General Studeis Indian Politics | పార్టీ సభ్యత్వాన్ని సభాధ్యక్షులు ఎవరి సూచనతో రద్దు చేస్తారు?
1. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) గురించి సరికాని వాక్యం ఏది?
1) దీన్ని 1925లో స్థాపించారు
2) పార్టీ చిహ్నం కంకి (మొక్కజొన్నపొత్తు), కొడవలి
3) దీని పత్రిక పేరు న్యూస్ఏజ్
4) దీనిలో 1970లో చీలికలు వచ్చాయి
2. ఇందిరాగాంధీ గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1) ఈమె మొదటి భారతీయ మహిళా ప్రధానమంత్రి
2) ఈమె 1969లో 14 బ్యాంకులను జాతీయం చేశారు
3) 1971లో గరీబీ హఠావో అనే నినాదం ఇచ్చారు
4) 1980లో 10 బ్యాంకులను జాతీయం చేశారు
3. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ సీపీఐ(ఎం) గురించి సరి కానిదేది?
1) దీన్ని 1964లో స్థాపించారు
2) దీని చిహ్నం సుత్తి, కొడవలి, నక్షత్రం
3) దీని స్థాపకుడు హరికిషన్ సింగ్ సుర్జీత్
4) దీని పత్రిక పీపుల్ డెమోక్రసీ
4. జనతాపార్టీ గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) దీన్ని 1964లో స్థాపించారు
2) దీనికి అధ్యక్షుడు మొరార్జీదేశాయ్, ఉపాధ్యక్షుడు చరణ్‌సింగ్
3) జనతాపార్టీ 6వ లోక్‌సభ ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టింది
4) దీని చిహ్నం నాగలి పట్టిన రైతు
5. భారతీయ జనతాపార్టీ గురించి సరికానిది?
1) దీన్ని 1988లో స్థాపించారు
2) ఈ పార్టీలో అగ్రనాయకులు అటల్‌బిహారి వాజ్‌పేయి, అద్వాని, మోదీ, వెంకయ్యనాయుడు
3) ఈ పార్టీకి ఒకే దేశం, ఒకే జాతి, ఒకే చైతన్యం మీద నమ్మకం
4) దీని పత్రిక కమల్ సందేశ్
6. బహుజన సమాజ్ పార్టీ గురించి సరికానిది.
1) దీన్ని 1984లో కాన్షీరామ్ స్థాపించారు
2) ఇది 8సార్లు యూపీలో అధికారంలోకి వచ్చింది
3) ఇది అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుంది
4) ఇది అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని సమాజంలో వ్యతిరేకిస్తుంది
7. నేషనలిస్ట్ కాంగ్రెస్‌పార్టీ గురించి సరికానిది?
ఎ) దీన్ని 1999లో స్థాపించారు.
2) శరద్‌పవార్ స్థాపించారు
3) ఇది అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుంది.
4) ఇది కేవలం అట్టడుగు వర్గాల వారి సాధికారత కోసం కృషి చేస్తుంది
8. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గురించి సరికానిది గుర్తించంది?
1) దీన్ని 1998లో మమతా బెనర్జీ స్థాపించింది.
2) 2006లో నందిగ్రామ్ ఉద్యమంలో ఈ పార్టీ ప్రముఖ పాత్ర వహించింది
3) ఇది 2018లో జాతీయ పార్టీ హోదా పొందింది
4) దీని నినాదం “మా మాటి మనుష్”
9. తెలుగు దేశం పార్టీ గురించి సరికానిది ఏది?
1) దీన్ని 1982 మార్చి 29న ఎన్టీఆర్ స్థాపించాడు
2) ఎన్టీఆర్ 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు
3) ఈ పార్టీని ఎదిరించిన మొదటి వ్యక్తి రాంలాల్
4) 2014లో 102 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది
10. ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ గురించి సరికానిది ఏది?
1) దీన్ని 1949లో అన్నాదొరై స్థాపించారు
2) దీని గుర్తు ఉదయిస్తున్న సూర్యుడు
3) రామస్వామి నాయకర్ను పెరియార్ అంటారు
4) ఇది బ్రాహ్మణుల అధిక్యతను ప్రోత్సహించింది
11. జయలలిత తమిళనాడులో ఏ పార్టీలో బాగా రాణించింది?
1) డీఎంకే పార్టీ 2) ఏఐడీఎంకే
3) శిరోమణి అకాళిదల్
4) ఏఐటీసీ
12. ఫ్లోర్ క్లాసింగ్ అంటే
1) రాజకీయ లబ్ధి కోసం పార్టీలు మారడం
2) శాసనసభలో అధికార పక్షానికి మద్దతు తెలపడం
3) అధికార పార్టీలోకి రాజకీయ లబ్ధి కోసం మారడం 4) పైవేవీకాదు
13. పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లోపం
1) సభాధ్యక్షులు నిర్ణీత సమయంలోనే తమ తీర్పును వెలువరించాల్సిన పరిమితి లేదు
2) చీలిక కలయిక అనే పదాలకు సరైన నిర్వచనం లేదు
3) పైరెండూ సరైనవి
4) పై రెండూ సరికాదు
14. పార్టీ మారాలనే ఉద్దేశంతో గుర్తింపదగిన ప్రయత్నాలు చేస్తే అవి పార్టీ ఫిరాయింపుల కిందికి వస్తాయని అలాంటి వారిని అనర్హులుగా ప్రకటించవచ్చని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
1) తమిళనాడు శాసనసభ
2) కర్ణాటక శాసనసభ
3) ఆంధ్రప్రదేశ్ శాసనసభ
4) కేరళ శాసనసభ
15. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హతపై అంతిమ అధికారం ఎవరిది?
1) సభాధ్యక్షులు 2) రాష్ట్రపతి
3) సుప్రీంకోర్టు
4) కేంద్ర ఎన్నికల సంఘం
16. పార్టీ ఫిరాయింపుల చట్టంలోని ప్రయోజనాలేవి?
1) రాజకీయ సుస్థిరత
2) అవకాశవాద రాజకీయాలను అరికట్టడం
3) సభ్యుల అనైతిక ప్రవర్తనను నిరోధించడం
4) పైవన్నీ సరైనవే
17. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి?
1) అవిశ్వాస, విశ్వాస తీర్మాన ఎ) దినేష్ గోస్వామి కమిటీ నివేదిక సమయంలోనే పార్టీ విప్ జారీ చేయాలి
2) ఎన్నికల ముందు ఏర్పడే రాజకీయ కూటములను కూడా రాజకీయ పార్టీలుగానే పరిగణించాలి బి) లా కమిషన్ నివేదిక
3) ప్రభుత్వాన్నీ బలహీన పరిచేలా ఓటు వేసినప్పుడే దాన్ని చెల్లని ఓటుగా పరిగణించాలి సి) రాజ్యాంగ సమీక్షా కమిషన్
4) పైవన్నీ సరైనవే
18. ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీకి సంబంధించి సరికాని వాక్యం ఏది?
1) దీన్ని 1972లో స్థాపించారు (రామచంద్రన్)
2) దీని గుర్తు 2 ఆకులు
3) జయలలిత 6 సార్లు ముఖ్యమంత్రిగా ఈ పార్టీ నుంచి ఎన్నికయ్యారు
4) దీనిలో కరుణానిధి సభ్యుడిగా పని చేశారు
19. కింది వాటిలో సరికానిది ఏది.
1) శిరోమణి అకాలిదళ్ 1920లో స్థాపించారు
2) దీన్ని పంజాబ్‌లో మాస్టర్ ధారాసింగ్ స్థాపించారు
3) ఈ పార్టీలో 1968లో చీలికలు వచ్చాయి
4) దీని గుర్తు త్రాసు
20. అస్సాం గణ పరిషత్ పార్టీ గురించి సరికానిది?
1) దీన్ని 1985లో స్థాపించారు
2) నినాదం అస్సాం అస్సామీలా కోసమే
3) అస్సాంలోకి పాకిస్థాన్ వాళ్లు వలస రావడాన్ని ఈ పార్టీ వ్యతిరేకించింది
4) ఈ పార్టీ గుర్తు ఏనుగు
21. శివసేన పార్టీ గురించి సరికానిది?
1) దీన్ని మహారాష్ట్రలో 1966లో బాల్ థాకరే స్థాపించారు
2) ఈ పార్టీ పత్రిక సామ్నా
3) ఈ పార్టీ శంభాజీ స్ఫూర్తిని పొందింది
4) దీని చిహ్నం విల్లు, బాణం
22. తెలంగాణ రాష్ట్ర సమితి గురించి సరికానిది?
1) దీన్ని 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ స్థాపించారు
2) దీని గుర్తు కారు
3) ఇది 2014 జూన్ 2న 66 స్థానాలను గెలుచుకొని అధికారంలోకి వచ్చింది
4) కేసీఆర్ ఇప్పటి వరకు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు
23. కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1) టీఆర్ఎస్ 2) లోక్‌సత్తా పార్టీ
3) సమాజ్‌వాది పార్టీ
4) వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ
24. కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1) 2006లో జయప్రకాశ్ నారాయణ్ లోక్‌సత్తా పార్టీని స్థాపించారు
2) దీని గుర్తు ఈల
3) నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ గుర్తు నాగలి
4) దీన్ని 1950లో షేక్ అబ్దుల్లా స్థాపించారు
సమాధానాలు
1-4 2-4 3-3 4-1
5-1 6-2 7-3 8-3
9-3 10-4 11-2 12-3
13-3 14-2 15-1 16-4
17-4 18-4 19-3 20-3
21-3 22-4 23-2 24-4
25. కిందివాటిలో సరికాని వాక్యం ఏది?
1) గుర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ పార్టీని 1989లో స్థాపించారు
2) ఇది పశ్చిమ బెంగాల్లో మంచి పేరున్న పార్టీ
3) దీన్ని సుభాష్ ఘీషింగ్ స్థాపించారు
4) దీని గుర్తు అడ్డచారలు, 3 నక్షత్రాలు, పిడిబాకుతో కూడిన జెండా
26. సమాజ్‌వాది పార్టీ గురించి సరికానిదేది?
1) దీన్ని 1992లో స్థాపించారు.
2) దీన్ని యూపీలో ములాయంసింగ్ యాదవ్ స్థాపించారు
3) దీని చిహ్నం సైకిల్
4) ఇది అన్ని వర్గాల వారికి సమాన ప్రాతినిధ్యం ఇస్తుంది
27. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి సరికానిది?
1) వైఎస్ఆర్ అనగా యువసేన శ్రామిక రైతు
2) ఇది 2014 ఎన్నికల్లో ఏపీలో 67 అసెంబ్లీ స్థానాలను గెలుపొందింది
3) 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను గెలుపొందింది
4) 2019 ఎన్నికల్లో 25 లోక్‌సభ స్థానాల్లో గెలిచింది
28. ఆమ్ఆద్మీ పార్టీ గురించి సరికానిది ఏది?
1) దీన్ని 2012లో అరవింద్ కేజ్రీవాల్ స్థాపించాడు
2) ఈ పార్టీ 2013, 15లో అత్యధిక మెజార్టీతో గెలిచింది
3) దీని గుర్తు చీపురు
4) ఇది 2015 ఎన్నికల్లో 70కు 70 స్థానాలను గెలుచుకుంది
29. కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి?
1. 2008లో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించారు
2) 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 18 స్థానాలను గెలుచుకుంది
3) 2011లో కాంగ్రెస్‌లో విలీనమయ్యింది
4) ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ సభ్యత్వం పొందారు
30. కింది వాటిలో సరికానిది.
2014లో జనసేన పార్టీ స్థాపించారు
2) దీని గుర్తు షట్చక్ర
3) జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం, అక్వాఫుడ్ పార్క్ కోసం ఎక్కువ కృషి చేస్తున్నది
4) దీని పత్రిక గ్రీన్
31. కింది వాటిలో సరికానిది గుర్తించండి?
1) 2018లో కమలహాసన్ మక్కం నిధిమయం అనే పార్టీని స్థాపించారు
2) ఈ పార్టీ చిహ్నం చేతులు కలిపిన వలయం మధ్యలో నక్షత్రం
3) 2018లో తెలంగాణ జనసమితి పార్టీని స్థాపించారు
4) తెలంగాణ జనసమితి పార్టీని చెరుకు సుధాకర్ స్థాపించారు
32. పార్టీ ఫిరాయింపులకు గల పేర్లలో సరికానిది?
1) ఫ్లోర్ క్రాసింగ్ 2) కార్పెట్ క్రాసింగ్
3) పార్టీ హాపింగ్ 4) పార్టీ వాకింగ్
33. పార్టీ ఫిరాయింపుల చట్టం ఆవశ్యకతల గురించి సరికానిది?
1) 1967 తర్వాత పార్టీ ఫిరాయింపుల అధికమయ్యాయి
2) 1967లో హర్యానాలో పార్టీని ఫిరాయించి ముఖ్యమంత్రి అయినది గయాలాల్
3) ఫిరాయింపు చట్టాన్ని 1979లో రూపొందించిన మొదటి రాష్ట్రం పశ్చిమబెంగాల్
4) దీన్ని 55వ రాజ్యాంగ సవరణ ద్వారా రూపొందించారు.
34. కింది వాటిలో సరికానిది ఏది?
1) 1985లో రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 52వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రంలో మొట్టమొదటిసారిగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని చేశారు
2) పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని 10వ షెడ్యూల్లో చేర్చారు
3) పార్టీ ఫిరాయింపుల చట్టం 2004లో అమల్లోకి వచ్చింది
4) పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని 2000ల్లోనే ఆమోదించారు
35. పార్టీ ఫిరాయింపుల్లో అనర్హతలో సరికానిది?
1) ఒకపార్టీ టికెట్ తరఫున ఎన్నికయ్యి ఇంకొక పార్టీలోకి వెళ్లడం
2) పార్టీ జారీచేసిన విప్‌కు వ్యతిరేకంగా ఉన్నప్పుడు
3) స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత వేరే పార్టీలో చేరితే ప్రభుత్వం రద్దు అవుతుంది
4. పార్టీ నాయకుడిని ఎదిరించిన సభ్యత్వం రద్దవుతుంది
36. పార్టీ సభ్యత్వాన్ని సభాధ్యక్షులు ఎవరి సూచన మేరకు రద్దు చేస్తాడు?
1) పార్టీ నాయకుడు
2) పార్టీలోని సభ్యులు
3) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి
4) ఆ రాష్ట్ర గవర్నర్
37. పార్టీ ఫిరాయింపుల చట్టం-ప్రయోజనం కానిది?
1) రాజకీయ సుస్థిరత సాధించవచ్చు
2) అవినీతి, అనైక్యత ప్రవర్తనను నిరోధించవచ్చు
3) రాజకీయాల్లో నిజాయితీని సాధించవచ్చు
4) అవకాశవాద, అధికార పూరిత రాజకీయాలను అరికట్టవచ్చు
38. పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లోపం కానిది?
1) సభ్యులు స్వేచ్ఛ హక్కును హరిస్తుంది
2) సభాధ్యక్షులు నిర్ణయం పక్షపాతంతో కూడుకొని ఉండవచ్చు
3) రాజకీయ సుస్థిరతను సాధించవచ్చు
4) చీలిక, కలయిక అనే పదాలకు సరైన అర్థం వివరణ లేదు
39. కిందివాటిలో సరికాని వాక్యం ఏది?.
1) 2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా మంత్రి మండలికి సంబంధించి అనర్హతలను పేర్కొన్నారు.
2) కేంద్ర మంత్రి మండలిలో లోక్సభ్లోని మొత్తం సభ్యుల్లో 15 శాతానికి మించి ఉండరాదు
3) రాష్ట్రమంత్రి మండలిలో వీరి సంఖ్య 12కు తగ్గరాదు
4) పార్టీ ఫిరాయింపులను 11వ షెడ్యూల్డ్‌లో చేర్చారు
సమాధానాలు
25-1 26-4 27-4 28-4
29-4 30-4 31-4 32-4
33-4 34-4 35-4 36-1
37-3 38-3 39-4
ఆంజనేయులు
ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీ సర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు