Buddhism | బౌద్ధమతం స్థాపన
-బౌద్ధమతాన్ని మాధ్యమికవాదం అంటారు.
-కోసల, మగధ రాజ్యాలు బుద్ధుడి కార్యక్రమాలకు కేంద్రంగా మారాయి.
-మొదటిసారి బుద్ధుడి గురించి ప్రస్తావించిన విదేశీయుడు: అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందిన క్లిమెంట్. (ఈయన క్రీ.శ. 2వ శతాబ్దం చివరలో బుద్ధుడి గురించి ప్రస్తావించాడు.)
-బుద్ధుడి జీవితం గురించి సుత్తనిపాతం, దీపవంశం, మహావంశం, బౌద్ధమత మూల గ్రంథాలైన త్రిపీఠకాలు, మహావస్తు, లలిత విస్తారం, బుద్ధచరితం, నిదనకథ, అభినిష్క్రమణ సూత్రం, జాతక కథలు, దిఘనికాయ, కొన్ని సంస్కృత, పాళీ గ్రంథాలు తెలుపుతున్నాయి.
-ప్రపంచంలో గుర్తించిన 11 మతాల్లో బౌద్ధమతం ఒకటి. దీనిని గౌతమ బుద్ధుడు స్థాపించాడు.
గౌతమ బుద్ధుడు
-ఎడ్విన్ ఆర్నాల్డ్ బుద్ధుడిని లైట్ ఆఫ్ ఏషియా అని పిలిచారు.
-బుద్ధుడికి సిద్ధార్థుడు, శాక్యముని, శాకజ్ఞాని, అంగీరసుడు, తథాగథుడు అనే పేర్లు ఉన్నాయి.
-తథాగి అంటే సత్యాన్ని తెలుసుకొన్నవాడని అర్థం. ఇతను మహావీరుడి సమకాలీనుడు.
-కోసలకు ఉత్తరాన కపిలవస్తు ప్రాంతాన్ని శాక్యవంశానికి చెందిన శుద్ధోధనుడు పరిపాలిస్తుండేవాడు.
-శుద్ధోధనుడు కొలియ వంశానికి చెందిన అంజనుడి కుమార్తెలైన మహా మాయాదేవి, ప్రజాపతి గౌతమిదేవిని పెండ్లి చేసుకున్నాడు.
-మాయాదేవి తొమ్మిది నెలల సమయంలో పుట్టినిల్లు దేవదహకు వెళ్తుండగా లుంబినీ వనంలో క్రీ.పూ. 563లో బుద్ధుడికి జన్మనిచ్చింది.
-బుద్ధుడు జన్మించిన ఏడు రోజులకు తల్లి మహా మాయాదేవి మరణించింది. సవతి తల్లి ప్రజాపతి బుద్ధుడిని పెంచి పెద్దచేసింది. ఇతడే శాక్యరాజ్యానికి వారసుడు.
-బుద్ధునికి తల్లిదండ్రులు పెట్టిన పేరు సిద్ధార్థుడు. అంటే లక్ష్యాన్ని సాధించినవాడని అర్థం. ఈ పేరు బౌద్ధ సాహిత్యంలో అతి తక్కువగా కనిపిస్తుంది.
-8వ ఏట విద్యాభ్యాసం ప్రారంభించాడు. సర్వమిత్రుడు అనే పండితుడి దగ్గర భాషాశాస్త్రం, వ్యాకరణశాస్త్రం, ఉపనిషత్తులను నేర్చుకున్నాడు.
-ఆ తర్వాత కపిలవస్తు ప్రాంతానికి చెందిన అలారకాలాముని శిష్యుడైన భరద్వాజుని వద్ద ఏకాగ్రత, ధ్యాననిష్ఠను నేర్చుకున్నాడు.
-సిద్ధార్థుడికి 16వ ఏట శాక్య వంశీయుడైన దండపాణి పుత్రిక యశోధరతో వివాహం జరిగింది.
-గౌతముడు 12 ఏండ్లు విలాసవంతమైన జీవితం గడిపి తన 29వ ఏటా క్రీ.పూ. 534వ సంవత్సరంలో సత్యాన్వేషణలో నిష్క్రమించాడు. దీనినే మహాభినిష్క్రమణం అంటారు.
-బుద్ధుడి మహాభినిష్క్రమణకు నాలుగు సంఘటనలు కారణమయ్యాయి.
మహాభినిష్క్రమణం
-రాజప్రసాదం ప్రవేశించగానే ఒక క్షత్రియ కన్య భవనం మీద నుంచి గౌతముని శరీర సౌందర్యాన్ని చూసి పొగిడింది. గౌతముడు ఆ మాటలు విని తనలో తానే ఆలోచించుకొని భ్రమ, గర్వం, దుష్ప్రభావాలు, దుఃఖాన్ని విసర్జించినప్పుడు మానవుడికి నిజమైన ఆనందం కలుగుతుంది అని తలచి ఇల్లు విడిచి వెళ్లాడు. క్షత్రియ కన్యకు ఒక హారం బహుమానంగా పంపాడు.
-గౌతముడు తన సారథి చెన్నుడు కంతక అనే గుర్రం మీద రాజప్రసాదం నుంచి నిష్క్రమించాడు దీనినే మహాభినిష్క్రమణం అంటారు.
-గౌతముడు చాలా దూరం ప్రయాణించి వైశాలి నగరం చేరాడు. అక్కడ అలారకాకమ, రుద్రక అనే గురువుల వద్ద గొప్ప పాండిత్యం సంపాదించాడు. కానీ, సత్యాన్వేషి అయిన బుద్ధుడికి తన సంపాదించిన సంఖ్యా దర్శవిజ్ఞానం తృప్తినివ్వలేదు. తర్వాత రాజధాని రాజగృహానికి వెళ్లాడు.
-గౌతముడు జ్ఞానోదయం పొందిన వెంటనే మొదట బింబిసారుని రాజ్యానికి వస్తానని వాగ్దానం చేశాడు.
-రాజగృహంలో గౌతముడు ఉద్దీకరామ పుత్రుడు (రుద్రక రామపుత్ర) అనే అతని ఉపదేశాలు వినడానికి వెళ్లాడు. అతని ఉపదేశాలతో సంతృప్తి చెందక ఉరువేల గ్రామానికి వెళ్లాడు. అక్కడ అతను హఠయోగం, రాజయోగం ఆరంభించాడు. ఆరేండ్లు కఠినమైన ఉపవాసాలు చేశాడు.
సంబోధి
-గౌతముడికి ఉరువేల గ్రామంలోని బోధి (రావి) వృక్షం కింద ఏడు వారాల తపస్సు తర్వాత వైశాఖ పూర్ణిమ నాడు జ్ఞానోదయమైంది. దీనినే సంబోధి అంటారు.
ధర్మచక్ర పరివర్తనం
-మొదట తన దగ్గర ఉన్న ఐదుగురు శిష్యులకు తన ధర్మాన్ని బోధించడానికి నిశ్చయించాడు.
-వారణాసిలోని సారనాథ్‌లోని మృగదావనం (జింకలవనం)లో తన ఐదుగురు శిష్యులకు ప్రథమంగా జ్ఞానోపదేశం చేశాడు. ఈ సంఘటననే ధర్మచక్ర పరివర్తనం అంటారు.
-బుద్ధుడి ఐదుగురు ప్రధాన శిష్యులు 1. కొండన 2. తిప్ప 3. బోదియ 4. అస్సగి 5. మహనామ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు