General Studies | ప్రభుత్వ భద్రతా సిబ్బందికి జీఐఎస్ ఏ విధంగా సహకరిస్తుంది?
1. కిందివాటిలో జియో ఇన్ఫర్మాటిక్స్లో భాగమైనది ఏది?
1) రిమోట్ సెన్సింగ్
2) జీఐఎస్ అండ్ జీపీఎస్
3) ఇంటర్నెట్ మ్యాపింగ్ సర్వీస్
4) పైవన్నీ
2. కిందివాటిలో సరైనది ఏది?
భారతదేశంలో విపత్తు నిర్వహణకు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కింది కార్యక్రమాలను, ప్రాజెక్టులను అమల్లోకి తెచ్చింది.
ఎ) విపత్తు నిర్వహణ మద్దతు కార్యక్రమం (డి.ఎం.ఎస్)
బి) జాతీయ వ్యవసాయ కరువు మదింపు పర్యవేక్షణ వ్యవస్థ (ఎన్.ఎ.డి.ఎ.ఎం.ఎస్)
సి) కార్చిచ్చుల మానిటరింగ్ కోసం ఇన్ఫ్రాస్
డి) భూ వినియోగం మొదలైన వాటికి సంబంధించి భువన్, భూ సంపద
1) ఎ, బి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
3. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ
(ఎన్ఎండీఏ) జాతీయ విపత్తు నిర్వహణ సమాచార, కమ్యూనికేషన్ వ్యవస్థపై మార్గదర్శకాలు విడుదల చేసిన సంవత్సరం?
1) 2011 2) 2012
3) 2014 4) 2016
4. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్ఎస్) ఎక్కడ ఉంది?
1) హైదరాబాద్ 2) నైనిటాల్
3) అహ్మదాబాద్ 4) డెహ్రడూన్
5. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్ఎస్)కు సంబంధించి దిగువ పేర్కొన్నవాటిలో సరైనది ఏది?
ఎ) సహజవనరులు, పర్యావరణ విపత్తు నిర్వహణకు సంబంధించి రిమోట్ సెన్సింగ్ జియో ఇన్ఫర్మాటిక్స్, జీపీఎస్ టెక్నాలజీలో సుశిక్షితులైన నిపుణులను రూపొందించేందుకు ఒక ప్రాథమిక శిక్షణ, విద్యా సంస్థగా వ్యవహరిస్తుంది.
బి) ఇది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలోని విభాగంగా పనిచేస్తుంది
సి) ఇంతకు పూర్వం దీని స్థానంలో ఇండియన్ ఫొటో ఇంటర్‌ప్రిటేషన్ ఇన్స్టిట్యూట్ ఉండేది
డి) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిల్లో రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ శిక్షణ, విద్యా కార్యక్రమాలను అందిస్తుంది
1) ఎ,బి 2) సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
6. భారతదేశంలో అతి పెద్ద ప్రభుత్వేతర సైంటిఫిక్ సొసైటీ ఏది?
1) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్ఎస్)
2) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ
3) నేషనల్ జియోగ్రాఫికల్ సర్వే ఇన్స్టిట్యూట్
4) ఏదీకాదు
7. వరద ప్రభావిత ప్రాంతాల పరిధిని తెలుసుకోవడానికి అత్యుత్తమ సాధనంగా ఉపయోగపడేవి ఏవి?
1) శాటిలైట్ ఆధారిత ఇమేజరీలు
2) ఏరోస్పేస్ సిస్టమ్‌ల ద్వారా వచ్చిన సమాచారం
3) పై రెండూ 4) ఏదీకాదు
8. ఇస్రో ఏ రాష్ర్టాల వరదలకు సంబంధించిన జిల్లాస్థాయి వైపరీత్య అట్లాస్‌లను రూపొందించింది?
ఎ) అసోం బి) బీహార్
సి) ఆంధ్రప్రదేశ్ డి) తెలంగాణ
9. తుఫాను ఏర్పడిన తర్వాత అది పయనించే మార్గాన్ని ఇస్రోకు చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్లో అభివృద్ధి చేసిన ఒక గణిత నమూనాను ఉపయోగించి అంచనా వేస్తారు. అయితే స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఏ రాష్ట్రంలో ఉంది?
1) గుజరాత్‌లోని అహ్మదాబాద్
2) తెలంగాణలోని హైదరాబాద్
3) ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట
4) ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్
10. భారతదేశంలో కరువు తీవ్రత స్థాయిని అంచనా వేయడానికి ఏ డేటాను ఉపయోగిస్తారు?
1) హజార్డ్ జోనేషన్ మ్యాప్ డేటా
2) కోర్స్ రెజల్యూషన్ శాటిలైట్ డేటా
3) క్రాఫ్ ఫోర్కాస్టింగ్ డేటా
4) 1, 2
11. భారతదేశంలో కార్చిచ్చుల (ఫారెస్ట్ ఫైర్)కు సంబంధించి వాస్తవమైనది ఏది?
ఎ) భారతదేశంలోని మొత్తం అటవీ విస్తీర్ణంలో 55 శాతం ప్రాంతానికి అగ్నిప్రమాదం పొంచి ఉంది?
బి) దేశవ్యాప్తంగా కార్చిచ్చుల కారణంగా సంవత్సరానికి రూ. 440 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లుతున్నది
సి) కార్చిచ్చుల వల్ల వాతావరణంలోకి పెద్ద ఎత్తున ట్రేస్ వాయువులు, ఏరోసాల్ పార్టికల్స్ విడుదలవుతాయి
డి) ఈ కార్చిచ్చులు ట్రోపోస్పియర్లోని రసాయన సమ్మేళనం, శీతోష్ణస్థితిలో కూడా కీలకపాత్ర పోషిస్తాయి
1) ఎ, డి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి, డి
12. సుధామహేశ్వరి విపత్తు నిర్వహణకు సంబంధించిన కమ్యూనికేషన్‌ను ఎన్ని స్థాయిలుగా వర్గీకరించవచ్చు?
1) నాలుగు 2) మూడు
3) రెండు 4) ఒకటి
13. సుధామహేశ్వరి వర్గీకరించిన విపత్తు నిర్వహణ కమ్యూనికేషన్ స్థాయిలు?
ఎ) విపత్తు నిర్వహణలో పాల్గొనే నిపుణులు, పరిశోధన చేసే వారి మధ్య కమ్యూనికేషన్
బి) విపత్తు నిర్వహణలో పాలుపంచుకుంటున్న సంస్థలు, ఏజెన్సీల మధ్య కమ్యూనికేషన్ సాధనాలు
సి) విపత్తు బాధితులకు అవగాహన కల్పించేందుకు విపత్తు సంసిద్ధతలో కమ్యూనికేషన్ సాధనాలు
డి) విపత్తులకు బాధితులు కాని ప్రజలకు విపత్తుపై అవగాహన కల్పించే కమ్యూనికేషన్ సాధనాలు
1) ఎ, డి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి, డి
14. జీఐఎస్ అంటే?
1) జియోగ్రాఫికల్ ఇంటిమేషన్ సిస్టం
2) జియోలాజికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం
3) జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం
4) జియోమార్పాలజీ ఇన్ఫర్మేషన్ సిస్టం
15. జీఐఎస్ అనేది ప్రాదేశిక డేటాను విశ్లేషించడంలో దిగువ పేర్కొన్న అంశాల కలయిక?
ఎ) జాగ్రఫీ బి) కంప్యూటింగ్
సి) కార్టోగ్రఫీ డి) రిమోట్ సెన్సింగ్
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
16. 2001లో గుజరాత్లో భూకంపం సందర్భం గా సహాయక చర్యల్లో బాగంగా సహాయపడిన ఆధునిక సాంకేతిక వ్యవస్థ?
1) జీఐఎస్ 2) జీపీఎస్
3) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
4) సోషల్ మీడియా
17. ప్రభుత్వ భద్రతా సిబ్బందికి జీఐఎస్ ఏ విధంగా సహకరిస్తుంది?
1) ఆపత్కాల స్పందన
2) సహాయక చర్యల ప్రాధాన్యతల నిర్ధారణ
3) భవిష్యత్ విపత్తు ఘటనలను పసిగట్టడం
4) పైవన్నీ
18. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఏ రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్ల కోసం అలర్ట్ సిస్టంను అభివృద్ధి పరిచింది?
1) ఆంధ్రప్రదేశ్ 2) తమిళనాడు
3) పశ్చిమ బెంగాల్ 4) బీహార్
19. భారత గృహ వ్యవహారాల శాఖ (హోం మినిస్ట్రీ) ఏ మంత్రిత్వ శాఖలతో కలిసి జీఐఎస్ ఆధారిత నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్(ఎన్డీఈఎం)ను అభివృద్ధి పరిచింది?
1) అంతరిక్షశాఖ
2) సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ
3) కమ్యూనికేషన్స్ ఐటీ మంత్రిత్వశాఖ
4) పైవన్నీ
20. ఇంటర్నెట్ అందుబాటులో ఉండే తీర ప్రాంత సముద్రమట్టం పర్యవేక్షణ వ్యవస్థ (కోస్టల్ సీ లెవల్ మానిటరింగ్ సిస్టం)ను అభివృద్ధి పరిచిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది?
1) విశాఖపట్నం 2) గోవా
3) పుదుచ్చేరి 4) కొచ్చిన్
21. ఎలాంటి సహజ విపత్తు సంభవించినా ప్రజలను తక్షణం అప్రమత్తం చేసే జాతీయ విపత్తు నిర్వహణ సమాచార వ్యవస్థ (ఎన్డీఐఎస్)ను ప్రభుత్వం ఆవిష్కరించింది.
ఈ ప్రాజెక్టును ఏ సంస్థ అభివృద్ధి చేసింది?
1) టెక్నాలజీ డెవలప్మెంట్ కౌన్సిల్(టీడీసీ)
2) బెంగళూరుకు చెందిన జెనీవా సాఫ్ట్వేర్ టెక్నాలజీస్
3) 1, 2 4) ఏదీకాదు
22. కిందివాటిలో వాస్తవమైనది ఏది?
ఎ) ప్రపంచ వాతావరణ సంస్థ న్యూఢిల్లీలోని భారత వాతావరణ శాఖను ఉష్ణమండల తుఫాన్లకు ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రంగా ప్రకటించింది
బి) బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో వచ్చే అన్ని తుఫాన్లకు సంబంధించిన వ్యవహారాలను ఇది పర్యవేక్షిస్తుంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
23. విపత్తువల్ల ప్రమాదానికి గురయ్యే అవకాశం పెరగడానికి ఇది కారణం కాదు?
1) జనాభా పెరుగుదల
2) వాతావరణ మార్పు
3) కాలుష్యం పెరగడం
4) శాస్త్ర సాంకేతికాల్లో స్తబ్దత
24. అభివృద్ధి స్థాయి, విపత్తుల వల్ల సంభవించే ప్రాణనష్టం మధ్య సంబంధం ఎలా ఉంటుంది?
1) నిలోమ 2) రేబియా
3) షూలీయ 4) ఘన
25. భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఎక్కడుంది?
1) చెన్నై 2) గోవా
3) కోల్‌కతా 4) హైదరాబాద్
26. భూకంపాలు..?
1) ఎక్సోజెనిక్ ప్రక్రియలు
2) ఎండోజెనిక్ ప్రక్రియలు
3) ఎక్సోజెనిక్, ఎండోజెనిక్ రెండూ కాదు
4) భూకంప రకాన్ని బట్టి నిర్ధారించాలి
27. భూకంప తీవ్రతని బట్టి భారతదేశాన్ని ఎన్ని జోన్లుగా విభజించారు?
1) 3 2) 4 3) 5 4) 6
28. కొండచరియలు విరిగిపడిన సందర్భాల వివరాలను నమోదు చేయటం, అలాంటి ప్రమాదాలను అంచనా వేయటం వంటి పనులను ప్రభుత్వం ఏ సంస్థకి అప్పగించింది?
1) భారత భౌమిక సర్వేక్షణ సంస్థ
2) భారతీయ సర్వేక్షణ సంస్థ
3) ఐఎన్సీఓఐఎస్
4) జాతీయ భూ భౌతిక పరిశోధనా సంస్థ
29. ఏ సంస్థ వృత్తిపరమైన ప్రమాద భావనను విశ్లేషించడంలో ప్రమాణాలు నిర్ణయిస్తుంది?
1) జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ
2) భారతీయ రసాయన సాంకేతిక సంస్థ
3) భారతీయ ప్రమాణాల బ్యూరో
4) వృత్తిపరమైన ప్రమాదాలకు సంబంధించి భారత్‌లో ప్రమాణాలు లేవు
30. భారత్‌లో కొండచరియలు విరిగిపడినప్పుడు జరిగే నష్టాన్ని త్వరితంగా అంచనా వేసే సంస్థ?
1) ఎన్డీఆర్ఎఫ్ 2) ఎన్ఆర్ఎస్సీ
3) జీఎస్ఐ 4) టీఈఆర్ఐ
31. ప్రపంచానికి ఉన్న ప్రకృతి వైపరీత్యాల ముప్పుకు సంబంధించిన సమాచార వినిమయం కోసం యూఎన్ఐపీ ఏర్పాటు చేసిన ‘విశ్వప్రమాద గణాంక నికేదిక’ (గ్లోబల్ రిస్క్డేటా ఫ్లాట్‌ఫామ్) పేరేమిటి?
1) ఓవర్ వ్యూ 2) ప్రివ్యూ
3) ఓపెన్స్ట్రీట్ 4) రిస్క్షేర్
32. విపత్తు ఉపశమన నిధి మొట్టమొదటిసారిగా ఎవరి సిఫారసు ద్వారా నెలకొల్పారు?
1) 7వ ఆర్థిక సంఘం
2) 8వ ఆర్థిక సంఘం
3) 9వ ఆర్థిక సంఘం
4) 10వ ఆర్థిక సంఘం
33. ‘విపత్తులన్నీ ఆపదలే, కానీ ఆపదలన్నీ విపత్తులు కావు’ ఈ ప్రకటన అసిస్టెంట్ ఆర్కిటెక్చరల్ ఇచ్చింది.
1) నిజమైనది 2) అబద్దం
3) పాక్షికంగా నిజం
4) నిర్ణయించుట కష్టం
34. ప్రమాద నిర్వహణ పరిభాషలో సామర్థ్యం (కెపాసిటీ) అనంతమైతే ఆపద వల్ల కలిగే ప్రమాద భావన (రిస్క్)?
1) అనంతం 2) తీవ్రం
3) మోస్తరు 4) సున్న
35. 1977లో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు జిల్లాలో వచ్చిన తుఫానులో మరణించిన వారిసంఖ్య సుమారు ఎంత?
1) 1,000 2) 10,000
3) 20,000 4) 25,000
36. ఆంధ్రప్రదేశ్‌లో తరచూ కరువుకు గురయ్యే జిల్లా ఏది?
1) కర్నూలు 2) కడప
3) అనంతపూర్ 4) ప్రకాశం
37. అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఎక్కడ ఉన్నది?
1) కొలంబో 2) సింగపూర్
3) టోక్యో 4) హోనోలులు
38. రిక్టర్ స్కేల్ దేన్ని కొలవడానికి వాడతారు?
1) వరదల తీవ్రత
2) భూకంపాల తీవ్రత
3) గనుల లోతు
4) సముద్రాల లోతు
39. భూకంపం లాస్ ఏంజెల్స్ని తాకితే అక్కడ నుంచి ఒక సునామీ టోక్యోకు?
1) ఒక జెట్ విమానం ప్రయోగించే సమయం కన్నా తక్కువ సమయంలో చేరుతుంది
2) ఒక బుల్లెట్ రైలు ప్రయాణించే సమయంకన్నా తక్కువ సమయంలో చేరుతుంది
3) 48 గంటల్లో చేరుతుంది
4) 36 గంటల్లో చేరుతుంది
40. ఒక సునామీలో మొదటి అల?
1) అన్నింటికంటే పెద్దది
2) అన్నింటికంటే పెద్దది కాకపోవచ్చు
3) అన్నింటికంటే ప్రమాదకరమైనది
4) ఇచ్చిన జవాబులన్నీ సరైనవి కావు
41. భూకంపం తర్వాత కూలీపోయిన భవనాల్లో వెతికేటప్పుడు వీటిని వాడటం మంచింది?
1) బ్యాటరీ టార్చ్
2) కొవ్వొత్తి
3) నూనెలో మండుతున్న బట్ట
4) దీపం వాడోద్దు
42. ప్రథమ చికిత్సలో కార్ల్ ప్రణాళికను ఆంగ్లంలో సంక్షిప్తంగా ఏమంటారు?
1) ఆర్ఏడీబీసీ 2) బీసీఆర్ఏడీ
3) డీఆర్ఏబీసీ 4) ఏబీసీడీఆర్
43. విపత్తు నిర్వహణ ప్రణాళిక ప్రకారం న్యూక్లియర్ విపత్తుల నిర్వహణకు ఏ మంత్రిత్వశాఖ నోడల్‌శాఖగా ఉంటుంది?
1) గృహ మంత్రిత్వశాఖ
2) అణుశక్తి విభాగం
3) రసాయన మంత్రిత్వ శాఖ
4) ఆరోగ్యశాఖ
జవాబులు
1-4 2-4 3-4 4-4
5-4 6-1 7-1 8-3
9-1 10-2 11-4 12-1
13-4 14-3 15-4 16-1
17-4 18-2 19-4 20-2
21-3 22-3 23-4 24-4
25-4 26-2 27-4 28-1
29-3 30-2 31-2 32-3
33-1 34-4 35-2 36-3
37-4 38-2 39-1 40-2
41-1 42-3 43-1
తెలుగు అకాడమీ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు