అగ్నిమాపక పదార్థాల తయారీలో ఉపయోగించే క్షారం?
ఆమ్లాలు- క్షారాలు
1. కింది వాటిలో సరికానిది.
1. జల ద్రావణంలో H+ అయాన్లను ఇచ్చే వాటిని క్షారాలు అంటారు
2. ఆమ్లాలు ఎరుపు లిట్మస్‌ను నీటి లిట్మస్ రంగుకు మారుస్తాయి
3. ఆమ్లాలను గాజు పాత్రల్లో నిల్వ ఉంచాలి
ఎ) 1, 2 బి) 1, 2, 3
సి) 1 మాత్రమే డి) 2 మాత్రమే
2. భావన: ఆమ్లాలను లోహపు పాత్రల్లో నిల్వ ఉంచకూడదు
కారణం: ఎందుకంటే ఆమ్లాలు చురుకైన స్వభావం కల్గి ఉంటాయి
ఎ) భావన, కారణం సత్యాలు; భావనకు కారణం సరికాదు
బి) భావన, కారణం సత్యాలు ; భావనకు కారణం సరైనది
సి) భావన సత్యం, కారణం అసత్యం
డి) భావన అసత్యం, కారణం సత్యం
3. కింది వాటిలో ఏది సత్యం?
1. ఆమ్లాల్లో మిథైల్ ఆరెంజ్ సూచిక ఎరుపు రంగును ఇస్తుంది
2. ఫినాప్తలిన్ సూచిక వల్ల ఆమ్లాల్లో రంగు మారదు
3. ఫినాప్తలిన్ సూచిక క్షారాల్లో పింక్ రంగును ఇస్తుంది
4. కర్బన ఆమ్లానికి ఉదాహరణ CH3COOH
ఎ) 1, 2, 4 మాత్రమే
బి) 1, 2, 3 మాత్రమే
సి) 1, 2, 3, 4 డి) 2, 3, 4 మాత్రమే
4. కింది వాటిలో బలమైన ఆమ్లం కానిది?
1. H2SO4 2. HNO3
3. CH3COOH 4. H2CO3
ఎ) 1, 2 మాత్రమే బి) 2, 3 మాత్రమే
సి) 3, 4 మాత్రమే
డి) 1, 2, 3 మాత్రమే
5. టమాటాలో ఉండే ఆమ్లం?
ఎ) ఆక్సాలిక్ ఆమ్లం బి) ఫార్మిక్ ఆమ్లం
సి) ఎసిటిక్ ఆమ్లం డి) టార్టారిక్ ఆమ్లం
6. జతపరచండి.
ఆమ్లం లభించే పదార్థం
ఎ. టార్టారిక్ ఆమ్లం 1. ఉసిరి
బి. ఆస్కార్బిక్ ఆమ్లం 2. చింతపండు
సి. ఎసిటిక్ ఆమ్లం 3. వెనిగర్
డి. స్టియరిక్ ఆమ్లం 4. కొవ్వు పదార్థాలు
ఎ) ఎ-3, బి-2, సి-1, డి-4
బి) ఎ-2, బి-1, సి-3, డి-4
సి) ఎ-2, బి-3, సి-1, డి-4
డి) ఎ-4, బి-1, సి-3, డి-2
7. కింది వాటిని జతపరచండి.
ఆమ్లం లభించే పదార్థం
ఎ. మాలిక్ ఆమ్లం 1. వెన్న
బి. లాక్టిక్ ఆమ్లం 2. పెరుగు
సి. సిట్రిక్ ఆమ్లం 3. ఆపిల్
డి. బ్యూటరిక్ ఆమ్లం 4. నిమ్మ, నారింజ
ఎ) ఎ-3, బి-2, సి-4, డి-1
బి) ఎ-2, బి-4, సి-1, డి-3
సి) ఎ-3, బి-4, సి-2, డి-1
డి) ఎ-2, బి-4, సి-3, డి-1
8. జతపరచండి.
ఆమ్లం ఉయోగం
ఎ. సిట్రిక్ ఆమ్లం 1. శీతల పానీయాల తయారీ
బి. కార్బోనిక్ ఆమ్లం 2. పేలుడు పదార్థాల తయారీ
సి. సల్ఫ్యూరిక్ ఆమ్లం 3. పులిహోర తయారీ
డి. నత్రికామ్లం 4. ఎరువులు, బ్యాటరీల తయారీ
ఎ) ఎ-3, బి-4, సి-1, డి-2 బి) ఎ-1, బి-2, సి-4, డి-3
సి) ఎ-1, బి-4, సి-3, డి-2 డి) ఎ-3, బి-1, సి-4, డి-2
9. ద్రాక్ష పండులో ఉండే ఆమ్లం?
ఎ) లాక్టిక్ ఆమ్లం బి) ఎసిటిక్ ఆమ్లం
సి) టార్టారిక్ ఆమ్లం డి) సిట్రిక్ ఆమ్లం
10. కార్బన్‌ను గాలిలో మండించినప్పుడు ఏర్పడేది?
ఎ) క్షార ఆక్సైడ్ బి) ఆమ్ల ఆక్సైడ్
సి) తటస్థం డి) ఏదీకాదు
11. కింది వాటిని జతపరచండి.
ఆమ్లం ఉపయోగం
ఎ. ఎసిటిక్ ఆమ్లం 1. మందులు, రంగుల తయారీ
బి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం 2. పచ్చళ్ల తయారీ
సి. ఆక్సాలిక్ ఆమ్లం 3. సిరా మరకలు తొలగించడానికి
ఎ) ఎ-1, బి-2, సి-3
బి) ఎ-2, బి-1, సి-3
సి) ఎ-2, బి-3, సి-1
డి) ఎ-1, బి-3, సి-2
12. కింది వాటిలో సరికానిది?
1. ఆమ్లం జల ద్రావణంలో OH- అయాన్లను ఇస్తుంది
2. లోహ ఆక్సైడ్ల జల విశ్లేషణ వల్ల ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి
3. క్షారాలన్నీ లోహాలతో చర్యంది హైడ్రోజన్ వాయువులను ఇస్తాయి
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 1, 2 మాత్రమే డి) 1, 2, 3
13. జింక్, హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్యందించినప్పుడు వెలువడే వాయువు ఏది?
ఎ) ఆక్సిజన్ బి) హైడ్రోజన్
సి) కార్బన్ డై ఆక్సైడ్ డి) నైట్రోజన్
14. కిందివాటిలో సరికానిది?
1. కోడి గుడ్డు పెంకు కాల్షియం ఆక్సైడ్తో నిర్మితమవుతుంది
2. కోడి గుడ్డు పెంకు హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపినపుడు CO2 వాయువు విడుదల అవుతుంది
3. సున్నపు తేటను పాల వలె తెల్లగా మార్చే వాయువు CO2
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1 మాత్రమే
15. కింది వాటిలో సరైనది ఏది?
1. ఆమ్లం జల ద్రావణంలో H+ అయాన్లు ఇస్తుంది
2. అలోహ ఆక్సైడ్ల జల విశ్లేషణ వల్ల ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి
3. Zn+ 2HCl ZnCl2 + H2
4.2HCl+Na2CO3
2NaCl + CO2 + H2O
ఎ) 1, 2, 3 మాత్రమే
బి) 2, 3, 4 మాత్రమే
సి) 1, 3, 4 మాత్రమే డి) 1, 2, 3, 4
16. కోడిగుడ్డు పెంకు దేనితో నిర్మితమవుతుంది?
ఎ) CaO బి) CaCO3
సి) Ca (OH)2 డి) Na2CO3
17. కింది వాటిలో సరికానిది?
1. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాల్లో CO, CO2, SO2 వంటి ఆక్సైడ్లు ఉంటాయి
2. CO, CO2, SO2 లు వాతావరణంలోని తేమతో చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లం, కార్బోనిక్ ఆమ్లాలను ఏర్పరుస్తాయి
3. పై ఆమ్లాలు వర్షపు నీటితో కలిసి భూమిని చేరితే ఆ వర్షాలను ఆమ్ల వర్షాలు అంటారు
ఎ) 1 మాత్రమే బి) 1, 2 మాత్రమే
సి) 1, 2, 3 డి) ఏదీ కాదు
18. కింది వాటిలో సరైన విషయం(లు).
1. ఆమ్ల వర్షం మొక్కలకు, జంతువుల ఆరోగ్యానికి మంచిది
2. ఆమ్ల వర్షం తాజ్‌మహల్ వంటి చారిత్రక కట్టడాల నాణ్యతను నష్టపరచదు
3. వర్షపు నీటి PH విలువ 5.6 కంటే తక్కువ ఉంటే దాన్ని ఆమ్ల వర్షం అంటారు
ఎ) 1 మాత్రమే బి) 1, 2
సి) 3 మాత్రమే డి) 1, 2, 3
19. తేజ: H3O+ అయాన్‌ను హైడ్రోనియం అయాన్ అంటారు
తేజస్విని: ఆమ్లాలకు నేరుగా నీటిని కలపవచ్చు
సత్య వాక్యం ఏది?
ఎ) తేజ బి) తేజస్విని
సి) తేజ, తేజస్విని డి) ఏదీకాదు
20. సరైన అంశం(అంశాలు)ను గుర్తించండి.
1. జల ద్రావణంలో పదార్థాలు అయాన్లుగా మారే ప్రక్రియను అయనీకరణం అంటారు
2. అయనీకరణ వల్ల ఆమ్ల లేదా క్షార ద్రావణాల విద్యుత్ వాహకత తగ్గుతుంది
3. మన జీర్ణక్రియలో జీర్ణాశయం హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తుంది
ఎ) 1, 3 బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే డి) 3 మాత్రమే
21. అజీర్తి సమయంలో కడుపు మంట నుంచి ఉపశమనం పొందడానికి వాడే పదార్థం?
ఎ) కాస్టిక్ సోడా
బి) మిల్క్ ఆఫ్ మెగ్నీషియం
సి) సోడియం కార్బొనేట్
డి) అల్యూమినియం క్లోరైడ్
22. కింది ఆమ్ల జలరహిత రూపాల్లో ఏది సరైనది?
1. H2CO3 జల రహిత రూపం CO
2. H3PO4 జల రహిత రూపం HPO3
3. H2SO4 జల రహిత రూపం SO3
4. H2SO3 జల రహిత రూపం SO2
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 2, 3, 4 డి) 1, 2 3, 4
23. క్షారాలకు సంబంధించి సరైన విషయం ఏది?
1. క్షారాలు రుచికి చేదుగా ఉంటాయి
2. క్షారాలు నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మారుస్తాయి
3. క్షారాలు జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1, 2, 3
24. కింది వాటిలో ఎరుపు లిట్మస్ కాగితాన్ని నీలిరంగులోకి మార్చే పదార్థం?
ఎ) ద్రాక్ష రసం బి) నిమ్మ రసం
సి) సబ్బు నీరు డి) ఆలివ్ ఆయిల్
25. సుజాత: మిథైల్ ఆరెంజ్ సూచిక క్షారాల్లో పసుపు రంగును ఇస్తుంది
సురేఖ: ఫినాప్తలిన్ సూచిక క్షారాల్లో పింకు రంగును ఇస్తుంది
సరైన వాక్యం ఏది?
ఎ) సుజాత బి) సురేఖ
సి) సుజాత, సురేఖ డి) ఎవరూ కాదు
26. కింది వాటిలో బలమైన క్షారం కానిది?
ఎ) NaOH బి) NH4OH
సి) KOH డి) ఎ, సి
27. కింది వాటిలో బలహీన క్షారం ఏది?
ఎ) Ca(OH)2 బి) Mg(OH)2
సి) ఎ, బి డి) KOH
28. జతపరచండి.
క్షారం లభించే పదార్థం
ఎ. సోడియం హైడ్రాక్సైడ్ 1. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం
బి. కాల్షియం హైడ్రాక్సైడ్ 2. గాజును శుభ్రపరిచే ద్రవం
సి. అమ్మోనియం హైడ్రాక్సైడ్ 3. సున్నపు నీరు
డి. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ 4. సబ్బులు
ఎ) ఎ-4, బి-2, సి-3, డి-1 బి) ఎ-2, బి-3, సి-4, డి-1
సి) ఎ-2, బి-1, సి-4, డి-3 డి) ఎ-4, బి-3, సి-2, డి-1
29. గ్రీసు మరకలను తొలగించడానికి వాడే పదార్థం?
ఎ) అమ్మోనియం హైడ్రాక్సైడ్
బి) సోడియం హైడ్రాక్సైడ్
సి) అల్యూమినియం హైడ్రాక్సైడ్
డి) కాల్షియం హైడ్రాక్సైడ్
30. అగ్ని మాపక పదార్థాల తయారీలో ఉపయోగించే క్షారం?
ఎ) కాల్షియం హైడ్రాక్సైడ్
బి) సోడియం హైడ్రాక్సైడ్
సి) పొటాషియం హైడ్రాక్సైడ్
డి) అల్యూమినియం హైడ్రాక్సైడ్
31. బ్లీచింగ్ పౌడర్ తయారీలో ఉపయోగించే క్షారం?
ఎ) అల్యూమినియం హైడ్రాక్సైడ్
బి) సోడియం హైడ్రాక్సైడ్
సి) కాల్షియం హైడ్రాక్సైడ్
డి) మెగ్నీషియం హైడ్రాక్సైడ్
32. ఏ జీవి కుట్టినప్పుడు లేదా గుచ్చినప్పుడు క్షార ద్రావణం వదులుతుంది?
ఎ) చీమ బి) తేనెటీగ
సి) కందిరీగ డి) దూలగొండి మొక్క ఆకుపై ఉన్న మందు
33. లోహ ఆక్సైడ్ రసాయన స్వభావం?
ఎ) ఆమ్లత్వం బి) క్షారత్వం
సి) ద్విస్వభావం డి) తటస్థం
34. కింది వాటిలో సరైనది?
1. NaOH→Na++ OH-
2. Na2O + H2O2NaOH
3. CaO + H2O→Ca(OH)2
ఎ) 1, 2 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 2, 3 మాత్రమే డి) 1, 2, 3
35. కింది వాటిలో సరికాని అంశం?
1. కొన్ని బలమైన క్షారాలు Al, Zn వంటి లోహాలతో చర్యంది H2 వాయువును విడుదల చేస్తాయి
2. క్షార ద్రావణాలు విద్యుత్ వాహకతను ప్రదర్శిస్తాయి
3. నీటిలో కరిగే క్షారాలను ఆల్కలీ అని పిలుస్తారు
ఎ) 1 మాత్రమే బి) 1, 2 మాత్రమే
సి) 1, 2, 3 డి) ఏదీకాదు
36. కింది వాటిలో సత్య వాక్యం?
1. సోడియం కార్బోనేట్‌ను బేకింగ్ సోడాగా వాడుతారు
2. సోడియం బైకార్బోనేట్‌ను వాషింగ్ సోడాగా వాడుతారు
3. ఆల్కీలు అన్నీ క్షారాలే కానీ క్షారాలన్నీ ఆల్కలీలు కావు
4. క్షారాలన్నీ నీటిలో పూర్తిగా కరుగుతాయి
ఎ) ఎ మాత్రమే బి) ఎ, బి మాత్రమే
సి) సి మాత్రమే డి) ఎ, బి, సి, డి
37. కింది వాటిని జతపరచండి.
లవణం పేరు వాటి పేరెంట్ ఆమ్లం, క్షారం
ఎ. పొటాషియం సల్ఫేట్ 1. H2SO4, NaOH
బి. సోడియం సల్ఫేట్ 2. H2SO4, KOH
సి. కాల్షియం సల్ఫేట్ 3. H2SO4, Mg(OH)2
డి. మెగ్నీషియం సల్ఫేట్ 4. H2SO4, Ca(OH)2
ఎ) ఎ-1, బి-2, సి-4, డి-3 బి) ఎ-2, బి-1, సి-4, డి-3
సి) ఎ-2, బి-4, సి-3, డి-1 డి) ఎ-1, బి-4, సి-3, డి-2
38. జతపరచండి.
లవణం పేరు వాటి పేరెంట్ ఆమ్లం, క్షారం
ఎ. కాపర్ సల్ఫేట్ 1. HCl, NaOH
2. సోడియం క్లోరైడ్ 2. HNO3, NaOH
3. సోడియం నైట్రేట్ 3. H2CO3, NaOH
4. సోడియం కార్బొనేట్ 4. H2SO4, Cu(OH)2
ఎ) ఎ-4, బి-2, సి-3, డి-1
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-4, బి-1, సి-2, డి-3
డి) ఎ-4, బి-2, సి-3, డి-1
జవాబులు
1. ఎ 2. బి 3. సి 4. సి 5. ఎ 6. బి 7. ఎ 8. డి 9. డి 10. బి 11. బి 12. డి 13. బి 14. డి 15. డి
16. బి 17. డి 18. సి 19. బి 20. ఎ 21. బి 22. సి 23. సి 24. సి 25. సి 26. బి 27. సి 28. డి 29. ఎ 30. డి
31. సి 32. సి 33. బి 34. డి 35. డి 36. సి 37. బి 38. సి
పీ ఢిల్లీ బాబు
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు