దేశంలో సంక్షేమ యంత్రాంగం
గ్రూప్ 2, 3, గ్రూప్ – I మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులకు సంక్షేమ యంత్రాంగం అనే టాపిక్ ఉపయోగపడుతుంది. గ్రూప్ – II పాలిటీలో 8వ చాప్టర్, సాంఘిక నిర్మితిలో 5వ యూనిట్ రెండింటికీ ఇది ఉపయోగపడుతుంది. దీనిని సంక్షిప్తంగా అధ్యయనం చేస్తే జనరల్ స్టడీస్‌కు ఉపయోగపడి అధిక మార్కులు సాధించే అవకాశం ఉంది.
-ఈ టాపిక్‌లో సంక్షేమ యంత్రాంగం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, మైనార్టీలకు రాజ్యాంగంలో కల్పించిన రక్షణలు, కమిషన్లు, ఆయా వర్గాలకు సంబంధించిన సమస్యలు, వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై సంపూర్ణ అవగాహన సాధించాలి.
-భారతీయ సమాజంలోని కొన్ని వర్గాలు ఏదో ఒక కారణంతో సమానత్వ భావనలోకి రాకుండా సామాజిక వెలివేతకు గురయ్యాయి.
– సామాజిక వెలి అనే పదం మొదటిసారిగా ఉపయోగించింది ప్రెంచ్ దేశానికి చెందిన రీన్ లెనోయర్
– పారిశ్రామిక విప్లవం ఫలితంగా సంక్షేమ రాజ్యభావన యూరప్‌లో (ఇంగ్లండ్) ప్రారంభమైంది.
– ఫ్రెంచ్ విప్లవం సంక్షేమ రాజ్యానికి పుట్టుకగా భావిస్తారు.
– ప్రాచీన రాజ్యాలు, పోలీస్ రాజ్యాలు, నేటి ఆధునిక రాజ్యాలు సంక్షేమ రాజ్యాలు.
– ఉపయోగితవాది జెర్మి బెంథామ్ భావనలు శ్రేయోరాజ్య భావన గురించి తెలియజేస్తుంది.
నిర్వచనాలు
– సంక్షేమ రాజ్యం అంటే అటు కమ్యూనిస్టు రాజ్యానికి, ఇటు మితిమీరిన వ్యక్తి శ్రేయోవాదానికి మధ్యేమార్గంగా ఏర్పడింది – హభ్మన్
– ఆధునిక కాలంలో ప్రజలందరికీ ఏదో ఒక రూపంలో పలు రకాల సేవలు అందిస్తున్న రాజ్యాలు సేవా రాజ్యాలు – రోస్కోలాండ్
– భారతదేశంలో సమాజ సంక్షేమం కోసం రాజ్యాంగ ప్రవేశికలోని భావనలు, ఆదేశిక సూత్రాల్లో పొందుపర్చిన నియమాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు రూపొందించే సమయంలో వారికి ఉపయోగపడి మార్గదర్శకంగా ఉంటూ సంక్షేమ చర్యలు నిర్వహించడానికి ఉపయుక్తంగా ఉన్నాయి.
– దేశంలో సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి అమలుపర్చాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.
– భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత దేశ ప్రజలందరికీ కనీస అవసరాలు సమకూర్చాల్సిన అవసరం ఏర్పడింది.
– కేంద్ర ప్రభుత్వం 1952 అక్టోబర్ 2న సమాజ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇదే కార్యక్రమాన్ని 1953 అక్టోబర్ 2న సమాజ వికాస అభివృద్ధి పథకంగా ప్రవేశపెట్టారు.
– CDP, NESP కార్యక్రమాలు సమాజ వికాస పథకాలుగా అమలయ్యాయి.
– 1957లో కేంద్ర ప్రభుత్వం సమాజ అభివృద్ధి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసింది.
– 1974లో గ్రామీణ అభివృద్ధి శాఖను ఏర్పాటుచేశారు.
– 1985లో రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో సాంఘిక సంక్షేమ శాఖను ఏర్పాటు చేశారు. ఈ శాఖ కిందివర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుంది.
1. షెడ్యూల్డ్ కులాల సంక్షేమం
2. షెడ్యూల్డ్ తెగల సంక్షేమం
3. వెనుకబడిన తరగతుల సంక్షేమం
4. మైనార్టీల సంక్షేమం
5. వికలాంగుల సంక్షేమం
– 1985లో ఏర్పాటుచేసిన సాంఘిక సంక్షేమ శాఖను 1998లో అటల్ బిహారీ వాజ్‌పేయ్ ప్రభుత్వం సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖగా పేరు మార్చింది.
– ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారమంత్రి దావర్ చందర్ గెహ్లాట్.
– సంక్షేమ యంత్రాంగాన్ని అమలుపర్చడం కోసం వివిధ మంత్రిత్వ శాఖలు కృషి చేస్తున్నాయి.
1. గిరిజన శాఖ
2. మహిళ, శిశు సంక్షేమ శాఖ
3. మానవ వనరుల అభివృద్ధి శాఖ
4. మైనార్టీల వ్యవహారాల శాఖ
– సామాజిక సంక్షేమం అమలుచేయడానికి కేంద్రం రాజ్యాంగబద్దమైన, చట్టపరమైన కమిషన్లు ఏర్పాటుచేసింది. అవి..
1. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (ఎస్సీ)
2. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఎస్టీ)
3. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఓబీసీ)
4. జాతీయ అల్పసంఖ్యాక వర్గాల కమిషన్ (మైనార్టీ)
5. జాతీయ మహిళా కమిషన్
6. జాతీయ మానవ హక్కుల కమిషన్
7. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్
– భారత రాజ్యాంగ పరిషత్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ రాజ్యాంగ ప్రధాన లక్ష్యం పేదరికానికి దిగువన నివసిస్తున్న ప్రజలందరికీ కనీస జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రయత్నం చేయాలని సూచించారు.
– పండిట్ జవహర్‌లాల్‌నెహ్రూ రాజ్యాంగ పరిషత్‌లో లక్ష్యాలు – ఆశయాలతో నిర్మాణం ప్రవేశపెడుతూ పేదరికం, అజ్ఞానం, అనారోగ్యం అంతం చేయాలని పేర్కొన్నారు.
– ప్రవేశికలోని అంశాలు రాజ్యాంగ ఆదర్శాలు, ఆశయాలకు సూక్ష్మరూపం అని జస్టిస్ కోకా సుబ్బారావు తెలిపారు
షెడ్యూల్డ్ కులాలు – రాజ్యాంగ రక్షణలు
-మనుధర్మశాస్త్రం, రుగ్వేదంలోని 10వ మండలం పురుష సూక్తంలోని వర్ణాశ్రమ ధర్మం ప్రకారం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కాకుండా 4వ వర్ణంవారు శూద్రులు-వీరేకాకుండా అనులోమ, విలోమ వివాహాల ద్వారా జన్మించినవారిని పంచములుగా పిలిచారు.
-భారతదేశంలో ఆంగ్లేయులు ఎస్సీ, ఎస్టీ వర్గాల వారిని Depressed Casts అని పిలిచారు
– అస్పృశ్యత అనే పదం మొదటిసారి ఉపయోగించిన ఆంగ్లేయుడు – జేఎంనెస్ఫీల్డ్ (వృత్తి సిద్ధాంతం తెలిపాడు)
– 2011 లెక్కల ప్రకారం భారతదేశ జనాభా
ఎస్సీ జనాభా 16.64శాతం, ఎస్టీ జనాభా 8.62శాతం
-2011 లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా ఎస్సీ జనాభా 15.44శాతం, ఎస్టీ జనాభా 9.34 శాతం
– సైమన్ కమిషన్ ఎస్సీ అనే పదం ఉపయోగించాడు.
-1935 భారత ప్రభుత్వ చట్టంలో మొదటిసారి షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) అనే పదం ఉపయోగించారు.
-1937లో ముంబైలో హరిజనులకు దేవాలయ ప్రార్థన చట్టం చేసి వారికి అనుమతి ఇచ్చారు.
ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగంలో ఉమ్మడి రక్షణలు
-భారత రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారి రక్షణలు, ప్రాథమిక హక్కుల్లో (3వ భాగం), ఆదేశ సూత్రాలు (4వ భాగం), 10వ భాగం, 16వ భాగం, 5, 6వ షెడ్యూల్లో ఉన్నాయి.
ప్రాథమిక హక్కులు
-అధికరణం 14 ప్రకారం చట్టం అందరికీ సమాన ం.
– 15 (2) నిబంధన ప్రకారం ప్రభుత్వ, బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ ధన సహాయంతో నిర్వహించే సంస్థల్లో జాతి, కుల, మత, లింగ, జన్మ విచక్షణలు చూపకుండా అందరికీ ప్రవేశం కల్పించాలి.
– 15 (4) నిబంధన ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ప్రత్యేక రక్షణలు కల్పించి, మినహాయింపులు ఇవ్వవచ్చు
– 15 (5) నిబంధన ప్రకారం ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలవారికి ప్రత్యేక అవకాశాలు కల్పించాలి.
– 16 (2) నిబంధన ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో జాతి, కుల, మత, లింగ, జన్మ, వారసత్వ, స్థిర నివాస ప్రాతిపదికన వివక్ష చూపరాదు.
– 16 (4) నిబంధన ప్రకారం బలహీనవర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన ప్రాతినిథ్యం లేనప్పుడు రిజర్వేషన్లు కల్పించవచ్చు.
– 16 (4ఎ) నిబంధన ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఉద్యోగాల పదోన్నతిలో రిజర్వేషన్లు కల్పించవచ్చు.
– 16(4బి) నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో అర్హత మార్కులు తగ్గించవచ్చు.
– 17వ నిబంధన ప్రకారం అంటరానితనం నేరం.
– 19(5) నిబంధన ప్రకారం ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైన వృత్తిని స్వీకరించవచ్చు.
– 23 నిబంధన ప్రకారం వెట్టిచాకిరీ, బానిసత్వాన్ని నిర్మూలించి ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రక్షణ కల్పించాలి.
– 29 నిబంధన ప్రకారం భారతదేశంలో అన్నివర్గాల ప్రజలు తమ భాష, లిపి, సంస్కృతిని పరిరక్షించుకోవచ్చు. అంటే ఎస్సీ, ఎస్టీ, వర్గాల వారికి భాష, లిపి సంస్కృతి పరిరక్షించబడుతుంది.
– 30 (2) నిబంధన ప్రకారం అల్పసంఖ్యాక వర్గాల విద్యాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి.
ఆదేశ సూత్రాలు
-38(1) నిబంధన ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి.
– 39 (సి) ప్రకారం జాతీయ సంపద వికేంద్రీకరించాలి. సంపద అందరికీ సమానంగా పంపిణీ చేయాలి.
– 46వ నిబంధన ప్రకారం ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన తరగతుల వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి.
ఇతర అంశాలు
– 16 (4) నిబంధన ప్రకారం గిరిజన జనాభా అధికంగా ఉన్న రాష్ర్టాలైన మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని నియమించాలి.
– 243 (డి) నిబంధన ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థలో 243 (టి) నిబంధన ప్రకారం పట్టణ ప్రభుత్వాల్లో జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ వర్గాలవారికి ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలి.
– 10వ భాగం 244 నిబంధనలో షెడ్యూల్డ్, గిరిజన ప్రాంతాలకు సంబంధించిన పరిపాలన అంశాలు చేర్చారు. ఈ నిబంధన అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ర్టాలకు వర్తించదు.
– 275 నిబంధన ప్రకారం 5, 6 షెడ్యూల్డ్‌లో పొందుపర్చిన రాష్ర్టాలకు కేంద్రం ప్రత్యేక గ్రాంట్లు మంజూరు చేయాలి. 5, 6వ షెడ్యూల్లో ఎస్సీ, ఎస్టీవర్గాల వారికి సంబంధించిన అంశాలున్నాయి.
– 330 నిబంధన ప్రకారం లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీ వర్గాలవారికి రిజర్వేషన్లు కల్పించాలి.
– 332 నిబంధన ప్రకారం రాష్ర్టాల విధాన సభల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించాలి.
– 334 నిబంధనలో శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి కాలపరిమితికి సంబంధించిన అంశాలున్నాయి.
– 335 నిబంధనలో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను పొందుపర్చారు.
– 338 నిబంధన ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్‌ను రాష్ట్రపతి ఏర్పాటుచేయాలి.
– 338 (ఎ) నిబంధన ప్రకారం జాతీయ ఎస్టీ కమిషన్‌ను రాష్ట్రపతి ఏర్పాటుచేయాలి
– 341 నిబంధన ప్రకారం షెడ్యూల్డ్ కులాలను రాష్ట్రపతి ప్రకటిస్తారు.
– 342 నిబంధన ప్రకారం షెడ్యూల్డ్ తెగలను రాష్ట్రపతి ప్రకటిస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు