అడవులు పర్యావరణ సమతుల్య ఆధారాలు

భూమి అభివృద్ధిలో అడవులు కీలక భూమిక పోషిస్తాయి. మౌలిక సదుపాయాల్లో అడవి ప్రధాన వనరు. దట్టమైన అడవులు వేలాది మంది జీవనానికి ఒక ఆధారంగా ఉపయోగపడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ నుంచి రక్షించుకోవడానికి,పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి అడవుల ప్రాముఖ్యత పెరిగింది. అన్ని రకాల జీవులకు పర్యావరణమే ప్రధాన జీవన ఆధారం. మానవుల జీవన సుస్థిరతకే కాకుండా ఆర్థిక సుస్థిరతకూ అడవి ఆధారం అవుతుంది.
అడవులు
– అడవులు మనదేశంలో వేల కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. భూమిపై ఉన్న ఆవరణ వ్యవస్థలో అడవులు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. అడవులను ఆంగ్లంలో ఫారెస్ట్ అంటారు. ఫారెస్ట్ అనే పదం ఫారిస్ (Foris) అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. లాటిన్ భాషలో ఈ పదానికి అర్థం ‘గ్రామ సరిహద్దు వెలుపలి ప్రాంతం’ అని అర్థం. అడవులు భూమి జీవావరణంలో ప్రాథమిక స్థూల ఉత్పత్తిలో 75 శాతం ఆక్రమించి, మొక్కల జీవసంబంధమైన పదార్థంలో 80 శాతం ఆక్రమించి ఉన్నాయి.
– భూమి అక్షాంశాల వద్ద అడవులు భిన్నంగా ఉంటూ పర్యావరణ జోన్లను ఏర్పరుస్తున్నాయి.
-అడవులను సాధారణంగా మానవ ప్రభావానికి లోనుకాని సహజ వృక్షప్రాంతంగా చెప్పవచ్చు. అడవులు మానవ మనుగడకు చాలా అవసరం. ఇవి మనకు వంటచెరుకును, వన మూలికలను, సహజ సిద్ధమైన రంగులను, భవన, గృహోపకరణ వస్తువులను, పేపరు తయారీలో కావలసిన కలపను అందించడమేగాక నేలల భూసార పరిరక్షణకు, వర్షాలు కురవడానికి, వరదలు అరికట్టడానికి, కాలుష్య నివారణకు ఎంతగానో దోహదం చేస్తున్నాయి.
-నీటి సంరక్షణ, వన సంరక్షణ, జంతు సంరక్షణ, శీతోష్ణస్థితి జెనెటిక్, వనరుల సంరక్షణ సంయక్త వాటర్‌షెడ్ నిర్వహణ నేలల పరిరక్షణ, ఆవరణ పర్యావరణ వ్యవస్థల పునరుత్పత్తిలో ప్రముఖపాత్ర వహిస్తూ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
– కానీ ఇలాంటి వనరులు ఉండవలసిన నిష్పత్తిలో లేకపోవటం వల్ల పర్యావరణ అసమ తుల్యత ఏర్పడి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి.
రాష్ట్రంలో అటవీ రక్షణ కార్యక్రమాలు
– దక్కన్ పీఠభూమిలో ఆకురాల్చే అడవులు ఎక్కువగా ఉన్నాయి. ఇవి పర్యావరణాన్ని ఎక్కువగా కాపాడుతున్నాయి. మొదటగా దట్టమైన అటవీ ప్రాంతంగా నిండిపోగా తర్వాత మైదాన ప్రాంతంగా మారింది. 80 శాతం పైగా ఈ ప్రాంతంలో వ్యవసాయం సాగవుతుంది. కలప పెంపకం, పశువుల మేత వల్ల అటవీ విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వు అడవు లన్నీ అకురాల్చే అడవులే.
– ప్రస్తుతం రాష్ట్రంలోని అటవీ విస్తీర్ణం 26,969 చ.కి.మీ. ఇది తెలంగాణ భౌగోళిక వైశాల్యంలో 24 శాతం ఆక్రమిస్తుంది. ఇది జాతీయ సరాసరి 21.3 శాతం కంటే ఎక్కువ. రాష్ట్రంలో 33 శాతం అడవులు విస్తరించడానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటూ అనేక పథకాలను అమలు చేస్తుంది.
– 2021-22లో అటవీ, లాగింగ్ ఉప రంగం రూ. 1944 కోట్లు ప్రాథమిక రంగం ద్వారా జోడించిన స్థూల విలువలో 1.77 శాతం
కార్బన్స్టాక్
– వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ రూపంలోని కార్బన్‌ను మొక్కలు ఎంత గ్రహించి అటవీ ఆవరణ వ్యవస్థలో జీవ ద్రవ్యరాశి రూపంలో నిల్వ ఉన్నదో తెలియజేయడాన్నే కార్బన్ స్టాక్ అంటారు.
– సహజ వనరుల నిర్వహణ రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధిలో కీలకమైనది. ప్రభుత్వ పర్యావరణ విభాగం, అడవులు, శాస్త్రసాంకేతిక వ్యవస్థల ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నది.
– తెలంగాణ రాష్ట్ర కాలుష్య బోర్డు వాయు, నీటి, ధ్వని కాలుష్యాన్ని నియంత్రించడానికి పర్యావరణ చట్టాలను చేస్తున్నది. దీనిలో వ్యర్థ పదార్థాల నిర్వహణ కాలుష్యాన్ని అరికట్టడానికి అనేక చర్యలు చేపడుతున్నాయి. రాష్ట్రంలోని జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం 12 సంరక్షణ ప్రాంతాలను వెల్లడించింది. వీటిని రెండు ఏజెన్సీలు- తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు, తెలంగాణ జీవ వైవిధ్య సంరక్షణ సొసైటీలు నిర్వహిస్తున్నాయి.
– ప్రభుత్వం పర్యావరణ సంరక్షణ కోసం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రాజెక్టు టైగర్, పట్టణ అడవులు ప్రత్యేక భాగాలను ఏర్పాటు చేశారు.
– హరిత హారం 2015-16 నుంచి 2021-22 వరకు రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే జనవరి 2022 నాటికి 235.59 కోట్ల మొక్కలను నాటడం జరిగింది.
-రాజ్యాంగంలోని ఆర్టికల్ 48ఎ(జి) అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించటం, మెరుగుపరచటం, జీవుల పట్ల కరణ కలిగి ఉండటం ప్రతి పౌరుడి విధి.
– రాష్ట్రంలో మొత్తం అటవీ విస్తీర్ణంలో 50 శాతం కంటే ఎక్కువ రాష్ట్రంలోని అటవీ విస్తీర్ణంలో దాదాపు 16 శాతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. రాష్ట్ర భౌగోళిక వైశాల్యంలో అడవుల శాతం 24%
– తెలంగాణలో ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో అడవులు ఎక్కువ శాతం విస్తరించి ఉన్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అడవుల శాతం తక్కువగా ఉన్నది.
అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లాలు
1. భద్రాద్రి కొత్తగూడెం (16%) 4, 31,252 హెక్టార్లు
2. ములుగు (11%) 3, 00,580 హెక్టార్లు
3. నాగర్‌కర్నూల్ (9.25%) 2, 49668 హెక్టార్లు
4. కుమ్రం భీం ఆసిఫాబాద్ 2, 44, 540 హెక్టార్లు
5. మంచిర్యాల 1, 76,473 హెక్టార్లు
అడవులు- రకాలు
అయనరేఖా, పొడి రుతుపవన ఆకురాల్చు అరణ్యాలు
అయనరేఖా ముళ్ళ అడవులు
అయనరేఖా అర్థ ఆకురాల్చే రుతుపవన అరణ్యాలు
చిట్టడవులు/ పొదలు
ముళ్లచెట్లతో కూడిన పొద అడవులు
అనార్థ టేకుజాతి వృక్షాలతో కూడిన అడవులు
అనార్థ సవన్నా అడవులు
అనార్థ వెదురుజాతి వృక్షాలతో కూడిన అడవులు
ప్రాక్టీస్ బిట్స్
1. తెలంగాణలో అత్యధిక విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్న జిల్లాలు ఏవి?
1) భద్రాద్రి కొత్తగూడెం 2) ములుగు 3) నాగర్ కర్నూల్ 4) కుమ్రం భీం ఆసిఫాబాద్ 5) మంచిర్యాల
ఎ) 1, 2,4 బి) 3, 4, 5
సి) 2, 3,5 డి) 1, 2, 3, 4,5
2. తెలంగాణలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లా ఏది?
ఎ) ములుగు బి) నాగర్ కర్నూల్
సి) భద్రాద్రి కొత్తగూడెం డి) మంచిర్యాల
3. అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం, మెరుగుపరచడం, జీవులపట్ల కరుణ కలిగి ఉండటం ప్రతి పౌరుని విధిగా రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సూచిస్తుంది?
ఎ) 51ఎ(జి) బి) 52 ఎ(బి)
సి) 51 బి(జి) డి) 52 ఎ(జి)
4. తెలంగాణలో ఏ రకమైన అడవులు ఉన్నాయి?
ఎ) ఆకురాల్చే అడవులు
బి) ముళ్ల చెట్లతో కూడి పొద అడవులు
సి) చిట్టడవులు డి) పైవన్నీ
5. ఏ అటవీ ప్రాంతంలో టేకు, వెదురు, ఏగిస, మద్ది, మోదుగ, బూరుగు, సిరిమాను వంటి వృక్షాలు ఎక్కువగా పెరుగుతాయి?
ఎ) అనార్థ ఆకురాల్చే అడవులు
బి) ముళ్ల చెట్లతో కూడిన అడవులు
సి) చిట్టడవులు
డి) అనార్థ సవన్నా అడవులు
6. అనార్థ ఆకురాల్చే అడవులు ఎన్ని సె.మీ వర్షపాతం కురిసే ప్రాంతాల్లో విస్తరిస్తాయి?
ఎ) 20 సె.మీ నుంచి 50 సె.మీ వర్షపాతం
బి) 40 శాతం నుంచి 70 సె.మీ వర్షపాతం
సి) 70 శాతం నుంచి 100 శాతం వర్షపాతం
డి) 100 శాతం నుంచి 150 శాతం వర్షపాతం
7. 100 నుంచి 200 సెం.మీ వర్షపాతం ఉండే ప్రాంతంలో ఏ రకం అడవులు పెరుగుతాయి?
ఎ) అర్థ ఆకురాల్చే అడవులు
బి) అనార్థ ఆకురాల్చే అడవులు
సి) చిట్టడవులు
డి) ముళ్ళ చెట్లతో కూడిన పొద అడవులు
8. ప్రభుత్వ ఆధీనంలో ఉండి అడవుల్లోకి ప్రజలు ప్రవేశించడం, కలప కోసం చెట్లను నరకడం, పశువులను మేపడం నిషేధం ఉన్న అడవులను ఏమంటారు?
ఎ) రక్షిత అడవులు
బి) రిజర్వ్డు అడవులు
సి) ఎ, బి డి) పైవేవీకాదు
9. ప్రభుత్వ ఆధీనంలో ఉండి ప్రజలు ప్రవేశించడం, పశువులను మేపడం, కలప కోసం చెట్లను నరకడం వంటి వాటికి అవకాశం ఉండే అడవులను ఏమని పిలుస్తారు?
ఎ) రక్షిత అడవులు
బి) రిజర్వ్ డు అడవులు
సి) ఎ, బి డి) పైవేవీకాదు
10. పడమటి కనుమల తూర్పు భాగంలో ఎక్కువగా విస్తరించి ఉన్న ఆర్థ ఆకురాల్చే అడవులు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నాయి?
1) ఖమ్మం, వరంగల్
2) మహబూబ్‌గనర్
3) ఆదిలాబాద్, నిజామాబాద్
4) కరీంనగర్
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 1, 2, 3, 4 డి) 2, 3, 4
11. తెలంగాణలో చిట్టడవులు ఏ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి?
1) సూర్యాపేట
2) యాదాద్రి భువనగిరి
3) నల్లగొండ, రంగారెడ్డి
4) మహబూబ్‌నగర్
ఎ) 1, 2 బి) 3, 4
సి) 1, 3, 4 డి) 1, 2, 3, 4
12. టేకు జాతి వృక్షాలతో కూడిన అడవులు ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి?
1) ఆదిలాబాద్
2) నాగర్ కర్నూల్
3) కుమ్రం భీం అసిఫాబాద్
4) భద్రాది కొత్త గూడెం
ఎ) 1, 2 బి) 2, 4
సి) 2, 3 డి) 1, 2, 3, 4
13. 50 సెం,మీ. వరకు వర్షపాతం ఉన్న ప్రాంతంలో విస్తరించే ముళ్ళ చెట్లతో కూడిన పొద అడవుల్లో ఏ రకమైన వృక్షాలు పెరుగుతాయి?
ఎ) తుమ్మచెట్లు బి) రేగు చెట్లు
సి) చెండ్ర, బలుసు డి) పైవన్నీ
14. సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగించే రూసా గడ్డి ఏ జిల్లాలో లభిస్తుంది?
ఎ) నిజామాబాద్ బి) కామారెడ్డి
సి) ఎ, బి డి) పైవేవీకాదు
15. బీడీల తయారీకి ఉపయోగించే తునికాకు ఎక్కువగా లభించే అడవులు ఏ జిల్లాలో ఉన్నాయి? (సి)
1) ఆదిలాబాద్ 2) నిజామాబాద్
3) కరీంనగర్, 4) ఖమ్మం
ఎ) 1, 2, 4 బి) 2, 3, 4
సి) 1, 2, 3, 4 డి) పైవేవీకాదు
16. తెలంగాణలో ప్రధాన అటవీ ఆధారిత పరిశ్రమలేవి?
1) సిర్పూర్ పేపర్ మిల్లు – కాగజ్ నగర్
2) నోవాపామ్ ఇండియా- పటాన్ చెరువు
3) రేయాన్ పరిశ్రమ – కమలాపురం
4) బొమ్మల తయారీ పరిశ్రమ -ఆదిలాబాద్
5) బీడీ పరిశ్రమ
ఎ) 1, 2 , 3, 4, 5 బి) 2, 3, 4
సి) 2, 4, 5 డి) 3, 4, 5
సమాధానాలు
1-డి 2-సి 3-ఎ 4-డి 5-ఎ 6-సి 7-ఎ 8-బి 9-ఎ 10-సి 11-డి 12-డి 13-డి 14-సి 15-సి 16-ఎ
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు