వేయి స్తంభాల దేవాలయ నిర్మాత?
1. భక్త కన్నప్ప గురించి కింది ఏ గ్రంథం తెలుపుతుంది?
1) మత్స్య పురాణం 2) పెరియపురాణం
3) వాయుపురాణం 4) తిరుక్కరల్
2. యాదవులను వివిధ రాష్ర్టాల్లో పిలిచే పేర్లలో సరైన దానిని గుర్తించండి?
1) మహారాష్ట్ర – ధంగర్
2) కర్ణాటక – కురుబ
3) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్- కురుమ, గొల్ల, యాదవ
4) పైవన్నీ
3. సింధు నాగరికత కాలంనాటి ప్రజల గురించి సరైనవి గుర్తించండి?
1) వీరు పూజించే దేవత అమ్మతల్లి, దేవుడు పశుపతి
2) వీరు రావిచెట్టును పవిత్రంగా భావించేవాళ్లు
3) వీరికి ఇష్టమైన జంతువు ఎద్దు. తెలియని జంతువు గుర్రం
4) పైవన్నీ
4. నచికేతుని కథ కింది ఏ ఉపనిషత్తు లోనిది?
1) కఠోపనిషత్తు 2) బృహదారణ్యక ఉపనిషత్తు
3) కౌశపోనిషత్తు 4) ముండకోపనిషత్తు
5. కింది వాటిని జతపర్చండి?
1. త్రిపీఠకాలు ఎ. జైనమతం
2. త్రిరత్నాలు బి. బౌద్ధమతం
3. జ్ఞాత్రిక వంశం సి. గౌతమబుద్ధుడు
4. శాక్య వంశం డి. వర్ధమాన మహావీరుడు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
6. కింది వాటిని జతపర్చండి.
1. నయనార్లు ఎ. శైవభక్తులు
2. ఆళ్వార్లు బి. వైష్ణవ భక్తులు
3. పాశురాలు సి. ఆళ్వార్లు కూర్చిన గ్రంథం
4. తౌవారం, తిరువాచకం
డి. నయనార్లు కూర్చిన గ్రంథం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
7. నయనార్లు, ఆళ్వార్ల సంఖ్య?
1) 63, 11 2) 62, 12
3) 63, 12 4) 61, 12
8. అష్టాధ్యాయి అనే సంస్కృత వ్యాకరణ గ్రంథం రచించింది?
1) పతంజలి 2) సుశ్రుత 3) పాణిని 4) అశ్వఘోషుడు
9. కింది వాటిని జతపర్చండి.
1. అశ్వఘోషుడు ఎ. మృచ్ఛకటికం
2. కాళిదాసు బి. అభిజ్ఞాన శాకుంతలం
3. శూద్రకుడు సి. పెరియపురాణం
4. సెక్కిలార్ డి. బుద్ధచరితం
1) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
2) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
3. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
10. గుప్తులకాలంలో రామాయణం, మహాభారతం ఆధారంగా 13 నాటికలు రాసిన వ్యక్తి?
1) కాళిదాసు 2) భాసుడు
3) శూద్రకుడు 4) విశాఖదత్తుడు
11. కింది ఎక్కడ లభించిన శిల్పంలో ఉపాలి అనే క్షురకుడు బౌద్ధ సంఘంలో ప్రవేశానికి అనుమతి పొందడం గమనించవచ్చు?
1) నాగార్జునకొండ 2) అమరావతి
3) జగ్గయ్యపేట 4) సాంచి
12. గ్వాలియర్ శాసనం ఏ రాజు విజయాలను తెలుపుతుంది?
1) నాగభట్ట 2) అశోక
3) చంద్రగుప్త-II 4) కనిష్క
13. కశ్మీర్‌ను పాలించిన రాజుల చరిత్రపై క్రీ.శ. 12వ శతాబ్దంలో సంస్కృతంలో కల్హణుడు రాసిన గ్రంథం?
1) దేవీ చంద్రగుప్తం
2) నవసాహసాంక చరిత్ర
3) రాజతరంగణి
4) గాధాసప్తశతి
14. త్రైపాక్షిక పోరాటంలో పాల్గొనని రాజవంశం?
1) ప్రతిహారులు 2) సేన వంశం
3) రాష్ట్రకూటులు 4) పాలవంశం
15. త్రైపాక్షిక పోరాటం ఏ ప్రాంతం కోసం జరిగింది?
1) కనోజ్ 2) స్థానేశ్వర్
3) రాయచూర్ 4) ఢిల్లీ
16. కితాబ్ ఉల్ హింద్ అనే అరబిక్ గ్రంథం రచించింది?
1) ఫిరదౌసి 2) బరౌని
3) అల్బెరూని 4) అబుల్ ఫజల్
17. తంజావూరు పట్టణ నిర్మాత?
1) మొదటి రాజరాజు 2) విజయాలయుడు
3) రాజేంద్రచోళుడు 4) కులోత్తుంగచోళుడు
18. చోళుల కాలంలో రైతుల గ్రామాలను ఏ విధంగా పిలిచేవారు?
1) ఉర్ 2) నగరం
3) వలనాడు 4) వెల్లం
19. వళ్లిచ్ఛందం భూములంటే..
1) బ్రాహ్మణులకు విరాళమిచ్చిన భూములు
2) బౌద్ధులకు విరాళమిచ్చిన భూములు
3) జైనసంస్థలకు విరాళమిచ్చిన భూములు
4) పాఠశాల నిర్వహణకు ఇచ్చిన భూములు
20. స్థానిక సంస్థల గురించి పేర్కొంటున్న చోళుల శాసనం?
1) ఉత్తర మేరూర్ శాసనం 2) జునాగఢ్ శాసనం
3) తంజావూర్ శాసనం 4) ఏదీకాదు
21. కింది వాటిని జతపర్చండి.
1. ప్రతాపరుద్ర యశోభూషణం ఎ. రుద్రదేవుడు
2. ప్రతాపరుద్ర చరిత్ర బి. వల్లభరాయుడు
3. క్రీడాభిరామం సి. ఏకామ్రనాథుడు
4. నీతిసారం డి. విద్యానాథుడు
1) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
22. కాకతీయ వంశ మూలపురుషుడు ?
1) వెన్నడు 2) దుర్జయ
3) కాకర్త్యగుండ్యన 4) ప్రోలయ
23. అనుమకొండలో వేయి స్తంభాల దేవాలయ నిర్మాత?
1) గణపతిదేవుడు 2) ప్రతాపరుద్ర-II
3) రుద్రదేవుడు 4) రుద్రమదేవి
24. కింది వాటిలో కాకతీయులకు సంబంధించి సరైనది?
1) మోటుపల్లి అభయశాసనం వేయించింది గణపతిదేవుడు
2) రాజకుటుంబానికి సంబంధించిన ముప్పమాంబ, మైలమ్మ వంటి స్త్రీలు దేవాలయాల నిర్మాణానికి అధికంగా భూములు దానం చేశారు
3) ఇటలీ యాత్రికుడు మార్కోపోలో రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించాడు
4) పైవన్నీ
25. పల్నాటి వీరుల చరిత్ర రచయిత?
1) శ్రీనాథుడు 2) కొరవి గోపరాజు
3) రావిపాటి త్రిపురాంతకుడు 4) బద్దెన
26. విజయనగర రాజ్యానికి సంబంధించిన వీటిని జతపర్చండి.
1. నికోలోకాంటి ఎ. 1420
2. అబ్దుల్ రజాక్ బి. 1443
3. డొమింగోపేజ్ సి. 1520
4. న్యూనిజ్ డి. 1537
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
4) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
27. మల్కీభరాముడు అనే బిరుదు గల కుతుబ్షాహి సుల్తాన్?
1) కులీ కుతుబ్‌షా
2) అబ్దుల్లా కుతుబ్‌షా
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) మహ్మద్ కులీకుతుబ్‌షా
28. శ్రీకృష్ణదేవరాయలు ఆండాళ్ అనే తమిళ భక్త కవయిత్రి జీవితం ఆధారంగా తెలుగులో రాసిన గ్రంథం?
1) జాంబవతి పరిణయం 2) అముక్త మాల్యద
3) మణిమేఖలై 4) శిలప్పాధికారం
29. విజయనగర పట్టణం ఏడు వలయాలతో ఏర్పడి, కోటగోడలు కలిగి ఉందని తెలిపిన విదేశీ యాత్రికుడు?
1) నికోలోకాంటి 2) డొమింగోపేజ్
3) అబ్దుల్ రజాక్ 4) న్యూనిజ్
30. హైదరాబాద్ నగర వాస్తు శిల్పి?
1) మీర్ మోమిన్ అస్రబాది
2) ఉస్తాద్ అహ్మద్ ఈసా
3) హజరత్ హుస్సేన్ షావలి
4) హయత్భక్షీబేగం
31. క్షేత్రయ్య ఏ కుతుబ్షాహి సుల్తాన్ ఆస్థానాన్ని సందర్శించారు?
1) ఇబ్రహీం కుతుబ్‌షా
2) మహ్మద్ కులీకుతుబ్‌షా
3) అబుల్ హసన్ తానీషా
4) అబ్దుల్లా కుతుబ్‌షా
32. హుస్సేన్‌సాగర్, పురానాపూల్ నిర్మాత ?
1) జంషెడ్ అలీ
2) ఇబ్రహీం కుతుబ్‌షా
3) మహ్మద్ కులీకుతుబ్‌షా
4) మహ్మద్ కుతుబ్‌షా
33. కింది వాటిలో సరైనది.
1) అద్దంకి గంగాధరుడు – తపతిసంవరణోపాఖ్యానం
2) కందుకూరి రుద్రకవి – నిరంకుశోపాఖ్యానం
3) పొన్నగంటి తెలగనార్యుడు – యయాతి చరిత్ర
4) పైవన్నీ
34. కింది రాజవంశాలను సరైన క్రమంలో అమర్చండి?
ఎ. సాళువ బి. అరవీటి
సి. సంగమ డి. తుళువ
1) సి, డి, ఎ, బి 2) సి, ఎ, డి, బి
3) సి, బి, డి, ఎ 4) డి, సి, బి, ఎ
35. బొల్లినాయకుడనే ప్రవేశద్వార సంరక్షకుడు ఏ కాకతీయరాజు గౌరవార్థం కళ్యాణ కేశం దేవాలయ సేవకులకు భూమిని దానం చేశాడు?
1) రుద్రమదేవి 2) గణపతిదేవుడు
3) రుద్రదేవ-I 4) ప్రతాపరుద్ర-II
36. హిరణ్యగర్భ అనే సంస్కార విధిని నిర్వహించిన రాజు?
1) రాజేంద్రచోళుడు 2) కదంబ మయూరశర్మ
3) దంతిదుర్గుడు 4) చక్రాయుధుడు
37. కింది ఏ ప్రాంతంలో జరిగిన యుద్ధంలో రుద్రమదేవి ప్రాణాలను కోల్పోయింది?
1) చందుపట్ల 2) వరంగల్లు
3) దివిసీమ 4) మోటుపల్లి
38. సింధు నాగరికత కాలంనాటి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది ఏది?
1) వర్తకం 2) వడ్రంగిపని
3) పశుపోషణ 4) వ్యవసాయం
39. మానవత్వ ప్రతిపాదిక మీద అశోకుడు ఏ రోజున కొందరు ఖైదీలను విడుదల చేశారు?
1) జన్మదినం 2) పట్టాభిషేకం రోజున
3) బౌద్ధమతాన్ని అవలంబించిన రోజు
4) కళింగ ఆక్రమణ రోజు
40. చైనా యాత్రికుడు ఫాహియాన్ ఎవరి పరిపాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు?
1) చంద్రగుప్త మౌర్యుడు 2) సముద్రగుప్తుడు
3) రెండో చంద్రగుప్తుడు 4) హర్షవర్ధనుడు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు