General Science Physics | ధ్వనిని యాంత్రికంగా రికార్డు చేసే పద్ధతిలో వేటిని ఉపయోగిస్తారు?
ఆధునిక ప్రపంచం – సాధనాలు
1. తీగలు లేకుండా ఒక చోటు నుంచి నుంచి మరొక చోటుకు వార్తలను ప్రసారం చేసే పద్ధతి?
1) తీగలు 2) నిస్తంత్రీ విధానం
3) వైర్లు 4) గ్రాహకం
2. రేడియో ఏ తరంగాల ప్రసారంపై ఆధారపడి పనిచేస్తుంది?
1) అయస్కాంత 2) విద్యుత్
3) విద్యుదయస్కాంత 4) ధ్వని
3. టెలివిజన్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది?
1) కాంతి
2) కాంతి విద్యుత్ ఫలితం
3) విద్యుత్ 4) ధ్వని
4. దృష్టి స్థిరత అనే ధర్మం ఆధారంగా సాధ్యపడేది?
1) మైక్రోఫోన్ 2) సినిమాగ్రఫీ
3) టెలివిజన్ 4) టెలిఫోన్
5. ఎలక్ట్రిక్ సాధనాలకు హృదయం వంటిది?
1) పి-రకం వాహకం
2) ఎన్-రకం వాహకం
3) డయోడ్ 4) ట్రాన్సిస్టర్
6. విద్యుదయస్కాంత తరంగాలను ఏది అన్ని దిశల్లోనూ ప్రసారం చేస్తుంది?
1) గ్రాహక యాంటెనా
2) డిష్ యాంటెనా 3) ఏరియల్
4) ప్రసార యాంటెనా
7. స్కానింగ్‌కు ఇప్పుడు ఉపయోగిస్తున్న పరికరం?
1) కాల్వనోస్కోప్ 2) మాగ్నెటోస్కాప్
3) నిష్కాన్ డిస్క్ 4) ఐకనోస్కోప్
8. కింది వాటిలో నివేశ సాధనం?
1) CU 2) ALR
3) ప్రింటర్ 4) మౌస్
9. కంప్యూటర్లో ప్రధాన భాగం?
1) నివేశ సాధనం 2) సీపీయూ
3) నిర్గమ సాధనం 4) ఉన్నత స్థాయి భాష
10. కంప్యూటర్ కింది ఏ సూత్రంపై ఆధారపడి పని చేస్తుంది?
1) ఇన్పుట్ 2) అవుట్‌పుట్
3) ఇన్పుట్-ప్రాసెస్-అవుట్‌పుట్
4) ఆదేశాలు
11. కంప్యూటర్లో టెలివిజన్ స్క్రీన్‌ను పోలి ఉండే సాధనం?
1) మానిటర్ 2) మైక్రోఫోన్
3) వెబ్‌కెమెరా 4) ప్రింటర్
12. ప్రింటర్, స్పీకర్లు వంటి వాటిని ఏ సాధనాలు అంటారు?
1) అవుట్‌పుట్ 2) ఇన్పుట్
3) 1, 2 4) పైవేవీ కావు
13. కింది వాటిలో నిషిద్ధ పట్టి ఉండనిది?
1) వాహకాలు 2) విద్యుద్బంధకాలు
3) అర్ధవాహకాలు 4) పైవేవీకావు
14. వేటి ప్రవాహాన్ని విద్యుతావాహం అంటారు?
1) స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు
2) స్వేచ్ఛా ప్రోటాన్లు
3) స్వేచ్ఛా న్యూట్రాన్లు
4) పైవేవీ కావు
15. కింది వాటిలో అర్ధవాహకం కానిది?
1) గ్రాఫైట్ 2) వెండి
3) జర్మేనియం 4) సిలికాన్
16. ధ్వని తరంగాలను విద్యుదయస్కాంత తరంగాలుగా మార్చేది?
1) నిప్కావ్డిస్క్ 2) ఐకానోస్కోప్
3) మైక్రోఫోన్ 4) ప్రసారిణి
17. టీవీ ప్రసారాలకు ధ్వని, చిత్రం రెండిటికీ కలిపి ఎంత అవధిని కేటాయిస్తారు?
1) 6 MHZ 2) 4.5 MHZ
3) 6 KHZ 4) 4.5 KHZ
18. జేఎల్ బయర్డ్ అనే శాస్త్రజ్ఞుడు కనుగొన్నది?
1) టీవీ 2) టెలిఫోన్
3) కంప్యూటర్ 4) టెలిగ్రాఫ్
19. ఫిల్మ్ ప్రొజెక్టర్‌లో వస్తువును ప్రొజెక్టర్ కటకానికి ముందు ఎంత దూరంలో ఉంచుతారు?
1) కటక నాభ్యాంతరం కంటే కొంచెం తక్కువ
2) కటక నాభ్యాంతరం కంటే రెండింతలు ఎక్కువ
3) కటక నాభ్యాంతరం కంటే కొంచెం ఎక్కువగా, 2F కంటే తక్కువగా ఉంటుంది
4) పైవేవీ కావు
20. ఏ పద్ధతిలో ధ్వని రికార్డు చేస్తే, చాలాకాలం నిలుస్తుంది?
1) ధ్వనిని యాంత్రికంగా రికార్డు చేయటం
2) ధ్వనిని అయస్కాంతికంగా రికార్డు చేయటం
3) ధ్వనిని విద్యుచ్ఛక్తిగా రికార్డు చేయటం
4) పైవన్నీ
21. ధ్వనిని యాంత్రికంగా రికార్డు చేసే పద్ధతిలో వేటిని ఉపయోగిస్తారు?
1) మైనం పలకలను 2) ప్లాస్టిక్ టేపులను
3) గ్రాఫైట్ పలకలను 4) ఇనుప రేకులను
22. జతపరచండి.
1. కాంతి విద్యుత్ ఫలితం ఎ. టెలిఫోన్ వ్యవస్థలోని భాగం
2. ప్రత్యేక ఆకృతి ఉన్న లోహపు డిష్ బి. కాంతి కిరణాల లోహపు తలాలపై పడినప్పుడు
3. పరమాణువులోని రుణవిద్యుదావేశ కణం సి. ఎలక్ట్రాన్లు
4. డయాఫ్రం డి. యాంటెనా
1) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
23. జతపరచండి.
1. జెజె థామ్సన్ ఎ. టెలిఫోన్
2. గ్రహమ్ బెల్ బి. విద్యుదయ స్కాంత తరంగాల ఉనికి
3. మార్కోని సి. ఎలక్ట్రాన్
4. జేమ్స్ క్లార్క్ మాక్స్వెల్ డి. రేడియో
1) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
2) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
24. మొదటి తరం కంప్యూటర్లో ఉపయోగించినవి?
1) ట్రాన్సిస్టర్ 2) డయోడ్
3) సూన్యనాళికలు
4) ఎలక్ట్రానిక్ వలయాలు
25. రేడియో (లేదా) టెలివిజన్ ప్రసారంలో దశల సంఖ్య?
1) 1 2) 2 3) 3 4) 4
26. కింది వాటిలో విద్యుదయస్కాంత తరంగాలను అన్ని దిశలలోకి ప్రసారం చేసేది?
1) గ్రాహక యాంటెనా
2) ప్రసార యాంటెనా
3) డిష్ 4) రాడార్
27. సాధారణ టీవీని మరొక పేరుతో ఏమని పిలుస్తారు?
1) కినిస్కోప్ 2) ఐకెనోస్కోప్
3) కాల్వనో స్కోప్ 4) పైవేవీ కావు
28. ధ్వని తరంగాలను విద్యుత్ ప్రవాహాలుగా మార్పు చెందించేది?
1) టెలివిజన్ 2) టెలిఫోన్
3) రేడియో 4) సినీ ప్రొజెక్టర్
29. టెలిఫోన్లో ఎటువంటి ఆకారం ఉన్న అయస్కాంతాన్ని ఉపయోగిస్తారు?
1) గుర్రపునాడ 2) వలయాకార
3) వృత్తాకార 4) చతురస్రాకార
30. లౌడ్ స్పీకర్ ఆడియో తరంగాలను ఏ తరంగాలుగా పునరుత్పత్తి చేస్తుంది?
1) కాంతి 2) ధ్వని
3) విద్యుత్ 4) అయస్కాంత
31. ధ్వని అయస్కాంత రికార్డింగ్, పునరుత్పాదనలో ఏ పూత ఉన్న ప్లాస్టిక్ టేపును ఉపయోగిస్తారు?
1) విద్యుత్ 2) మైనపు
3) జింక్
4) అయస్కాంత పదార్థపు పూత
32. సినిమా ప్రొజెక్టర్‌ను రూపొందించింది?
1) జే ఎల్ బయర్డ్ 2) మార్కోని
3) థామస్ ఆల్వా ఎడిసన్
4) ఓల్టా
33. www రూపకర్త ఎవరు?
1) డగ్లస్ ఏంజెల్ బర్డ్
2) టీమ్ బెర్నర్స్ లీ
3) రెటాస్ మ్లిన్ 4) సింప్లెయిర్
34. e-mail పితామహుడిగా పేరుగాంచింది?
1) జెకెర్ బర్గ్
2) డగ్లస్ ఏంజెల్ బర్డ్
3) సీమార్క్రీ 4) రెటెస్మ్లిన్
35. సెల్‌ఫోన్ కనుగొన్నది?
1) సీమార్ క్రీ 2) మార్టిన్ కూపర్
3) సింప్లెయిర్ 4) పాస్కల్
36. కాలిక్యులేటర్ కనుగొన్నది?
1) అబాకస్ 2) జాన్ నేపియర్
3) బాబ్బేజ్ 4) పాస్కల్
37. రెండవ తరం కంప్యూటర్లలో వేటిని ఉపయోగిస్తున్నారు?
1) డయోడ్ 2) ఐసీ
3) చిప్స్ 4) ట్రాన్సిస్టర్లు
38. 4వ తరం కంప్యూటర్లలో వేటిని ఉపయోగిస్తున్నారు?
1) సూన్య నాళిక
2) తార్కిక వలయాలు
3) సమీకృత తార్కిక వలయాలు
4) ట్రాన్సిస్టర్లు
39. డయోడ్లు, ట్రాన్సిస్టర్లు, ఐసీ, చిప్‌ల తయారీలో ఉపయోగించే మూలకం?
1) అల్యూమినియం 2) సిలికాన్
3) జర్మేనియం 4) జిర్కోనియం
40. 5వ తరం కంప్యూటర్లలో ప్రస్తుతం ఉపయోగిస్తున్నది?
1) ట్రాన్సిస్టర్లు 2) తార్కిక వలయాలు
3) డయోడ్లు 4) కృత్రిమ మేధస్సు
41. కింది వాటిలో నివేశ సాధనం కానిదేది?
1) కార్డ్ డేటా 2) స్కానర్
3) ప్రింటర్ 4) మౌస్
42. మౌస్ సృష్టికర్త?
1) డగ్లస్ ఏంజెల్ బర్డ్ 2) జెగెర్బర్గ్
3) బాబ్బేజ్ 4) సింప్లెయిర్
43. రేడియో తరంగాలు ఏ ఆవరణంలో పరావర్తనం చెంది భూమిని చేరుతాయి?
1) ట్రోపో ఆవరణం 2) స్ట్రాటో ఆవరణం
3) ఐనో ఆవరణం 4) మిసో ఆవరణం
సమాధానాలు
1.2 2.3 3.2 4.2
5.4 6.4 7.4 8.4
9.2 10.3 11.1 12.1
13.1 14.1 15.2 16.3
17.1 18.1 19.3 20.2
21.1 22.1 23.1 24.3 25.3 26.2 27.1 28.2 29.1 30.2 31.4 32.3 33.2 34.4 35.2 36.4 37.4 38.3 39.2 40.4 41.3 42.1 43.3
అయస్కాంతత్వం
1. సరైన వాక్యాన్ని గుర్తించండి.
1) ఉత్తర, దక్షిణ ధ్రువాలు వికర్షించుకుంటాయి
2) దక్షిణ ధ్రువం దక్షిణ ధ్రువాన్ని ఆకర్షిస్తుంది
3) అయస్కాంతంలోని ఉత్తర, దక్షిణ ధ్రువాలను వేరు చేయలేము
4) సహజ అయస్కాంతాలు, కృత్రిమ అయస్కాంతాల కంటే శక్తివంతమైనవి
2. అయస్కాంత దిక్సూచిని ఎందులో ఉపయోగిస్తారు?
1) టేప్ రికార్డరు
2) మోటార్లు
3) ఓడలు, విమానాలు
4) సైకిల్
3. సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. ఈ ధర్మాన్ని ఏమంటారు?
1) జంట నియమం
2) దిశా ధర్మం
3) ధ్రువాల సిద్ధాంతం
4) ప్రేరణ ధర్మం
4. శక్తిమంతమైన విద్యుదయస్కాంతాలను వేటిలో ఉపయోగిస్తారు?
1) విద్యుత్ క్రేన్లు
2) అయస్కాంత ధాతువును వేరుచేయుటకు
3) వైరస్ కంపాస్
4) టేపు రికార్డరు
5. కింది వాటిలో అయస్కాంత పదార్థం?
1) ఇత్తడి 2) వెండి
3) నికెల్ 4) ఆస్బెస్టాస్
6. దండాయస్కాంతం స్వేచ్ఛగా వేలాడదీస్తే అది విరామస్థితికి వచ్చే దిశ?
1) తూర్పు-పడమర
2) తూర్పు-దక్షిణం
3) ఉత్తర-దక్షిణం
4) ఉత్తర-పడమర
7. భూ అయస్కాంతం ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే సరళరేఖ?
1) భౌగోళికాక్షం
2) భూ అయస్కాంత అక్షం
3) ధ్రువాక్షం
4) భూమధ్య రేఖ
8. విరామానికి వస్తే S-S దిశలను సూచించే పరికరం?
1) దిక్పాతసూచి 2) దిక్సూచి
3) అవపాత సూచి 4) పైవేవీ కావు
9. కింది వాటిలో డయా అయస్కాంత పదార్థం కానిది?
1) గాలి 2) నీరు
3) ఇనుము 4) బిస్మత్
10. డయా అయస్కాంత పదార్థానికి ఉదాహరణ?
1) Bi 2) O2
3) Fe 4) Ni
11. పారా అయస్కాంత పదార్థానికి ఉదాహరణ?
1) అల్యూమినియం 2) పాదరసం
3) కోబాల్ట్ 4) బంగారం
12. ఒక అయస్కాంత ధ్రువం మరొక అయస్కాంత ధ్రువాన్ని ఆకర్షించే (లేదా) వికర్షించే స్వభావాన్ని ఏమంటారు?
1) అయస్కాంతత్వం
2) ధ్రువసత్వం
3) అయస్కాంతీకరణం
4) పైవేవీకావు
13. ధ్రువసత్వాలకు MKS ప్రమాణం?
1) ఆంపియర్ 2) వెబర్
3) హెన్రీ 4) టెస్లా
14. ఆకర్షించే స్వభావం ఉన్న ఇనుప ఖనిజానికి పెట్టిన పేరు?
1) హెమలైట్ 2) మాగ్నటైట్
3) క్యుపరైట్ 4) జింకైట్
సమాధానాలు
1.3 2.3 3.3 4.1
5.3 6.3 7.2 8.1
9.3 10.1 11.1 12.2
13.2 14.2
ఎస్వీఆర్ కోచింగ్ సెంటర్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు