BIOLOGY | ఆపిల్‌లోని ఏ భాగాన్ని ఆహారంగా తీసుకుంటాం?
1. కింది ఏ ప్రత్యుత్పత్తి కేవలం మొక్కల దేహ భాగాల ద్వారా మాత్రమే జరుగుతుంది?
1) శాఖీయ ప్రత్యుత్పత్తి
2) లైంగిక ప్రత్యుత్పత్తి
3) అలైంగిక ప్రత్యుత్పత్తి
4) అంతర ప్రత్యుత్పత్తి
2. కేవలం కాండం ద్వారా వ్యాప్తి చెందే మొక్కకు ఉదాహరణ?
1) వేప 2) చెరకు
3) వరి 4) గోధుమ
3. అలైంగిక ప్రత్యుత్పత్తికి అవసరమైనది?
1) రెండు జీవులు
2) వ్యతిరేక లింగానికి చెందిన రెండు జీవులు
3) ఒకే జీవి 4) స్త్రీ జీవి
4. మానవుడిలో ఫలదీకరణం జరిగే భాగం
1) గర్భాశయం 2) యోని
3) ఫాలోపియన్ నాళం
4) పుటిక
5. నిశ్చితం (ఎ): సమ విభజన అన్ని శరీర కణాల్లో జరుగుతుంది. అయితే క్షయకరణ విభజన ప్రత్యుత్పత్తి కణాల్లో జరుగుతుంది.
వివరణ (ఆర్): సమ విభజన వల్ల క్రోమోసోమ్‌ల సంఖ్య సగానికి తగ్గించ బడుతుంది. క్షయకరణ విభజనలో క్రోమోసోమ్‌ల సంఖ్య స్థిరంగా ఉంటుంది.
1) ఎ, ఆర్ రెండూ సరైనవి. ఆర్ అనేది ఎ కు సరైన వివరణ
2) ఎ, ఆర్లు రెండూ సరైనవి ఆర్ అనేది ఎ కు సరైన వివరణ కాదు
3) ఎ సరైనది, ఆర్ సరైనది కాదు
4) ఎ సరైనది కాదు, ఆర్ సరైనది
6. ఏ జంతువుల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి ఎక్కువగా జరుగుతుంది?
1) మత్స్యాలు 2) ఉభయచరాలు
3) క్షీరదాలు 4) అకశేరుకాలు
7. మొక్కల ప్రత్యుత్పత్తిలో రెండో పురుష సంయోగ బీజం ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెందిన తర్వాత ఏర్పడే నిర్మాణం, దాని కేంద్రక స్థితి?
1) అండాంతః కణజాలం-3n
2) సంయుక్త బీజం- 2n
3) పరిచ్ఛదం- 2n
4) అంకురచ్ఛదం- 3n
8. ఏదైనా వ్యాధికి గురైనప్పుడు శస్త్రచికిత్స ద్వారా గర్భాశయాన్ని తొలగించడం?
1) ట్యుబెక్టమీ 2) వాసెక్టమీ
3) హిస్టిరెక్టమీ 4) ఏదీకాదు
9. ఒకే విధమైన కవలలు పుట్టడానికి కారణం?
1) రెండు అండాలు, ఒక శుక్రకణం చేత ఫలదీకరణం చెందుతుంది
2) ఒకే అండం, రెండు శుక్రకణాల చేత ఫలదీకరణం జరిగినప్పుడు
3) ఒక అండం, ఒక శుక్రకణం కలిసినప్పుడు
4) రెండు శుక్రకణాలు, రెండు అండాలు ఫలదీకరణం చెందినప్పుడు
10. ఏ భూగర్భ కాండంలో కన్నులు అనే నిర్మాణా లు ఉండి ఆ భాగాల నుంచి కొత్త మొక్కలు ఏర్పడుతాయి?
1) క్యారెట్ 2) అరటి
3) పసుపు 4) బంగాళదుంప
11. సాధారణ మానవ శరీరంలో ఉండే క్రోమోసోమ్‌ల సంఖ్య?
1) 43 2) 44 3) 45 4) 46
12. సంకరీకరణ ప్రయోగాలకు మెండల్ బఠానీ మొక్కను ఎంపిక చేసుకోవడానికి కారణం?
1) ఆత్మపరాగ సంపర్కం జరుపుకోవడం
2) ఏకవార్షిక మొక్క
3) ఏకలింగ పుష్పాలు
4) స్పష్టమైన లక్షణాలు కలిగి ఉండటం
13. కింది వాటిలో మార్పు చెందిన భూగర్భకాండం?
1) ముల్లంగి 2) బీట్రూట్
3) క్యారెట్ 4) పసుపు
14. మనకు ఆర్థికంగా ఉపయోగపడే అల్లం అనేది?
1) మార్పు చెందిన వేరు
2) మార్పు చెందిన భూగర్భకాండం
3) వాయుగత కాండం
4) రసయుత భూగర్భభాగం
15. శాఖీయ ప్రత్యుత్పత్తి వల్ల తర్వాతి తరంలో కలిగే లక్షణం?
1) కొత్త లక్షణాలు ఏర్పడతాయి
2) ఉత్పరివర్తనాలు కలుగుతాయి
3) తల్లి మొక్కల లక్షణాలు ఉంటాయి
4) రెండు మొక్కల లక్షణాలు ఉంటాయి
16. ఏ మొక్క వేరుపై మొగ్గలు ఏర్పడి అవి వాయుగతమై కొత్త మొక్కలు ఏర్పడతాయి?
1) అరటి 2) మందార
3) అల్లం 4) కరివేపాకు
17. కింది వాటిని జతపరచండి.
మొక్క క్రోమోసోమ్‌ల సంఖ్య
ఎ. ముల్లంగి 1. 18
బి. బఠాని 2. 14
సి. వరి 3. 24
డి. మొక్కజొన్న 4. 20
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-2, బి-3, సి-1, డి-4
18. ఒక పొడవు (సమయుగ్మజం) బఠానీ మొక్కను పొట్టి బఠానీ మొక్కతో సంకరణం చేసినప్పుడు ఏర్పడే పొడవు, పొట్టి బఠానీ మొక్కల నిష్పత్తి?
1) 3:1 2) 1:2:1
3) 1:2:1, 3:1 4) 1:0
19. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. టర్నర్ సిండ్రోమ్‌లో 45 క్రోమోసోమ్స్ ఉంటాయి
బి. డౌన్ సిండ్రోమ్‌లో 47 క్రోమోసోమ్స్ ఉంటాయి
సి. పాలి ప్లాయిడ్‌కు ఉదాహరణ పంట మొక్కలు
1) ఎ 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
20. ఫలదీకరణం అనంతరం అండాశయం దేనిగా మారుతుంది?
1) పిండం 2) విత్తనం
3) అండం 4) ఫలం
21. అంకురచ్ఛదయుత విత్తనాలకు ఉదాహరణ?
1) చిక్కుడు 2) వరి
3) బఠానీ 4) శనగ
22. కింది వాటిని జతపరచండి.
కారకం పరాగసంపర్క విధానం
ఎ. గాలి 1 హైడ్రోఫిలి
బి. నీరు 2. ఎనిమోఫిలి
సి. పక్షులు 3. ఎంటమోఫిలి
డి. కీటకాలు 4. ఆర్నిథోఫిలి
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
23. ఫలదీకరణం చెందని అండం నుంచి జరిగే ప్రత్యుత్పత్తి?
1) అనిషేక జననం 2) సంయుగ్మం
3) అర్హీనోటాకీ 4) ప్లాస్మాటోమీ
24. కింది జంతువుల్లో అత్యధిక గర్భావధి గలది?
1) ఆవు 2) మనిషి
3) మేక 4) ఏనుగు
25. కింది వాటిని జతపరచండి.
పుష్ప వలయం పుష్ప భాగాలు
ఎ. మొదటి 1. అండకోశం
బి. రెండో 2. కేసరావళి
సి. మూడో 3. ఆకర్షణ పత్రాలు
డి. నాలుగో 4. రక్షణ పత్రాలు
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-3, బి-2, సి-3, డి-1
4) ఎ-4, బి-3, సి-2, డి-1
26. కింది వాటిలో అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించినది కానిది?
1) విచ్ఛిత్తి 2) కోరకీభవనం
3) సిద్ధబీజం 4) సంయుక్త బీజం
27. కోరకీభవనం (బడ్డింగ్) ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే ఏక కణ జీవి?
1) క్లామిడోమోనాస్ 2) ఈస్ట్
3) వాచీరియా 4) బ్యాక్టీరియా
28. కింది వాటిని జతపరచండి.
ఎ. మామిడి 1. అంటుకట్టడం
బి. ఉల్లి 2. లశునం
సి. గులాబీ 3. ఛేదనం
1) ఎ-3, బి-2, సి-1
2) ఎ-1, బి-2, సి-3
3) ఎ-3, బి-1, సి-2
4) ఎ-2, బి-1, సి-3
29. సుఖ ప్రసవానికి, పొదుగు నుంచి పాల విడుదలకు తోడ్పడే హార్మోన్ ఏది?
1) ఈస్ట్రోజన్ 2) ప్రొజెస్టిరాన్
3) ఆక్సిటోసిన్ 4) టెస్టోస్టిరాన్
30. పుష్పంలోని రక్షక, ఆకర్షణ పత్రావళిని కలిపి ఏమని పిలుస్తారు?
1) అనావశ్యక భాగాలు
2) శాఖీయ భాగాలు
3) ప్రాథమిక భాగాలు
4) ఆవశ్యక భాగాలు
31. కింది వాటిని జతపరచండి.
గ్రంథి/హార్మోన్ ప్రభావం
ఎ. ముష్కాలు/ 1. శుక్ర కణాల ఉత్పత్తి టెస్టోస్టిరాన్
బి. ఈస్ట్రోజన్ 2. అండాల విడుదల
సి. ఎడ్రినలిన్ 3. ఉద్వేగాల నియంత్రణ
1) ఎ-3, బి-2, సి-1
2) ఎ-2, బి-3, సి-1
3) ఎ-1, బి-2, సి-3
4) ఎ-2, బి-1, సి-3
32. రణపాల మొక్క ఏవిధంగా ప్రత్యుత్పత్తి చూపుతుంది?
1) కాండపు మొగ్గల ద్వారా
2) వేరు మొగ్గల ద్వారా
3) పత్రపు మొగ్గల ద్వారా
4) కాండ ఛేదనాల ద్వారా
33. ఏ మొక్కలో వాయుగతంగా ఉండే మిద్యా కాండం ఉంటుంది?
1) మందార 2) అరటి
3) జామ 4) క్రోటాన్
34. ఆవృత బీజ మొక్కల్లో అంకురచ్ఛదం ఏవిధంగా ఉంటుంది?
1) ఏకస్థితికంగా 2) ద్వయస్థితికంగా
3) త్రయస్థితికంగా 4) పంచస్థితికంగా
35. పరపరాగ సంపర్కం వల్ల కలిగే ఉపయోగం?
1) తల్లి లక్షణాలు ఏర్పడతాయి
2) తండ్రి లక్షణాలు ఏర్పడతాయి
3) వ్యాధులకు నిరోధకత పెరుగుతుంది
4) కొత్త లక్షణాలు ఏర్పడతాయి. దిగుబడి పెరుగుతుంది
36. శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఉద్భవించిన మొక్కలను ఏమని పిలుస్తారు?
1) క్లోన్లు
2) సిద్ధబీజ మొక్కలు
3) శాఖీయ మొక్కలు
4) అలైంగిక మొక్కలు
37. RNAలో ఉండి, DNAలో లేని పదార్థం ఏది?
1) థైమిన్ 2) సైటోసిన్
3) యురాసిల్ 4) అడినిన్
38. ఏ జీవులు సిద్ధబీజాలను ఎరుపు లేదా నలుపు రంగులో ఏర్పరిచి వేగంగా ప్రత్యుత్పత్తి జరుపుకొంటాయి?
1) శిలీంధ్రాలు 2) శైవలాలు
3) డయాటమ్‌లు 4) వివృత బీజాలు
39. జతపరచండి.
పరాగసంపర్కం రకం సహాయకారులు
ఎ. ఎనిమోఫిలి 1. గాలి
బి. ఎంటమోఫిలి 2. కీటకాలు
సి. ఆర్నిథోఫిలి 3. పక్షులు
డి. కాంథరోఫిలి 4. సీతాకోక చిలుకలు
5. తేనెటీగలు
1) ఎ-1, బి-2, సి-3, డి-5
2) ఎ-1, బి-2, సి-5, డి-4
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-2, బి-1, సి-4, డి-5
40. ఏ రకమైన మొక్కల జీవిత చక్రంలో సిద్ధ బీజాలు మొలకెత్తి నేరుగా సంయోగ బీజదాన్ని ఏర్పరుస్తాయి?
1) వివృతబీజాలు
2) టెరిడోఫైటా మొక్కలు
3) థాలోఫైటా మొక్కలు
4) ఏకదళ బీజ మొక్కలు
41. ఆపిల్‌లోని ఏ భాగాన్ని మనం ఆహారంగా తీసుకుంటాం?
1) అండాశయం 2) ఫలం
3) పుష్పాసనం 4) విత్తనం
42. ప్రతిపాదన (ఎ): కుంటుంబ నియంత్రణ కోసం పురుషుల్లో చేసే శస్త్ర చికిత్సను వాసెక్టమి అంటారు
కారణం (ఆర్): ఈ శస్త్ర చికిత్సలో శుక్రనాళాలను కత్తిరించి వాటి రెండు చివరలను గట్టిగా ముడివేస్తారు
1) ఎ, ఆర్ రెండూ సరైనవి. ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ, ఆర్ రెండూ సరైనవి కానీ ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ, సరైనది ఆర్ తప్పు
4) ఎ తప్పు ఆర్ సరైనది
43. పిల్లల్లో లింగనిర్ధారణ దేని ఆధారంగా జరుగుతుంది?
1) తండ్రి క్రోమోసోమ్‌ల వల్ల
2) తల్లిదండ్రుల Rh కారకం వల్ల
3) తల్లి క్రోమోసోమ్‌ల వల్ల
4) తండ్రి రక్తవర్గం వల్ల
44. ముష్కాలు శరీరం లోపల కాకుండా దేహం బయట ముష్కగోణిలో వేలాడుతూ ఉంటాయి. కారణమేంటి?
1) శుక్రకణోత్పత్తికి కావలసిన తక్కువ ఉష్ణోగ్రత ఉండటానికి వీలుగా బయట ఉంటాయి
2) శరీర నిర్మాణంలో భాగంగా బయట ఉంటాయి
3) సంపర్కం కోసం బయట ఉంటాయి
4) పైవేవీ కాదు
45. సాధారణంగా రక్షకపత్రావళి ఫలదీకరణం జరిగిన తర్వాత రాలిపోతుంది. కాని ఏ మొక్కలో ఫలంతో పాటు పెరుగుతుంది?
1) మామిడి 2) అరటి
3) వంకాయ 4) కాకరకాయ
సమాధానాలు
1.1 2. 2 3. 3 4.3
5.3 6.4 7.4 8.3
9.3 10.4 11.4 12.1
13.4 14.2 15.3 16.4
17.1 18.4 19.4 20.4
21.2 22.2 23.1 24.4
25.4 26.4 27.2 28.2
29.3 30. 4 31.3 32.3
33.2 34.3 35.4 36.1
37.3 38.1 39.3 40.2
41.3 42.1 43.1 44.1
45.3
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






