Geography Groups Special | ‘గేట్ వే ఆఫ్ శ్రీనగర్’ అని దేన్ని పిలుస్తారు?
1. నల్లరేగడి నేలలకు సంబంధించి కింది వాటిని పరిశీలించండి.
ఎ. నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది
బి. పత్తి పంటకు అనుకూలమైంది
సి. ప్రయరీ ప్రాంతాల్లోని పోడ్జోల్సు నేలలను పోలి ఉంటాయి పై వాటిల్లో తప్పుగా ఉన్నవాటిని గుర్తించండి?
1)) ఎ 2) బి 3) సి 4) ఎ, బి
2. లాటరైట్ నేలలకు సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలించండి.
ఎ. తోలు పంటలకు అనుకూలమైంది
బి. లీచింగ్ ప్రక్రియ వల్ల ఏర్పడతాయి
సి. బాక్సైట్ ఖనిజం ఎక్కువగా ఉంటుంది
పై వాటిలో నిజమైన వాటిని గుర్తించండి?
1)) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
3. కింది వాటిలో ఒండ్రు నేల లక్షణం కానిది?
1) అధిక నత్రజని శాతం
2) హ్యూమస్ తక్కువగా ఉండటం
3) అధిక సారవంతమైంది
4) దున్నడానికి తేలికైంది
4. లోక్తక్ సరస్సు ఒడ్డున ఉన్న జాతీయ పార్క్ ఏది?
1) నామ్‌దాఫా 2) బితర్కనిక
3) కైబుల్ లాంజావో 4) మౌతింగ్
5. దేశంలో పాములకు ప్రసిద్ధిచెందిన జాతీయ పార్క్ ఏది?
1) దంఫా 2) బలపాక్రం
3) పెరియా 4) గిండి
6. ‘జీబీ పంథ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్’ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) డెహ్రాడూన్ 2) అలహాబాద్
3) అల్మోరా 4) నాగ్‌పూర్
7. సైబీరియన్ కొంగలకు ప్రసిద్ధి చెందిన పక్షుల సంరక్షణ కేంద్రం?
1) నేలపట్టు 2) సలీం అలీ
3) ఘనా 4) సుల్తాన్పూర్
8. దేశంలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా గల రాష్ర్టాల వరుస క్రమాన్ని గుర్తించండి?
1) మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా
2) మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ
3) మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా
4) మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్
9. ఐఎస్ఎఫ్ఆర్-2019తో పోలిస్తే ఐఎస్ఎఫ్ఆర్-2021 ప్రకారం శాతం పరంగా దేశంలో అటవీ విస్తీర్ణం తగ్గుదల రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రం?
1) అరుణాచల్‌ప్రదేశ్ 2) మిజోరం
3) నాగాలాండ్ 4) ఏదీకాదు
10. ఐఎస్ఎఫ్ఆర్-2021 ప్రకారం దేశంలోని ఏ టైగర్ రిజర్వ్‌లో అటవీ విస్తీర్ణం అతి తక్కువగా ఉంది?
1) భద్రా టైగర్ రిజర్వ్
2) సిమ్లా టైగర్ రిజర్వ్
3) సుందర్బన్ టైగర్ రిజర్వ్
4) కవ్వాల్ టైగర్ రిజర్వ్
11. కింది వాటిని జతపర్చండి.
వృక్ష జాతి అటవీరకం
1. టేకు ఎ. సతతహరిత
2. యూఫోర్బియా బి. ఆకురాల్చే
3. రోజ్‌వుడ్ సి. సవన్నా
4. సుంద్రీ డి. మాంగ్రూవ్
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-1, బి-3, సి-2, డి-4
12. ప్రతిపాదన (ఎ): రుతుపవన ప్రాంతాల్లో పెరిగే వృక్షజాతులు వేసవికాలంలో ఆకులను రాల్చుతాయి
కారణం (ఆర్): ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే వృక్షజాతులు వేసవిలో బాష్పోత్సేక ప్రక్రియను నియంత్రించడానికి, వాటి ఆకులను రాల్చడం జరుగుతుంది
1) ఎ, ఆర్ నిజమైనవి, ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ, ఆర్ నిజమైనవి, ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ నిజమైనది, ఆర్ నిజమైనది కాదు
4) ఎ నిజమైనది కాదు, ఆర్ నిజమైనది
13. షోలా అడవులు ఎక్కడ ఉన్నాయి?
1) హిమాలయ పర్వత వాలులో
2) మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో
3) నీలగిరి, అన్నామలై పర్వత కొండల్లో
4) ఈశాన్య రాష్ర్టాల్లో
14. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీకే) ప్రాజెక్టుకు సంబంధించి కింది వాటిని పరిశీలించండి.
ఎ. పశ్చిమబెంగాల్లో వరదల నియంత్రణ
బి. యూఎస్ఏలోని టెన్నిస్ వ్యాలీ ప్రాజెక్టు నమూనాను పోలి ఉంది
సి. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల ప్రయోజనాన్ని పొందుతున్నాయి
పై వాటిలో నిజమైన వాటిని గుర్తించండి?
1) ఎ, సి 2) బి, సి 3) సి 4) ఎ, బి, సి
15. కింది వాటిలో నిజమైన వాటిని గుర్తించండి?
1) మెట్టూర్ ప్రాజెక్ట్ కర్ణాటక, తమిళనాడు మధ్య గల వివాదాస్పద ప్రాజెక్ట్
2) బాబ్లీ ప్రాజెక్ట్ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య గల వివాదాస్పద ప్రాజెక్ట్
3) ముళ్ల పెరియార్ ప్రాజెక్ట్ కేరళ, తమిళనాడు మధ్య గల వివాదాస్పద ప్రాజెక్ట్
4) పైవన్నీ సరైనవే
16. దేశంలోనే అతిపెద్ద కృత్రిమ నిర్మిత సరస్సు ఏది?
1) గురుగోవింద్ సాగర్ 2) గాంధీసాగర్
3) గోవింద్ వల్లభ్ పంత్ 4) మెట్టూర్
17. చంబల్ నదీ లోయ ఏ రాష్ర్టాల ఉమ్మడి ప్రాజెక్ట్?
1) ఉత్తరప్రదేశ్, రాజస్థాన్
2) గుజరాత్, మధ్యప్రదేశ్
3) మధ్యప్రదేశ్-ఉత్తరప్రదేశ్
4) మధ్యప్రదేశ్-రాజస్థాన్
18. ప్రతిపాదన (ఎ): జువారీ దక్షిణ భారతదేశంలో తూర్పు దిశలో ప్రవహించే నది
కారణం (ఆర్): దక్కన్ పీఠభూమి ప్రాంతం పశ్చిమ సరిహద్దులో ఎక్కువ ఎత్తు కలిగి తూర్పున ఉన్న బంగాళాఖాతం వైపు ఉంది
1) ఎ, ఆర్ నిజమైనవి, ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ, ఆర్ నిజమైనవి, ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ నిజమైనది, ఆర్ నిజమైనది కాదు
4) ఎ నిజమైనది కాదు, ఆర్ నిజమైనది
19. లూని నదికి సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలించండి.
ఎ. ఇది కంబాట్ సింధు శాఖలో కలుస్తుంది
బి. ఇది కచ్ సింధూ శాఖలో కలుస్తుంది
సి. ఇది పాకిస్థాన్‌లోకి ప్రవేశించి ఉప నదిగా సింధూ నదితో కలుస్తుంది
డి. రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలోని చిత్తడి నేలల్లో కలుస్తుంది
పై వాటిలో నిజమైన వాటిని గుర్తించండి?
1) ఎ, డి 2) బి, సి 3) ఎ, సి 4) డి
20. దేశంలో దుర్బిక్షాలు, వరదలు ఒక సాధారణ ప్రక్రియలా ఉన్నాయి. కారణం?
1) దేశ భూభాగంలో సంవత్సరానికి, సంవత్సరానికి మధ్య రుతుపవనాల విఫలం ఎక్కువగా ఉండటం వల్ల
2) దేశంలో రుతుపవనాల కాలం నిడివి తక్కువగా ఉన్నందు వల్ల
3) దేశ భూభాగం ఎక్కువ విస్తృతిని కలిగి ఉన్నందు వల్ల
4) దేశంలో వర్షాచ్ఛాయ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందు వల్ల
21. దుర్బిక్ష ప్రాంతాల్లో వర్షపాత విచలనం ఎంతవరకు ఉంటుంది?
1) 20-25 శాతం
2) 30 శాతం కంటే ఎక్కువ
3) 15 శాతం కంటే తక్కువ
4) 15-20 శాతం
22. హేలీ సిద్ధాంతం ప్రకారం నైరుతి రుతుపవనాలు ఏ స్థానిక పవనాల కోవకు చెందుతాయి?
1) భూ పవనాలు
2) సముద్ర పవనాలు
3) పర్వత పవనాలు 4) లోయ పవనాలు
23. దేశంలో నైరుతి, ఈశాన్య రుతుపవనాల ద్వారా వర్షాన్ని పొందే ప్రాంతం?
1) నర్మదా నదీలోయ
2) కావేరి నదీలోయ
3) కోరమండల్
4) యమునా నదీలోయ
24. దేశంలో శీతోష్ణస్థితికి సంబంధించి కింది వాటిని పరిశీలిచండి.
ఎ. ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటగానే 180 డిగ్రీల కోణంతో అపవర్తనం చెంది దేశ భూభాగంలోకి ప్రవేశిస్తాయి
బి. నైరుతి రుతుపవనాలు పొడి పవనాలు, ఈశాన్య రుతుపవనాలు తడి పవనాలు
సి. ఈశాన్య వ్యాపార పవనాలే నైరుతి రుతుపవనాలుగా మారుతాయి
డి. ఆగ్నేయ వ్యాపార పవనాలే నైరుతి రుతుపవనాలుగా మారుతాయి
పై వాటిలో నిజమైనవి పేర్కొనండి?
1) బి, సి 2) ఎ, సి
3) ఎ, డి 4) బి, డి
25. దేశంలో శీతల ఎడారి?
1) లడఖ్ 2) షిల్లాంగ్
3) థార్ 4) డూన్ లోయ
26. దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం?
1) జైసల్మేర్ 2) లడఖ్
3) జోధ్‌పూర్ 4) బికనీర్
26. దేశంలో సంభవించే వర్షపాతం ఎక్కువగా ఏ రకానికి చెందింది?
1) చక్రవాత 2) సంవహణ
3) పర్వతీయ 4) ఏదీకాదు
28. అక్టోబర్ హీట్‌కు కారణం?
1) బెంగాల్ మైదాన ప్రాంతాల్లో వాతావరణంలో అధిక ఆర్ధ్రత, అధిక వేడి ఉండటం
2) పొడి, వేడి వాతావరణం ఉండటం
3) పవనాల వేగం తక్కువగా ఉండటం
4) గంగా-సింధూ మైదానాల్లో అల్పపీడన వ్యవస్థలు
29. థార్ ఎడారికి సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
ఎ. ఇది దేశ వాయవ్య ప్రాంతంలో 2 లక్షల చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది
బి. రాజస్థాన్, దక్షిణ పంజాబ్, హర్యానా, ఉత్తర గుజరాత్ రాష్ర్టాల్లో విస్తరించి ఉంది
సి. థార్ ఎడారి అనేది ఒక ఎర్గ్ స్థలాకృతి
డి. సాంబార్ సరస్సు థార్ ఎడారిలో ఉంది
పై వాటిలో నిజమైనవి గుర్తించండి?
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) ఎ, సి 4) పైవన్నీ నిజమైనవే
30. దక్కన్ నాపలు ఏ శిలలతో ఏర్పడ్డాయి?
1) గ్రానైట్ 2) గాబ్రా
3) బసాల్ట్ 4) క్వార్ట్
31. హిమాలయాలు, బృహత్మైదానాలు దేనిలో భాగాలు?
1) అంగారా భూ భాగం
2) గోండ్వానా భూ భాగం
3) పాంథాల్సా
4) టెథిస్ భూ అభినితి
32. పశ్చిమం నుంచి తూర్పునకు హిమాచల్‌లో కనిపించే పర్వత శ్రేణుల వరుస క్రమం?
1) పీర్‌పంజల్, ధౌలాధార్, నాగ్ టిబ్బా, ముస్సోరి
2) పీర్‌పంజల్, నాగ్ టిబ్బా, ధౌలాధార్, ముస్సోరి
3) పీర్‌పంజల్, ధౌలాధార్, ముస్సోరి, నాగ్ టిబ్బా
4) ధౌలాధార్, పీర్‌పంజల్, నాగ్ టిబ్బా, ముస్సోరి
33. భూ అభినితి అంటే ఏమిటి?
1) రెండు నదుల మధ్యగల నిష్పత్తి
2) రెండు నదుల మధ్యగల లోతైన నిమ్నతి
3) రెండు నదులను వేరుచేసే ఉన్నతి
4) లోతైన అవక్షేపాలతో కూడిన పల్లపు ప్రదేశం
34. ‘గేట్ వే ఆఫ్ శ్రీనగర్’ అని దేన్ని పిలుస్తారు?
1) జోజిలా కనుమ 2) బనిహాల్ కనుమ
3) థగ్ లా కనుమ 4) నాథులా కనుమ
35. బద్రీనాథ్, కేదార్నాథ్ శిఖరాలు ఏ పర్వత శ్రేణుల్లో ఉన్నాయి?
1) కుమయోన్ 2) పంజాబ్
3) నేపాల్ 4) అసోం
36. పీర్‌పంజల్ శ్రేణిలో కారేవాస్ దేన్ని సూచిస్తాయి?
1) ఒండలి వీనలు
2) అవనాళికా క్రమక్షయం ద్వారా ఏర్పడిన వాగులు
3) హిమానీ నదీ నిక్షేపాల వల్ల ఏర్పడిన సారవంత మైదానాలు
4) విశాలమైన నదీ వేదికలు
37. పశ్చిమ కనుమల్లో అతిపెద్ద విరామం (కనుమ)
1) భోర్ఘాట్ 2) థాల్‌ఘాట్
3) షన్కోట్ 4) పాల్ఘాట్
సమాధానాలు
1-3, 2-4, 3-1, 4-3,
5-4, 6-3, 7-3, 8-3, 9-1, 10-4, 11-3, 12-1, 13-3, 14-4, 15-4, 16-3, 17-4, 18-4, 19-4, 20-1, 21-2, 22-2, 23-2, 24-3, 25-1, 26-2, 27-3, 28-1, 29-4, 30-3, 31-4, 32-1, 33-4, 34-2, 35-1, 36-3, 37-4.
జీ గిరిధర్
ఫ్యాకల్టీ
బీసీ స్టడీ సర్కిల్
హైదరాబాద్
9966330068
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు