Indian geography | ప్రపంచీకరణ – పట్టణీకరణ
గ్రూప్ -1 ప్రత్యేకం ఇండియన్ జాగ్రఫీ
ప్ర: గ్లోబలైజేషన్ కారణంగా వచ్చిన సామాజిక మార్పులు తెలియజేయండి?
- ప్రపంచీకరణ సాంకేతికత, ఆలోచనలు, వ్యక్తులు వస్తువుల కదలికల ద్వారా నడపబడుతుంది. అనేక దేశాలు ప్రపంచ వ్యాప్తంగా అనుసంధానించబడినప్పటికీ రాజకీయ సంక్షోభం, ప్రపంచ స్థాయి సంఘర్షణలు కూడా పెరిగాయి.
1) గ్రామీణ చిన్నతరహా పరిశ్రమలను అప్రమత్తం చేసింది. బహుళ జాతీయ సంస్థలు (MNC) రావడం వల్ల పోటీ ఏర్పడింది. అంతేకాకుండా సానుకూలంగా చూస్తే వీరి ఉత్పత్తులను ఎంఎన్సీలకు అమ్ముకొనేందుకు అవకాశాలు పెరిగాయి. ఫలితంగా వస్తుత్పత్తులు పెంచుకొనేందుకు అవకాశం ఏర్పడింది.
2) ఇది వ్యవసాయ రంగానికి ముప్పు కలిగిస్తుంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల ఉత్పత్తుల కంటే చాలా తక్కువ సేవలు అందించడం వల్ల, రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. రైతుల ఆత్మహత్యలకు దారి తీశాయి.
3) సాంకేతికత కారణంగా ఉద్యోగాల కల్పన పెరుగుతుందని భావించినప్పటికీ అంతకంటే ఎక్కువ ఉద్యోగాలను కోల్పోవడానికి దారి తీసింది. ఉపాధి వృద్ధిరేటు తగ్గింది.
4) అనాగరిక సమాజం శక్తులైన మూఢనమ్మకాలను రూపుమాపింది. హేతుబద్ధమైన ఆలోచనల వైపు మళ్లారు.
5) ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా వంటి సామాజిక సమస్యలు, కొవిడ్-19 వంటి వ్యాధుల అంతర్జాతీయ ప్రవాహాలను వేగవంతం చేసింది.
6) ప్రభుత్వ సంస్థలు, పౌర సమాజాలు ఆందోళనకు గురయ్యేలా (సమాజపరమైన, సైబర్ దాడుల లాంటి వాటి వల్ల) చేసింది. - Homogenisation Vs Globalisation of Culture సజాతీకరణ Vs సంస్కతి ప్రపంచీకరణ:
- అన్ని సంస్కృతులు ఒకేలా మారుతాయి అనే ఒక ప్రధాన వాదన ఒకవైపు ఉండగా, మరొక వైపు సంస్కృతులు విస్తరిస్తాయన్న వాదన ఉంది.
- రిటర్: (ప్రపంచీకరణ గురించి) సంస్కృతులు ఏకీకరణ చెందుతాయి. ప్రపంచ కలయిక ఏర్పడుతుంది అని చెప్పాడు (జాక్స్ రిటర్ తన గ్రంథం ‘గ్లోబలైజేషన్’లో సామాజిక సిద్ధాంతాలు ఏ విధంగా ఉంటాయని వివరించాడు). సమాజం మెక్డొనాల్డ్ లాంటి ఫాస్ట్ఫుడ్ రెస్టారెంట్ లక్షణాలను స్వీకరించినప్పుడు వచ్చే చెడు పర్యవసానాలు, వాటి ఆధిపత్యం వల్ల సంప్రదాయాల్లో వచ్చే చెడు మార్పులు తెలియజేశాడు.
- భాషలో సజాతీయత పెరిగింది. ముఖ్యంగా ఇంగ్లిష్ వాడకం రేటు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో దీని ప్రభావం తక్కువగా ఉంది. విద్యార్థులకు వివిధ భాషలు బోధించేందుకు అవకాశాలు పెరిగాయి. ఉదా: ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్ విదేశీ సినిమాలు డబ్బింగ్ చేయడం ప్రపంచీకరణకు నిదర్శనం.
- పండుగలు: వాలంటైన్స్ డే, స్నేహితుల దినోత్సవం వంటివి జరుపుతూనే సంప్రదాయ పండుగలను నిర్వహించకుంటున్నారు.
- వివాహ ప్రాముఖ్యం తగ్గి విడాకులు పెరిగాయి. లివ్ ఇన్ సంబంధాలు (Living Relationship) సింగిల్ పేరెంటింగ్ విధానం పెరుగుతుంది. వివాహం అనే ఆత్మీయ సంబంధాల బంధం ఒప్పంద బంధంగా మారుతుంది.
సాంస్కృతిక పునరుజ్జీవనం - అంతర్జాతీయ స్థాయిలో యోగా పునరుద్ధరణ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రజాదరణ, ఆయుర్వేద ఔషధాల వినియోగం.
- ఓటర్లను ఆకర్షించడానికి మతం, ఆచారాలను వారి కట్టడాలను పరిరక్షిస్తున్నారు. కాబట్టి పునరుజ్జీవనం చెందుతుంది.
- స్థానిక హస్తకళలకు ప్రపంచస్థాయి డిమాండ్ పెరుగుతుంది. ఈ విధంగా రెండు సంస్కృతుల మిశ్రమం ఏర్పడుతుంది.
- యుక్త వయస్సులోనే యువత ఉద్యోగాల కోసం సిద్ధం కావలసిన అవసరం ఏర్పడి వారి జీవితాలపై నియంత్రణను పెంపొందించుకోవలసి వస్తుంది.
- వివాహాలు- వయస్సుకు గల (మారుతున్నాయి) అంశాల్లో మార్పులు వస్తున్నాయి. యుక్త వయస్సును కోల్పోతున్నాం అనే భావనలో ఉన్నారు.
- హైబ్రిడ్/బహుళ సంస్కృతుల గుర్తింపులకు అనుగుణంగా వేగంగా మారడం కష్టంగా ఉండే అవకాశం కొందరిలో కనిపిస్తుంది.
- కుటుంబం కంటే వ్యక్తివాదం పెరుగుతుంది.
- (Individuality) ఏక కేంద్రక కుటుంబాలు ఏర్పడుతున్నాయి. భోజనం చేసే సమయంలో (చాటింగ్ చేస్తూ) మాట్లాడుకోవడం కంటే ఇంటర్నెట్లోనే ఎక్కువగా గడుపుతున్నారు.
- ద్వంద్వ సంపాదన జంటల నిష్పత్తి కూడా పెరిగింది. ఇది మహిళల సంప్రదాయక, క్రియాత్మక పాత్రను భారీగా మార్చింది.
- ఇంట్లో పిల్లలు, వృద్ధులను మానసిక ఆందోళనలకు గురి చేస్తుంది.
- విద్యపై ప్రభావం: e-లెర్నింగ్, ఫ్లెక్సిబుల్ లెర్నింగ్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, విదేశీ శిక్షణల వల్ల విద్యలో మార్పులు సంభవించాయి. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు రూపొందించుకొనేలా మంచి/ గణనీయమైన మార్పులు వచ్చాయి. కానీ పేద విద్యార్థులకు విద్య ఖర్చుతో కూడుకొన్నదిగా మారింది.
- కుల వ్యవస్థలో మార్పు వచ్చి వృత్తి నైపుణ్యం పెరగడం వల్ల బలహీనుల స్థితిగతులు మెరుగుపడినాయి.
- ఒకవైపు నైపుణ్యాల కొరత కారణంగా బలహీనమైన కులాలు పోటీలో వెనుకబడి చిన్న ఉద్యోగాలు చేసే అనధికార రంగం వైపు బలవంతంగా మారుతున్నారు.
- శారీరక శ్రమ తగ్గడం వల్ల నిశ్చలమైన పని చేసే ప్రదేశాల్లో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
- మునుపెన్నడూ లేనంతగా సుస్థిరత, సమ్మిళితాలకు ప్రాధాన్యం ఇస్తూ కొత్త అవకాశాలను ఉపయోగించుకోవాలి. ప్రాంతీయ వ్యవస్థను ముందస్తుగా నిర్మించాలి. స్థానికంగా ఉద్యోగాలను సృష్టించడానికి, కొనసాగించడానికి సరైన విద్య, మౌలిక సదుపాయాలు కలిగించేలా ప్రయత్నం చేయాలి.
ప్ర: దేశంలో పట్టణీకరణ అనేది జీవన విధానంగా మారింది. వివరణాత్మకంగా తెలియజేయండి?
1) పట్టణీకరణ – నిర్వచనం.
2) పట్టణీకరణ వల్ల వచ్చిన సామాజిక మార్పులు
3) పట్టణ సామాజిక నిర్మితి లక్షణాలు
4) ముగింపు
- పట్టణీకరణ అంటే పట్టణాలు, నగరాల్లో జనాభా పెరుగుదల క్రమం. ఇది సామాజికంగా ప్రజల జీవన శైలిలో పట్టణ సామాజిక నిర్మితిలో గల లక్షణాలను అలవరుస్తుంది.
- పట్టణవాదం (అర్బనైజేషన్) వల్ల ప్రజల సామాజిక, మానసిక విధానాల్లో, భౌతిక, సాంస్కృతిక, ప్రవర్తనల్లో మార్పులు సంభవిస్తాయి. లూయీస్ వర్త్ అనే సామాజిక శాస్త్రవేత్త ప్రకారం జీవన విధానంలో మార్పులు పట్టణాల వెలుపల గల వారిని కూడా ప్రభావితం చేస్తాయి.
- ఆధునిక పట్టణ కేంద్రాలు పారిశ్రామీకరణ వల్ల అవతరించాయి. దేశంలో వలస వాదుల కాలంలో స్వాతంత్య్రానంతరం ఏర్పడ్డాయి. వలస పాలన కాలంలో పాత నగరాలు కొన్ని అంతరించిపోయాయి. కొత్త నగరాలు ఏర్పడ్డాయి. బ్రిటన్లోని మాంచెస్టర్ నగరంలో కాటన్, సిల్కు వస్ర్తాల తయారీ వల్ల భారతదేశ ఎగుమతులు కొంతవరకు కుంటుపడ్డాయి.
నోట్: లూయిస్ వర్త్ గ్రంథం ‘అర్బనైజేషన్ యాజ్ ఏ వే ఆఫ్ లైఫ్’
లక్షణాలు – జీవనశైలిలో మార్పు - 1) విధి నిర్వహణ, సమయ పాలన, వ్యక్తిత్వ వికాసం, మానవ సంబంధాల్లో వృత్తి పరమైన నైతికత పెరిగింది.
- 2) హేతుబద్ధత, ఆధునికత పెరిగింది.
- 3) లౌకికవాదం వల్ల మత స్వేచ్ఛ, మత మార్పిడులు
జరుగుతున్నాయి. - 4) శ్రామిక విభజన, ప్రత్యేకీకరణ పెరిగింది.
- 5) పాశ్చాతీకరణ పట్టణీకరణకు దారి తీసింది.
అని టోయిన్ బీ తెలియజేశారు. - 6) కులవ్యవస్థ సామాజిక నిర్మాణాలను
విచ్ఛిన్నం చేస్తుంది. విభిన్న వర్గ సరిహద్దులను నిర్మిస్తుంది. - 7) కుటుంబ ప్రాముఖ్యం, సంప్రదాయ సామాజిక ఐక్యత తగ్గుముఖం పడతాయి.
- 8) సమాజం నుంచి ఒంటరిగా, దూరంగా ఉన్నారని భావిస్తారు.
- 9) సామూహిక సంఘాలు లేదా క్లబ్లో చేరుతారు.
- 10) ఆత్మహత్యలు, నేరాలు, మానసిక క్షీణత, ఆదాయం పొందడానికి ప్రత్యామ్నాయంగా అవినీతి లాంటి అంశాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
- కాబట్టి పట్టణీకరణ అనేది సామాజిక, ఆర్థిక మార్పులకు కారణమవుతుంది. స్త్రీ స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు పెరుగుతాయి. కానీ మరొక వైపు సామాజిక బంధుత్వాలు తగ్గడం, కాలుష్యం, మురికి వాడలు, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతాయి.
ప్ర: ‘పట్టణీకరణ అనేది కేవలం సిటీలు/ నగరాల విస్తరణ మాత్రమే కాదు’?
- పట్టణ విస్తరణ అనేది ఏకకాలంలో కింది విధంగా మార్పులను కలుగజేస్తుంది. సంపద-పేదరిక, పెద్ద గృహ సముదాయాలు-మురికివాడలు, విద్యలో నవీనత- నిరక్షరాస్యత అనే అంశాల్లో ప్రభావం చూపిస్తుంది. నిజమైన పట్టణవాదంలోని లోపాలను సవరిస్తూ పట్టణీకరణలో మార్పులు చేయాలి.
- 2011 జనాభా లెక్కల ప్రకారం 31.2 % దేశంలో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు, 2050 నాటికల్లా 50% పెరిగే అవకాశం ఉంది.
పట్టణీకరణ నగరాల విస్తరణ - 2011 వలస విధానాలు గమనిస్తే ఎక్కువగా టైర్-1 పట్టణాలకు (ఢిల్లీ, ముంబై, కోల్కతా) వలసలు పెరుగుతాయి. కాబట్టి నోయిడా, గురుగ్రామ్, నవీ ముంబై లాంటి పట్టణాలు ఏర్పడ్డాయి. క్రమంగా టైర్-2, టైర్-3 పట్టణాలకు వలసలు వెళ్తున్నారు.
సవాళ్లు: అహ్లువాలియా కమిటీ పట్టణీకరణ గురించి కొన్ని అంశాలను గుర్తించినది. అవి.. - 1) పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ
- 2) నీటి లభ్యత- కేవలం 46 గంటల వరకు సరఫరా చేయగలుగుతున్నారు.
- 3) రవాణా సౌకర్యాలు ఇంకా పెంచాలి.
- 4) గృహాలు, సొంతిల్లు నిర్మించి ఇవ్వడంలో సమస్యలు
- 5) పారిశ్రామికీకరణ, సామాజిక ఆధునికీకరణ
- ఆదేశిక సూత్రాల్లోని 40వ అధికరణ గ్రామీణ స్థానిక సంస్థల ఏర్పాటును సూచించింది. అయినా ప్రభుత్వం 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ స్థానిక సంస్థలను ఏర్పాటు చేసింది. కానీ నిధులలేమి, విధుల నిర్వహణ, పౌరుల భాగస్వామ్యం తక్కువగా ఉండటం అనే సమస్యలున్నాయి.
- పరిపాలనలో బాధ్యతాయుతం, జవాబుదారీతనం, వలస ప్రజల ఆశయాలను నెరవేర్చవచ్చు.
- నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం 21 పట్టణాల్లో భూగర్భ జలాలు (2020) అడుగంటినాయి.
- ప్రజల (టైర్-2, టైర్-3 సిటీలవైపు వలసలు) దృష్టి మళ్లించేందుకు కృషి చేయడంలో చాలా సమస్యలున్నా ప్రభుత్వం షహరీ రోజ్ గార్ యోజన, స్మార్ట్ సిటీలు అమృత్ పథకాల (500 సిటీలు) ద్వారా అభివృద్ధికి సహకరిస్తుంది.
- క్రమబద్ధీకరించబడిన ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ అనేది ప్రస్తుతం మన ముందున్న ప్రధాన అంశంగా మారింది. దీని కోసం పీపీపీ ప్రభుత్వాల పరిష్కార మార్గం అని అహ్లువాలియా కమిటీ సూచించింది.
- 2వ ఏఆర్సీ కమిటీ నేషనల్ కమిషన్ ఆన్ అర్బనైజేషన్ను ఏర్పాటు చేసి పట్టణీకరణను నియంత్రించడంలో పలు సమస్యలను పరిష్కరించాలని కోరింది.
- ఈ విధంగా పట్టణీకరణ మన జీవన విధానంగా ‘మారిన సందర్భంలో ప్రజల అవసరాలను స్మార్ట్ సిటీలను కొత్తవాటిని తయారు చేస్తూ జీవన విధానాన్ని అందచేయవచ్చు.
Previous article
Telangana budget | తెలంగాణ బడ్జెట్- 2023
Next article
Online study | విద్యార్థి చూపు.. ఆన్లైన్ వైపు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు