శిలాశైథిల్య పదార్థాన్ని ఏమంటారు?
వరంగల్ (అర్బన్): ఈ ప్రాంతం ఆర్కియన్ శిలలతో నిర్మితమైంది.
-వరంగల్ రూరల్: ఈ ప్రాంతమంతా క్లిష్టమైన భూగర్భ ప్రక్రియ కలిగి ఉంది.
-జయశంకర్ భూపాలపల్లి: ఈ ప్రాంతం ఎగువ ప్రికాంబ్రియన్, దిగువ పాలియోజోయిక్ కాలానికి చెందిన నిర్మాణాలు ఉన్నాయి.
-మహబూబాబాద్, ఖమ్మం: ఈ ప్రాంతంలోని ఎక్కువ భాగం క్లిష్టమైన భూగర్భ నిర్మాణం కలిగి ఉంది.
-భద్రాద్రి కొత్తగూడెం: ఈ జిల్లాల్లోని ఉత్తరభాగాలు, దక్షిణభాగాలు ఆర్కియన్ నీస్ శిలలతో, వాయవ్య, పడమర భాగాలు ఎగువ ప్రికాంబ్రియన్ శిలలతో, కొండ ప్రాంతాలు దిగువ కాంబ్రియన్ కాలానికి చెందిన నిక్షేపాలతో ఏర్పడ్డాయి.
-గోదావరి, కిన్నెరసాని నదుల మధ్య భాగం ఎగువ కార్బొనిఫెర్రస్, దిగువ ట్రాయాసిక్ కాలానికి చెందిన శిలలతో నిర్మితమై ఉన్నాయి.
-నల్లగొండ, యాదాద్రి భువనగరి: ఈ జిల్లాలు ఆర్కియన్ కాలానికి చెందిన పురాతన శిలలతో ఏర్పడ్డాయి ఇవి నైసిస్, హార్న్బ్లెండ్, బయోటైట్, వర్గీకరించని స్పటిక శిలలతో ఏర్పడ్డాయి.
-ఈ జిల్లా దక్షిణ భాగంలో అక్కడక్కడ మెటావల్కనిక్స్ అగ్నిపర్వతాలు ఉన్నాయి.
-కృష్ణ, డిండి నదుల దగ్గర ఎగువ ప్రీకాంబ్రియన్ శిలలు ఉంటాయి.
-మహబూబ్‌నగర్: పశ్చిమభాగం, వాయవ్య భాగం పాలియోజిక్ శిలలతో ఏర్పడింది.
-జోగుళాంబగద్వాల: ప్రికాంబ్రియన్, మిసోజోయిక్ కాలానికి చెందిన శిలలతో నిర్మితమైంది.
-వనపర్తి, నాగర్‌కర్నూలు: ఆర్కియన్ రాళ్లతో ఏర్పడ్డాయి.
రంగారెడ్డి: తూర్పుభాగం ఆర్కియన్ శిలలతో నిర్మితమైంది.
-మేడ్చల్, వికారాబాద్: కొన్ని ప్రాంతాలు గ్రానైట్ శిలలకు, తూర్పుభాగం దక్కన్ట్రాప్కు చెందినవి. కొన్ని ప్రాంతాలు లాటరైట్ శిలలతో విచ్ఛిన్నమయ్యాయి.
-హైదరాబాద్: కార్డియోరైట్ నీస్, హార్న్బ్లెండ్, బయోటైట్, వంటి అవిచ్ఛిన్న స్పటిక శిలలతో నిర్మితమయ్యాయి.
-సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట: ఆర్కియన్ నీస్, గ్రానైట్ శిలలతో ఉన్నాయి. సంగారెడ్డి పశ్చిమభాగంలో మిసోజోయిక్ శిలలు ఉన్నాయి. దిగువన టెర్షియరీ యుగానికి చెందిన శిలలు ఉన్నాయి.
మృత్తికలు
-నేల: భూమి ఉపరితలంపై విభిన్న రకాల పోషకాలతో పరిచి ఉన్న పొర (లేదా) శిలా శైథిల్య (శిథిల) పదార్థాన్ని నేల/మృత్తిక అంటారు.
-శిలలు శైథిల్యం (పగిలి) చెందడంవల్ల ఏర్పడిన శిలాశైథిల్య పదార్థాన్ని రెగోలిథ్ అని అంటారు. ఈ రెగోలిథ్ అనే పదార్థం వివిధ జీవ, భౌతిక, రసాయన ప్రక్రియలకు లోనై కాలక్రమేణా మెత్తని పొరగా మారుతుంది. ఈ విధానాన్ని పెడజెనసిస్ అంటారు. అంటే నేలల పుట్టుక గురించి తెలియజేయడాన్ని పెడజెనసిస్ అంటారు.
-నేల పుట్టుక గురించి (స్వభావం) అధ్యయనం చేసే శాస్ర్తాన్ని పెడాలజీ అంటారు.
-తెలంగాణ దక్కన్ పీఠభూమిలో భాగంగా ఉండి పురాతన స్పటిక శిలలతో నిర్మితమై రూపాంతర, అగ్నిశిలలచేత నిర్మితమై ఉంది.
నోట్: నేల సహాయం లేకుండా మొక్కలు పెంచే విధానాన్ని హైడ్రోఫోనిక్స్ అంటారు.
-ప్రపంచ ధరిత్రీ దినోత్సవం- ఏప్రిల్ 22
-వరల్డ్ వెట్‌ల్యాండ్స్ దినోత్సవం- (మెట్ట భూములు) ఫిబ్రవరి 2
-నేల/మృత్తికలోని పొరలను హురైజెన్స్ అంటారు.
-మృత్తికా క్రమక్షయం: సహజ కారకాల (గాలి, నీరు మొదలైన) వల్ల భూమిపై పొరలు కొట్టుకొనిపోవడాన్ని మృత్తికా క్రమక్షయం అంటారు.
క్రమక్షయం 3 విధాలుగా జరుగుతుంది.
-పటక్రమక్షయం: నేల పొరలు పొరలుగా కొట్టుకుపోవడం
-వంకక్రమక్షయం: చేతివేళ్ల ఆకారంలో క్రమక్షయం చెందడం
-అవనాళిక క్రమక్షయం: లోతైన గాడులుగా కొట్టుకుపోవడం (కయ్యలుగా)
-Soil అనే పదం సోలమ్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది.
-సోలమ్ అంటే చెట్లు జీవించడానికి అనుకూలమైన ప్రదేశం.
విస్తీర్ణంపరంగా మృత్తికల వరుసక్రమం
-ఎర్ర మృత్తికలు-నల్లరేగడి-ఒండ్రు-లాటరైట్
ఎర్ర నేలలు
-ఈ నేలలు గ్రానైట్ శిలలు శైథిల్యం చెందడం వల్ల ఏర్పడ్డాయి.
-ఈ నేలలు రాష్ట్ర వైశాల్యంలో 48 శాతాన్ని ఆక్రమించి ప్రథమ స్థానంలో ఉన్నాయి.
-ఈ రకమైన నేలలు దేశ వైశాల్యంలో 29.8 శాతాన్ని కలిగి ద్వితీయ స్థానంలో ఉన్నాయి.
-ఈ నేలలు ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఐరన్ ఆక్సైడ్‌ను కలిగి ఉండటం
లక్షణాలు
-ఇవి నీటిని నిల్వ ఉంచుకొనే సామర్థ్యాన్ని కలిగి ఉండవు.
-ఇవి తేలికపాటి రకానికి చెంది దుమ్మును ఎగబాసినట్లుగా ఉండే నేలలు.
-పండే పంటలు: పప్పు ధాన్యాలు, నూనె గింజలు, పసుపు
-విస్తరణ: తెలంగాణలో నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్(ఆర్), వరంగల్(యు), జనగామ, మహబూబాబాద్‌లలో ఉన్నాయి. ఖమ్మం, భద్రాది కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరిలలో అత్యధికం, ఆదిలాబాద్‌లో అత్యల్పం.
-1. తమిళనాడులో అధికం, 2. తెలంగాణ 3. ఆంధ్రప్రదేశ్
-తెలంగాణలో ఎర్రనేలలు తిరిగి రెండు రకాలు: అవి..
-చెల్కనేలలు: ఎర్రనేలల్లో ఇసుక శాతం ఎక్కువగా ఉన్నాయి.
-దుబ్బ నేలలు: ఎర్ర నేలలో ఇసుక శాతం తక్కువగా ఉంది.
నోట్: నల్లగొండ, సూర్యాపేట, వరంగల్ (ఆర్), వరంగల్ (యు), నిజామాబాద్, కామారెడ్డిల్లోని ఎర్రనేలలో నైట్రోజన్ తక్కువ.
-ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లలో ఫాస్ఫరస్ తక్కువ.
నల్లరేగడి నేలలు
-ఈ నేలలు అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడ్డాయి. (రూపాంతర, అవక్షేప శిలలు)
-బసాల్ట్ శిలలను కలిగి ఉండి, వీటికి తోడు సున్నపురాయి శిలలు క్రమక్షయం చెందడం వల్ల ఈ నేలలు ఏర్పడుతాయి.
-ఈ రకమైన నేలలు దేశ వైశాల్యంలో (నికర సాగుభూమిలో) 25 శాతం వరకు
-తెలంగాణ నికర సాగుభూమిలో 25 శాతం వరకు ఉన్నాయి.
-పై రెండింటిలో (భారత్, తెలంగాణ) ద్వితీయస్థానంలో ఉన్నాయి. ఈ నేలలు నలుపురంగులో ఉండటానికి కారణం ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, అల్యూమినియం ఆక్సైడ్
మారుపేర్లు/లక్షణాలు
రేగర్ నేలలు
-పత్తి పంటకు అనుకూలమైన నేలలు
-తనను తాను దున్నుకొనే నేలలు
-నీటిని నిలుపుదల చేసుకొనే నేలలు (అంటే జలధార శక్తి ఎక్కువ)
-నీరు ఉన్నప్పుడు ఉప్పొంగినట్లు ఉండి, నీరు లేనప్పుడు పగులు చూపే స్వభావం ఉన్న నేలలు
-ఈ నేలలను ప్రపంచ చెర్రోజోమ్ నేలలు అంటారు.
– ఈ రకమైన నేలలను కాలిఫోర్నియాలో అరిజోనా నేలలు అంటారు.
-పండే పంటలు: పత్తి, చెరుకు, పొగాకు, పొద్దుతిరుగుడు
విస్తరణ
-1. మహారాష్ట్ర (ఎక్కువ విస్తీర్ణం) 2. గుజరాత్ 3. మధ్యప్రదేశ్ 4. కర్ణాటక 5. తెలంగాణ (ఉత్తర-పశ్చిమ తెలంగాణ) 6. ఆంధ్రప్రదేశ్ (నంద్యాల, అనంతపురం) 7. గంగా-సింధు మైదాన ప్రాంతం
-తెలంగాణలో గోదావరి నదీ పరివాహక సమీపం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు, నిర్మల్, మహబూబ్‌నగర్, గద్వాల పశ్చిమభాగంలో లోతైన నల్లరేగడి నేలలు ఉన్నాయి.
-నిజమాబాద్, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పశ్చిమ భాగాల్లో మధ్యతరహా నల్లరేగడి నేలలు ఉన్నాయి.
నేలల్లో అనుఘటకాలు 4 రకాలు
-ఖనిజాలు- 45 శాతం
-గాలి- 25 శాతం
-నీరు- 25 శాతం
-హ్యూమస్- 5 శాతం (సేంద్రియ పదార్థం)
-1893లో ఓయల్కర్, 1989లో లేదర్ అనే శాస్త్రవేత్తల పరిశోధనల ఆధారంగా దేశంలో నేలలను 4 రకాలుగా వర్గీకరించారు. అవి.. 1. ఎర్రనేలలు, 2. నల్లరేగడి నేలలు, 3. ఒండ్రు నేలలు, 4. లాటరైట్/జేగురు నేలలు.
-1956లో సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటైంది.
-1959లో భారత వ్యవసాయ పరిశోధన మండలి ఏర్పాటైంది. వీరి అభిప్రాయాల ప్రకారం నేలలను, వాటి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని 8 రకాలుగా వర్గీకరించారు.
-1. ఎర్ర మృత్తికలు 2. నల్లరేగడి మృత్తికలు 3. ఒండ్రు మృత్తికలు 4. లాటరైట్/జేగురు మృత్తికలు 5. ఎడారి మృత్తికలు 6. పర్వతీయ/అటవీ మృత్తికలు 7. క్షార మృత్తికలు 8. పీట్ జీవ సంబంధిత నేలలు
-తెలంగాణలో ప్రధానంగా మొదటి 4 రకాల మృత్తికలు ఉన్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు