Gurukula JL/DL Special | దేహానికి ఆకారం.. ఆధారం.. పటుత్వం
మానవ కండర అస్థి పంజర వ్యవస్థ
- ఉన్నత స్థాయి జంతువుల్లో అస్థిపంజర వ్యవస్థ అభివృద్ధి చెంది ఉంటుంది. ఇది శరీరానికి ఆధారాన్ని, ఆకారాన్ని ఇస్తుంది. ఇందులో ఎముకలు, కీళ్లు ఉంటాయి. కీళ్లు ఎముకలను ఒకదానికొకటి కలపడానికి తోడ్పడతాయి. మానవుడిలో పూర్తిస్థాయిలో వృద్ధి చెందిన అస్థిపంజర వ్యవస్థ ఉంటుంది. ఈ నేపథ్యంలో మానవ అస్థిపంజర వ్యవస్థ గురించి విపులంగా తెలుసుకుందాం..
- అస్థిపంజరం రెండు విధాలుగా ఉంటుంది. అవి.. బాహ్య అస్థిపంజరం, అంతర అస్థిపంజరం.
- ఇది దృఢమైన, రక్షణనిచ్చే బయటి నిర్జీవ పొర.
ఉదా: నత్తలు, ఆల్చిప్ప, ప్రవాళాల కర్పరం, కీటకాల స్లీరైట్లు, సకశేరుకాల వెంట్రుకలు, గోర్లు, కొమ్ములు, ఈకలు, చేపల పొలుసులు, కోడిగుడ్డు పెంకు. - ఇది శరీరం లోపల ఉండి దేహానికి నిర్దిష్ట ఆకారాన్ని, యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది.
ఉదా: అస్థి (ఎముకలు), మృదులాస్థి (చెవి డొప్ప, ముక్కుకొన, కొండ నాలుక, వాయునాళంలోని C ఆకారపు నిర్మాణాలు)
నోట్: మృదులాస్థి అధ్యయనాన్ని కాండ్రాలజీ అంటారు. మృదులాస్థిలో ఉండే ప్రొటీన్ కాండ్రిన్ - మానవ అస్థిపంజరం మూడు భాగాలుగా విభజించి ఉంటుంది. అవి ఎముకలు, కండరాలు, కీళ్లు.
- ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రం- ఆస్టియాలజీ
- ఎముకల్లో ఉండే కణాలు- ఆస్టియోసైట్స్
- ఎముకల్లో ఉండే ప్రొటీన్- అస్సిన్
- ఎముకలు కాల్షియం, ఫాస్ఫరస్తో నిర్మితమవుతాయి.
- కాల్షియం ఎముకకు గట్టిదనాన్నిస్తుంది.
- ఫాస్ఫరస్ ఎముకకు మండే స్వభావాన్ని కలిగిస్తుంది.
- మానవుడి శరీరంలో ఉండే అతిపెద్ద ఎముక/అతిపొడవైన ఎముక- ఫీమర్ (తొడ ఎముక)
- మానవుడి శరీరంలో ఉండే అతిచిన్న ఎముక- చెవిలోని స్టేపిస్ (కర్ణాంతరాస్థి)
- మానవుడి శరీరంలో ఉండే అతి మెత్తని ఎముక- మృదులాస్థి
- మానవుడిలో ఉండే అతి గట్టి ఎముక- కింది దవడ ఎముక
- మానవ శరీరంలో ఎముక కంటే గట్టి పదార్థం- ఎనామిల్
- సాధారణ మానవుడి శరీరంలో ఉండే మొత్తం ఎముకల సంఖ్య- 206
- అప్పుడే పుట్టిన పిల్లల్లో ఉండే మొత్తం ఎముకల సంఖ్య- 300
- అస్థిపంజరాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి అక్షాస్థిపంజరం, అనుబంధాస్థి పంజరం.
శ్రోణి మేఖల: ఇందులో రెండు భాగాలుంటాయి. అవి జత్రుక-2, రెక్క ఎముక-2. జత్రుక, రెక్క ఎముకలను కలిపి ‘భుజాస్థులు’ అని అంటారు.
ఉరో మేఖల: ఈభాగం పొట్ట కింద ఉంటుంది. ఇది కటీ వలయంతో నిర్మితమై ఉంటుంది. ఇందులో ఉండే ఎముకల సంఖ్య-2. - ఎముకల పెరుగుదలకు తోడ్పడే విటమిన్- డి విటమిన్
- ఎముకల మధ్యలో ‘అస్థి మజ్జ’ ఉంటుంది. ఇది ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో
పాల్గొంటుంది. - పక్షుల రెక్క ఎముకల మధ్యలో అస్థి మజ్జ ఉండదు. అవి గాలితో నిండి ఉంటాయి. వీటిని వాతిలాస్థులు అంటారు. ఇవి పక్షులు ఎగరడానికి సహాయపడతాయి.
- రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎముకలు లిగమెంట్ అనే పట్టీల సహాయంతో అతికే ప్రదేశాన్ని కీలు అంటారు. ఒక ఎముకను మరొక ఎముకను కలుపుతూ ఉండే నిర్మాణాన్ని కీలు అంటారు.
- కీళ్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రం-
ఆర్థ్రాలజీ - కీళ్లకు సంబంధించిన చికిత్స- ఆర్థరైటిస్
- మానవ శరీరంలో ఉండే కీళ్ల సంఖ్య- 230
- కీళ్లు రెండు రకాలు అవి. కదలని కీళ్లు,
కదిలే కీళ్లు.
కదలని కీళ్లు: ఇవి పుర్రెలో ఉంటాయి. కదలని కీళ్లలో కదిలే కీలుగా ‘కింది దవడ ఎముక’ను పేర్కొంటారు.
కదిలే కీళ్లు: వీటిని తిరిగి నాలుగు రకాలుగా విభజించారు. - బంతిగిన్నె కీలు- ఇది భుజంలో ఉంటుంది.
- మడతబందు కీలు- ఇది మోచేయి, మోకాలులో ఉంటుంది.
- కీలు- ఇది మెడ భాగంలో ఉంటుంది.
- జారుడు కీలు- ఇది మణికట్టు, వెన్నుపూసల్లో ఉంటుంది.
- సున్నిత శరీరావయవాలకు రక్షణ కల్పిస్తుంది.
- శరీరానికి ఆకారం, నిర్మాణం, ఆధారాన్నిస్తుంది.
- శరీర కదలికలు, చలనానికి తోడ్పడుతుంది.
- మూలకాలు, కొవ్వు నిల్వకు సహాయపడుతుంది.
- ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాల ఉత్పత్తి.
- అస్థిమజ్జలోని ఎరిత్రోపాయిటిన్ అనే ప్రొటీన్ వల్ల రక్తం ఉత్పత్తి జరుగుతుంది.
ఆస్టియోపోరోసిస్: ఇది వయస్సు మీరిన వారిలో ఎముకల సాంద్రత తగ్గడం వల్ల కలిగే రుగ్మత. - దీని వల్ల ఎముకలు కాల్షియాన్ని అధికంగా కోల్పోయి గుల్లబారి, పెళుసుగా మారి విరుగుతాయి.
ఆస్టియో మలేషియా: పెద్దవారిలో విటమిన్-డి లోపం వల్ల ఎముకల్లో కాల్షియం, ఫాస్ఫరస్ లోపించి ఈ వ్యాధి వస్తుంది.
ఆస్టియో ఆర్థరైటిస్: కీళ్ల మధ్య మృదులాస్థి క్షీణించడం, సైనోవియల్ ద్రవం స్రవించడం ఆగిపోవడం వల్ల నొప్పి వస్తుంది.
ఆర్థరైటిస్: కీళ్లలో వాపు ఏర్పడటం. దీనికి విరుగుడుగా తేనెటీగల విషాన్ని ఉపయోగిస్తారు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్: ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్. భరించలేని కీళ్లనొప్పి వస్తుంది.
రికెట్స్ (ఎముకలు విరగడం): చిన్నపిల్లల్లో విటమిన్-డి, కాల్షియం లోపం వల్ల వస్తుంది. ఎముకలు పెలుసుబారడం, ఎముకల్లో రంధ్రాలు ఏర్పడి కుచించుకుపోవడం ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధిని దొడ్డికాలు లేదా ముట్టి కాలు అంటారు. - గౌట్: కీళ్లలో యూరిక్ ఆమ్లం స్ఫటికాల రూపంలో సంచితం అయి కీళ్ల వాపు వస్తుంది.
కండరాలు
- ఎముకలకు అంటిపెట్టుకుని ఉండే కణజాల నిర్మాణాలను కండరాలు అంటారు.
- కండరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం- మయాలజీ
- కండరాల్లో ఉండే ప్రొటీన్- మయోసిన్
- మానవ శరీరంలో ఉండే మొత్తం కండరాల సంఖ్య- 639
- శరీరంలోని అతిపెద్ద కండరం- గ్లూటియస్ మాక్సామస్ (తొడ భాగంలో ఉంటుంది)
- మానవ శరీరంలో ఉండే అతిచిన్న కండరం- స్టెపిడియస్ కండరం( చెవిలో ఉంటుంది)
- కండరాలు మూడు రకాలు అవి నియంత్రిత కండరాలు, అనియంత్రిత కండరాలు, హృదయ కండరాలు.
నియంత్రిత కండరాలు (రేఖిత కండరాలు): ఈ కండరాలు మన శరీరం ఆధీనంలో ఉంటాయి. ఇవి కాళ్లు, చేతుల్లో ఉంటాయి.
అనియంత్రిత కండరాలు (అరేఖిత కండరాలు): ఈ కండరాలు శరీరం నియంత్రణలో ఉండవు. ఇవి పేగులు, గర్భాశయం, మూత్రాశయం, కనురెప్పల్లో ఉంటాయి.
హృదయ కండరాలు: ఇవి హృదయంలోనే ఉంటాయి. ఇవి రక్తాన్ని పంపు చేయడంలో సహాయపడతాయి. ఈ కండరాలు నిర్మాణంలో నియంత్రిత కండరాలు, విధుల్లో అనియంత్రిత కండరాలను పోలి ఉంటాయి. - కండర సంకోచానికి ఉపయోగపడే మూలకాలు- పొటాషియం, కాల్షియం
- కండరాల గురించి వివరించే సిద్ధాంతం ైస్లెడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతం.
- దీన్ని హక్సలే ప్రతిపాదించాడు.
- కండరాలకు వచ్చే క్యాన్సర్- సార్కోమా
- కండరాల్లో ఉండే వర్ణకం- మయోగ్లోబిన్
కండరాల అపస్థితులు
టెటాని: టెటాని అంటే పారాథార్మోన్ లోపం వల్ల ఎల్లప్పుడూ సంకోచం చెందడం. - దీని ఫలితంగా ఎముకలు కదలవు.
కండర గ్లాని: కండరాలు ఎల్లప్పుడు పనిచేయడం వల్ల దానికి సరైన ఆక్సిజన్ అందక అవాయు శ్వాసక్రియ జరుపుకొని లాక్టిక్ ఆమ్లం ఏర్పడటం వల్ల కండరాలు అలసటకు గురవుతాయి.
రిగర్ మోర్టిస్: జీవి చనిపోయిన తర్వాత దానిలో ATP ఉత్పత్తి కాకపోవడం వల్ల ఆక్టిన్, మయోసిన్ అనే కండరాల ప్రొటీన్స్ పనిచేయక శరీరం గట్టిగా మారుతుంది.
కాలేయం
- కాలేయం గురించిన అధ్యయనాన్ని హెపటాలజీ అంటారు.
- ఇది దేహంలోని అతిపెద్ద గ్రంథి. ప్రౌఢ మానవుడిలో దీని బరువు 1.2-1.5 కిలోలు ఉంటుంది.
- ఇది విభాజక పటలానికి కింద ఉదర కుహరంలో కుడివైపున ఉంటుంది.
- కాలేయంలో కాలేయ కణాలను కలిగి ఉన్న గ్లిస్సన్స్ గుళిక ఉంటుంది.
- కాలేయ కణాలు పైత్య రసాన్ని స్రవిస్తాయి. ఈ పైత్యరసం పిత్తాశయంలో నిల్వ ఉంటుంది.
- కాలేయం, క్లోమ గ్రంథుల నాళాలు ఐక్య కాలేయ క్లోమ నాళంగా చిన్న పేగు పై భాగమైన ఆంత్రమూలంలోకి తెరుచుకుంటుంది. ఇక్కడ ఒడ్డి సంవరణి ఉంటుంది.
- కాలేయం అనేక విధులను నిర్వహిస్తుంది.
- ఇది స్రవించే పైత్య రసంలో ఎంజైమ్లు ఉండవు. కానీ పైత్య రస లవణాలు, పైత్య రస వర్ణకాలు ఉంటాయి.
- కాలేయం కొలెస్టిరాల్, హెపారిన్, అల్బుమిన్లు, గ్లోబ్యులిన్లు, ఫైబ్రినోజన్, ప్రోత్రాంబిన్ల ఉత్పత్తికి తోడ్పడుతుంది.
- A, D, E, K, B12 విటమిన్లు, ఇనుము కాలేయంలో నిల్వ ఉంటాయి.
- కాలేయంలో ఆర్నిథిన్ వలయం ద్వారా యూరియా ఏర్పడుతుంది.
- కాలేయం ఆహారం ద్వారా పేగులోకి ప్రవేశించిన విష పదార్థాలను విష రహితంగా మారుస్తుంది.
- పిండ దశలో కాలేయం ప్లీహంతో పాటు రక్త కణోత్పాదక అంగంగా, ప్రౌఢ దశలో ఎర్రరక్త కణ విచ్ఛిత్తి అంగంగా పనిచేస్తుంది.
అక్షాస్థిపంజరం
దీనిలో 80 ఎముకలుంటాయి.
పుర్రె- 29
పక్కటెముకలు-24 (12 జతలు)
వెన్నుపూసలు- 26 (చిన్న పిల్లల్లో 33)
ఉరోస్థి ఎముక (వక్ష ఎముక)- 1
పుర్రెలో ఉండే ఎముకల సంఖ్య- 29
కపాలం-8 ముఖభాగం-14
చెవులు- 6 నాలుక కింద- 1
అనుబంధాస్థి పంజరం- 126
శ్రోణి మేఖల (భుజం)- 4
ఉరో మేఖల (కటీ వలయం)-2
పూర్వాంగపు ఎముకలు (రెండు చేతులు)- 60
చరమాంగపు ఎముకలు (రెండు కాళ్లు)- 60
పూర్వాంగపు ఎముకలు(60)
అంస ఫలకం-2
రత్ని-2
అరత్ని-2
మణిబంధాస్థులు-16
అరచేయి-10
అంగుళ్యాస్థులు-28
చరమాంగం ఎముకలు (60)
తొడ-2 మోకాలు-2
బహిర్జంగిక-2
అంతర్జంగిక-2
చీలమండలం-14
ప్రసాదాస్థికలు-10
అంగుళ్యాస్థులు-28
ఎముక పొడవు
ఫీమర్ 19.88 అంగుళాలు
టిబియా 16.94 అంగుళాలు
ఫిబ్యులా 15.94 అంగుళాలు
హ్యూమెరస్ 14.35 అంగుళాలు
అల్నా 11.10 అంగుళాలు
స్టేపిస్ అతిచిన్న ఎముక
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు