ఇది మార్స్ ఉపరితల లక్షణాలు, సంఘటనాన్ని, వాతావరణాన్ని దుమ్ము తుఫాన్ల వంటి వాతావరణ కల్లోలాలను అధ్యయనం చేస్తుంది.
-2015, సెప్టెంబర్ 24న మార్స్ అట్లాస్‌ను ఇస్రో విడుదల చేసింది. ఇందులో మార్స్ చిత్రాలు, సమాచారాన్ని పొందుపర్చారు.
-నేషనల్ స్పేస్ సొసైటీ (అమెరికా) సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో స్పేస్-పయోనల్ అవార్డు- 2015ను మంగళ్యాన్ పొందింది.
-అంగారక యాత్రను మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా పూర్తిచేసినందుకు ఈ అవార్డు లభించింది.
-దీంతో 2018-2020 మధ్య మంగళ్యాన్-2 ప్రయోగానికి ఇస్రో ప్రయత్నాలు చేస్తుంది.
ఆస్ట్రోశాట్
-ఇది పూర్తిస్థాయి ఖగోళ పరిశోధక ఉపగ్రహం.
-ఆస్ట్రోశాట్ ప్రయోగానికి ముందువరకు వేర్వేరు ఉపగ్రహాల్లో ఖగోళ అధ్యయన పరికరాలను అమర్చి పంపేవారు.
-2015, సెప్టెంబర్ 28న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు.
-దీంతోపాటు లపాన్-2 (ఇండోనేషియా), ఎస్ఎల్ఎస్-14 (కెనడా), లేమూర్ 2, 3, 4, 5 (అమెరికా) ఉపగ్రహాలను వాటి నిర్దేశిత కక్ష్యల్లోకి చేర్చారు.
-దీంతో ఖగోళ అధ్యయనాలకు కృషిచేసిన అమెరికా, జపాన్, రష్యా, ఐరోపాల సరసన భారత్ చేరింది.
-ఆస్ట్రోశాట్ అనేది బహుళ తరంగదైర్ఘ్యాలు ఉన్న వికిరణాల సహాయంతో విశ్వం మూలాలు, గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, ఎక్స్‌రే పల్సర్లు, సూపర్ నోవాలు, శ్వేత మరుగుజ్జు నక్షత్రాలు, గెలాక్సీలోని కృష్ణబిలాలు, క్రియాశీల రేణువులను పరిశీలించి అధ్యయనం చేస్తుంది.
-ఉపగ్రహం బరువు 1,513 కిలోలు, జీవితకాలం ఐదేండ్లు, అయిన ఖర్చు రూ. 178 కోట్లు.
-పీఎస్ఎల్వీ నౌకకు ఇది 31వ ప్రయోగం కాగా విజయవంతమైన 30వ ప్రయోగం.
-ప్రయోగం ప్రారంభమైన 25 నిమిషాల 32 సెకన్ల కాలంలో ఆస్ట్రోశాట్ 650 కి.మీ. ఎత్తున్న సూర్యానువర్తన ధృవకక్ష్య (సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్) లోకి ప్రవేశించింది.
-తదుపరి కక్ష్య పెంపు వాటి ఉపగ్రహ నియంత్రణ కార్యక్రమాలు హసన్‌లోని మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ చేపట్టింది.
ఆస్ట్రోశాట్‌లో ప్రధాన పేలోడ్లు
ఆల్ట్రా వయొలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్
-దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (బెంగళూరు), ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ (పుణె)లు తయారు చేశాయి.
-దృశ్యకాంతి, అతి నీలలోహిత కిరణాల ఆధారంగా ఖగోళ అధ్యయనం చేస్తుంది.
లార్జ్ ఏరియా ఎక్స్‌రే ప్రపోర్షనల్ కౌంటర్
-దీన్ని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (ముంబై), రామన్ రిసెర్చ్ ఏజెన్సీ (బెంగళూరు)లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
-ఎక్స్ కిరణాల సహాయంతో ఖగోళ పరిశోధనలు చేపడుతుంది.
సాఫ్ట్ ఎక్స్‌రే టెలిస్కోప్ (ఎస్ఎక్స్టీ)
-టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (ముంబై), యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ (బ్రిటన్), ఇస్రోలు రూపొందించాయి.
-0.3-8 కిలో ఎలక్ట్రాన్ ఓల్ట్ పరిధిలోని ఎక్స్ కిరణాల ఆధారంగా వాటిని ఉద్గారించే మూలాలను పరిశీలిస్తుంది.
కాడ్మియం జింక్ టెల్యూరైడ్ ఇమేజిల్
-దీన్ని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్, ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్లు రూపొందించాయి.
-ఇది 10-100 కేడబ్ల్యూ పరిధిలోని X-కిరణాలను పరిశీలిస్తుంది.
స్కానింగ్ స్కై మానిటర్ (ఎస్ఎస్ఎం)
-దీన్ని ఇస్రో, ఐయూసీ ఏయే (పుణె)లు సంయుక్తంగా వృద్ధి పర్చాయి.
-విశ్వ మూలాలను తెలుసుకునేందుకు, వాతావరణ అధ్యయనానికి విశ్వం నుంచి వెలువడే వికిరణాల ఆధారంగా ఈ పరికరాలు పరిశీలనలు చేసి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తాయి.
-ఫలితంగా ఆస్ట్రోశాట్ మినీహబుల్గా ఖ్యాతి గాంచింది.
ఇస్రో భవిష్యత్ కార్యక్రమాలు
-రీయూజబుల్ లాంచ్ వెహికిల్ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే దిశగా ఇస్రో ప్రయత్నాలు ప్రారంభించింది.
-ఆర్ఎల్వీ పరిజ్ఞానం ద్వారా ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి ప్రవేశపెట్టిన వాహక నౌక తిరిగి స్పేస్క్రాఫ్ట్లా భూమిని చేరుతుంది.
-16 మీ. పొడవు, 12 టన్నుల బరువుగల ప్రొటోటైప్ వాహక నౌకను సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 2016, మే 23న ప్రయోగించారు.
-నౌక ల్యాండింగ్‌కు అవసరమైన రన్‌వేను ఏర్పాటు చేయకపోవడంతో దీన్ని ప్రస్తుతం సముద్రంలో ల్యాండింగ్ చేశారు.
-దీని విజయం ద్వారా భవిష్యత్ ఉపగ్రహ ప్రయోగాల వ్యయం గణనీయంగా తగ్గనుంది.
-మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్- 2009 అక్టోబర్)- ఈ పథకంలో భాగంగా ప్రజలకు ఏడాదిలో కనీసం 100 రోజులు పని కల్పించాలి. అయితే 2011లో 100 రోజులు పనిచేసిన వారికి మరో 25 రోజులు పని కల్పించాలని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి 90:10 నిష్పత్తిలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు నిధులు కేటాయించాలి. ఈ పథకాన్ని గతంలో ఉన్న ఎన్ఆర్ఈజీఎస్, ఎంఎన్ఆర్ఈజీఎస్లను కలిపి రూపొందించారు.
గమనిక: ప్రస్తుతం దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ మాత్రమే అమలవుతన్నది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు