దేశంలోతొలి డిజిటల్ రైల్వేస్టేషన్ ఏది? (టీఎస్ ఎకానమీ)
మౌలిక సదుపాయాలు
1. సరికానివి గుర్తించండి
1. 2022 ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణలో అత్యధిక విద్యుత్ కనెక్షన్స్ కలిగిన జిల్లా హైదరాబాద్
2. 2022 ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప విద్యుత్ కనెక్షన్స్ కలిగిన జిల్లా కుమ్రం భీమ్
3. దేశంలో అత్యధిక టెలిడెన్సిటీ కలిగిన రాష్ట్రం గోవా (177)
4. 2022 ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణలో టెలిడెన్సిటీలో 7వ ర్యాంక్‌ను కలిగి ఉంది
ఎ) 2 బి) 3 సి) 4 డి) ఏదీకాదు
2. సరైన అంశాన్ని గుర్తించండి
1. తెలంగాణలో ప్రతి వందమంది వ్యక్తులకు 110 మొబైల్ ఫోన్లు కలిగి ఉన్నారు
2. దేశంలో అత్యల్ప టెలిడెన్సిటీని కలిగి ఉన్న రాష్ట్రం బీహార్. ప్రతి 100 మందికి కేవలం 51 ఫోన్లు మాత్రమే కలిగి ఉన్నారు
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
3. తెలంగాణ ఆర్థిక సర్వే-2022 ప్రకారం సరికాని అంశాన్ని గుర్తించండి
1. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకారం తెలంగాణలో 11 కమ్యూనిటీ రేడియో స్టేషన్లు నమోదయ్యాయి
2. 11 కమ్యూనిటీ రేడియో స్టేషన్స్‌లో 10 ప్రైవేట్ రంగంలో ఉంటే, కేవలం ఒకటి మాత్రమే పబ్లిక్ సెక్టార్‌కు సంబంధించింది
3. పబ్లిక్ సెక్టార్‌కు సంబంధించిన కమ్యూనిటీ రేడియో స్టేషన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు నిర్వహిస్తున్నారు
ఎ) 2 బి) 3 సి) 1 డి) ఏదీకాదు
4. తెలంగాణలో 2022 జనవరి నాటికి వార్త పత్రికలు, వార పత్రికలు, మాస పత్రికలు, త్రైమాసిక పత్రికలు కలిపి ఎన్ని నమోదు అయ్యాయి?
ఎ) 1015 బి) 1020
సి) 1115 డి) 905
5. హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి జలవిద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ స్థాపించారు?
ఎ) నాగార్జున సాగర్ బి) నిజాం సాగర్
సి) జూరాల డి) పోచంపాడ్
6. దేశంలో మొట్టమొదటి జలవిద్యుత్ ప్రాజెక్ట్‌ను ఎక్కడ నిర్మించారు?
ఎ) కర్నాటక బి) ఒడిశా
సి) గుజరాత్ డి) మధ్యప్రదేశ్
7. తెలంగాణలో అత్యధిక జలవిద్యుత్ ఏ ప్రాజెక్ట్ ద్వారా పొందుతుంది?
ఎ) శ్రీశైలం బి) నాగార్జునసాగర్
సి) నిజాంసాగర్ డి) సింగూరు
8. హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటి రోడ్డుమార్గం 1868లో ఏ రెండు ప్రదేశాలను కలుపుతూ నిర్మించారు?
ఎ) షోలాపూర్ నుంచి హైదరాబాద్
బి) హైదరాబాద్ నుంచి షోలాపూర్
సి) హైదరాబాద్ నుంచి థానే
డి) ముంబై నుంచి థానే
9. 2020-21 ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణలో 100 చ.కి.మీలకు నమోదైన రోడ్డు పొడవు ఎంత?
ఎ) 96 బి) 69 సి) 121 డి) 130
10. సరైన అంశాలను గుర్తించండి
1. తెలంగాణలో హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా రోడ్డు సాంద్రత 4148 కి.మీ. గా నమోదైంది
2. 2022 ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణలో హైదరాబాద్ మినహా అత్యధిక రోడ్డు సాంద్రత కలిగిన జిల్లా వరంగల్
3. 2022 ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణలో అత్యల్ప రోడ్డు సాంద్రత కలిగిన జిల్లా ములుగు (38 కి.మీ.లు)
ఎ) 1 బి) 2 సి) 3 డి) పైవేవీకావు
11. 2022-23 ఆర్థిక సర్వేప్రకారం తెలంగాణలో ఎన్ని జాతీయ రహదారులున్నాయి?
ఎ) 22 బి) 23 సి) 24 డి) 25
12. సరైన అంశాన్ని గుర్తించండి.
1. తెలంగాణలో అతిపొడవైన జాతీయ రహదారి ఎన్‌హెచ్-44
2. తెలంగాణలో అతి తక్కువ పొడవైన జాతీయ రహదారి ఎన్‌హెచ్-150
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) పైవేవీకావు
13. దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి 7 తెలంగాణలో ఎన్ని జిల్లాల నుంచి వెళ్తుంది?
ఎ) 6 బి) 7 సి) 8 డి) 9
14. 2022 ఆర్థిక సర్వేప్రకారం రాష్ట్రంలో అత్యధిక రోడ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నది?
ఎ) జాతీయ రహదారులు
బి) గ్రామీణ రోడ్లు
సి) జీహెచ్ఎంసీ రోడ్లు డి) ఆర్&బీ
15. సరైన అంశాలను గుర్తించండి.
1. రాష్ట్రంలో జాతీయ రహదారులు పొడవు అత్యల్పంగా 3910 కి.మీ.లతో 3.62 శాతం నమోదైంది
2. 2022 ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణలో మొత్తం రోడ్ నెట్వర్క్ పొడవు 107871 కి.మీ.లుగా నమోదైంది
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
16. సరైన జతలను గుర్తించండి.
పాత కొత్త
1. ఎన్‌హెచ్ 7 – ఎన్‌హెచ్ 44
2. ఎన్‌హెచ్ 202 – ఎన్‌హెచ్ 163
3. ఎన్‌హెచ్ 221 – ఎన్‌హెచ్ 30
4. ఎన్‌హెచ్ 9 – ఎన్‌హెచ్ 66
5. ఎన్‌హెచ్ 752 – ఎన్‌హెచ్ 62
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 5, 1, 2 డి) 4, 5, 3
17. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతం చుట్టూ అభివృద్ధి చేసిన ఓఆర్ఆర్ పొడవు ఎంత?
ఎ) 158 కి.మీ. బి) 156 కి.మీ
సి) 154 కి.మీ డి) 148 కి.మీ
18. సరైన దానిని గుర్తించండి.
1. తెలంగాణలో అతి పొడవైన రాష్ట్ర రహదారి.. ఎస్‌హెచ్-1
2. తెలంగాణలో అతిచిన్న రాష్ట్ర రహదారి… ఎస్‌హెచ్ – 9
3. ఎస్‌హెచ్ -1 (రాజీవ్ రహదారి) హైదరాబాద్-కరీంనగర్-రామగుండం రోడ్డుగా పేర్కొంటారు
ఎ) 1, 2 బి) 2, 3 సి) 1, 3 డి) 1, 2, 3
19. నిజాం రాజ్య గ్యారంటీడ్ రైల్వే వ్యవస్థను ఏ సంవత్సరంలో నిర్మించారు?
ఎ) 1874 బి) 1868
సి) 1872 డి) 1864
20. సరైనవి గుర్తించండి.
1. 1907లో మీర్ మహబూబ్ అలీ ఖాన్ నాంపల్లిలో హైదరాబాద్ దక్కన్ రైల్వేస్టేషన్ ను నిర్మించాడు
2. కాచీగూడ రైల్వేస్టేషన్ దేశంలోనే తొలి డిజిటల్ రైల్వేస్టేషన్‌గా నిలిచింది
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
21. తెలంగాణలో 2016 సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రైల్వేస్టేషన్ ఏది?
ఎ) కాచీగూడ రైల్వేస్టేషన్
బి) సికింద్రాబాద్ రైల్వేస్టేషన్
సి) వరంగల్ రైల్వేస్టేషన్
డి) కాజీపేట్ రైల్వేస్టేషన్
22. సరికాని అంశాలు గుర్తించండి.
1. దేశంలో మొట్టమొదటి మహిళా రైల్వేస్టేషన్ ముంబైలో మాతుంగా రైల్వేస్టేషన్
2. తెలంగాణలో మహిళా రైల్వేస్టేషన్లు బేగంపేట, విద్యానగర్
3. కాచీగూడ రైల్వేస్టేషన్ గోథిక్ ఆర్కిటెక్చర్ లో నిర్మించారు
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 2, 3 డి) పైవేవీకావు
23. తెలంగాణలో మొట్టమొదటి రైల్వేలైన్ ఏ రెండు ప్రాంతాలను కలుపుతూ నిర్మించారు?
ఎ) ముంబై-షోలాపూర్
బి) వాడి-సికింద్రాబాద్
సి) గుల్బర్గా-మద్రాస్
డి) సికింద్రాబాద్-మద్రాస్
24. హైదరాబాద్ మెట్రోరైల్ చిహ్నం ఏది?
ఎ) నిజ్ బి) బజ్
సి) పుష్పక్ డి) పైవేవీకావు
25. మధురానగర్ మెట్రోస్టేషన్ మహిళా మెట్రోస్టేషన్‌గా గుర్తింపు పొందిన పేరు?
ఎ) వనిత బి) తరుణి
సి) రుద్రమ దేవి డి) మహిళా
26. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు కార్గో టెర్మినల్ గుడ్ స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాక్టీసెస్గా ఎవరిచే గుర్తింపు పొందింది?
ఎ) WTO బి) FAO
సి) WHO డి) పైవేవీకావు
27. 2022 ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణలో 2020 వరల్డ్ టాయిలెట్ డే లో భాగంగా దేశంలోనే అత్యుత్తమ జిల్లాలుగా అవార్డు పొందినవి ?
1. సిద్దిపేట 2. పెద్దపల్లి
3. గజ్వేల్ 4. ములుగు
ఎ) 1, 2, 3 బి) 1, 2, 3, 4
సి) 1, 3, 4 డి) 1, 2
28. గంధగీ ముక్త్ భారత్ కార్యక్రమంలో గరిష్ఠ శ్రమదానానికి దేశంలో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది?
ఎ) కర్ణాటక బి) కేరళ
సి) తెలంగాణ డి) గోవా
29. 2014లో తెలంగాణ ఏర్పడే సమయానికి రాష్ట్రంలో ఎన్ని మెగావాట్ల విద్యుత్ కొరత ఉంది?
ఎ) 3000 MW బి) 1600 MW
సి) 2500 MW డి) 2700 MW
30. సరైన అంశాలను గుర్తించండి.
1. 2014-15 సంవత్సరానికి రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థాపిత సామర్థ్యం 9470 మెగావాట్లుగా ఉంది
2. 2020-21 సంవత్సరానికి రాష్ట్రంలో వ్యవస్థాపిత విద్యుత్ సామర్థ్యం17,218 మెగావాట్లుగా నమోదైంది
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
31. 2022 ఆర్థిక సర్వేప్రకారం 2020-21 నాటికి రాష్ట్ర తలసరి విద్యుత్ లభ్యత ఎంత?
ఎ) 1905 KWH బి) 1919 KWH
సి) 2001 KWH డి) 2005 KWH
32. సరైన వాటిని గుర్తించండి.
1. 2022 ఆర్థిక సర్వేప్రకారం 2014-15 సంవత్సరంలో తలసరి విద్యుత్ లభ్యత 1152 KWHగా నమోదైంది
2. ఇదేకాలంలో జాతీయ సగటు 852 KWH ఉంది
3. 2021 నాటికి జాతీయ తలసరి విద్యుత్ లభ్యత 1031 MWH నమోదైంది
ఎ) 1, 2 బి) 1, 3
సి) 1, 2, 3 డి) 2, 3
33. తెలంగాణలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్స్ ఎక్కువగా ఉన్న జిల్లా?
ఎ) మెదక్ బి) సంగారెడ్డి
సి) నిజామాబాద్ డి) ఖమ్మం
34. సరికాని అంశాన్ని గుర్తించండి.
1. 2022 తెలంగాణ ఆర్థిక సర్వే ప్రకారం 2018-19 నాటికి తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ విద్యుత్ ప్రసరణ నష్టాలను కలిగి ఉంది
2. 2022 తెలంగాణ ఆర్థిక సర్వే ప్రకారం జాతీయ సగటు విద్యుత్ ప్రసరణ నష్టం 20.66 శాతంగా నమోదైంది
3. దేశంలో అతితక్కువ విద్యుత్ ప్రసరణ నష్టం కలిగిన రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్ (14.29 శాతం)
ఎ) 1, 2, 3 బి) 2, 3
సి) 1, 3 డి) పైవేవీకావు
35. 2022 తెలంగాణ ఆర్థిక సర్వేలో రాష్ట్రంలో విద్యుత్ ప్రసరణ నష్ట శాతం ఎంత నమోదైంది?
ఎ) 14.29 శాతం బి) 14.73 శాతం
సి) 20.10 శాతం డి) 14.85 శాతం
36. తెలంగాణలో అత్యధిక శాతం గృహ విద్యుత్ కనెక్షన్స్ కలిగి ఉన్న జిల్లా ఏది?
ఎ) హైదరాబాద్ బి) రంగారెడ్డి
సి) మేడ్చల్ డి) కుమ్రం భీం
37. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం గృహ విద్యుత్ కనెక్షన్లు కలిగిన రెండో జిల్లా?
ఎ) హైదరాబాద్ బి) సంగారెడ్డి
సి) రంగారెడ్డి డి) కుమ్రం భీం
38. 2022 ఆర్థిక సర్వే ప్రకారం సరైన అంశాలను గుర్తించండి.
1. రాష్ట్రంలో అత్యల్ప శాతం గృహ విద్యుత్ కనెక్షన్లు కలిగిన జిల్లా – మెదక్ (59 శాతం)
2. రాష్ట్రంలో అత్యధిక శాతం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కలిగిన జిల్లా – మెదక్ (30.84 శాతం)
3. రాష్ట్రంలో అత్యల్ప శాతం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కలిగిన జిల్లా – మేడ్చల్ (1.38 శాతం)
4. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు లేని జిల్లా – హైదరాబాద్ (0.0 శాతం)
ఎ) 2 బి) 1 సి) 4 డి) 3
39. రాష్ట్రంలో అత్యల్ప శాతం పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లు కలిగిన జిల్లా ?
ఎ) మహబూబ్‌నగర్ బి) జనగామ
సి) కుమ్రం భీం
డి) జయశంకర్ భూపాలపల్లి
40. రాష్ట్రంలో అత్యధిక శాతం పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లు కలిగిన జిల్లా ?
ఎ) రంగారెడ్డి బి) మేడ్చల్
సి) హైదరాబాద్ డి) హనుమకొండ
41. తెలంగాణలోని అంతర్జాతీయ విమానాశ్రయం పేరు?
ఎ) ఎన్టీఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం
బి) రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
సి) హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం
డి) జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం
42. శంషాబాద్ విమానాశ్రయం నిర్మించిన ప్రైవేట్ సంస్థను గుర్తించండి.
ఎ) జీవీకే బి) జీఎంఆర్
సి) ఎల్ అండ్ టీ డి) ఎయిర్ ఇండియా
43. హైదరాబాద్ నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి రవాణా మార్గం కలిగిన పీవీ నరసింహారావు ఫ్లెఓవర్ పొడవు ఎంత?
ఎ) 12 కి.మీ బి) 13 కి.మీ
సి) 11.6 కి.మీ డి) 10 కి.మీ
44. 2017 నవంబర్ 28న హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్ట్‌ను ఎవరు ప్రారంభించారు?
ఎ) కేసీఆర్ బి) కేటీఆర్
సి) నరేంద్రమోదీ డి) రైల్వేశాఖ మంత్రి
45. రాష్ట్రంలోని అతి తక్కువ పొడవు కలిగిన జాతీయ రహదారి ఎన్‌హెచ్-150 పొడవు?
ఎ) 16 కి.మీ బి) 13 కి.మీ
సి) 9 కి.మీ డి) 12 కి.మీ
46. తెలంగాణ రాష్ట్రంలో అతిపొడవైన జాతీయ రహదారి ఎన్‌హెచ్-44 ఎన్ని కి.మీ.లు విస్తరించింది?
ఎ) 512 బి) 513 సి) 612 డి) 412
47. APSRTC నుంచి TSRTC ఎప్పుడు విడిపోయింది?
ఎ) 2015 మే 21 బి) 2015 మే 24
సి) 2016 మే 24 డి) 2016 మే 2
48. 2021 సెప్టెంబర్ 1 నాటికి రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో వ్యవస్థాపిత విద్యుత్ సామర్థ్యం ఎంత?
ఎ) 8516 MW బి) 2645 MW
సి) 5453 MW డి) 5455 MW
జవాబులు
1. డి 2. సి 3. డి 4. ఎ 5. బి 6. ఎ 7. ఎ 8. బి 9. ఎ 10. సి 11. సి 12. సి 13. డి 14. బి 15. సి 16. ఎ 17. ఎ 18. డి 19. ఎ 20. సి 21. ఎ 22. డి 23. బి 24. ఎ 25. బి 26. సి 27. డి 28. సి 29. డి 30. సి
31. ఎ 32. సి 33. ఎ 34. డి 35. డి 36. సి 37. డి 38. సి 39. డి 40. సి 41. బి 42. బి 43. సి 44. సి 45. డి
46. ఎ 47. బి 48. సి
ఎం.ప్రవీణ్ కుమార్
విషయనిపుణులు
హైదరబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు