దేశంలో మొదట ఆర్టీఐ చట్టాన్ని ఎప్పుడు చేశారు?
1. 2012లో ఇద్దరు కేరళ మత్స్యకారులను కాల్చివేసిన ఘటనలో అరెస్టయిన ఇటాలియన్ నావికులు సల్వటోర్ జిరోన్+ మసిమిలనోలటోరేలను అంతర్జాతీయ సముద్రజలాల ట్రిబ్యునల్ అభ్యర్థన మేరకు విడుదల చేసిన వెకేషన్ బెంచ్ న్యాయమూర్తులు?
1) రోగర్+పంత్ 2) పంత్+ చంద్రచూడ్
3) చంద్రచూడ్+ సాధిఖ్ 4) పంత్+ చక్రిపాల్
2. నీరాంచల్ అనేది .. ?
1) ప్రత్యేకరాష్ట్ర డిమాండ్
2) ఉత్తరాఖండ్‌లో జల విద్యుత్ ప్రాజెక్టులు
3) నేపాల్‌లోని ఒక జిల్లా 4) వాటర్‌షెడ్ పథకాలు
3. మనం రోజు తింటున్న బ్రెడ్‌లో కలుపుతున్న ప్రాణాంతక రసాయనాలను గుర్తించండి.
1) పొటాషియం బ్రోమేట్+ అయోడేట్
2) పొటాషియం క్లోరైడ్+పర్మాంగనేట్
3) అస్కార్బిక్ యాసిడ్ + సోడియం
4) సోడియం బేస్డ్ ఎంజైమ్స్+ఎముల్సిపైర్స్
4. రిడ్జ్ ఫారెస్ట్ ఎక్కడుంది ?
1) జెనీవా 2) బార్సిలోనా 3) అట్టావా 4) న్యూఢిల్లీ
5. కిందివాటిలో ఏ దేశ అధ్యక్షుడు భారత రిపబ్లిక్ డే ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు?
1) పాకిస్థాన్ 2) దక్షిణాఫ్రికా 3) చైనా 4) ఇరాన్
6. AW101-12హెలికాప్టర్లకు (ఒక్కొక్కటి రూ.300కోట్లు) ఆర్డర్ ఇవ్వగా 3 హెలికాప్టర్లు మొదటి విడతగా దిగుమతి అయ్యాయి. భారత్‌కు అవి ఏ సంవత్సరంలో అందాయి ?
1) 2012 2) 2010 3) 2013 4) 2006
7. మిసా భారతి ఎవరు ?
1) పేపాల్ సీఈవో 2) పేటీఎం సీఈవో
3) పాప్‌సింగర్ 4) లాలు కుమార్తె
8. అమెరికా ఆమోదించిన NDAA/ఎన్డీఏఏ చట్టం ప్రకారం భారతదేశం ఏ స్థాయి దేశంగా గుర్తింపు పొందింది?
1) ఎన్పీటీ 2) ఎన్ఏటీవో
3) సీఈఏటీవో 4) ఏపీఈసీ
9. కింది వాటిని జతపర్చండి.
1) స్పెల్లింగ్బీ ఎ) ఆనంద్‌కుమార్
2) జాగ్రఫిక్బీ బి) జమాలా
3) సూపర్ 30 సి) నిహార్+జైరాం
4) 1944 డి) రిషి నాయర్+సాకేత్
1) 1-బి,2-సి,3-ఎ,4-డి
2) 1-సి,2-బి,3-ఎ,4-డి
3) 1-సి,2-డి,3-ఎ,4-బి
4) 1-డి,2-బి,3-ఎ,4-సి
10. కిందివాటిని జతపర్చండి.
1) కాళోజి ఎ) గ్రామీణ విశ్వవిద్యాలయం
2) కొండా లక్ష్మణ్‌బాపూజీ బి) వ్యవసాయ విశ్వవిద్యాలయం
3) జయశంకర్ సి) పశువైద్య విశ్వవిద్యాలయం
4) స్వామి రామానందతీర్థ డి) ఉద్యానవన విశ్వవిద్యాలయం
5) పీవీ నరసింహారావు ఈ) ఆరోగ్య విశ్వవిద్యాలయం
1) 1-బి,2-సి,3-డి,4-ఈ, 5-ఎ
2) 1-సి,2-బి,3-ఎ,4-ఈ,5-డి
3) 1-ఈ,2-డి,3-బి,4-ఎ,5-సి
4) 1-డి,2-బి,3-ఎ,4-సి,5-ఈ
11. మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులలో లేనిది గుర్తించండి.
1) కల్వకుర్తి 2) భీమా 3) నెట్టెంపాడు 4) కంతానపల్లి
12. ఇది తెలంగాణ ప్రభుత్వ అనుబంధ సంఘం/సంస్థ?
1) ధూం ధాం 2) తెలంగాణ కళాభారతి
3) సాంస్కృతిక సారథి 4) తెలంగాణ వారధి
13. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 96 నుంచి 106 వరకు ఏం చెబుతున్నాయి ?
1) ఆత్మరక్షణ కోసం దౌర్జన్యకారుడ్ని చంపడం
2) స్వీయ రక్షణకోసం బలప్రయోగం
3) నేరాన్ని అరికట్టుటకు పోలీసుల పాత్ర పోషించుట
4) తప్పు చేసి నిర్దోషిగా బయటపడవచ్చు
14. సెడిషన్ కేసులో అరెస్టు కాని వారిని గుర్తించండి.
1) యశ్పాల్ మాలిక్ 2) హార్థిక్ పటేల్
3) ఇస్లాం అలీబేగ్ 4) కన్హయ్య
15. రాజస్థాన్ అంటే ఎడారి, ఒంటెలు అంతేకాదు! రాజస్థాన్ అంటే ఆర్టీఐ కూడా! ప్రజాస్వామ్యంలో పారదర్శకత కోసం జైపూర్ జిల్లాలోని బేవార్ గ్రామ ప్రజలు 1996లో 40 రోజులు ధర్నా చేశారు. అది రాష్ట్రమంతా వ్యాపించి ప్రభుత్వాన్ని కదిలించింది. దేశంలో మొదటగా రాజస్థాన్ ప్రభుత్వం ఆర్టీఐ చట్టం చేయడానికి కారణమైంది. దాన్ని అనుసరిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా 2005లో ఆర్టీఐ చట్టాన్ని తీసుకురావడానికి దారితీసింది. అయితే దేశంలో మొదటి ఆర్టీఐ చట్టాన్ని ఎప్పుడు చేశారు?
1) 2004 2) 2003 3) 2002 4) 2000
16. జనవరి 23, 2016న నేతాజీ 119వ జన్మదినం సందర్భంగా ప్రధాని మోడీ అతడికి సంబంధంచిన 100 రహస్య పత్రాలను ప్రజలు తెలుసుకునేందుకు బహిర్గతం చేశారు. నేతాజీ మరణం గురించి సరైన అభిప్రాయంతో ఎవరూ లేకపోవడం చేత, నేతాజీ గురించి ప్రభుత్వం చేసిన ప్రకటనలు, తీసుకున్న నిర్ణయాన్ని రహస్యంగా ఉంచుతూ వస్తున్నారు. 1992లో జారీ చేసిన ఒక ఉత్తర్వు ప్రకారం పీవీ నరసింహారావు నేతాజీ పేరును సూచించడంతో భారతరత్నను ప్రకటించారు. మరి గాంధీజీ పేరును నోబెల్ శాంతి బహుమతికి 5సార్లు నామినేట్ చేసినా ఆయనకు ఆ బహుమతి ప్రకటించలేదు ఎందుకు?
1) గాంధీజీ ఎవరికి అందని మహనీయుడని
2) బ్రిటీషు ప్రభుత్వం వ్యతిరేకించడం వల్ల
3) శాంతి బహుమతి ప్రదానం చేసే నార్వే పార్లమెంట్ సభ్యుల బృందంలో ఏకాభిప్రాయం లేకపోవడం చేత
4) మరణాంతరం అవార్డు ప్రదానం చేయాలనే నిబంధన లేకపోవడం కారణంగా
17. ఏ.ఓ.ఏ అంటే?
1) భారతీయ కంపెనీల చట్టం ప్రకారం కంపెనీ స్థాపనకు ముందే అంతర్గత వ్యవహారాల కోసం కంపెనీ యాజమాన్యం రాసుకునే డాక్యుమెంట్ (ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్)
2) రాఫెల్ యుద్ధ విమానాలకు సమానశక్తి కలిగిన భారతీయ యుద్ధ విమానం తేజస్ మాక్-2 రెండో ఇంజిన్ (అనమోలి ఆఫ్ అసెంబ్లీ/ఏ.ఓ.ఏ)
3) జమ్ముకశ్మీర్ నూతన ప్రభుత్వ ఒప్పందం
4) అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందం ముందు 27 ఏండ్ల అంతర్గత పోరు (వైట్ఫ్లాగ్ కిల్లింగ్స్ – మానవ హక్కుల ఉల్లంఘనపై శ్రీలంక ప్రభుత్వం సమర్పించిన శ్వేతపత్రం)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు